Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Master (1997)

చిత్రం: మాస్టర్ (1997)
సంగీతం: దేవా
నటీనటులు: చిరంజీవి, సాక్షి శివానంద్, రోషిణి
దర్శకత్వం: సురేష్ కృష్ణ
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 02.10.1997

Songs List:

తమ్ముడు అరె తమ్ముడు పాట సాహిత్యం

చిత్రం: మాస్టర్ (1997)
సంగీతం: దేవా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిరంజీవి

తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక తెగులే ప్రేమంటే
ఈ తెలియని దిగులే ప్రేమంటే
నను అడగర చెబుతా డౌటుంటే
నువు బెదరవు కదా నా మాటింటే
అమ్మడు ఓయ్ అమ్మడు
నువు మరీ పరాగ్గా ఉంటుంటే
నీకు నిదరే సరిగా రాకుంటే
ఏం జరిగిందో తెలియాలంటే
ఆ రహస్యాన్ని చెబుతా వింటే
మాస్టారూ మాస్టారూ మాంచి లెక్చర్ ఇచ్చారు

మాస్టారూ మాస్టారూ లవ్లో మీరు మెగాస్టారు
థాంక్యూ... తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక తెగులే ప్రేమంటే
ఈ తెలియని దిగులే ప్రేమంటే

మీరింత బాగా పాడగలరని మేమస్సలనుకోలేదు మాస్టర్
ఇంతవరకు నేనెప్పుడూ పాడలేడోయ్ ఇదే ఫస్ట్ టైం
సార్ మొదటిసారి మీరు అదరగొట్టేశారు సార్
ఆ మీ ఉత్సాహం చూసి ఏదో సరదాగా హమ్ చేయాలనిపించింది చేశానంతే
మాస్టర్ ఈ పాటకి మంచి స్టెప్ కలిసిందంటే అదురుతుంది
డాన్సేగా చాలా బాగుంటుంది చేయండి
హే... మేము కాదు మాస్టర్ మీరు
నేను డాన్సా నో నో నో
ప్లీజ్ సర్ ప్లీజ్
ఓకే ఓకే హేయ్...

వేల వేల భాషలున్న నేల మీద ఎక్కడైనా ప్రేమ గ్లామరొక్కటే లవరు
ఆ లాంగ్వేజ్ తెలియనిదెవరూ
మూగసైగలైన చాలు వేడి ఊపిరైన చాలు గుర్తుపట్టలేరా ప్రేమికులు
అవి అచ్చుతప్పు లేని ప్రేమలేఖలు
అమెరికాలో ఇంగ్లిష్ ప్రేమ
ఆఫ్రికాలో జంగిల్ ప్రేమ
హా ఏకమయ్యే ఏకాంతంలో ఎక్కడైనా ఒకటే ప్రేమ
తమ్ముడు అరె తమ్ముడు
పొట్టివాళ్లు పొట్టవాళ్లు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు
ప్రేమదేశం వెళ్లగానే మానవులుగా మిగులుతారు

తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక తెగులే ప్రేమంటే

ఈ తెలియని దిగులే ప్రేమంటే
నను అడగర చెబుతా డౌటుంటే
నువు బెదరవు కదా నా మాటింటే

లక్షాలాది లక్షణాలు చూపుతున్న ప్రేమకున్న అక్షరాలు మాత్రం రెండు
అది మహాసముద్రం ఫ్రెండు
సెంచరీల కొద్ది పెద్ద సీరియల్గా సాగుతున్న మహా నవలరా ప్యారు
ఆ స్టోరీ కొట్టదు బోరు
కా గుణింతం తెలియని వాళ్లు కాళిదాసులు అయిపోతారు
హా కాఫీ టీలే తాగని వాళ్లు దేవదాసులు అయిపోతారు
అమ్మడు ఓయ్ అమ్మడు లబ్బుడబ్బు హార్ట్ బీట్ లవ్వులవ్వు అన్నదంటే
హైక్లాసు లోక్లాసు చూసుకోదు ప్రేమ కేసు

తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక తెగులే ప్రేమంటే

ఈ తెలియని దిగులే ప్రేమంటే
నను అడగర చెబుతా డౌటుంటే
నువు బెదరవు కదా నా మాటింటే
అమ్మడు ఓయ్ అమ్మడు
నువు మరీ పరాగ్గా ఉంటుంటే
నీకు నిదరే సరిగా రాకుంటే
ఏం జరిగిందో తెలియాలంటే
ఆ రహస్యాన్ని చెబుతా వింటే
మాస్టారూ మాస్టారూ మాంచి లెక్చర్ ఇచ్చారు
మాస్టారూ మాస్టారూ లవ్లో మీరు మెగాస్టారు

ఇంటిలోకి వెల్కమంటు పాట సాహిత్యం

చిత్రం: మాస్టర్ (1997)
సంగీతం: దేవా
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాజేష్, సౌమ్య

ఇంటిలోకి వెల్కమంటు గేటు తీసినాడు మాస్టరు
టేస్ట్ కాస్త చూడమంటు బూస్ట్ కలిపినాడు మాస్టరు
అలా అలా హఠాత్తుగా అటూ ఇటూ కరంట్ పోగా
నెక్స్ట్ సీను ఎం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తుంది
నెక్స్ట్ సీను ఎం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తుంది

ఇంటిలోకి వెల్కమంటు గేటు తీసినాడు మాస్టరు
టేస్ట్ కాస్త చూడమంటు బూస్ట్ కలిపినాడు మాస్టరు

శిస్యురాల చారుశీల శీఘ్రమేవ రొమాన్స్ నీకు ప్రాప్తిరస్తు
అక్షరాల దీక్ష బూని లవ్ లోని లెసెన్స్ నేను అలకిస్తు
అందంతో పరీక్ష ఇప్పుడు అర్ధాంగి ప్రమోషనెప్పుడు
ఫలితం రానున్నది పరువం ఔనన్నది

ఇంటిలోకి వెల్కమంటు గేటు తీసినాడు మాస్టరు
టేస్ట్ కాస్త చూడమంటు బూస్ట్ కలిపినాడు మాస్టరు

పోర్టికోలో లైబ్రరీలో కారిడార్లో భరించలేని తాపమాయె
పుస్తకాల్లో డిక్షనరీలో బ్లాకు బోర్డులో లిఖించలేని ఆకళాయే
వల్లించేయ్ వయస్సు వాచకం
చెల్లించేయ్ వయ్యారి వేతనం
గురువా లెటెందుకు
లఘువై రా ముందుకూ

ఇంటిలోకి వెల్కమంటు గేటు తీసినాడు మాస్టరు
టేస్ట్ కాస్త చూడమంటు బూస్ట్ కలిపినాడు మాస్టరు
అలా అలా హఠాత్తుగా అటూ ఇటూ కరంట్ పోగా
నెక్స్ట్ సీను ఎం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తుంది
నెక్స్ట్ సీను ఎం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తుంది

ఇంటిలోకి వెల్కమంటు గేటు తీసినాడు మాస్టరు
టేస్ట్ కాస్త చూడమంటు బూస్ట్ కలిపినాడు మాస్టరు

BSC అయినాగాని పాట సాహిత్యం

చిత్రం: మాస్టర్ (1997)
సంగీతం: దేవా
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాజేష్, కృష్ణరాజ్, చంద్రబోస్, మురళీధర్

గిల్లేలే గిల్లెల్లేలే గిల్లెల్లేలే గిల్లెల్లేలే
గిల్లేలే గిల్లెల్లేలే గిల్లెల్లేలే లే
గిల్లేలే గిల్లెల్లేలే గిల్లెల్లేలే గిల్లెల్లేలే
గిల్లేలే గిల్లెల్లేలే గిల్లెల్లేలే లే

BSC అయినాగాని MSC అయినాగాని 
SSC అయినాగాని PUC అయినాగాని
KG గాని PG గాని ఆంద్రా గాని ఆగ్రా గాని
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి ఉండదు క్షణమైన కాళీ
ఓరోరి సోదరా హంగామా నీదిరా
ఓరోరి సోదరా హంగామా నీదిరా

