చిత్రం: సోగ్గాడి పెళ్ళాం (1996) సంగీతం: కోటి నటీనటులు: మోహన్ బాబు, రమ్యకృష్ణ దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య నిర్మాత: యమ్. ఏ. గఫూర్ విడుదల తేది: 22.01.1996
Songs List:
కొండమల్లి విచ్చుకుంది మావ పాట సాహిత్యం
చిత్రం: సోగ్గాడి పెళ్ళాం (1996) సంగీతం: కోటి సాహిత్యం: గురుచరన్ గానం: బాలు, చిత్ర కొండమల్లి విచ్చుకుంది మావ గుండెలోన గుచ్చుకుంది ప్రేమ కొంగులోకి రమ్మంటావా భామ కొంపమునిగి పోతాదేమో నావ గుప్పు గుప్పుమంటిందమ్మ పైట ఇంక ఎప్పుడెప్పుడంటుందమ్మా ఆట ఇట్టా మాట మాట కొచ్చావంటే ఆట ఆట అన్నావంటే అమ్మబాబో అనిపిస్తానే వయసంత అదిమి వలపంత చిదిమి మత్తుల్లో ముంచాడమ్మ బుల్లోడు అత్తర్లో అద్దాడమ్మా మురిపాల తళుకా ముద్దుల్లో పడకా అలవాటు చేయకమ్మ నా మీద ఈ ఆశ ఎందుకమ్మా నీ రాజ ఠీవి నచ్చింది నాకు ఈ ఫోజు కొట్టకంటా కోరింది నీకు ఒళ్లోకి వస్తే ఈ బెట్టు చేయకంటా ఇట్టా బుంగమూతి పెట్టుకుంటు రంగు పొంగు చూపావంటే రంగరించి పంపిస్తాలే హెయ్ కొండమల్లి విచ్చుకుంది మావ హెయ్ కొంగులోకి రమ్మంటావా భామ వయ్యారి చిలక నా చేతి గిలక నువ్వైన చెప్పవేమే ఆడంటే నాకెంత మోజు ఉందో పరువాల మొలక పగడాల పలక చిలకమ్మ ఎందుకమ్మ నీ గోల తెలియంది కాదులేమ్మా సోగ్గాడి పెళ్ళం అవుతాను అంటే కాదంటావెందుకయ్యా అందాల కళ్లెం నిన్నేయమంటే పేచీలు దేనికయ్యా ఇట్టా కళ్ళతోటి సైగ చేసి గొళ్లెమేస్తా నన్నావంటే రాతిరంత ఘొల్లు మనిపిస్తా హెయ్ కొండమల్లి విచ్చుకుంది మావ కొంగులోకి రమ్మంటావా భామ గుప్పు గుప్పుమంటిందమ్మ పైట ఇంక ఎప్పుడెప్పుడంటుందమ్మా ఆట ఇట్టా మాట మాట కొచ్చావంటే ఆట ఆట అన్నావంటే అమ్మబాబో అనిపిస్తానే
కొండ కోన పాలైన పాట సాహిత్యం
చిత్రం: సోగ్గాడి పెళ్ళాం (1996) సంగీతం: కోటి సాహిత్యం: సాయి శ్రీహర్ష కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన సీత సర్వమూ రామ పాదము రామ చంద్రుడే సీత ప్రాణము ఆ రామయ్య సీతమ్మ అనురాగ బంధం ఎంత మధురము కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన నీలాగా నవ్వకుంటే ధర్మరాజు జూదరిగా పేరొందునా భారతాన యుద్ధమునకు తావుండునా లోపమంటు లేనివాడు లోకమందు ఉండబోడు ఏ ఒక్కడు తప్పు దిద్దుకున్న వాడే ఆ దేవుడు నీ సహనానికి నా భాష్పాంజలి నీ హృదయానికి ఇది పుష్పాంజలి ఏ దేవుళ్ళు దిగివచ్చి దీవించినారో నోము పండెను కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన రాయల్లె ఉన్నా ఈ రామయ్య పైన కన్ను కాచే రెప్ప నీవే ఆకలైన వేల అమ్మలాలింతువే కన్ను చెమ్మ గిల్లు వేల చెల్లెమ్మవే కంటి చెమ్మ చూడలేని తోడు నీడ వీడలేని ఇల్లాలిని జన్మ జన్మ నందు నేను నీ దానిని ఈ జగమంతటా నిను తిలకించని నీ సగ బాగమై నను తరియించని నా బంగారు కళలన్ని ఫలించి ఇల్లే స్వర్గమైనది... కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన సీత సర్వమూ రామ పాదము రామ చంద్రుడే సీత ప్రాణము ఆ రామయ్య సీతమ్మ అనురాగ బంధం ఎంత మధురము కొండకొన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన రాయల్లె ఉన్నా... ఈ రామయ్య పైన...
