చిత్రం: అత్తారింటికి దారేది (2013) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నటీనటులు: పవన్ కళ్యాణ్ , సమంత, ప్రణీత దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాతలు: బి.వి.యస్.యన్. ప్రసాద్ విడుదల తేది: 27.09.2013
Songs List:
ఆరడుగుల బుల్లెట్టు పాట సాహిత్యం
చిత్రం: అత్తారింటికి దారేది (2013) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీ మణి గానం: విజయ్ ప్రకాష్, ఎమ్. ఎల్. ఆర్. కార్తీకేయన్ గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమె తన వాసం వనవాసం భైరవుడొ భార్గవుడొ భాస్కరుడొ మరి రక్కసుడొ ఉక్కు తీగలాంటి ఒంటి నైజం వీడు మెరుపులన్ని ఒక్కటైన తేజం రక్షకుడొ దక్షకుడొ పరీక్షలకె సుశిక్షితుడో శత్రువు అంటు లేని వింత యుద్ధం వీడి గుండె లోతు గాయమైన శబ్ధం నడిచొచ్చె నర్తన శౌరీ పరిగెత్తె పరాక్రమ శైలీ హలాహలం ధరించిన ధగ్ ధగ్ హృదయుడొ వీడు ఆరడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టూ గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమె తన వాసం వనవాసం దివి నుంచి భువి పైకి భగ భగ మని కురిసేటి వినిపించని కిరణం చప్పుడు వీడు వడివడిగా వడగళ్లై ధడ ధడమని జారేటి కనిపించని జడి వానేగ వీడూ శంఖంలొ దాగేటి పోటెత్తిన సంద్రం హోరితడు శోకాన్నె దాచేసే అశోకుడు వీడురొ వీడు ఆరడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టూ తన మొదలే వదులుకొని పైకెదిగిన కొమ్మలకి చిగురించిన చోటుని చూపిస్తాడు తన దిశనే మార్చుకొని ప్రభవించె సూర్యుడికి తన తూరుపు పరిచయమె చేస్తాడూ రావణుడొ రాఘవుడొ మనసును దోచె మాధవుడో సైనికుడొ శ్రామికుడొ అసాధ్యుడు వీడురో వీడు ఆరడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టూ గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం శిఖరపు అంచు నుంచి నేల జారి పోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమె తన వాసం వనవాసం
నిన్ను చూడగానె చిట్టి గుండె పాట సాహిత్యం
చిత్రం: అత్తారింటికి దారేది (2013) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్ గానం: దేవి శ్రీ ప్రసాద్ నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హో అదేమిటే నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హొయ్ ఓయ్ ఆ ఆ ఏ అవతలకి పో నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హొయ్ నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హై ఏమిటో ఏమ్మాయో చేసినావె కంటి చూపుతోటి ఏమిటో ఇదేమి రోగమో అంటించినావె ఒంటి ఊపుతోటి ముంచే వరదలా కాల్చే ప్రమిధలా చంపావే మరదలా నిన్ను చూడగానే... నా చిట్టి గుండె నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హొయ్ నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హై వన్స్ మోర్ విత్ ఫీల్ ఓహ్ నో ఏ అంత పెద్ద ఆకాశం అంతులేని ఆ నీలం నీ చేప కళ్ల లోతుల్లో ఎట్ట నింపావె ఇరగదీసావే ఏయ్ భూమిలోన బంగారం దాగి ఉందనేది ఓ సత్యం దాన్ని నువ్వు భూమి పైన పెరిగేస్తూ ఇట్ట తిరిగేస్తూ తిరగ రాసావే ఏయ్ అలా నువ్వు చీర కట్టి చిందులేస్తె చీమలా నేను వెంట పడనా నావలా నువ్వు తూగుతూ నడుస్తు ఉంటె కాపలాకి నేను వెంట రానా కృష్ణ రాధలా, నొప్పి బాధలా ఉందాం రావె మరదలా నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హై ఆ హుం ఆ హుం ఆ హుం ఆ హుం అత్తలేని కోడలుత్తమురాలు ఓరమ్మా కోడల్లేని అత్త గుణవంతురాలు ఆ హుం ఆ హుం హోయ్ కోడల కోడల కొడుకు పెళ్ళామా ఓరమ్మా పచ్చి పాల మీద మీగడేదమ్మా హా వేడి పాలలోన వెన్న లేదమ్మా ఆ హుం ఆ హుం ప్లీజ్ డ్యాన్స్ యార్ మోనలీస చిత్రాన్ని గీసినోడు ఎవడైనా ఈ పాల సీస అందాన్ని చూడనే లేదు ఇంక ఏం లాభం కోహినూరు వజ్రాన్ని ఎత్తుకెళ్లినోడు రాజైనా దాని మెరుపు నీలోనే దాగిఉందని తెలియలే పాపం ఇంతిలా నువ్వు పుట్టుకొస్తె నేను మాత్రమెంతని పొగిడి పాడగలను తెలుగు భాషలో నాకు తెలిసిన పదాలు అన్ని గుమ్మరించి ఇంత రాసినాను సిరివెన్నెల మూటలా వేటూరి పాటలా ముద్దుగున్నావె మరదలా నిన్ను చూడగానె నా చిట్టి గుండె... నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హొయ్ నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హై
దేవదేవం భజే పాట సాహిత్యం
చిత్రం: అత్తారింటికి దారేది (2013) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: తాళ్ళపాక అన్నమాచార్య గానం: పాలక్కడ్ శ్రీరామ్, ఎమ్. ఎస్. సుబ్బలక్ష్మి, రీటా దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం వేల సుమ గంధముల గాలి అలలా కలల చిరునవ్వులతో కదిలినాడు రాల హృదయాల తడిమేటి తడిలా కరుణగల వరుణుడై కరిగినాడు అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం ఆవిరి మేఘాలే ఆతని సొంతం అరమరికల వైరం కాల్చెడి అంగారం వెలుగుల వైభోగం ఆతని నయనం ప్రాణ ఋణబంధముల తరువును పుడమిగ నిలుపుటె తన గుణం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం
అమ్మో బాపు గారి బొమ్మో పాట సాహిత్యం
చిత్రం: అత్తారింటికి దారేది (2013) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: శంకర్ మహదేవన్ హేయ్ బొంగరాలంటి కళ్ళు తిప్పింది ఉంగరాలున్న జుట్టు తిప్పింది గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పిందీ... అమ్మో బాపు గారి బొమ్మో ఓలమ్మో మల్లెపూల కొమ్మో... రబ్బరు గాజుల రంగు తీసింది బుగ్గల అంచున ఎరుపు రాసింది రిబ్బను కట్టిన గాలి పటంలా నన్నెగరేసిందీ... అమ్మో దాని చూపు గమ్మో ఓలమ్మో ఓల్డ్ మోంక్ రమ్మో... హై పగడాల పెదవుల్తో పడగొట్టిందీ పిల్లా కత్తులులేని యుద్ధం చేసి నన్నే గెలిచింది ఏకంగా యెదపైనే నర్తించిందీ... అబ్బా నాట్యంలోని ముద్దర చూసి నిద్దర నాదే పోయింది... అమ్మో బాపు గారి బొమ్మో హే హే హే ఓలమ్మో మల్లెపూల కొమ్మో... హో హో మొన్న మేడ మీద బట్టలారేస్తూ కూని రాగమేదొ తీసేస్తూ పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్లా... నిన్న