Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bava Bavamaridi (1993)



చిత్రం: బావ బావమరిది (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: రాధిక
నటీనటులు: కృష్ణంరాజు, సుమన్, జయసుధ, మాలశ్రీ
దర్శకత్వం: శరత్
నిర్మాతలు: ఆకుల మోహన్, సి.యమ్.కృష్ణ
విడుదల తేది: 1993

బావలూ... బావలూ....  బావలూ... సయ్యా..? -  సై సై
నై నై - వెయ్ వెయ్ నువ్వు ముయ్ ముయ్ - హా హా హా

బావలు సయ్యా - హేయ్ మరదలు సయ్యా
సై బావలు సయ్యా - హోయ్ మరదలు సయ్యా
సై రింబోల రింబోల రింబోలా - హొయ్ హొయ్
రింబోల రింబోల రింబోలా - హొయ్ హొయ్
బావలు సయ్యా - హేయ్ మరదలు సయ్యా
సై బావలు సయ్యా - హోయ్ మరదలు సయ్యా
సై రింబోల రింబోల రింబోలా - హొయ్ హొయ్
రింబోల రింబోల రింబోలా - హొయ్ హొయ్
ఆ... ఆ... ఆ... ఆ... ఆ ఆ ఆ ఆ
డింగర డింగా డింగర డింగా
డింగర డింగా డింగర డింగా

ఆ... నేనే మీరై ఉందురుగా మీరు ఉందురుగా
ఉందుమే పిల్లా మేముందుమే పిల్లా
ఆఁ ఉందుమే పిల్లా మేముందుమే పిల్లా
ఉందుమే పిల్లా మేముందుమే పిల్లా
ఆ వేరే గూటికి చేరరుగా మీరు చేరరుగా
చేరమెపిల్లా మేముచేరమె పిల్లా
ఆఁ చేరమెపిల్లా మేముచేరమె పిల్లా
కూరిమితో కుళుకులతో దండవేస్తా రారా
కూరిమితో కుళుకులతో దండవేస్తా రారా - అహే
అందగాడా సందకాడ రారా వచ్చినీవు ముద్దులాడి పోరా
రాటుదేలిన మంచమేసినాను రాతిరంతా తైతక్కలేరా
రాటుదేలిన - ఆఁ... రాటుదేలిన -  ఓ...
రాటుదేలిన మంచమేసినాను రాతిరంతా తైతక్కలేరా
బావలు బావలు బావలు బావలు బావలూ
హొయ్ బావలు బావలు బావలు బావలు బావలూ

బావలు సయ్యా - హేయ్ మరదలు సయ్యా
సై బావలు సయ్యా - హోయ్ మరదలు సయ్యా
సై రింబోల రింబోల రింబోలా - హొయ్ హొయ్
రింబోల రింబోల రింబోలా - హొయ్ హొయ్
రింబోల రింబోల రింబోలా - హొయ్ హొయ్
రింబోల రింబోల రింబోలా - హొయ్ హొయ్
డింగర డింగా డింగర డింగా
డింగర డింగా డింగర డింగా

ఆ... నోటు రేటు తేలిస్తే నాకిస్తే
ఏమిస్తావ్ మాకేమిస్తావ్
ఏమిస్తావ్ మాకేమిస్తావ్
ఆ ఆడి పాడి చూపిస్తా మురిపిస్తా
మురిపించేయ్ మైమరపించేయ్
మురిపించేయ్ మైమరపించేయ్
మాటలకే లోబడని పేట జాణను నేను
ఆ మాటలకే లోబడని పేట జాణను నేను
చిల్లరుంటే అల్లరంత మీకే
ఇచ్చినోడే నచ్చుతాడు నాకు
పైట జారిన రంగసాని నేను
హంసమేడ సెక్స్ బాంబునేను
పైట జారిన పైట జారిన
పైట జారిన రంగసాని నేను
హంసమేడ సెక్స్ బాంబునేను
బావలు బావలు బావలు బావలు బావలూ
హొయ్ బావలు బావలు బావలు బావలు బావలూ

ఆ బావలు సయ్యా - హేయ్ మరదలు సయ్యా
సై బావలు సయ్యా - హోయ్ మరదలు సయ్యా
సై రింబోల రింబోల రింబోలా - హొయ్ హొయ్
హా రింబోల రింబోల రింబోలా - హొయ్ హొయ్
హొయ్ రింబోల రింబోల రింబోలా - హొయ్ హొయ్
హా రింబోల రింబోల రింబోలా - హొయ్ హొయ్




********  ********   ********



చిత్రం: బావ బావమరిది (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, చిత్ర

గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడై తమాషా
ఇచ్చుకో ఒడే మజాగా
లేత చీకట్లో నీ ఒళ్లు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే
సోకు పూరేకులా విచ్చి మారాకులేసింది నన్నంటుకో
చిన్నింటిలో జున్నంటుకో

గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడై తమాషా
ఇచ్చుకో ఒడే మజాగా

చరణం: 1
ఒంపుల్లో సొంపుల్లో వాటేసుకుంటేనే సంపంగి కంచాలు
ఒళ్లంటుకుంటేనే జల్లంటు పుట్టేను వయ్యారి గంధాలు
నీ గాలికే పైట మేఘాలు కమ్మేను సాయంత్ర వేళల్లో
నీ చూపుకే ఊపు ఉయ్యూరు దాటేను ఉల్లాస లీలల్లో
ఉత్తమైన గుమ్మందమూ ఒత్తుకున్న వడ్డాణమూ
గంటకొట్టే కౌగిళ్ళలోనా...
మువ్వగోపాల రమ్మంది ముద్దిచ్చి పొమ్మంది మువ్వెన్నడో
జివ్వుజివ్వంటు నా గువ్వ గూడెక్కి కూసింది నీ కోనలో
నీరెండలో నీ గుండెలో

గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడై తమాషా
ఇచ్చుకో ఒడే మజాగా

చరణం: 2
చిట్టెమ్మ బుగ్గల్లో పిట్టమ్మలాడేను నీ గోరువంకల్లో
చీరంటు సిగ్గుల్లో చీపో లు రేగేను నా పూల సంతల్లో
కొండమ్మ కోనమ్మ కోలాటమాడేను నీ రూపురేఖల్లో
ఆడున్న ఈడమ్మ ఈడొచ్చి కుట్టేను నీ వాలుచూపుల్లో
పంచదార పందిళ్లలో మంచు తేనె సందెళ్లలో
పాలు పంచుకోరాదా ప్రాయం
వంగతోటెంతో బాగుంది వయ్యారి వడ్డీలు చెల్లించిపో
కొత్త కవ్వింత పుట్టించి గల్లంత చేసేసి వేడెక్కిపో
వేధించుకో వేటాడుకో

గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడై తమాషా
ఇచ్చుకో ఒడే మజాగా
లేత చీకట్లో నీ ఒళ్లు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే
సోకు పూరేకులా విచ్చి మారాకులేసింది నన్నంటుకో
చిన్నింటిలో జున్నంటుకో

గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడై తమాషా
ఇచ్చుకో ఒడే మజాగా




********  *******   ********



చిత్రం: బావ బావమరిది (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, చిత్ర

ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో
కలత నిదర చెదిరే తొలి కలల వలపు ముదిరే
కొత్త కొత్తందాలు మత్తెక్కెంచే జోరులో

ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో

ఈ కన్నె లేతందాలే ఏతలేసి తోడుకో
నా సిగ్గు పూతల్లోన తేనె జున్ను అందుకో
ఈ పొద్దు వద్దంటున్న మొమాటాల పక్కనే
ఓ ముద్దు ముద్దంటాయి ఆరాటాలు ఎక్కడో
చేరుకో పొదరిల్లకి చీకటి చిరు తిల్లకి
అలకాపురి చిలకమ్మకి
కుళుకెందుకో ఒక్కసారికి
ఒళ్ళో వేడెక్కింది గిల్లికజ్జా ప్రేమకి

ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో

మంచమ్మ ముంగిళ్ళల్లో దీపాలెట్టి చూసుకో
సందేల మంచాలేసి సంకురాత్రి చేసుకో
మామల్లే మాగానుల్లో బాసలంత చేసుకో
పూబంతి పూవందాలు బందీ కట్టి వెళ్లిపో
పూటకో పులకింతగా జంటగా పురి విప్పుకో
మరుమల్లెల మహారాజుకి తెరచాటుల ప్రతి రోజుకి
ఆపేదెట్టాగంటా పువ్వైపోయే రెమ్మని

ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో
కలత నిదర చెదిరే తొలి కలల వలపు ముదిరే
కొత్త కొత్తందాలు మత్తెక్కెంచే జోరులో

ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో



********  *******   ********



చిత్రం: బావ బావమరిది (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: డి. నారాయణ శర్మ
గానం: యస్.పి. బాలు, చిత్ర

