చిత్రం: పెద్దరికం (1992) సంగీతం: రాజ్-కోటి నటీనటులు: జగపతిబాబు, సుకన్య, భానుమతి రామకృష్ణ, యన్.యన్.పిళ్ళై దర్శకత్వం & నిర్మాత: ఎ.ఎమ్. రత్నం విడుదల తేది: 18.06.1992
Songs List:
నీ నవ్వే చాలు పూబంతి చామంతి పాట సాహిత్యం
చిత్రం: పెద్దరికం (1992) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి.బాలు, చిత్ర నీ నవ్వే చాలు పూబంతి చామంతి ప్రేమించా నిన్ను వాసంతి మాలతి ఆ మాటే చాలు నెలవంక రా ఇక ప్రేమిస్తా నిన్ను సందేహం లేదికా విలాసాల దారి కాచా సరాగాల గాళమేశా కులసాల పూలు కోశా వయ్యారాల మాల వేశా మరో నవ్వు రువ్వరాదటే నీ నవ్వే చాలు పూబంతి చామంతి ప్రేమించా నిన్ను వాసంతి మాలతి మల్లెపూల మంచమేసి హుషారించనా జమాయించి జాజిమొగ్గ నిషా చూడనా తెల్ల చీర టెక్కులేవో చలాయించనా విర్ర వీగు కుర్రవాణ్ణి నిభాయించనా అతివకు ఆత్రము తగడటగా తుంటరి చేతులు విడువవుగ మనసు పడే పడుచు ఒడి ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ... ఓ ఓ ఓ ఓ... నీ నవ్వే చాలు పూబంతి చామంతి ప్రేమించా నిన్ను వాసంతి మాలతి కోరమీసమున్న వాడి కసే చూడనా దోర దోర జమాపళ్ళు రుచే చూపనా కొంగుచాటు హంగులన్ని పటాయించనా రెచ్చి రేగు కుర్రదాన్ని ఖుమాయించనా పరువము పరుపుల పరమటగా వయసున సరసము సులువటగా తదిగినతోం ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ... ఓ ఓ ఓ ఓ... నీ నవ్వే చాలు పూబంతి చామంతి ప్రేమించా నిన్ను వాసంతి మాలతి విలాసాల దారి కాచా సరాగాల గాళమేశా కులసాల పూలు కోశా వయ్యారాల మాల వేశా మరో నవ్వు రువ్వరాదటే నీ నవ్వే చాలు పూబంతి చామంతి ఆ మాటే చాలు నెలవంక రా ఇక
ప్రియతమా ప్రియతమా పాట సాహిత్యం
చిత్రం: పెద్దరికం (1992) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి.బాలు, చిత్ర ప్రియతమా ప్రియతమా తరగనీ పరువమా తరలిరా ఓ తరలిరా కన్నె గోదారిలా కొంటె కావేరిలా నిండు కౌగిళ్ళలో చేర రావే... ప్రియతమా ప్రియతమా తరగనీ విరహమా కదలిరా ఓ కదలిరా మాఘ మాసానివై మల్లె పూమాలవై నిండు నా గుండెలో ఊయలూగా... ప్రియతమా ప్రియతమా తరగనీ పరువమా తరలిరా ఓ తరలిరా నీ ఆశలన్నీ నా శ్వాసలైనా ఎంత మోహమో ఓ ఓ ఓ నీ ఊసులన్నీ నా బాసలైనా ఎంత మౌనమో ఎవరేమి అన్నా ఎదురీదనా... ఆ... సుడిగాలినైనా ఒడి చేరనా... ఓ... నీడల్లే నీ వెంట నేనుంటా నా ప్రేమ సామ్రాజ్యమా ప్రియతమా ప్రియతమా తరగనీ విరహమా కదలిరా ఓ కదలిరా పెదవుల్ని తడితే పుడుతుంది తేనే తియ తియ్యగా ఓ ఓ ఓ కౌగిట్లో పడితే పుడుతుంది వానా కమ్మ కమ్మగా వెన్నెల్ల మంచం వేసెయ్యనా... ఓ... ఏకాంత సేవా చేసేయనా... ఓ... వెచ్చంగ చలి కాచుకోవాలా నీ గుండె లోగిళ్ళలో ప్రియతమా ప్రియతమా తరగనీ పరువమా తరలిరా ఓ తరలిరా కన్నె గోదారిలా కొంటె కావేరిలా నిండు కౌగిళ్ళలో చేర రావే... ప్రియతమా ప్రియతమా తరగనీ విరహమా కదలిరా ఓ కదలిరా