డాడీ జేబులో డబ్బులు తీసి దాబా కెళ్ళొచ్చు
మమ్మీ పర్సును మాయం చేసి మూవీ చూడొచ్చు
బెడ్ రూమ్ నిండా పోస్టర్లెన్నో అతికించ వచ్చు
వాటిని చూస్తూ వందల ఏళ్ళు బ్రతికేయ వచ్చు
తోచిందేదో తప్పైనా చేసేయొచ్చు
తమ్ముడుకేమో యమ నీతులు బోదించొచ్చు

స్టూడెంట్ లైఫ్ చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి ఉండదు క్షణమైన కాళీ

పీలగ ఉన్న పిల్లను నువ్వు పిన్ని అనవచ్చు
బొద్దుగ ఉన్న భామను నువ్వు భామ్మా అనవచ్చు
ఎత్తుగ ఉంటె అత్తా అంటూ వరసే కలపొచ్చు
పొట్టిగ పాపా అంటే పాప్కార్నివ్వొచ్చు
అందంగుంటే నువ్వు అడ్వాన్స్ అయిపోవచ్చు
పెళ్లి అంటే నువు ప్లేటే తిప్పేయొచ్చు

హే స్టూడెంట్ లైఫ్ చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి ఉండదు క్షణమైన కాళీ

హే BSC అయినాగాని MSC అయినాగాని 
SSC అయినాగాని PUC అయినాగాని
KG గాని PG గాని ఆంద్రా గాని ఆగ్రా గాని
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి ఉండదు క్షణమైన కాళీ
అరె రరెరే రరెరే...

ఆనందంగా ఎన్నికలల్లో పోటీచేయొచ్చు
అవతలవాడి బ్యానర్ మీద పేడే కొట్టొచ్చు
కొత్తగ వచ్చిన ఫ్యాషన్లన్నీ ఫాలో కావచ్చు
కోతికి మనకు తేడా లేదని తేల్చేయ వచ్చు
మంత్రులు పొతే సంతాపం  తెలిపేయొచ్చు
ఆతరువాత హాలిడే మనకే వచ్చు

స్టూడెంట్ లైఫ్ చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి ఉండదు క్షణమైన కాళీ

ముప్పై మార్కులు వస్తే నువ్వు ఓకే అనవచ్చు
నలభై గాని వచ్చాయంటే షాకే తినవచ్చు
ఏబై వస్తే ప్లేబాయ్ లాగా ఫోజే కొట్టొచ్చు
అరవై వస్తే ఆలిండియానే అమ్మేయవచ్చు
డెబ్భై వస్తే నువు అబ్బుర పడిపోవచ్చు
డౌటే లేక హార్ట్ ఫెయిలైపోనువచ్చు

స్టూడెంట్ లైఫ్ చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి ఉండదు క్షణమైన కాళీ

BSC అయినాగాని MSC అయినాగాని 
SSC అయినాగాని PUC అయినాగాని
KG గాని PG గాని ఆంద్రా గాని ఆగ్రా గాని
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి ఉండదు క్షణమైన కాళీ
ఓరోరి సోదరా హంగామా నీదిరా
ఓరోరి సోదరా హంగామా నీదిరా

తిలోత్తమా ప్రియ వయ్యారమా పాట సాహిత్యం

చిత్రం: మాస్టర్ (1997)
సంగీతం: దేవా
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిహరన్, సుజాత

తిలోత్తమా ప్రియ వయ్యారమా
ప్రభాతమా శుభ వసంతమా
నే మోయలేనంటూ హృదయాన్ని అందించా
నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేశా
ఏ దారిలో సాగుతున్నా ఎద నీవైపుకే లాగుతోంది
ఏ వేళలో ఎప్పుడైనా మది నీ ఊహలో ఊగుతోంది

ఆ... తిలోత్తమా ప్రియ వయ్యారమా...