సత్యభామ సత్యభామ పాట సాహిత్యం
చిత్రం: సోగ్గాడి పెళ్ళాం (1996) సంగీతం: కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: బాలు, చిత్ర సత్యభామ సత్యభామ పిచ్చ షాకులిచ్చి రెచ్చగొట్టమాకుమా బుజ్జి బాబు బుల్లి బాబు ఆకు లాంటి సోకులన్ని ఆరగింపుమా పెదవి నడిగితే పన్నీరు పైట కెందుకే కంగారు కోకజారితే శ్రీవారు పోకతప్పదోయ్ పుత్తూరు కట్టాక మెడ్లోన తాళి కమ్మంగ ఇవ్వాలి ఓణి వెచ్చంగ ఒడిలోన వాలి హో హో హో సత్యభామ సత్యభామ పిచ్చ షాకులిచ్చి రెచ్చగొట్టమాకుమా బుజ్జి బాబు బుల్లి బాబు ఆకు లాంటి సోకులన్ని ఆరగింపుమా మొదటి ముద్దు సడి పాల బుగ్గ తడి ఎంత ఎంత స్వీటో పసిడి వయసు గడి పడుచు వాన జడి ఎంత ఎంత హాటో మెచ్చ నిన్నే మొగాడ పాలిచ్చు కోక లాగ అచ్చాగుంది తమాషా అందించు లవ్ పరోట పట్టు పట్టు బాసు పచ్చిపాల గ్లాసు స్టార్ట్ చెయ్యు రేసు ఓ ఓ ఓ హెయ్ సత్యభామ సత్యభామ పిచ్చ షాకులిచ్చి రెచ్చగొట్టమాకుమా బుజ్జి బాబు బుల్లి బాబు ఆకు లాంటి సోకులన్ని ఆరగింపుమా కొంగుచాటు ఒక స్వర్గమున్నదని తెలిసినాది ఇపుడే దోర వయసు గురి పెట్టినాక మరి తెల్లవార్లు రగడే ఎట్టాగమ్మ ఆరేది ఇన్నాళ్ల కుర్రవేడి లెఫ్ట్ రైట్ లాగించేయ్ కసిమీద ఉంది కోడి అరిగిపోద్ది పిల్లా ఆ గోలుకొండ ఖిల్లా తెల్లవారికల్లా ఓ ఓ ఓ హోయ్ హోయ్... సత్యభామ సత్యభామ పిచ్చ షాకులిచ్చి రెచ్చగొట్టమాకుమా బుజ్జి బాబు బుల్లి బాబు ఆకు లాంటి సోకుబాధ ఆలకించుమా పెదవి నడిగితే పన్నీరు పైట కెందుకే కంగారు ఒప్పుకుంటినా శ్రీవారు పోకతప్పదోయ్ పుత్తూరు కట్టాక మెడ్లోన తాళి కమ్మంగ ఇవ్వాలి ఓణి వెచ్చంగ ఒడిలోన వాలి హో హో హో
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా పాట సాహిత్యం
చిత్రం: సోగ్గాడి పెళ్ళాం (1996) సంగీతం: కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి.బాలు, చిత్ర, బృందం కలికి పెట్టిన ముగ్గు తళతళ మెరిసింది తుమ్మెద ఓ తుమ్మెద మురిపాల సంక్రాంతి ముంగిట్లో కొచ్చింది తుమ్మెద ఓ తుమ్మెద గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో చలిమంట వెలుగుల్లూ తుమ్మెద ఓ తుమ్మెద సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందేలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా... ఆ ఆ ఆ పేరంటం ఊరంతా... ఆ ఆ ఆ ఉల్లాసం కొత్త అల్లుళ్లతో కొంటె మరదళ్లతో పొంగే హేమంత