Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ninnu Kori (2017)





చిత్రం: నిన్ను కోరి (2017)
సంగీతం: గోపి సుందర్
నటీనటులు: నాని, ఆది పినిశెట్టి, నివేద థామస్
దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాత: డి.వి.వి.దానయ్య
విడుదల తేది: 07.07.2017



Songs List:



అడిగా అడిగా పాట సాహిత్యం

 
చిత్రం: నిన్ను కోరి (2017)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: శ్రీజో
గానం: సిద్ శ్రీరామ్

ఊహుఁ...  ఊహుఁ... 
ఊహుఁ...  ఊహుఁ... 

ఊహుఁ హు  ...  ఊహుఁ... 
ఊహుఁ...  ఊహుఁ... 

అడిగా అడిగా ఎదలో లయనడిగా 
కదిలే క్షణమా చెలి ఏదనీ
నన్నె మరిచా తన పేరునె తలిచా 
మదినే అడిగా తన ఊసేదనీ

నువ్వే లేని నన్ను ఊహించలేను 
నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే 
నీలోనె ఉన్నా నిను కోరి ఉన్న 
నిజమై నడిచా జతగా...

ఊహుఁ...  ఊహుఁ... 
ఊహుఁ...  ఊహుఁ... 

ఊహుఁ...  ఊహుఁ... 
ఊహుఁ...  ఊహుఁ... 

గుండెలోతుల్లో ఉంది నువ్వేగా 
నా సగమే నా జగమే నువ్వేగా 
నీ స్నేహమే నను నడిపే స్వరం 
నిను చేరగ ఆగిపోనీ పయణం 
అలుపే లేని గమనం 

అడిగా అడిగా ఎదలో లయనడిగా 
కదిలే క్షణమా చెలి ఏదని 
నన్నె మరిచా తన పేరునె తలిచా 
మదినే అడిగా తన ఊసేదని 

నువ్వే లేని నన్ను ఊహించలేను 
నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే 
నీలోనె ఉన్న నిను కోరి ఉన్నా
నిజమై నడిచా జతగా....

ఊహుఁ...  ఊహుఁ... 
ఊహుఁ...  ఊహుఁ... 

ఊహుఁ...  ఊహుఁ... 
ఊహుఁ...  ఊహుఁ... 



ఉన్నటుండి గుండె పాట సాహిత్యం

 
చిత్రం: నిన్ను కోరి (2017)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తిక్, చిన్మయి శ్రీపద

ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందె 
ఎవ్వరంట ఎదురైనదీ..
సంతోషాలె నిండే బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినది 
నేనా నేనా... ఇలా నీతో ఉన్నా
ఔనా ఔనా... అంటూ ఆహా అన్నా 

హెయ్ మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు 
ముచ్చటగా నను హత్తుకుపొయె 
ఓయె.. ఒయె.. యె యె యె యె హత్తుకుపోయె 
చుక్కలు చూడని లోకం లోకి 
చప్పున నన్ను తీసుకుపోయె 
ఓయె.. ఒయె.. యె యె యె యె తీసుకుపోయె 

ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందె 
ఎవ్వరంట ఎదురైనది 
సంతోషాలె నిండి బంధం అల్లుకుంది 
ఎప్పుడంట ముడిపడినది 

ఏ దారం ఇలా లాగిందో మరి 
నీ తోడై చెలీ పొంగిందె మది 
అడిగి పొందినది కాదులె 
తనుగ దొరికినది కానుక 
ఇకపై సెకనుకొక వేడుక 
కోరె కలా నీలా నా చెంత చేరుకుందిగ 

హెయ్ మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు 
ముచ్చటగా నను హత్తుకుపొయె 
ఓయె.. ఒయె.. యె యె యె యె హత్తుకుపోయె 
చుక్కలు చూడని లోకం లోకి 
చప్పున నన్ను తీసుకుపోయె 
ఓయె.. ఒయె.. యె యె యె యె తీసుకుపోయె 

ఆనందం సగం అచ్చర్యం  సగం 
ఏమైనా నిజం బాగుంది నిజం
కాలం కదలికల సాక్షిగ 
ప్రేమై కదిలినది జీవితం 
ఇకపై పదిలమె నా పధం 
నీతో అటో ఇటో ఏవైపు దారి చూసిన 

ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందె 
ఎవ్వరంట ఎదురైనది 
సంతోషాలె నిండే బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినది 
నేనా నేనా... ఇలా నీతో ఉన్నా
ఔనా ఔనా... అంటూ ఆహా అన్నా 

హెయ్ మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు 
ముచ్చటగా నను హత్తుకుపొయె 
ఓయె.. ఒయె.. యె యె యె యె హత్తుకుపోయె 
చుక్కలు చూడని లోకం లోకి 
చప్పున నన్ను తీసుకుపోయె 
ఓయె.. ఒయె.. యె యె యె యె తీసుకుపోయె




వన్స్ అప్ ఆన్ ఎ టైములో పాట సాహిత్యం

 
చిత్రం: నిన్ను కోరి (2017)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అరుణ్ గోపాన్

వన్స్ అప్ ఆన్ ఎ టైములో
వైజాగ్ బీచ్ రోడ్డులో
ఏవండోయ్ మాస్టారంటు 
విష్ చేసింది నన్నూ... 

వన్స్ అప్ ఆన్ ఎ టైములో
వైజాగ్ బీచ్ రోడ్డులో
ఏవండోయ్ మాస్టారంటు 
విష్ చేసింది నన్నూ... 

అల్లి బిల్లి నడుముని తిప్పి
ఐ లవ్ యు చెవిలోన చెప్పి హో
తప్పుకుంది కల్లు రెండు కప్పి
అందుకేగ  గుండెకింత నొప్పి

బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. 
కింగు లాంటి.. ఉమా గాడి లైఫె పాకప్పు... (2)

బైకెనక.. తను ఎక్కేసి కూర్చుంది చేతుల్ని వేసింది 
లైఫంత.. నన్ను వదలనంటు ఒట్టేసి చెప్పింది 
సోల్ మేటె దొరికిందనుకుంటె అంతలో...
సోలోగ వదిలేసెలిపోయెను సంతలో
తోక చుక్కల్లె నా వెంట వచ్చి
తేనె చుక్కల్లె తీయగ నచ్చి
బుగ్గ చుక్కని పెట్టుకు వస్తానని 
చుక్కలు చూపిందె 
మందు చుక్కె మిగిలిందే...

బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. 
కింగు లాంటి.. ఉమా గాడి లైఫె పాకప్పు... (2)

నీ సుఖమె.. కోరుకున్నాను అన్నది వన్నెల చిన్నది 
కాబట్టె.. నీ కంటికి దూరంగ ఉన్నాను అన్నది 
తను లేక మనుసుకి సుఖమెట్టా ఉంటది
నా బాధ పిల్లకి ఎపుడర్దం అవుతది
ఈ లేడీసు ఇంతె తమ్మి
వాల్లు చెప్పినవన్ని నమ్మి
మనసిచ్చామంటె తిరిగి ఇవ్వరు 
పట్టుకు పోతారె.. 
వేరె వాన్ని కట్టుకు పోతారె.. 

బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. 
కింగు లాంటి.. ఉమా గాడి లైఫె పాకప్పు... (3)

పాకప్...



హే బదులు చెప్పవె పాట సాహిత్యం

 
చిత్రం: నిన్ను కోరి (2017)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: హరిచరన్

హే బదులు చెప్పవె 
రుజువు చూపవె సమయమా
నీ పనిగ నువ్విల గడిచిపోవడం న్యాయమా
ఏ పరిచయానికేం ఫలితమున్నదో తెలుపుమా 
అది ఆ తొలి క్షణాలలో
తెలుసుకోవడం సాధ్యమా... 

నిన్నేనే అడిగేది...  ఎన్నాల్లే నలిగేది... 

హే బదులు చెప్పవె 
రుజువు చూపవె సమయమా
నీ పనిగ నువ్విల గడిచిపోవడం న్యాయమా

వేలి తోటి వేలు కలిపేయగానె చాలు 
వేల యేల్లు వాళ్ళు కలిసుందురందురే 
ప్రానమైన వారు జంట లాగ చేరితే 
ఎన్నడైన వీడరన్న మాట నమ్మరే

నిన్నేనే అడిగేదీ... ఎన్నాల్లే నలిగేదీ... 

దారులేమొ రెండె అవి ముళ్ళతోటి నిండె 
ఎంచుకోమనంటు వదిలేసి వెళ్లకే
నిన్న లోని లోపమేదొ నిండి ఉందని 
రేపు దాన్ని లోటులా మిగల్చలేం కదా 

హే బదులు చెప్పవె 
రుజువు చూపవె సమయమా
నీ పనిగ నువ్విల గడిచిపోవడం న్యాయమా
ఏ పరిచయానికేం ఫలితమున్నదో తెలుపుమా 
అది ఆ తొలి క్షణాలలో
తెలుసుకోవడం సాధ్యమా... 

నిన్నేనే అడిగేది...  ఎన్నాల్లే నలిగేది... 
నిన్నేనే అడిగేది...  ఎన్నాల్లే నలిగేది... 




నిన్ను కోరీ పాట సాహిత్యం

 
చిత్రం: నిన్ను కోరి (2017)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: శివ నిర్వాణ
గానం: అరుణ్ గోపన్ 

నిన్ను కోరీ
నిన్ను కోరీ
నిన్ను కోరీ
నిన్ను కోరీ….

కదిలే నదిలా
కరిగా కనులా

నిన్ను కోరీ
నడిచే ప్రతి దారీ

నిన్ను కోరీ
ఎగసే నా ఊపిరీ..

చెలియా ఓ సఖియా..
నిన్ను కోరీ..

ఓ చెలియా ఓ సఖియా..
నిన్ను కోరీ..

Most Recent

Default