చరణం: 1
పెదవే ఓ మధుర కవిత చదివే
అడుగే నా గడపనొదిలి కదిలే
ఇన్నాళ్ళు లేని ఈ కొత్త బాణీ 
ఇవ్వాళే మనకెవరు నేర్పారమ్మా
ఈ మాయ చేసింది ప్రేమే
ప్రియా ప్రేమంటే ఒకటైన మనమే

తిలోత్తమా సుఖ వసంతమా

చరణం: 2
కలలే నా ఎదుట నిలిచె నిజమై
వలపే నా ఒడికి దొరికె వరమై
ఏ రాహువైనా ఆషాఢమైనా 
ఈ బహుబంధాన్ని విడదీయునా
నీ మాటలే వేదమంత్రం
చెలి నువ్వన్నదే నా ప్రపంచం

తిలోత్తమా ప్రియ వయ్యారమా
ప్రభాతమా శుభ వసంతమా
నే మోయలేనంటూ హృదయాన్ని అందించా
నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేశా
ఏ దారిలో సాగుతున్నా ఎద నీవైపుకే లాగుతోంది
ఏ వేళలో ఎప్పుడైనా మది నీ ఊహలో ఊగుతోంది

బావున్నార బాగున్నార పాట సాహిత్యం

చిత్రం: మాస్టర్ (1997)
సంగీతం: దేవా
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాజేష్, సౌమ్య

బావున్నార బాగున్నార  భామ గారు బాగున్నారా
ఆ బావున్నార బాగున్నార  భామ గారు బాగున్నారా
బావున్నార బాగున్నార  బావగారు బాగున్నారా
ఎదురు చూపులు చూస్తున్నారా మధన జపమే చేస్తున్నారా
ఆరు అడుగుల మాగధీరుడిని ఎవ్వరైనా వదిలేస్తారా
ఇంతబాగా శెలవిస్తారా అమ్మో చిన్నమ్మమ్మో...
అమ్మో అమ్మమ్మమ్మో...

ఆ బావున్నార బాగున్నార  భామ గారు బాగున్నారా
బావున్నార బాగున్నార  బావగారు బాగున్నారా

చిన్ని ముద్దు ఇమ్మంటారా ఛి పో వద్దు పొమ్మంటారా
చుమ్మా అంటు చెంతకొస్తే కొమ్మమీద కూర్చుంటారా
మాట మాట పెంచేశారా మంచి చెడ్డా మానేశారా
గోటితోటి పోయేదాన్ని గూటిదాకా లాగేశారా
వరసలు కలిపి మరదలు ఒడికే వేంచేస్తారా మనసారా
బూరెల్లాంటి బుగ్గలు రెండు బొంచేస్తాలే కడుపార
ఆపై రతి మహరాజల్లే మత్తుల్లో ముంచేస్తారా
అమ్మో అమ్మమ్మమ్మో...
అమ్మో చిన్నమ్మమ్మో...

బావున్నార బాగున్నార  భామ గారు బాగున్నారా
బాగున్నార బాగున్నార  బావగారు బాగున్నారా

పిల్లా అంటు లాలిస్తారా పెళ్ళాం పోస్ట్ ఇప్పిస్తారా
లిల్లిపూల మంచం మీద పిల్లో నాకు పంచిస్తారా
వేళా పాలా లేదంటారా వేలాకోళం కాదంటారా
చాటుమాటు పాఠాలన్ని నోటితోటి చెప్పిస్తారా
ఆలుమగలం అయిపోతాంలే అడిగిందిచ్చే సుకుమారా
నోరే జారితే పరవాలేదు కాలే జారకు యువతారా
జరిగే కళ్యాణం దాకా జాగారం చెయ్ మంటారా
అమ్మో అమ్మమ్మమ్మో...
అమ్మో చిన్నమ్మమ్మో...

బావున్నార బాగున్నార  భామ గారు బాగున్నారా
బావున్నార బాగున్నార  బావగారు బాగున్నారా
ఎదురు చూపులు చూస్తున్నారా మధన జపమే చేస్తున్నారా
ఆరు అడుగుల మాగధీరుడిని ఎవ్వరైనా వదిలేస్తారా
ఇంతబాగా శెలవిస్తారా అమ్మో చిన్నమ్మమ్మో...
అమ్మో అమ్మమ్మమ్మో...

Most Recent

Default