కాఫీ గ్లాసు చేతికందిస్తూ నాజూకైన వేళ్ళు తాకిస్తూ మెత్తని మత్తుల విద్యుత్ తీగై ఒత్తిడి పెంచిందే మళ్ళా... హోయ్ కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది ఓరగా చూసే చూపు నావైపే అనిపిస్తుంది పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసింది చీర చెంగు చివరంచుల్లో నన్నె బంధీ చేసింది పొద్దు పొద్దున్నే హల్లో అంటుందీ పొద్దు పోతె చాలు కల్లోకొస్తుందీ పొద్దస్తమానం పొయినంత దూరం గుర్తొస్తుంటుందీ... అమ్మో బాపు గారి బొమ్మో హే హే హే ఓలమ్మో మల్లెపూల కొమ్మో... సయ్యో అయ్యయ్యో మయ్యో అయ్యయ్యో రయ్యో అయ్యయ్యో అహ అహ అహ అహ సయ్యో అయ్యయ్యో మయ్యో అయ్యయ్యో రయ్యో అయ్యయ్యో అహ అహ అహ అహ యే మాయా లోకంలోనో నన్ను మెల్లగ తోసేసింది తలుపులు మూసింది తాళం పోగెట్టేసిందీ ఆ మబ్బుల అంచుల దాకా నా మనసుని మోసేసింది చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగింది. తిన్నగా గుండెను పట్టి గుప్పిట పెట్టి మూసేసింది అందమే గంధపు గాలై మళ్ళీ ఊపిరి పోసింది తియ్యని ముచ్చటలెన్నో ఆలోచన్లో అచ్చేసింది ప్రేమనే కళ్లద్దాలు చూపులకే తగిలించింది కోసల దేశపు రాజకుమారి ఆశలు రేపిన ఖండాల పోరి పూసల దండలొ నన్నే గుచ్చి మెళ్ళో వేసిందీ అమ్మో బాపు గారి బొమ్మో హే హే హే ఓలమ్మో మల్లెపూల కొమ్మో... ఓ...
కిర్రాకు కిర్రాకు పాట సాహిత్యం
చిత్రం: అత్తారింటికి దారేది (2013) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: నరేంద్ర, డేవిడ్ సిమన్ ఓహ్ మై గాడ్!! ఐ కాంట్ బిలీవ్ దట్ యు సెడ్ దట్ ఆర్ యామ్ ఐ డ్రీమింగ్ దట్ ఐ హియర్డ్ దట్ మై హార్ట్ ఈస్ రేజింగ్ లైక్ ఎ చీతా సో ఐ వన్నా సింగ్ దిస్ కొత్త పాట ఓసోసి పిల్ల పోరి ఓ చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావె రాకాసి రాకుమారి కోపంగ పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే అందంగ పెట్టినావె స్పాటు గుండె తాకిందె ప్రేమ గన్ను షాటు ఏది లెఫ్టు ఏది నాకు రైటు మందు కొట్టకుండనే నేను టైటు క్యాట్ బాలు లాగిపెట్టి మల్లె పూలు జల్లినట్టు షర్టు జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుందే కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే హోయ్ ఓహ్ మై గాడ్!! ఐ కాంట్ బిలీవ్ దట్ యు సెడ్ దట్ ఆర్ యామ్ ఐ డ్రీమింగ్ దట్ ఐ హియర్డ్ దట్ మై హార్ట్ ఈస్ రేజింగ్ లైక్ ఎ చీతా సో ఐ వన్నా సింగ్ దిస్ కొత్త పాట పెదవి స్ట్రా బెరి పలుకు క్యాట్బరీ సొగసు తీగలో కదిలింది పూల నర్సరీ కళ్ళలో కలల గేలరీ చిలిపి చూపులో కొలువుంది ద్రాక్ష మాధురి అత్తరేదొ జల్లినావే అత్త గారి పిల్ల సిత్తరాల నవ్వు పైన రత్తనాలు జల్లా కొత్త ప్రేమ మత్తు నన్ను హత్తుకుంటె యిల్లా పిచ్చి పిచ్చి గుందే కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే హోయ్ హే మహంకాళి జాతర్లో మైకు సెట్టు మోగినట్టు మైండంత గోల గుందే బెంగాళి స్వీటు లోన భంగేదో కలిపితిన్న ఫీలింగు కుమ్ముతుందే కౌబాయ్ డ్రెస్సు వేసినట్టు క్రిష్ణ రాయలోని గుర్రమెక్కినట్టు భూమ్మీద ఉన్న చోటే ఉంటూ ఆ మూను మీద కాలు పెట్టినట్టు సిమ్ము లేని సెల్లు లోకి ఇన్ కమింగు వచ్చినట్టు సింగరేణి బొగ్గు తీసి ఫేసు పౌడరద్దినట్టు పిచ్చి పిచ్చి గుందే కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే హోయ్
