చిత్రం: స్టూడెంట్ నెం:1 (2001) సంగీతం: యమ్.యమ్.కీరవాణి నటీనటులు: జూ. యన్. టి. ఆర్, గజాల దర్శకత్వం: యస్. యస్. రాజమౌళి దర్శకత్వ పర్యవేక్షణ: కె.రాఘవేంద్రరావు నిర్మాత: సి. అశ్వనీదత్ విడుదల తేది: 27.09.2001
Songs List:
కూచిపూడికైనా పాట సాహిత్యం
చిత్రం: స్టూడెంట్ నెం:1 (2001) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: టిప్పు, బృందం కూచిపూడికైనా ధిరనన కొంగుపూలకైనా తకధిమి క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ ఆనాటి బాలుణ్ణి ఈనాటి రాముణ్ణి తెలుగింటి కారం తింటూ కలలనుకంటూ పెరిగిన కుర్రోణ్ణి కూచిపూడికైనా ధిరనన కొంగుపూలకైనా తకధిమి క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ చరణం: 1 శివధనుస్సునే విరిచిన వాడికి గడ్డిపరకనే అందిస్తే వాటే జోక్ వాటే జోక్ హాలహలమే మింగిన వాడికి కోలాపెప్సీ కొట్టిస్తే వాటే జోక్ వాటే జోక్ మాన్లీ ఫోజులు మధుర వాక్కులు మ్యాజిక్ చూపులు నా సిరులు ఒళ్లే కళ్లుగ మెల్ల మెల్లగ నోళ్లే విప్పర చూపరులు ఆబాలగోపాలం మెచ్చేటి మొనగాణ్ణి తెలుగింటి కారంతో మమకారాన్నే రుచి చూసిన చిన్నోణ్ణి కూచిపూడికైనా ధిరనన కొంగుపూలకైనా తకధిమి క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ దేనికైనా రెడీ చరణం: 2 సప్త సముద్రాలీదిన వాడికి పిల్లకాలువే ఎదురొస్తే వాటే జోక్ వాటే జోక్ చంద్రమండలం ఎక్కిన వాడికి చింతచెట్టునే చూపిస్తే వాటే జోక్ వాటే జోక్ వాడి వేడిగ ఆడిపాడితే నేడే పోవును మీ మతులు పోటాపోటీగ పొగరు చూపితే నాకే వచ్చును బహుమతులు రెహమాను సంగీతం మహబాగ విన్నోణ్ణి మీ కాకికూతలకైనా చేతలు చూపే సరదా ఉన్నోణ్ణి దేనికైనా రెడీ... దేనికైనా రెడీ
కాస్త నన్ను నువ్వు నిన్నునేను పాట సాహిత్యం
చిత్రం: స్టూడెంట్ నెం:1 (2001) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: యస్.పి.బాలు, చిత్ర కాస్త నన్ను నువ్వు నిన్నునేను తాకుతుంటే తాకుతున్నచోట సోకు నిప్పు రేగుతుంటే రేగుతున్నచోట భోగిమంట మండుతుంటే మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది కాస్త నన్ను నువ్వు నిన్నునేను తాకుతుంటే తాకుతున్నచోట సోకు నిప్పు రేగుతుంటే రేగుతున్నచోట భోగిమంట మండుతుంటే మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది అమ్మడూ నీ యవ్వారం అసలుకే ఎసరు పెడుతుంటే కమ్మగా నీ సింగారం కసురు విసురుతుంటే పిల్లడూ నా ఫలహారం కొసరి కొసరి తినిపిస్తుంటే మెల్లగా నీ వ్యవహారం కొసరులడుగుతుంటే చిన్ననాడె అన్న ప్రాసనయ్యిందోయ్ కన్నెదాని వన్నె ప్రాసనవ్వాలోయ్ అమ్మచేతి గోరు ముద్దతిన్నానోయ్ అందగాడి గోటి ముద్ర కావాలోయ్ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ కాస్త నన్ను నువ్వు నిన్ను నేను కోరుకుంటే కోరుకున్నచోట నువ్వు నేను చేరుకుంటే చేరుకున్నచోట ఉన్నదీపమారుతుంటే ఆరుతున్నవేళ కన్నె కాలు జారుతుంటే నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది మెత్తగా నీ మందారం తనువులో మెలిక పెడుతుంటే గుత్తిగా నీ బంగారం తలకు తగులుతుంటే కొత్తగా నీ శృంగారం సొగసులో గిలకలవుతుంటే పూర్తిగా నా బండారం వెలికి లాగుతుంటే బుగ్గలోన పండుతుంది జాంపండు పక్కలోన రాలుతుంది ప్రేంపండు రాతిరేళ వచ్చిపోరా రాంపండు బంతులాడి పుచ్చుకోరా భాంపండు ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ కాస్త నన్ను నేను నిన్ను నువ్వు ఆపుకుంటే ఆపలేక నేను నిన్ను జాలి చూపమంటే చూపనంటు నేను తీపి ఆశ రేపుతుంటే రేపుతుంటే నేను రేపు కాదు ఇప్పుడుంటే నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది
ఒకరికి ఒకరై ఉంటుంటే పాట సాహిత్యం
చిత్రం: స్టూడెంట్ నెం: 1 (2001) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: కె.కె., వర్ధిని ఒకరికి ఒకరై ఉంటుంటే ఒకటిగ ముందుకు వెళుతుంటే అడిగినవన్నీ ఇస్తుంటే అవసరమే తీరుస్తుంటే ప్రేమంటారా... కాదంటారా! ఒకరికి ఒకరై ఉంటుంటే ఒకటిగ ముందుకు వెళుతుంటే చరణం: 1 దిగులే పుట్టిన సమయంలో ధైర్యం చెబుతుంటే గొడవే పెట్టిన తరుణంలో తిడుతూనే వేడుకుంటే కష్టం కలిగిన ప్రతిపనిలో సాయం చేస్తుంటే విజయం పొందిన వేళలలో వెనుదట్టి మెచ్చుకుంటే దాపరికాలే లేకుంటే లోపాలను సరిచేస్తుంటే ఆటాపాటా ఆనందం అన్నీ చెరి సగమౌతుంటే ప్రేమంటారా... కాదంటారా! ఒకరికి ఒకరై ఉంటుంటే ఒకటిగ ముందుకు వెళుతుంటే చరణం: 2 ఓ మనోహరీ చెలీ సఖీ ఓ స్వయంవరా దొరా సఖా మనసు నీదని మనవి సేయనా సఖీ బ్రతుకు నీదని ప్రతినబూననా సఖా నినుచూడలేక నిమిషమైన నిలువజాలనే సఖీ సఖీ... నీ చెలిమిలేని క్షణములోన జగతిని జీవింపజాలనోయ్ సఖా... ఆ... ఆ... నటనకు జీవం పోస్తుంటే ఆ ఘటనలు నిజమనిపిస్తుంటే అటుపై సెలవని వెళుతుంటే నీ మనసే కలవర పడుతుంటే ప్రేమంటారా... జౌనంటాను...
పడ్డానండి ప్రేమలో మరి పాట సాహిత్యం
చిత్రం: స్టూడెంట్ నెం: 1 (2001) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: ఉదిత్ నారాయణ్ , చిత్ర స స మ ప మ ప ని మ ప స ని ప మ రి స రి నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది నమ్మకం కుదిరింది అన్ని కలిసొచ్చి ఈ పిచ్చి మొదలయ్యింది పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది ఈ కాంతలోన దాగివుంది ఆయస్కాంతము తన వైపు నన్ను లాగుతుంది వయస్కాంతము ఒహొఒహొఒఒ నీ చేతిలోన దాగి వుంది మంత్ర దండము నువ్వు తాకగానే చెంగుమంది మగువ దేహము ఒహొఒఒహొఒ ఇద్దరిదీ ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి ఇద్దరిదీ ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి వలపు గుర్రమెక్కి వనిత చేయమంది స్వారీ పడ్డానండి ప్రేమలో మరివిడ్డూరంగా ఉందిలే ఇది నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది నా ఈడు నేడు పాడుతుంది భామ దండకం నా ఒంటి నిండ నిండివుంది ఉష్ణ మండలం ఒహొఒఒహొఒ నా పాత పెదవి కోరుతుంది కొత్త పానకం నా అందమంత చూపమంది హస్త లాఘవం ఒహొఒఒహొఒ కలిసుంటే ఏకాదశి కలబడితే ఒకే ఖుషి కలిసుంటే ఏకాదశి కలబడితే ఒకే ఖుషి వయసులోన ఉన్నోళ్ళకి తప్పదీ స్వయంకృషి పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పాట సాహిత్యం
చిత్రం: స్టూడెంట్ నెం: 1 (2001) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: యమ్.యమ్.