చిత్రం: పూజా (1975) సంగీతం: రాజన్ - నాగేంద్ర నటీనటులు: రామకృష్ణ, మంజుల, వాణిశ్రీ దర్శకత్వం: మురగన్ కుమారన్ నిర్మాతలు: యమ్.మురగన్, యమ్. కుమారన్, యమ్.శరవణన్, యమ్.బాలు విడుదల తేది: 25.08.1975
Songs List:
అంతట నీ రూపం పాట సాహిత్యం
చిత్రం: పూజ (1975) సంగీతం: రాజన్-నాగేంద్ర సాహిత్యం: దాశరథి గానం: యస్.పి.బాలు ఆహా...హా...ఏహే..హే...లాలా ...లా...లాలా..లా.. అంతట నీ రూపం నన్నే చూడనీ.. ఆశలు పండించే నిన్నే చేరనీ... నీకోసమే నా జీవితం.. నాకోసమే నీ జీవితం అంతట నీరూపం నన్నే చూడనీ.. ఆశలు పండించే నిన్నే చేరనీ... నీవే లేని వేళ... ఈ పూచే పూవులేల వీచే గాలి.. వేసే ఈల.. ఇంకా ఏలనే కోయిల పాటలతో ..పిలిచే నా చెలీ.. ఆకుల గలగలలో నడిచే కోమలీ.. అంతట నీ రూపం నన్నే చూడనీ.. ఆశలు పండించే నిన్నే చేరనీ... నాలో ఉన్న కలలు.. మరి నీలో ఉన్న కలలూ అన్నీ నేడు నిజమౌ వేళ రానే వచ్చెనే.. తీయని తేనెలకై తిరిగే తుమ్మెదా నీ చిరునవ్వులకై వెతికే నా ఎదా అంతట నీ రూపం నన్నే చూడనీ.. ఆశలు పండించే నిన్నే చేరనీ.. ఆహా..హా...ఓహో..ఓ..లాలాలా...ఏహే..హే...
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ పాట సాహిత్యం
చిత్రం: పూజా (1975) సంగీతం: రాజన్ - నాగేంద్ర సాహిత్యం: దాశరధి గానం: యస్.పి.బాలు, వాణి జయరాం ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ చరణం: 1 పున్నమి వెన్నెలలోన పొంగును కడలీ నిన్నే చూసిన వేళా నిండును చెలిమి ఓ హో హో హో నువ్వు కడలివైతే నే నదిగా మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా... చేరనా... చేరనా... ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ చరణం: 2 కోటి జన్మలకైనా కోరేదొకటే నాలో సగమై ఎపూడూ నేనుండాలి ఓ హో హో హో నీ వున్న వేళా ఆ స్వర్గమేలా ఈ పొందు ఎల్లవేళలందు ఉండనీ... ఉండనీ... ఉండనీ... ఎన్నెన్నో... ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ ఎన్నటికీ... ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను ఆ హా హా హా హా... ఓ హో హో హో హో
మల్లితీగ వాడిపోగా పాట సాహిత్యం
చిత్రం: పూజ (1975) సంగీతం: రాజన్-నాగేంద్ర సాహిత్యం: దాశరథి గానం: యస్.పి. బాలు మల్లితీగ వాడిపోగా మరల పూలు పూయునా
పూజలు చేయ పూలు తెచ్చాను పాట సాహిత్యం
చిత్రం: పూజ (1975) సంగీతం: రాజన్-నాగేంద్ర సాహిత్యం: దాశరథి గానం: వాణీ జయరాం తూరుపులోన తెలతెలవారే బంగరు వెలుగు నింగిని చేరే పూజలు చేయ పూలు తెచ్చాను పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను తియ్యరా తలుపులను... రామా ఇయ్యరా దరిశనము... రామా పూజలు చేయ పూలు తెచ్చాను చరణం: 1 తూరుపులోన తెలతెలవారే బంగరు వెలుగు నింగిని చేరే తొలి కిరణాల... ఆ... ఆ... ఆ... ఆ... తొలి కిరణాల హారతి వెలిగే... ఇంకా జాగేలా స్వామీ ఇయ్యరా దరిశనము రామా ఇయ్యరా దరిశనము... రామా పూజలు చేయ పూలు తెచ్చాను చరణం: 2 దీవించేవో కోపించేవో... చెంతకు చేర్చి లాలించేవో దీవించేవో కోపించేవో... చెంతకు చేర్చి లాలించేవో నీ పద సన్నిధి... నా పాలిటి పెన్నిధి నీ పద సన్నిధి... నా పాలిటి పెన్నిధి నిన్నే నమ్మితిరా స్వామీ ఇయ్యరా దరిశనము రామా పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను ఇయ్యరా దరిశనము... రామా పూజలు చేయ.... పూలు తెచ్చాను
ఓ రంగైన బంగారు రవణమ్మా పాట సాహిత్యం
చిత్రం: పూజ (1975) సంగీతం: రాజన్-నాగేంద్ర సాహిత్యం: కొసరాజు గానం: యస్.పి.బాలు, ఎల్.ఆర్.ఈశ్వరి ఓ రంగైన బంగారు రవణమ్మా
నీ దయ రాదా రామా పాట సాహిత్యం
చిత్రం: పూజ (1975) సంగీతం: రాజన్-నాగేంద్ర సాహిత్యం: త్యాగరాజ గానం: పి. సుశీల నీ దయ రాదా రామా
నింగీ నేలా ఒకటాయెలే పాట సాహిత్యం
చిత్రం: పూజ (1975) సంగీతం: రాజన్-నాగేంద్ర సాహిత్యం: దాశరథి గానం: యస్.పి.బాలు, వాణీ జయరాం నింగీ నేలా ఒకటాయెలే మమతలూ వలపులూ పూలై విరిసెలే మమతలూ వలపులూ పూలై విరిసెలే లలలలలల నింగీ నేలా ఒకటాయెలే మమతలూ వలపులూ పూలై విరిసెలే మమతలూ వలపులూ పూలై విరిసెలే లలలలల నింగీ నేలా ఒకటాయెలే... హో హోహోహో... ఇన్నాళ్ళ ఏడబాటు నేడే తీరెలే నా వెంట నీవుంటే ఎంతో హాయిలే ఆహాహా లాలాలా... ఆహాహా లాలాలా హృదయాలు జత జేరి ఊగే వేళలో దూరాలు భారాలు లేనే లేవులే నీవే నేను లే ...నేనే నీవు లే లలలలలా... లాలాల లాలాల... లాలాల లాలాల... లలల నింగీ నేలా ఒకటాయెలే మమతలూ వలపులూ పూలై విరిసెలే మమతలూ వలపులూ పూలై విరిసెలే లలలలల నింగీ నేలా ఒకటాయెలే... ఆహాహాహా రేయైనా పగలైనా నీపై ధ్యానము పలికింది నాలోన వీణా గానము ఆహాహా లాలాలా... ఓహోహో లాలాలా అధరాల కదిలింది నీదే నామము కనులందు మెదిలింది నీదే రూపము నీదే రూపమూ ... నీవే రూపము లలలలలా... లాలాల లాలాల... లాలాల లాలాల... లలల నింగీ నేలా ఒకటాయెలే మమతలూ వలపులూ పూలై విరిసెలే