Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Premalo Pavani Kalyan (2003)






చిత్రం: ప్రేమలో పావని కళ్యాణ్ (2003)
సంగీతం: గంటాడి కృష్ణ
నటీనటులు: దీపక్ , అంకిత
దర్శకత్వం: పోలూర్ ఘటికాచలం
నిర్మాతలు: బి.ఏ. రాజు, జయ
విడుదల తేది: 13.12.2003



Songs List:



చెప్పమ్మా చెప్పమ్మా చిలకమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలో పావని కళ్యాణ్ (2003)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: శంకర్ మహదేవన్

పల్లవి:
చెప్పమ్మా చెప్పమ్మా చిలకమ్మా
నీ అందమైన చిరునామా
ఇప్పుడే ఇక్కడే వాలిపోమ్మా
ఎద తలుపు తెరుచుకుందమ్మా

నీదే ఆలోచన ఎటు వైపు చూపు వెళుతున్నా
ఓ కన్నె వనమా కవ్వించకమ్మా
నా మనసే నిలకడలేక
నీ ఊహా వెనక మాటైన వినక
తనురికే బదులే లేక

చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా చెప్పమ్మా చిలకమ్మా
నీ అందమైన చిరునామా

చరణం: 1
నీ రూపురేఖల బొమ్మ నా తలపులో తోచక
నా చూపు జాడలకైన ఆ ఛాయలే అందక
నీ స్నేహ గీతిక కోసం వేచింది ఎదవేదిక
నీ చూపు సోకేదాకా నిదురైన రాదే ఇక
గుండెలో గుప్పున ఎన్నెన్నో చిగురాశలే
కళ్ళల్లో కమ్మని కలలే కదిలించెనే
చిలిపి వయసు వలపు కవిత చెదిరె
కన్నెవనమా కవ్వించకమ్మా
నా మనసే నిలకడలేక
నీ ఉహ వెనక మాటైనా వినక
తనురికే బదులే లేక

చెప్పమ్మా చెప్పమ్మా చిలకమ్మా
నీ అందమైన చిరునామా

చరణం: 2
నిన్ను చూడగానే నాలో ఏ భావం ఉప్పొంగునో
అనుకుంటే నాలోలోనే ఒక వింతగా ఉన్నదే
ఏ తీరుగా నను నీతో పరిచయము కలిగించునో
ఆ తీపి కలయిక నాలో ఏ రాగమొలికించునో
ముందుగా అందితే తియ్యని సంకేతమే
చేతికే అందదా అందని ఆకాశమే
మనసు పడిన వరము దొరికిపోదా
కన్నె వనమా కవ్వించకమ్మా
నా మనసే నిలకడ లేక నీ ఊహ వెనక
మాటైన వినక తనురికే బదులే లేక

చెప్పమ్మా చెప్పమ్మా చిలకమ్మా
నీ అందమైన చిరునామా
ఇప్పుడే ఇక్కడే వాలిపోమ్మా
ఎద తలుపు తెరుచుకుందమ్మా
నీదే ఆలోచన ఎటు వైపు చూపు వెళుతున్నా
ఓ కన్నె వనమా కవ్వించకమ్మా
నా మనసే నిలకడలేక
నీ ఊహ వెనక మాటైన వినక
తనురికే బదులే లేక

చెప్పమ్మా చెప్పమ్మా...



తెలిమంచులోన పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలో పావని కళ్యాణ్ (2003)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: తైదల బాపు
గానం: కె. జె. ఏసుదాసు

పల్లవి:
తెలిమంచులోన 
తెలిమంచులోన చెలి అదర సవ్వడి
విరజాజి వానై కురిసింది పైబడి
ఇక చేరాలి ఆమె కౌగిలి
ఇక చేరాలి ఆమె కౌగిలి

తెలిమంచులోన చెలి అదర సవ్వడి
విరజాజి వానై కురిసింది పైబడి

చరణం: 1
తొలిచూపుతోనే దోచావు మనసుని
కదలించావులే నాలోన ప్రేమనే
నిను చేరుగాలి నా చెంత చేరగా
నా మది ఊయలై ఊగేను హాయిగా
విధినైన గెలిచే ఓ వింత ధైర్యమే
నిన్ను కలిశాక కలిగే నాలోన చిత్రమే
రాచెలి నిచ్చెలి జాబిలీ

