చిత్రం: మామగారు (1991) సంగీతం: రాజ్-కోటి నటీనటులు: వినోద్ కుమార్, ఐశ్వర్య, దాసరి నారాయణరావు దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య నిర్మాతలు: ఏ. మోహన్, సి.ఎమ్.కృష్ణ విడుదల తేది: 30.08.1991
Songs List:
దండాలు పెట్టాము దుర్గమ్మ పాట సాహిత్యం
చిత్రం: మామగారు (1991) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్. పి.బాలు దండాలు పెట్టాము దుర్గమ్మ
ఈ రాతిరి శివరాతిరి పాట సాహిత్యం
చిత్రం: మామగారు (1991) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: డి.నారాయణ వర్మ గానం: మంజుల ఈ రాతిరి శివరాతిరి జాగారమే చేయ రారా ఈ రాతిరి శివరాతిరి జాగారమే చేయ రారా దీపము తీసి రాతిరినాపి పూజలుకాని పూజలు చేసి జాతర చేయ రారా ఈ రాతిరి శివరాతిరి జాగారమే చేయ రారా ఆకలి కాదు తోచగ రాదు మరి లోలో ఎదో బాధ అదేమో చూపుల కోన కాపురమేల ఇక చేసేదేమి లేదా అదేదో ఆలన పాలన ఏమిలేదాయే మోహము తాపము ఆటు పోటాయే తోటలో రాజుగా పాగా వేయాలి శోభన కార్యము నేడే కావాలి రారా చాటు మాటు ఏలా నా ఒడి నీదేరా రాజా గాలి నీరు తోడు ఈ గుడి నీకేరా ఈ రాతిరి శివరాతిరి జాగారమే చేయ రారా ఊర్వశి గాను మేనక గాను నిను ఏమో మాయచేయ పనేది ఆలిని నేను అయినా గాని నిరజాన గానా గానాభజాన నాట్యము చేయన నాథ నీకోసం కామిని కోహిని కాదా దాసోహం నా బిగి తాకగా కాదా బేజారు నా ఎదా ఏలరా నీకే జోహారు రారా ఏతా వాత ఎద లోతులు చూడాలి రాజా ఖాన పీనా సోనా దోపిడి చేయాలి ఈ రాతిరి శివరాతిరి జాగారమే చేయ రారా హాయ్ ఈ రాతిరి శివరాతిరి జాగారమే చేయ రారా దీపము తీసి రాతిరినాపి పూజలుకాని పూజలు చేసి జాతర చేయ రారా
ఈ యాలె అచ్చమైన దీపావళి పాట సాహిత్యం
చిత్రం: మామగారు (1991) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్. పి.బాలు, స్వర్ణలత ఈ యాలె అచ్చమైన దీపావళి
కొట్టరో గట్టిగా పెళ్లి డోలు దెబ్బ పాట సాహిత్యం
చిత్రం: మామగారు (1991) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వెన్నలకంటి గానం: యస్. పి.బాలు, మంజుల కొట్టరో గట్టిగా పెళ్లి డోలు దెబ్బ బుద్దిగా గిచ్చరో మల్లెపూల అబ్బా హద్దే దాటేయమంది కన్నె బెట్టు ముద్దు ఓటేయమంది కన్నుగొట్టు గుట్టే గుండెల్లో దూరి గోలపెట్టు పెట్టె మంచాన చేరి గోలపెట్టు నాయనమామా.... ఓ ఓ ఓ కొట్టరో గట్టిగా పెళ్లి డోలు దెబ్బ గుట్టుగా గిచ్చరో మల్లెపూల అబ్బా కన్నె చొక్క జున్ను ముక్క కన్నుకొట్టెరో దాని వెన్నదోచి వెన్నుతట్టరో... ముద్దబంతి ముద్దులన్ని మూటగట్టరో వాలే పోద్దికింక ఆట కట్టరో... కిర్రెక్కినా కుర్రీడునే జుర్రేసుకో... మంచాలలో లంచాలనే పంచేసుకో ఒంటి సోకున్నది - హొయ్ హొయ్ కొంటి షాకున్నది - హ హ ముద్దులందుతుంటే నిద్దరుండదంట ఇంక చుక్క పొద్దు