ముద్దుల జానకి పెళ్ళికి పాట సాహిత్యం
చిత్రం: పెద్దరికం (1992) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వాడేపల్లి కృష్ణ గానం: చిత్ర ఓఓఓఓ..ఓఓ..ఓఓఓఓ.... ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే మురిపాల తేలించ మునిమాపులో దివినుండి రేరాజు దిగివచ్చులే ఆ ఆ ఆ ఆ.... ఆ ఆ ఆ ఆ.... ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే తొలకరిలా వలపంతా కురిసెనులే తీయని ఊహలు చిగురు తొడిగెను నింగిని తాకే పందిరి వేసీ పచ్చని పల్లెను పీటగజేసీ నింగిని తాకే పందిరి వేసీ పచ్చని పల్లెను పీటగజేసి బంగారు రంగులు వేయించరారే మురిపాల పెళ్ళి జరిపించరారే వధువు సొగసంత మెరిసే వలపు మదిలోన విరిసే చిలిపి కోరికలు కురిసే పడుచు పరువాలు బిగిసే కనివిని ఎరుగని కమ్మని భావన కధలుగ కనిపించే ఆ ఆ ఆ ఆ.... ఆ ఆ ఆ ఆ.... ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే తూరుపు ఎరుపై మనసులు పాడే గోదావరిలా మమతలు పొంగే తూరుపు ఎరుపై మనసులు పాడే గోదావరిలా మమతలు పొంగే రాయంచలన్నీ రాగాలు తీసే చిలకమ్మలెన్నో చిత్రాలు చేసే కదలి రావమ్మ నేడే కలలు పండేటి వేళా వేచియున్నాడు వరుడే సందె సరసాల తేలా సరసపు వయసున ఒంపుల సొంపుల సరిగమ వినిపించే ఆ ఆ ఆ ఆ... ఆ ఆ ఆ ఆ... ఆ ఆ ఆ ఆ...
ఇదేలే తరతరాల చరితం పాట సాహిత్యం
చిత్రం: పెద్దరికం (1992) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: కె. జే. యేసుదాసు ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం పగేమో ప్రాణమయ్యేన ప్రేమలే దూరమయ్యేన నిరాశే నింగి కెగసేన ఆశలే రాలిపోయేన ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం ఒడిలో పెరిగిన చిన్నారిని ఎరగా చేసినదా ద్వేషము కధ మారదా ఈ బలి ఆగదా మనిషే పశువుగ మారితే కసిగా శిశువును కుమ్మితే మనిషే పశువుగ మారితే కసిగా శిశువును కుమ్మితే అభము శుభము ఎరుగని వలపులు ఓడిపోయేన ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం పగేమో ప్రాణమయ్యేన ప్రేమలే దూరమయ్యేన నిరాశే నింగి కెగసేన ఆశలే రాలిపోయేన ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం విరిసి విరియని పూదోటలో రగిలే మంటలు చల్లారవ ఆర్పేదెలా ఓదార్చేదెలా నీరే నిప్పుగ మారితే వెలుగే చీకటి రూగితే నీరే నిప్పుగ మారితే వెలుగే చీకటి రూగితే పొగలో సెగలో మమతల పువ్వులు కాలిపోయేనా ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం పగేమో ప్రాణమయ్యేన ప్రేమలే దూరమయ్యేన నిరాశే నింగి కెగసేన ఆశలే రాలిపోయేన ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం