చిత్రం: కన్నెవయసు (1973) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం నటీనటులు: లక్ష్మీకాంత్, రోజారమణి దర్శకత్వం: ఓ.యస్.ఆర్.ఆంజనేయులు నిర్మాత: యస్.వి.నరసింహారావు విడుదల తేది: 28.05.1973
Songs List:
ఓయమ్మా చిలకమ్మా పాట సాహిత్యం
చిత్రం: కన్నెవయసు (1973) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాశరధి గానం: జానకి ఓయమ్మా చిలకమ్మా అల్లంత దూరాన సెలయేటి తీరాన అందాల తోటలోన మందారం కన్ను విచ్చింది.. కన్నె మందారం కన్ను విచ్చిందీ.. ఓయమ్మా చిలకమ్మా అల్లంత దూరాన సెలయేటి తీరాన అందాల తోటలోన మందారం కన్ను విచ్చింది.. కన్నె మందారం కన్ను విచ్చిందీ.. తీయని సన్నాయి కోయిల వాయించే తీయని సన్నాయి కోయిల వాయించే తొలకరి మేఘాలు బాజాలు మోగించె మల్లె పందిరేసింది మంచు చిందులేసింది నెమలి పురివిప్పి నాట్యాలాడే ఓయమ్మా చిలకమ్మా అల్లంత దూరాన సెలయేటి తీరాన అందాల తోటలోన మందారం కన్ను విచ్చింది.. కన్నె మందారం కన్ను విచ్చిందీ.. హోయ్ కెరటాల చినుకులు జలకాలాడించె ఆ కెరటాల చినుకులు జలకాలాడించె పగడాల చివురాకు పైటను సవరించె గాలి ఈల వేసింది.. తీగ కొంగులాగింది కొంటె తుమ్మెదలు మాటేశాయి.. ఓయమ్మా చిలకమ్మా అల్లంత దూరాన సెలయేటి తీరాన అందాల తోటలోన మందారం కన్ను విచ్చింది.. కన్నె మందారం కన్ను విచ్చిందీ..
చిన్నారీ సీతమ్మా పాట సాహిత్యం
చిత్రం: కన్నెవయసు (1973) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాశరధి గానం: పి. లీల అండ్ పార్టీ పల్లవి: చిన్నారీ సీతమ్మా యీడేరిందీ మా యింట రారమ్మా ఓ రమణుల్లాగా పేరంటానికి మీరంతా ము తైదువలు ముచ్చటగా దీవించాలీ శుభమనగా చరణం: 1 ముంజేతి బంగారు మురుగులు మోగంగ సువ్వీ .... సువ్వీ ...... బంగారు పళ్లాల సువ్వీ బంతులు చేసేము సువ్వీ నువ్వులు బెల్లాలు కలబోసి దించేను సువ్వీ ..... ఆ సువ్వీ..... బంగారు పళ్లాల బంతుల్లు చేశాము. చిమ్మిళ్లు దంచేము సువ్వీ .... చరణం: 2 కాళ్ళకు పారాణిపూయ - కాంతల్లారా రారే తలకు సంపంగి నూనెలంట - తరుణుల్లారా రారే! ఓ తరుణుల్లారా రారే..... మంచిగంధం నలుగులు పెట్ట మగువల్లారా రారే బాలకూ పన్నీటి జలకాలాడించంగారారే
ఏ దివిలో విరిసిన పారిజాతమో పాట సాహిత్యం
చిత్రం: కన్నెవయసు (1973) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాశరధి గానం: యస్.పి.బాలు ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో... నా మదిలో నీవై నిండిపోయెనే... ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో... నీ రూపమె దివ్య దీపమై నీ నవ్వులె నవ్య తారలై నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే... ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో... పాలబుగ్గలను లేతసిగ్గులు పల్లవించగా రావే నీలిముంగురులు పిల్ల గాలితో ఆటలాడగా రావే పాలబుగ్గలను లేతసిగ్గులు పల్లవించగా రావే నీలిముంగురులు పిల్ల గాలితో ఆటలాడగా రావే కాలి అందియలు గల్లుగల్లుమన కాలి అందియలు గల్లుగల్లుమన రాజహంసలా రా...వే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో... నామదిలో నీవై నిండిపోయెనే... ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో... చరణం: 2 నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలురేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలురేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే పదము పదములో మధువులూరగా... పదము పదములో మధువులూరగా కావ్యకన్యవై రావే... ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో... నా మదిలో నీవై నిండిపోయెనే... ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో...
యల్ల మంద కోటయ్య పాట సాహిత్యం
చిత్రం: కన్నెవయసు (1973) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాశరధి గానం: ఘంటసాల పల్లవి: హరోహరా ! హరోహరా ! యల్ల మంద కోటయ్య పలుకో పలుకో చెయ్యికాస్త అందించి చేదుకో చేదుకో.... హరోహరా ! హరోహరా ! చరణం: 1 పులిచర్మమ్మును కట్టినవాడా త్రికూలమ్ము చేపట్టినవాడా శేషుని మెడలో చుట్టినవాడా శిరమున గంగను పెట్టినవాడా చరణం: 2 జోడు ప్రభలు కట్టుకొని వస్తామయ్యా శివరాత్రి జాగరణ చేస్తామయ్యో హరోహరా ! హరోహరా ! ఏటేట నీకొండ ఎక్కుతామయ్యో ముడుపులన్నీ చెల్లించి మొక్కుతామయ్యో చరణం: 3 శివశివమూర్తివి నీవేనయ్యా శివావతారము నీవేనయ్యా భక్తుల బ్రోవగ యిలపై వెలసిన పరమేశ్వరుడవు నీవేనయ్యా చరణం: 4 కోటి జంగములు గుడికడమూగగ శంఖనాదములు చిందులు తొక్కగ భూలోకమ్మున కైలాసమ్మే ప్రత్యక్షమ్ముగ కనబడు వింతగ యల్లమంద!
యే దివిలో విరిసిన పారిజాతమో పాట సాహిత్యం
చిత్రం: కన్నెవయసు (1973) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాశరధి గానం: జానకి పల్లవి: యే దివిలో విరిసిన పారిజాతమో యే కవిలో మెరిసిన ప్రేమగీతమో నా మదిలో నీవై నిండిపోయెనే.... అనుపల్లవి: నీ రూపమే దివ్యదీపమై నీ నవ్వులే నవ్యతారనే నా కన్నుల వెన్నెల కాంతినింపెనో చరణం: 1 పాలబుగ్గలను లేతసిగ్గులు పల్లవించగా రావే నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే కాలి అందియలు ఘల్లు ఘల్లుమన రాజహంసలా రావే చరణం: 2 నిదుర మబ్బులను మెరుపు తీగపై కలలు రేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే పదము పదములో మధువులూరగా కావ్యకన్యవై రావే