ఒక్కపొద్దులొద్దురో... కొట్టరో గట్టిగా పెళ్లి డోలు దెబ్బ - యబ్బా బుద్దిగా గిచ్చరో మల్లెపూల అబ్బా - హ అబ్బా ముక్కుపచ్చ లారకున్న ముద్దబంతిరో నిన్ను ముక్కుతాడు వేయమందిరో ఆరుబయట అందమంత ఆరబెట్టెరో ముద్దు బారసాల చేయమందిరో... పండుందిరో దిండుందిరో పండించరో చుక్కుందిరో చక్కందిరో చిక్కిందిరో పాడు ఈడుందిరో - హై హై గోడు చూడందిరో - హై హై మంచి మాట ఉంది మంచెమాటు ఉంది కంచెదాటుతున్న వాటముంది పదరో... కొట్టరో గట్టిగా పెళ్లి డోలు దెబ్బ బుద్దిగా గిచ్చరో మల్లెపూల అబ్బా హద్దే దాటేయమంది కన్నె బెట్టు ముద్దు ఓటేయమంది కన్నుగొట్టు గుట్టే గుండెల్లో దూరి గోలపెట్టు పెట్టె మంచాన చేరి గోలపెట్టు నాయనమామా.... ఓ ఓ ఓ కొట్టరో గట్టిగా పెళ్లి డోలు దెబ్బ - అబ్బా గుట్టుగా గిచ్చరో మల్లెపూల అబ్బా - దెబ్బ
శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే పాట సాహిత్యం
చిత్రం: మామగారు (1991) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వేదవ్యాస్ గానం: చిత్ర, యస్.పి.బాలు ఓ ఓ ఓ ఓ ఆ ఆ శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే ఏ వంక లేనోడే ఏ మచ్చలేని జాబిల్లి మల్లె ఎన్నెల్లు చల్లాడే నింగి ఒంగింది నెల పొంగింది ఊహ ఊగింది ఉయ్యాలో పేద రాగంలో మారు మోగింది పెళ్లి సన్నాయి అమ్మమ్మో శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే ఏ వంక లేనోడే ఏ మచ్చలేని జాబిల్లి మల్లె ఎన్నెల్లు చల్లాడే ఊరుపేరు లేని నన్ను గుండెల్లో దాచుకున్నవే ఏరికోరి నిన్నే యేరు వాగల్లె చేరుకున్నానే తానుగా మెచ్చెనే తావిలేని పువ్వుని పూలకే తావిలే చిన్ని నీ నవ్వే ఏ జన్మలోనో ఏనాడో ఏ పూజలే చేశానో పుణ్యాలు పండే ఈనాడు ఈ దేవుడే నావాడు ఏనాడూ నీవు నాలోనే నేను నీలోనే అమ్మమ్మో శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే ఏ వంక లేనోడే ఏ మచ్చలేని జాబిల్లి మల్లె ఎన్నెల్లు చల్లాడే నింగి ఒంగింది నెల పొంగింది ఊహ ఊగింది ఉయ్యాలో పేద రాగంలో మారు మోగింది పెళ్లి సన్నాయి అమ్మమ్మో శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే ఏ వంక లేనోడే ఏ మచ్చలేని జాబిల్లి మల్లె ఎన్నెల్లు చల్లాడే తోడునీడలోని ముద్దు ముచ్చట్లు ఇంత వింతయే ఎన్ని జన్మలైనా వీడిపోలేని బంధం ఇంతేలే పల్లవి నీవయి కోయిలమ్మ పాటలో నిత్యమూ ఆమనే నిండు నీ ఒడిలో మా వాడకొచ్చీ మావాడై మా మంచినే కోరారే చుక్కల్లే మీరే నా తోడై నా పక్కనే చేరారే చక్కన్ని చుక్క నీవేలే వేల చుక్కల్లో అమ్మమ్మో శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే ఏ వంక లేనోడే ఏ మచ్చలేని జాబిల్లి మల్లె ఎన్నెల్లు చల్లాడే నింగి ఒంగింది నెల పొంగింది ఊహ ఊగింది ఉయ్యాలో పేద రాగంలో మారు మోగింది పెళ్లి సన్నాయి అమ్మమ్మో