చిత్రం: తపస్సు (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: మనో
నటీనటులు: భరత్, భాస్కర్, క్రిష్ణ భారతి
కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భరత్
నిర్మాత: భరత్, సి. ఎస్. అవధాని
విడుదల తేది: 1995
లల లల లల లాలా (2)
తళుకుమన్నది కుళుకుల తార
పలుకుతున్నది వలపు సితార
తళుకుమన్నది కుళుకుల తార
పలుకుతున్నది వలపు సితార
ఓ మైనా వదలనిక ఏమైన
నా లోన శృతిలయలు నీవేన
గుండెల్లోన నిండే ఊహా నీవే కిరణ్ రావే కిరణ్
తళుకుమన్నది కుళుకుల తార
పలుకుతున్నది వలపు సితార
తళుకుమన్నది కుళుకుల తార
పలుకుతున్నది వలపు సితార
నేడే... కొండా కోన తోడుగా
ఎండా వాన చూడగా ఈడు జోడుగ
ఎన్నో ఊసులాడగా తోడు నీడగ
ఈడు గోదారి పొంగింది చూడు
నాదారికొచ్చింది నేడు ఆశ తీరగ
ప్రేమ మాగాణి పండింది నేడు
మారాని పారాణి తోటి నన్ను చేరగ
గువ్వల జంటగ ఓ ఓ సాగే వేళలో
నవ్వుల పంటగ ఓ ఓ రావే నా కిరణ్
తళుకుమన్నది కుళుకుల తార
పలుకుతున్నది వలపు సితార
తళుకుమన్నది కుళుకుల తార
పలుకుతున్నది వలపు సితార
రావే... ఆకాశాన విల్లుగ
ఆనందాల జల్లుగ మల్లెలు చల్లగ
ముద్దే నేడు తీయగ తెరే తీయగ
గుండె కొండెక్కి జాబిల్లి వచ్చి
ఎండల్లో వెన్నెళ్ళు తెచ్చి పానుపేయగా
కోటి మందార గాంధాల తోటి
అందాల చందాలు నాకు కానుకీయగ
ఊహల లాహిరి ఓ ఓ ఊగే వేళలో
ఊపిరి నీవుగ ఓ ఓ రావే నా కిరణ్
తళుకుమన్నది కుళుకుల తార
పలుకుతున్నది వలపు సితార
తళుకుమన్నది కుళుకుల తార
పలుకుతున్నది వలపు సితార
ఓ మైనా వదలనిక ఏమైన
నా లోన శృతిలయలు నీవేన
గుండెల్లోన నిండే ఊహా నీవే కిరణ్ రావే కిరణ్