చిత్రం: చెంచులక్ష్మీ (1958)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: గంటసాల, జిక్కీ
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, అంజలిదేవి
దర్శకత్వం: బి.ఏ. సుబ్బారావు
నిర్మాత: బి.ఏ. సుబ్బారావు
విడుదల తేది: 09.04.1958
ఆనందమాయె అలినీలవేణి
ఆనందమాయె అలినీలవేణి
అరుదెంచినావా అందాల దేవి
ఆనందమాయె అలినీలవేణి
అరుదెంచినావా అందాల దేవి
చరణం: 1
అనువైన వేళ అనురాగ శోభ
హరిప్రేమ పూజ నా భాగ్యమాయె
అలనాటి నోము కల నేడు పండె
అరుదైన హాయి నాలోన నిండె
ఆనందమాయె అసమాన తేజా
అపురూపమైనా అందాల దేవా
ఆనందమాయె అసమాన తేజా
చరణం: 2
సొగసైన రూపె సోలించు చూపె
సగమైన కనుల సంతోషమిడులే
నగుమోము పైన నడయాడు కళలే
అగుపించగానే మగువను నాలో
ఆనందమాయె అలినీలవేణి
అరుదెంచినావా అందాల దేవి
ఆనందమాయె అలినీలవేణి
చరణం: 3
ఎనలేని స్వామి నిను చేరబోతే
నును లేత ప్రేమ నను సాగనీదే
తనువేమో నీకై తపియించు నిలచి
మనసేమో నీలో మునుపె కలిసే
ఆనందమాయె అసమాన తేజా
అపురూపమైనా అందాల దేవా
ఆనందమాయె అలినీలవేణి
అరుదెంచినావా అందాల దేవి
ఆనందమాయె అలినీలవేణి
********* ********* *********
చిత్రం: చెంచులక్ష్మీ (1958)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: గంటసాల, జిక్కీ
చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా
చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మల చిగురు కోయగలవా
ఓ నరహరి చిగురు కోయగలవా
చెట్టులెక్కగలనే ఓ చెంచిత పుట్టలెక్కగలనే
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే
ఓ చెంచిత చిగురు కోయగలనే
చరణం: 1
ఉరకలేయగలవా ఓ నరహరి
పరుగులెత్తగలవా
ఉరకలేయగలవా ఓ నరహరి
పరుగులెత్తగలవా
ఊడ పట్టుకుని జారుడు బండకు
ఊగి చేరగలవా ఓ నరహరి ఊగి చేరగలవా
ఉరకలేయగలనే ఓ చెంచిత
పరుగులెత్తగలనే
ఉరకలేయగలనే ఓ చెంచిత
పరుగులెత్తగలనే
ఊడపట్టుకుని జారుడు బండకు ఊగి చేరగలనే
ఓ చెంచిత ఊగి చేరగలనే
చరణం: 2
ఓ హొయ్ గురిని చూసుకొని కనులు మూసుకుని
బాణమేయగలవా ఓ నరహరి బాణమేయగలవా
గురిని చూసుకొని వెనుతిరిగి నాణ్యముగ
బాణమేయగలనే ఓ చెంచిత బాణమేయగలనే
ఓ చెంచిత నిన్ను మించగలనే
చెట్టులెక్కగలనే ఓ చెంచిత పుట్టలెక్కగలనే
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే
ఓ చెంచిత చిగురు కోయగలనే
చరణం: 3
ఓహో...
తగువులేల ఎగతాళిగాదు నను తాళికట్టనీవా
ఓ చెంచిత తాళి కట్టనీవా
మనసు తెలుసుకుని మరులు చూపితే
మనువునాడనిస్తా ఓ నరహరి
మనువునాడనిస్తా ఓ నరహరి మాల తెచ్చివేస్తా
చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా
చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా
చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మల చిగురు కోయగలవా
ఓ నరహరి చిగురు కోయగలవా
********* ********* *********
చిత్రం: చెంచులక్ష్మీ (1958)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు
గానం: పి.సుశీల, సత్యవతి, వైదేహి
చెయ్యి చెయ్యి కలుపుదాం
చెయ్యి చెయ్యి కలుపుదాం
చిందులేసి కులుకుదాం
చిట్టిపొట్టి పిల్లలార చుట్టీ చుట్టీ తిరుగుదాం
చెయ్యి చెయ్యి కలుపుదాం
చెయ్యి చెయ్యి కలుపుదాం
చిందులేసి కులుకుదాం
చిట్టిపొట్టి పిల్లలార చుట్టీ చుట్టీ తిరుగుదాం
చరణం: 1
ఓ... ఓ... ఓ...
అల్లిబిల్లిలాడదాం అంగలేసి దూకుదాం
గున్నమావి చెట్టునీడ గుంపు గూడదాం
గుంపు గూడదాం
ఓ... ఓ... ఓ...
చెయ్యి చెయ్యి కలుపుదాం
చెయ్యి చెయ్యి కలుపుదాం
చిందులేసి కులుకుదాం
చిట్టిపొట్టి పిల్లలార చుట్టీ చుట్టీ తిరుగుదాం
చరణం: 2
ఓ... ఓ... ఓ...
దాగుడు మూతాటంట సాగిరండమ్మా - ఓ.. ఓ..
దాగుడు మూతాటంట సాగిరండమ్మా
పిల్లివచ్చె ఎలుక హుత్ చూడండమ్మా!
చూడండమ్మా! ...
పైన పోయె చిలుకలూ - హోయ్
పైన పోయె చిలుకలూ పావురాయి జంటలూ
మీకు మాకు దీటైన వాట పందలూ
మనకు వాట పందాలూ
ఓ... ఓ... ఓ...
చెయ్యి చెయ్యి కలుపుదాం
చెయ్యి చెయ్యి కలుపుదాం
చిందులేసి కులుకుదాం
చిట్టిపొట్టి పిల్లలార చుట్టీ చుట్టీ తిరుగుదాం
చరణం: 3
ఓ... ఓ... ఓ...
చిక్కు చిక్కు చెమ్మచెక్క చేరరండమ్మా - ఓ.. ఓ..
చిక్కు చిక్కు చెమ్మచెక్క చేరరండమ్మా
చారడేసి మొగ్గలంట ఏరండమ్మా...
ఏరండమ్మా...
వయ్యరి జాణలు... - హోయ్
వయ్యరి జాణలు... వగలాడి చానలు
ఓడిపొతే మీకంత ఆరు గుంజిళ్ళూ - హాఁ.. - ఊఁ
ఓడిపొతే మీకంత ఆరు గుంజిళ్ళూ
చెయ్యి చెయ్యి కలుపుదాం
చెయ్యి చెయ్యి కలుపుదాం
చిందులేసి కులుకుదాం
చిట్టిపొట్టి పిల్లలార చుట్టీ చుట్టీ తిరుగుదాం
********* ********* *********
చిత్రం: చెంచులక్ష్మీ (1958)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: వెంపటి సదాశివ బ్రహ్మం
గానం: గంటసాల, జిక్కీ
చిలకా గోరింకా కులికే పకా పకా
నేనే చిలకైతే నీవే గోరింకా రావా నా వంక
చిలకా గోరింకా కులికే పకా పకా
నీవే చిలకైతే నేనే గోరింకా రావా నా వంక
చరణం: 1
చెలియా నేటికి చెలిమి ఫలించెనే
కలలు కన్నట్టి కలిమి లభించెనే
మనువూ నిజమామే తనువులు ఒకటాయె
మదిలో తలంపులే తీరే తీయగా
మారే హాయిగా
చిలకా గోరింకా కులికే పకా పకా
నేనే చిలకైతే నీవే గోరింకా రావా నా వంక
చరణం: 2
కలికీ నీవిలా ఎదుటా నిలాబడా
పలుకే బంగారం ఒలికే వయ్యారమే
కలికీ నీవిలా ఎదుటా నిలాబడా
పలుకే బంగారం ఒలికే వయ్యారమే
ఒకటే సరాగము ఒకటే పరాచికం
కలసి విహారమే చేద్దాం హాయిగా నీవే నేనుగా
చిలకా గోరింకా కులికే పకా పకా
నీవే చిలకైతే నేనే గోరింకా రావా నా వంక
చిలకా గోరింకా కులికే పకా పకా
నేనే చిలకైతే నీవే గోరింకా రావా నా వంక
********* ********* *********
చిత్రం: చెంచులక్ష్మీ (1958)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: పి.సుశీల
కనలేరా కమలా కాంతుని
అదిగో కనలేరా భక్తపరిపాలుని
ఇదిగో కనలేరా శంఖు చక్రధారిని
నారాయణా హరి నారాయణా
శ్రీమన్నారాయణా లక్ష్మీనారాయణా
నారాయణా హరి నారాయణా
శ్రీమన్నారాయణా లక్ష్మీనారాయణా
చరణం: 1
దీనావన నీ దివ్య స్వరూపము
మూర్ఖులు మదిలో కనగలరా
దీనావన నీ దివ్య స్వరూపము
మూర్ఖులు మదిలో కనగలరా
నారాయణా హరి నారాయణా
శ్రీమన్నారాయణా లక్ష్మీనారాయణా
నారాయణా హరి నారాయణా
చరణం: 2
పాపాత్ములు నిను పరికింపరుగా...
పాపాత్ములు నిను పరికింపరుగా
నీపై కోపము వైరము పూని
హే పరమేశా... హే పరమేశా
ఎటు చూసిన నే రూపమేకాదా లోకేశా
హరి నారాయణా హరి నారాయణా
శ్రీమన్నారాయణా లక్ష్మీనారాయణా
నారాయణా హరి నారాయణా
నారాయణా హరి నారాయణా
శ్రీమన్నారాయణా లక్ష్మీనారాయణా
నారాయణా హరి నారాయణా
********* ********* *********
చిత్రం: చెంచులక్ష్మీ (1958)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: గంటసాల
పల్లవి:
నీలగగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా
నీలగగన ఘనశ్యామా
నీలగగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా
నీలగగన ఘనశ్యామా
హాని కలిగితే అవతారాలను
హాని కలిగితే అవతారాలను
పూని భ్రోచునదీ నీవేకావా
నీలగగన ఘనశ్యామా
నీలగగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా
నీలగగన ఘనశ్యామా
చరణం: 1
చదువులు హరించి అసురండేగిన
జలచరమైతివి ఆగమరూపా
చదువులు హరించి అసురండేగిన
జలచరమైతివి ఆగమరూపా
వేద నిదులనే విధాత కొసగిన
ఆదిదేవుడవు నీవే కావా
నీలగగన ఘనశ్యామా
నీలగగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా
నీలగగన ఘనశ్యామా
చరణం: 2
కడలి మదించగ కదిలే నగమును
వెడలి కూర్మమై వీపున మోసి
కడలి మదించగ కదిలే నగమును
వెడలి కూర్మమై వీపున మోసి
అతివ రూపమున అమృతం గాచిన
ఆదిదేవుడవు నీవే కావా
నీలగగన ఘనశ్యామా
నీలగగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా
నీలగగన ఘనశ్యామా
చరణం: 3
సుజనుల కోసము ఎపుడే వేషము
ధరియెంచెదవో తెలియగ నేరము
సుజనుల కోసము ఎపుడే వేషము
ధరియెంచెదవో తెలియగ నేరము
ఫెండ్లి కొడుకువై వెడలినాడవు
ఎందులకొరకో హే జగదీశా
నీలగగన ఘనశ్యామా
నీలగగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా
నీలగగన ఘనశ్యామా
చరణం: 4
క్షీరసాగరము వీడక నిరతము
సిస్టుల రక్షణ దుష్టుల శిక్షణ
క్షీరసాగరము వీడక నిరతము
సిస్టుల రక్షణ దుష్టుల శిక్షణ
చిత్ర చిత్రముల రూపములొంది
చేసే దైవము శ్రీహరి ఒకడే
నీలగగన ఘనశ్యామా
నీలగగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా
నీలగగన ఘనశ్యామా
నీలగగన ఘనశ్యామా...
********* ********* *********
చిత్రం: చెంచులక్ష్మీ (1958)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల
పాలకడలిపై శేషతల్పమున
పవళించేవా దేవా
పాలకడలిపై శేషతల్పమున
పవళించేవా దేవా
బాలుని నను దయపాలించుటకై
కనుపించేవ మహానుభావా
బాలుని నను దయపాలించుటకై
కనుపించేవ మహానుభావా
పాలకడలిపై శేషతల్పమున
పవళించేవా దేవా
చరణం: 1
అలకలు అల్లలనాడుచు ముసరగా
అలకలు అల్లలనాడుచు ముసరగా
నెలనవ్వులు పులకించే మోము
నెలనవ్వులు పులకించే మోము
ఎలికన్నుల కరుణారస వృష్టి
ఎలికన్నుల కరుణారస వృష్టి
తిలకించిన మై పులకించె స్వామి
పాలకడలిపై శేషతల్పమున
పవళించేవా దేవా
చరణం: 2
ఆదిలక్ష్మి నీ పాదములొత్తగ
వేద మంత్రములు విరించి చదువ
ఆదిలక్ష్మి నీ పాదములొత్తగ
వేద మంత్రములు విరించి చదువ
నారదాది ముని ముఖ్యులు చేరి...
నారదాది ముని ముఖ్యులు చేరి
మోదమలర నిను గానము చేయ
పాలకడలిపై శేషతల్పమున
పవళించేవా దేవా