మాయదారి తేనెటీగ
మాయదారి తేనెటీగ మాపటేల కుట్టేనమ్మ
జమ్ జజమ్ జమ్ జమ్ జజమ్ జమ్
కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టెనమ్మో
జమ్ జజమ్ జమ్ జమ్ జజమ్ జమ్
అల్లేసుకోరా ఖలేజా చూపగ రారా
గిల్లేసుకోరా ఖజానా దోచుకు పోరా
పదహారు ఈడు నాది నీదేరా

మాయదారి తేనెటీగ మాపటేల కుట్టేనమ్మ
జమ్ జజమ్ జమ్ జమ్ జజమ్ జమ్
కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టెనమ్మో
జమ్ జజమ్ జమ్ జమ్ జజమ్ జమ్

ఈలవేసి గాలమేసి గోల చూశానే
రూపు జూసి ఊపు జూసి కాపు కాశానే
వయసు తహ తహ లాడే
సొగసు చిటపటలాడే
వయసు తహ తహ లాడే
సొగసు చిటపటలాడే
వలపు నెగడతో వగలు సెగలతో రగిలిపోతి నేను
మరులు మెరుపులై కుళుకు ఉరుములై దరికి చేరినాను
గుబులే పుట్టాక సిగ్గేమిటున్నాది

మాయదారి తేనెటీగ మాపటేల కుట్టేనమ్మ
జమ్ జజమ్ జమ్ జమ్ జజమ్ జమ్
కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టెనమ్మో
జమ్ జజమ్ జమ్ జమ్ జజమ్ జమ్

తీపిపూత పూతరేకు మూత వేశాను
మూత తీసి పూతరేకు తీపి చూశాను
కొసరు మరువకు మావా
ఎసరు పెడతను భామా
కొసరు మరువకు మావా
ఎసరు పెడతను భామా
ఎగువ బిగువులో ముడులు సడలగ మరిగిపోయే మేను
పొగరు పరువమే పురులు విరియగ మురిసిపోతి నేను
ఒడిలో పడ్డాక వద్దేమిటున్నాది

మాయదారి తేనెటీగ
మాయదారి తేనెటీగ మాపటేల కుట్టేనమ్మ
జమ్ జజమ్ జమ్ జమ్ జజమ్ జమ్
కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టెనమ్మో
జమ్ జజమ్ జమ్ జమ్ జజమ్ జమ్
అల్లేసుకోరా ఖలేజా చూపగ రారా
గిల్లేసుకోరా ఖజానా దోచుకు పోరా
పదహారు ఈడు నాది నీదేరా

మాయదారి తేనెటీగ మాపటేల కుట్టేనమ్మ
జమ్ జజమ్ జమ్ జమ్ జజమ్ జమ్
కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టెనమ్మో
జమ్ జజమ్ జమ్ జమ్ జజమ్ జమ్



********  *******   ********



చిత్రం: బావ బావమరిది (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర

కొంటె కోనంగి వయసిది
నీలో చూసింది మగసిరి
అబ్బ ఎన్నాల్లకో నువ్వు దొరికావురో
కసిగా ఇల్లు ఒళ్ళు గుల్లై పోనీ
రారా హీరో మస్తి మారో
గుమ్మెత్తిస్తా దేఖో యారో

కొంటె కోనంగి వయసిది
నీలో చూసింది మగసిరి

నచ్చే పోజీవ్వన మెచ్చే ముద్దివ్వనా
నువ్వొకటిస్తే రాజా నేనింకొకటిస్తా
అరవై నాలుగు కళలు నా ఒడిలో నేర్పిస్తా
కోడె వయసు కౌగిట్లో కొత్త కోక నలగాలి
నంగనాచి మలుపుల్లో గంగ వెర్రులెత్తాలి
వాడుకుగా వేడుకగా గుమ్మని గుమాయించు గురుడా

కొంటె కోనంగి వయసిది
నీలో చూసింది మగసిరి

నీలో ఆవేశము నాలో ఆరాటము
పోటా పోటీ లూటీ చేసెయ్యాలీపూట
సొగసులు దాచిన చోట సాగించే నీ వేట
వగలమారి వెన్నెల్లో ఉడుకులెత్తి పోవాలి
మల్లె పూల గుండెల్లో మోత మోగిపోవాలి
ఆ రతికే హారతిగా రేయిని రఫ్ఫాడించు మగడా

కొంటె కోనంగి వయసిది
నీలో చూసింది మగసిరి
అబ్బ ఎన్నాల్లకో నువ్వు దొరికావురో
కసిగా ఇల్లు ఒళ్ళు గుల్లై పోనీ
రారా హీరో మస్తి మారో
గుమ్మెత్తిస్తా దేఖో యారో

Most Recent

Default