తెలిమంచులోన చెలి అదర సవ్వడి
విరజాజి వానై కురిసింది పైబడి
ఇక చేరాలి ఆమె కౌగిలి
ఇక చేరాలి ఆమె కౌగిలి

చరణం: 2
చెక్కిల్లపైనే తొలి సంతకానికై మది ఆరాటమే రేపింది మోహమే
చిరునవ్వులోనే దాగుంది అందమే
ఎదలోగిళ్ళలో వేసింది బాణమే
నువ్వు అన్నదే నా లోకమన్నది
నీ కోసమే ఈ ప్రాణమున్నది
అందనే అందని అందమా

తెలిమంచులోన చెలి అదర సవ్వడి
విరజాజి వానై కురిసింది పైబడి
ఇక చేరాలి ఆమె కౌగిలి
ఇక చేరాలి ఆమె కౌగిలి 

తెలిమంచులోన చెలి అదర సవ్వడి
తెలిమంచులోన చెలి అదర సవ్వడి




ముద్దుగుమ్మా పైడిబొమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలో పావని కళ్యాణ్ (2003)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: హేరిస్ రాఘవేంద్ర

పల్లవి:
ముద్దుగుమ్మా పైడిబొమ్మా అదిరిందోయమ్మా
నాజూకుతనమా నమ్మవమ్మా నువ్వంటే ప్రేమా
ముద్దుగుమ్మ పైడిబొమ్మా అదిరిందోయమ్మా
నాజూకుతనమా నమ్మవమ్మా నువ్వంటే ప్రేమ
చెప్పకుండా పోతావేమ్మా చక్కనైనా మీనమ్మా
మనకు మనకు గొడవేంటమ్మా మర్చిపోవే చిట్టమ్మా
మెహమాటమో కోపమో నేనేలకనుగొందునో
మెహమాటమో కోపమో నేనేలకనుగొందునో

ముద్దుగుమ్మా పైడిబొమ్మ అదిరిందోయమ్మా
నాజూకుతనమా నమ్మవమ్మా నువ్వంటే ప్రేమ

చరణం: 1
నిన్ను చూసి నవ్వానా లేదులే చెలీ
కన్నుగీటి పిలిచానా కాదులే మరీ
మూతి ముడుచుకెళ్తుంటే ముగ్ధసుందరీ
ముద్దు ముద్దుగా ఉందే సొగసు వైఖరీ
చెప్పాలనుకున్నదేదో చెప్పేసెయ్ సూటిగా

ఓ.కె. చేస్తావా కిస్ కోరితే
ఓ.కె.చేస్తావా కిస్ కోరితే

ముద్దుగుమ్మ పైడిబొమ్మ అదిరిందోయమ్మా
నాజూకుతనమా సమ్మవమ్మా నువ్వంటే ప్రేమా

చరణం: 2
ఒట్సు పెట్టి చెబుతున్నా నమ్మవే చెలీ
నువ్వు తప్ప ఇంకెవరూ నచ్చరే మరీ
మాట ఇచ్చి వచ్చానే ఇంటివాళ్ళకీ
నిన్ను గెలుచుకుంటేనే థిల్ మనసుకీ
అలిగి అలిగిపోవద్దే నువ్వు అట్టా సుందరి
అలిగి అలిగిపోవద్దే నువ్వు అట్టా సుందరి
జోడికట్టేసై ఎందుకల్లరీ జోడికట్టేసై ఎందుకల్లరీ

ముద్దుగుమ్మా పైడిబొమ్మా అదిరిందోయమ్మా
నాజూకుతనమా నమ్మవమ్మా నువ్వంటే ప్రేమా
చెప్పకుండపోతావేమ్మా చక్కనైన మీనమ్మా
మనకు మనకు గొడవేంటమ్మా
మరిచిపోవే చిట్టమ్మా
మోహమాటమో కోపమో నేనేల కనుగొందునో
మోహమాటమో కోపమో నేనేలకనుగొందునో
ముద్దుగుమ్మా పైడిబొమ్మా అదిరిందోయమ్మా
నాజూకుతనమా నమ్మవమ్మా నువ్వంటే ప్రేమా...




అనురాగం మా పేరు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలో పావని కళ్యాణ్ (2003)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: తైదల బాపు
గానం: యస్. పి. బాలు, చిత్ర

పల్లవి:
అనురాగం మా పేరు అభిమానం మా ఊరు
ఆప్యాయత గలవారు మా వియ్యంకులవారు
వెల్కమ్ టు యూ...వెల్కమ్ టు యూ
వెల్కమ్ టు యూ...వెల్కమ్ టు యూ
శుభమంటూ పిలిచారు ఆహ్వానం పలికారు
కమనీయం మీ తీరు మా వియ్యంకులవారు
థాంక్స్ టు యూ...థాంక్స్ టు యూ...

చరణం: 1
జేబు రుమాలు పట్టుకుపోయే పందెం వేద్దాం రండి
సై అంటే మరి సై అంటాము మీరిక కాసుకోండి
ఆటపాట అన్నింటా మేం మీకేం తీసిపోము
తాడో పేడో తేలేదాక మేము ఊరుకోము
ఆటలో గెలుపు మాదండీ
మాటతో గెలుపురాదండీ
కిటుకులే మాకు తెలుసండీ
అదేదో చేసి చూపండి
ఓడితే ఏం చేస్తారండీ
ఆ మాట మేము ఎరగమండీ

అనురాగం మా పేరు...అభిమానం మా ఊరు
ఆప్యాయత గలవారు మా వియ్యంకులవారు
వెల్కమ్ టు యూ...వెల్కమ్ టు యూ
వెల్కమ్ టు యూ...వెల్కమ్ టు యూ

చరణం: 2
మనసులు కలవని పెళ్ళికి అర్థం లేనేలేదు కదండీ
ఆ మనసులు కలిపిన జంటకు నేడు మనువే జరిగేనండీ..
కొంగులు రెంటిని కలిపే ముడినే బ్రహ్మముడి అంటారండీ
మరి ఆ పెళ్ళిళ్ళంటూ జరిగేది ఆ స్వర్గంలోనే కదండీ
రెండుగా వున్న ఈ జంట నేటితో ఒక్కటవునంటా
అందాల పెళ్ళి కొడుకండీ గుణములో రాముడేనండీ
బంగారు బొమ్మ ఇదిగోండి మీ వాడి జోడు తగునండీ

శుభమంటూ పిలిచారు ఆహ్వానం పలికారు
కమనీయం మీ తీరు మా వియ్యంకులవారు
థాంక్స్ టు యూ...థాంక్స్ టు యూ
థాంక్స్ టు యూ...థాంక్స్ టు యూ
వెల్కమ్ టు యూ...వెల్కమ్ టు యూ
వెల్కమ్ టు యూ...వెల్కమ్ టు యూ



అడగక్కర్లేదు నా బావ ఎక్కడని పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలో పావని కళ్యాణ్ (2003)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: టిప్పు, స్వర్ణలత

పల్లవి:
అడగక్కర్లేదు నా బావ ఎక్కడని 
అడగక్కర్లేదు నా బావ ఎక్కడని
సింపిరి, సింపిరి జుట్టుతోటి 
చిరిగిన నిక్కరు వేసుకుని
వంకర చూపులు చూసుకుంటూ 
వాగుల వెంట పోతా ఉంటాడే

వాడేనా బావంటే... వాడేనా బావంటే
వాడేనా బావంటే... వాడేనా బావంటే

చెప్పక్కర్లేదు నా మరదలు ఎక్కడని 
అడగక్కర్లేదు నా మరదలు ఎక్కడని
బొబర్లంక చీరకట్టి...జబ్బలదాక జాకెట్ వేసి
కొప్పునిండా మల్లెలు పెట్టి తిప్పుకుంటు తిరుగుతుంటదే

అదే నా మరదలని...అదే నా మరదలని
అదే నా మరదలని...అదే నా మరదలని

చరణం: 1
మంచినీళ్ళ నల్లకాడ బిందెనెత్తుకుంట వుంటే
తొంగి తొంగి చూస్తాడే 
మల్లెపూల తోటలోన మంచం వేసుకుని వుంటే
దొంగలాగ చేరతాడే
పొద్దుకూడ పొడవకుండా రయ్యమంటూ ఇంటికొచ్చి దుప్పటంతా లాగుతుందే 
నిద్దరంతా పాడుచేసి లేవమంటు గోలచేసి
నీళ్ళు చల్లి నవ్వుతుందే

కల్లోకొచ్చి ఏదేదేదో అడిగేస్తాడే
కన్నేకొట్టి తికమకలో ననుతోసేస్తుందే
బుజ్జిగాడిలా ఒళ్ళో వాలిపోతాడే 
ఎంత చెప్పిన వల్ల నోల్లనంటాడే
పూతరేకు తెస్తానంటూ వత్తాలేక పారిపోతాడే