It's time to party now పాట సాహిత్యం
చిత్రం: అత్తారింటికి దారేది (2013) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: మల్గాడి శుభ, డేవిడ్ సిమన్ ఓరి దేవుడో దేవుడో ఏంపిల్లగాడే మిల్లీమీటరైన వదలకుండా దిల్లో నిండినాడే హాఁ కళ్ళల్లోన కత్తులున్న తీవ్రవాదిలా మాటల్లోన మత్తులున్న మంత్రవాదిలా పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో ఆఁ పట్టుకో Hey It's time to party now (2) నోటికొచ్చిన పాటేదో పాడెయ్ పాడెయ్ పాడెయ్ పాడెయ్ ఒంటికొచ్చిన డేన్సేదో చేసెయ్ చేసెయ్ రో It's time to party (2) చేతికందిన డ్రింకేదోతాగెయ్ తాగెయ్ తాగెయ్ తాగెయ్ లోకమంతా ఉయ్యాలే ఊగెయ్ ఊగెయ్ రో It's time to party (2) Come on Come on Lets chill n thrill n kill it now Come on Come on పిచ్చెక్కించేద్దాం రో Come on Come on Lets rock it shake it break it now Come on Come on తెగ జల్సా చేద్దాం రో It's time to party now It's time to party now రావే ఓ పిల్లా It's time to party now చేద్దాం గోల It's time to party now రావే ఓ పిల్లా మనకంటే గొప్పోళ్ళా టాటా బిర్లా ఓరి దేవుడో దేవుడో ఏంపిల్లగాడే మిల్లీమీటరైన వదలకుండా దిల్లో నిండినాడే హాఁ కళ్ళల్లోన కత్తులున్న తీవ్రవాదిలా మాటల్లోన మత్తులున్న మంతవాదిలా పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో ఆఁ పట్టుకో ఎడిసన్ను బల్బులోని ఫిలమెంటు వైరు నేను అట్టా నను టచ్ చేశావో ఇట్టా స్విచ్చానౌతాను It's time to party (2) హే మైక్రోవేవ్ మంటలాగా సైలెంటు ఫైరు నేను నువు కొంచెం మనసిచ్చావో టాలెంటే చూపిస్తాను It's time to party (2) హే బాయ్ అబ్బాయ్ లవ్వు గాడుకు నువ్వు క్లోనింగా అమ్మోయ్ అమ్మాయ్ తొలి చూపుకె ఇంతటి ఫాలోయింగా It's time to party now It's time to party now రావే ఓ పిల్లా It's time to party now చేద్దాం గోల హాఁ మైనేం ఈజ్ మార్గరీటా మాక్ టైల్లా పుట్టానంటా చూపుల్తో అందమంతా సరదాగా సిప్ చేయ్మంటా It's time to party (2) వాచ్ మేనే లేని చోట వయసే ఓ పూల తోట వెల్కమ్మని పిలిచావంటే తుమ్మెదలా వాలిపోతా It's time to party (2) హల్లో హల్లో అని పిలవాలా నినుపేరెట్టి పిల్లో పిల్లో నను లాగొద్దట్టా దారం కట్టి It's time to party now It's time to party now రావే ఓ పిల్లా It's time to party now చేద్దాం గోల It's time to party (3)
కటమరాయుడా కదిరి నరసింహుడ పాట సాహిత్యం
చిత్రం: అత్తారింటికి దారేది (2013) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య గానం: పవన్ కళ్యాణ్ కటమరాయుడా కదిరి నరసింహుడ