Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Manasicchi Choodu (1998)




చిత్రం: మనసిచ్చి చూడు (1998)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: వడ్డే నవీన్ , రాశి, రవితేజా
దర్శకత్వం: ఆర్.సురేష్ వర్మ
నిర్మాత: యమ్. వి.లక్ష్మీ
విడుదల తేది: 27.11.1998



Songs List:



అంతే ఈ ప్రేమ వరస పాట సాహిత్యం

 
చిత్రం: మనసిచ్చి చూడు (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్. పి.బాలు, సుజాత

నాలో ఏదేదో ఆయిపోతున్నదే
అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా
నీ తోడు కోరింది నా ఊపిరి
అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా
ఈ వేళ ఈ సూర్యోదయం ఇన్నాళ్ళులాగలేదు కాదా
నీ లోన ఈ ప్రేమోత్సవం ఈ రోజే పుట్టినట్టు ఉందాలేదా

నాలో ఏదేదో ఆయిపోతున్నదే
అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా

బాష మొత్తము మాయమైనదా
గుండె మాట గొంతుదాటి  రాదే
అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా
శ్వాసమాత్రము గేయమైనదా 
హాయి పాట నన్ను మీటుతోంది
అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా
నీలో ఏదో కొత్తకోణం చూశా నువ్వు నువ్వేన కాళిదాసా
నువ్వే కదా నిండు ప్రాణంపోసి వీడ్ని పెంచావు కన్నె హంస
ఒక్క మాటే అని కోటి భావాలని 
అందజేయాలని కొత్త పాఠం నీదే తెలుసా

నాలో ఏదేదో ఆయిపోతున్నదే
అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా

కన్ను బొత్తిగా చిన్నదైనదా నిన్ను తప్ప ఏమిచూడలేదే
అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా
కొన్ని ఏళ్లుగా ముందుకెళ్లక కాలమంత ఆగిపోయి ఉంది
అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా
ఏతా వాత దీని వాటం చూస్తే తియ్యగావున్న కత్తికోత
ఇంటా బయటా మొగమాటం పెట్టె తప్పుకోలేని వింత వేట
మంచు మంటై ఇలా అంటుకుంటే ఎలా
పంచుకుంటే తనే తగ్గుతుందో ఏమో బహుశా

నాలో ఏదేదో ఆయిపోతున్నదే
అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా
నీ తోడు కోరింది నా ఊపిరి
అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా
ఈ వేళ ఈ సూర్యోదయం ఇన్నాళ్ళులాగలేదు కాదా
నీ లోన ఈ ప్రేమోత్సవం ఈ రోజే పుట్టినట్టు ఉందాలేదా

నాలో ఏదేదో ఆయిపోతున్నదే
అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా
అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా





బోడి చదువులు వేస్ట్ పాట సాహిత్యం

 
చిత్రం: మనసిచ్చి చూడు (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: మనో, మురళి, తేజ, మోహన్ 

పల్లవి:
బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా భోంచేస్తూ!
ఆడి చూడు క్రికెట్టు టెండుల్కర్ అయ్యేటట్టు!

ఒక్క ఫోజు కొట్టు లక్షలు వచ్చిపడేటట్టు
అడిడాసు బూట్లు తొడగవ నీకు ఆరు కోట్లు
ఎంత చదివితే సంపాదిస్తవు అంత పెద్ద అంతస్తు
ఓరి ఇన్నోసెంటు స్టూడెంటు
.
చరణం: 1
చిరపుంజిలోని చినుకెంతైనా తడుస్తుంద నీ జుట్టు
థార్ ఎడారి గోలెందుకురా గోదారి ఒడ్డునుంటూ
వీరప్పన్ కొట్టేసుంటాడు అశోకుడెపుడో నాటిన చెట్లు
పాత డేట్లు బట్టీ వేస్తూ అసలేంటీ కుస్తీ పట్లు
ఐ.క్యు అంటే అర్థం తెలుసా అతి తెలివికి తొలి మెట్టు
ఆడే పాడే ఈడుని దానికి పెట్టకు తాకట్టు
పనికిరాని చెత్తంతా నింపకు మెదడు చెదలు పట్టు
ఓరి ఇన్నోసెంటు స్టూడెంటు
.
చరణం: 2 
లీకు వీరులకు ముందే తెలుసు క్వస్చన్ పేపర్ గుట్టు
లోక జ్ఞానం కలిగిన వాడే కోచింగ్ సెంటర్ పెట్టు
బాబూ!మార్కుల కోసం ఏడవలేదురా ఎదిగిన ఏ సైంటిస్ట్
గుర్తుపట్టర ఏ రంగంలో ఉందో నీ ఇంట్రస్టు
నీక్కూడా ఉండే ఉంటుంది ఏదో ఒక టాలెంటు
నీకు నువ్వు బాసవ్వాలంటే దాన్ని బయట పెట్టు
రేసు హార్సువై లైఫును గెలిచే పరుగు మొదలుపెట్టు
ఓరి ఇన్నోసెంటు స్టూడెంటు

చరణం: 3
రెండో ఎక్కం రాకపోయినా నీకేమిట్రా లోటు కాలిక్యులేటర్ చేపట్టు డోంట్ వర్రీ
బిల్లు కడితే నీ బెడ్రూంలో వేస్తాడు బాసింపెట్టు సాక్షాత్తూ బిల్ గేట్సు
పిచ్చోడెవరో జుట్టుని పీక్కుని ఎన్నో కనిపెట్టు
పైసా ఉంటే అదే నీకు అవి అన్నీ కొనిపెట్టు
చదువు సంధ్య వదిలిపెట్టి సన్నాసివి కమ్మంటూ
సలహా ఇస్తున్నానని అనుకుంటే అదే రాంగు రూటు
బతుకు బాటలో ముందుకు నడపని బరువు మొయ్యవద్దు హొయ్
ఓరి ఇన్నోసెంటు స్టూడెంటు




జిలిబిలి జాబిలి పాట సాహిత్యం

 
చిత్రం: మనసిచ్చి చూడు (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిహరన్, చిత్ర 

జిలిబిలి జాబిలిలోనా
చెలి తళుకులు తిలకిస్తున్న
హితులు స్నేహితులు ఎందరు ఉన్నా
యమునా కోసమే చూస్తున్నా
తెలుగు పలుకు లెన్నెన్నో ఉన్నా
యమునా పదమే తీపంటున్నా
యమునా యమునా యమునా

జిలిబిలి జాబిలిలోనా
చెలి తళుకులు తిలకిస్తున్న

నా మదీ మహా నదీ వరదౌతున్నదీ
ఈ ఇదీ ఇలాంటిది ఎపుడూ లేనిదీ
తాను అలా ఎదురౌ క్షణాన
నిలువున కదిలిపోనా
నిలవనా మరీ మరో జగాన

జిలిబిలి జాబిలిలోనా
చెలి తళుకులు తిలకిస్తున్న

నా బలం ఘనం జనం యమునా స్నేహమే
నా స్థలం నిరంతరం యమునా తీరమే
మనసే కోరి వలచే
మమతే తనది కాదా
మునగానా తానా మనస్సులోనా

జిలిబిలి జాబిలిలోనా
చెలి తళుకులు తిలకిస్తున్న
హితులు స్నేహితులు ఎందరు ఉన్నా
యమునా కోసమే చూస్తున్నా
తెలుగు పలుకు లెన్నెన్నో ఉన్నా
యమునా పదమే తీపంటున్నా

యమునా యమునా యమునా





గులాబీ రెమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: మనసిచ్చి చూడు (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు

గులాబీ రెమ్మ 



లవ్వు చేయండ్రా పాట సాహిత్యం

 
చిత్రం: మనసిచ్చి చూడు (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో 

పల్లవి:
లవ్వు చేయండిరా మీరు లాభపడండిరా (2)
మట్టి ముద్ద ముత్యమల్లే ఎలా మారేరా
అరె రాగిముక్క రత్నమల్లే ఎలా మెరిసేరా
గడ్డిపువ్వు పారిజాతం ఎలా అయ్యెరా
అరె పోకిరోడు ప్రయోజకుడు ఎలా మరేరా
ప్రేమ వల్లరా ప్రేయసి మాటవల్లరా
బలం వుందిరా ప్రేమకు ఫలితముందిరా
లవ్వు చేయండిరా మీరు లాభపడండిరా
బయలుదేరండిరా మీరు బాయ్ఫ్రేండ్స్ కండిరా
.
చరణం: 1
గుండె కాయలోన ఒకరి బొమ్మ ఉంచరా
అది కొండమీది కోతినైన దించుతుందిరా
అండ ఒకరు దొరుకునన్న ఊహ చాలురా
అప్పుడు ఎండ మావిలో నుంచి నీళ్ళు తీయవచ్చురా
గుడ్డికాదురా ప్రేమ బ్లడ్ లైట్ రా
అడ్డురాదురా లైఫుకి ఒడ్డు చూపరా
.
చరణం: 2
ప్రేమలోన చెప్పలేని ప్రేరణుందిరా
ఇంపాజిబుల్ పాజిబుల్ గా మార్చుతుందిరా
ప్రేమలోన అంతులేని శక్తి ఉందిరా
పోక్రాన్లో బాంబులాగా పేలుతుందిరా
వద్దు అనకురా ప్రేమకు సిధ్ధమవ్వరా
మొద్దు మనిషిని ముద్దుగా దిద్దుతుందిరా




సలాం లేకుం భామా పాట సాహిత్యం

 
చిత్రం: మనసిచ్చి చూడు (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

సలాం లేకుం భామా

Most Recent

Default