వాడేనా బావంటే...వాడేనా బావంటే 
వాడేనా బావంటే...వాడేనా బావంటే

అడగక్కర్లేదు నా బావ ఎక్కడని
చెప్పక్కర్లేదు నా మరదలు ఎక్కడని

చరణం: 2
కొత్త కొత్త ఫ్యాషనంటూ జబ్బలు చూపే జాకెట్ వేసి
నిబ్బరంగా వుండనీయదే 
ఊసుపోదలేదు అంటు ఏడవుంటే ఆడికొచ్చి
పోదమంటూ సంపుతుంటదే
వేపచెట్టు నీడలోన అష్ట చెమ్మ ఆడుతుంటే
గుళకరాళ్ళు విసురుతాడే వెనకనుంచి దూసుకొచ్చి కళ్ళు రెండు మూసి
నన్ను ఇరికు నెట్టి నవ్వుతాడే
ఒక్కోసారి కోపంతో తెగ అరిచేస్తుందే
సుతారంగా దువ్వి దువ్వి మురిపిస్తాడే
ఎన్ని చేసినా ఎంత సతాయించినా 
అప్పుడప్పుడు దాన్ని కష్టపెటనా 
నన్ను విడిచి దూరమైతే బతకలేను బావ అంటదే... 

అదేనా మరదలటా...అదేనా మరదలటా
అదేనా మరదలటా...అదేనా మరదలటా

అడగక్కర్లేదు నా బావ ఎవ్వరని 
చెప్పక్కర్లేదు వాడి మోటు మోజులని
పొద్దున్న లేస్తే ముద్దు అంటాడే సద్దులేమో చెప్పేస్తాడు 
వద్దంటే దగ్గరకొచ్చి తుంటరివాడు చుట్టుకుంటాడే 

వాడేనా బావంటే...వాడేనా బావంటే
వాడేనా బావంటే...వాడేనా బావంటే

పిలవక్కర్లేదు నా కొంటె మరదలని
చెప్పక్కర్లేదు నా స్వీట్ సరసాన్ని
చూపులతోనే చుట్టేస్తుంది మాటలతోనే కట్టేస్తుంది
సైగలోనే ఒప్పించి చప్పున ముద్దు పెట్టుకుంటదే

అదేనా మరదలటా....అదేనా మరదలటా
అదేనా మరదలటా...అదేనా మరదలటా



ఓ ప్రియా ఓ ప్రియా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలో పావని కళ్యాణ్ (2003)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: తైదల బాపు
గానం: హరిహరన్, గోపిక పూర్ణిమ

పల్లవి:
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
నీ నవ్వే నాకు సొంతం నీ పిలుపే సుప్రభాతం
నీ నవ్వే నాకు సొంతం నీ పిలుపే సుప్రభాతం
నీ చూపే సుందరకాండమే

ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా

చరణం: 1
చిరునగవుల్లో తొలకరి జల్లు కురిసే వేళలో
ప్రేమ పురాణం పల్లకి రాగం సాగే వేళలో
ఊసులుతోని ఊహల ఊయలలూపే వేళలో
చూపులతోని కమ్మని కథలు తెలిపే వేళలో
ప్రేమలో పావనితో జావళీలు పాడన
జావళీలు పాడుకోనె జాగరాలు చేయన
నీ తడిసిన పెదవిని పెడవులతో 
నే ముద్దుల ముద్రే వేయన

ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా

చరణం: 2
తుమ్మెద నీవై రమ్మని పిలిచే కమ్మని రేయిలో
ఝుమ్మని తేనెలు తీయని వానై కురిసే వేళలో
వన్నెల పైట వెన్నెలలోన జారే వేళలో
వెచ్చని ప్రాయం నెచ్చెలి సాయం కోరే వేళలో
నిన్ను చూసి చూడంగానే చెప్పలేని హాయిలో
గుండెచాటు కోరికలన్నీ గుప్పుమన్న వేళలో
తడబడు అడుగుల సవ్వడిలో నీ జంటై నేనుంటాలే

ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
నీ నవ్వే నాకు సొంతం నీ పిలుపే సుప్రభాతం
నీ నవ్వే నాకు సొంతం నీ పిలుపే సుప్రభాతం
నీ చూపే సుందరకాండమే

ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా


Most Recent

Default