సిరులు... గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో మంచీ మర్యాదనీ పాప పుణ్యాలనీ నమ్మే మన పల్లెటూళ్లు న్యాయం మా శ్వాసనీ ధర్మం మా బాటనీ చెబుతాయి స్వాగతాలు బీద గొప్పోళ్లనే మాటలేదు నీతి నిజాయితీ మాసిపోదు మచ్చలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా పాటే పంచామృతం మనసే బృందావనం తడితేనే ఒళ్లు ఝల్లు మాటే మకరందము చూపే సిరి గంధము చిరునవ్వే స్వాతి జల్లు జంట తాళాలతో మేజువాణి జోడు మద్దెళ్లనీ మోగిపోనీ చెంతకొస్తే పండగాయే చెప్పలేని బంధమాయే వయసే అల్లాడిపోయే... సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా హోయ్ సరదాలు తెచ్చిందే తుమ్మెదా హోయ్ కొత్త ధాన్యాలతో కోడి పందేలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా... ఆ ఆ ఆ పేరంటం ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఊరంతా ఆ ఆ ఆ ఉల్లాసం కొత్త అల్లుళ్లతో కొంటె మరదళ్లతో పొంగే హేమంత సిరులు...
టక్కరివాడే అబ్బ ఎంత పాట సాహిత్యం
చిత్రం: సోగ్గాడి పెళ్ళాం (1996) సంగీతం: కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: బాలు, చిత్ర టక్కరివాడే అబ్బ ఎంత చక్కనివాడే అల్లరి చూడే ఎత్తుకొచ్చి హత్తుకున్నాడే మిస మిస మదనుడి మెరుపులతో తడిపొడి సొగసుల పని పడతా ముద్దంటే మోజు లేదు ఉద్దేశం లేనేలేదు అంటూనే కొంప ముంచాడే... తస్సాల రవ్వలా పైట పిచ్చి పుట్టిందే పిల్లా తిమ్మిరి పుడితే ఆగమన్న ఆగనే మల్లా హోయ్ హోయ్ ఒడి ఒంపుల్లో ఊగుతోంది వయ్యారం రతి రాగంతో రైట్ చెయ్నా యవ్వారం బుగ్గలకొచ్చే ముద్దుల కరువు వయసు తెచ్చే ఓ బరువు వానలు లేక నిండదె చెరువు తొందరగా తలుపులు తెరువు వాటంగ వద్దకొచ్చి వైనంగ బుగ్గ పట్టి కిస్సోటి కొట్టునాయనో... టక్కరివాడే అబ్బ ఎంత చక్కనివాడే ఆయ్ తస్సాల రవ్వలా పైట పిచ్చి పుట్టిందే పిల్లా హెయ్ హోయ్ పెట్టించెయ్నా ఫస్ట్ నైటు పలహారం కొట్టించెయ్ రో కొంగుజారే కోలాటం ఓయ్ లబ్జుగ ఉందే డైమండ్ రాణి వెచ్చగ చెయ్నా లవ్ బోణి వద్దన్నాన ముద్దుల బాసు ఇచ్చాశాలే ఫ్రీ పాసు చిన్నారి సోకు మొగ్గ వెయ్యాలి పిల్లి మొగ్గ కిల్లాడి మల్లె తోపులో... టక్కరివాడే అబ్బ ఎంత చక్కనివాడే అల్లరి చూడే ఎత్తుకొచ్చి హత్తుకున్నాడే అరగని తరగని అతివతనం తగిలితె వదలదె మదన జ్వరం మందార మొగ్గ పట్టి మారేడు ముళ్ళు గుచ్చి నవ్వాడె కొంటె పిల్లడు...