కీరవాణి ఓ మై డియర్ గాళ్స్ డియర్ బోయ్స్ డియర్ మేడమ్స్ గురుబ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటు వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము చిలిపితనపు చివరి మలుపులో వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమలేఖలూ సైన్సు లాబ్ లోనా షీలాపై చల్లిన ఇంకు చుక్కలూ ఫస్ట్ బెంచ్ లోన మున్నీపై వేసిన పేపర్ ఫ్లైటులూ రాధ జళ్ళోనుంచి రాబర్ట్ లాగిన రబ్బరు బాండులూ రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు ఖైలాష్ కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగిరాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి ఆ అల్లరంటే మాక్కూడా సరదా లెండీ వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటు వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము చిలిపితనపు చివరి మలుపులో బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు జోకులూ రాగిణి మేడం రూపురేఖ పైన గ్రూపు సాంగులూ సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులూ టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోక్ టిన్నులూ బ్లాకుబోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్లుఫోనుల్లోన సిల్లీ న్యూసులు బాత్ రూముల్లోన భావకవితలు క్లాస్ రూముల్లోన కుప్పిగంతులు మరపురాని తిరిగిరాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ మనకు మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేం కూడా ఇంతేనండి వియ్ మిస్ ఆల్ ది ఫన్ వియ్ మిస్ ఆల్ ది జోయ్ వియ్ మిస్ యు వియ్ మిస్ ఆల్ ది ఫన్ వియ్ మిస్ ఆల్ ది జోయ్ వియ్ మిస్ యు
ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ పాట సాహిత్యం
చిత్రం: స్టూడెంట్ నెం: 1 (2001) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: ఉదిత్ నారాయణ్ , చిత్ర ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా పాలతోనా పూలతోనా వెన్నతోనా జున్నుతోనా రంభ ఊర్వశి మేని చమటతోనా ఏవెట్టి... ఏవెట్టి టి టి టి టి ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా నిన్ను చూసినప్పుడే కనకదుర్గకు నేను మొక్కుకున్నా నీకు కన్నుకొట్టు కుంటానని నిన్ను కౌగిలించు కుంటానని నిన్ను కలిసినప్పుడే సాయిబాబకు నేను మొక్కుకున్నా నీతో సందిచేసుకుంటానని నీతో సందులోకి వస్తానని రాఘవేంద్ర స్వామికి మొక్కుకున్నా నీతో భాగస్వామినౌతానని మూడుకళ్ళ శివుడికి మొక్కుకున్నా నీతో మూడు రాత్రులవ్వాలని ఆఖరికి ఆఖరికి నీకే మొక్కుకున్నా నీ నౌకరుగా ఉంటానని తీపి చాకిరులే చేస్తానని ఏవెట్టి... ఏవెట్టి టి టి టి టి ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ నిను మీ అమ్మ నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ ఉక్కుతోనా ఉగ్గుతోనా నిప్పుతోనా పప్పుతోనా కాముడు పంపిన కోడి పులుసుతోనా ఏవెట్టి... ఏవెట్టి టి టి టి టి ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ నిను మీ అమ్మ నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ నువ్వు కట్టుకొచ్చిన గళ్ళచీరతో ఒకటి చెప్పుకున్నా నిన్ను చూడగానే జారాలని ఆ మాట నోరు జారొద్దని నువ్వు పెట్టుకొచ్చిన కళ్ళజోడుతో ఒకటి చెప్పుకున్నా మేము అల్లుకుంటే చూడొద్దని ఈ లొల్లి బయట చెప్పొద్దని చెవులకున్న దుద్దులతో చెప్పుకున్నా చిలిపి మాటలన్ని వినోద్దే అని కాలికున్న మువ్వలతో చెప్పుకున్నా మసక చీకటేల మూగ బొమ్మని నీ కన్నె తనానికే చెప్పుకున్నా తనకేవేవో చెబుతానని అవి నీక్కూడా చెప్పొద్దని ఏవెట్టి... ఏవెట్టి టి టి టి టి ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ నిను మీ అమ్మ నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమా