Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Taraka Ramudu (1997)




చిత్రం: తారకరాముడు (1997)
సంగీతం: కోటి
నటీనటులు: శ్రీకాంత్, సౌందర్య
దర్శకత్వం: ఆర్.వి.ఉదయ్ కుమార్
నిర్మాత: యమ్.సుధాకర్, కె.శోభన్ బాబు
విడుదల తేది: 29.08.1997



Songs List:



దండాలండి కొత్త పాట సాహిత్యం

 
చిత్రం: తారకరాముడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర , కృష్ణం రాజు 

దండాలండి కొత్త 




కోపం వస్తే మండుటెండ పాట సాహిత్యం

 
చిత్రం: తారకరాముడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, యస్.పి.బాలు

కోపం వస్తే మండుటెండ
మనసు మాత్రం వెండి కొండ
కోపం వస్తే మండుటెండ
మనసు మాత్రం వెండి కొండ
వాన మబ్బులాంటి వాటం నీదయా
నాకు తెలుసా మంచి చెడ్డా
నువ్వు చెబితే నేర్చుకుంటా
నిన్ను నమ్మినాను అంతా నీదయా...

నీ అల్లర్లు అందం 
నీ అవకల్లు అందం 
నన్ను కవ్వించి నవ్వించి 
నీ నేస్తమే మంచి గంధం

కోపం వస్తే మండుటెండ
మనసు మాత్రం వెండి కొండ 
వాన మబ్బులాంటి వాటం నీదయ్యా

చరణం: 1
చెర్లో వున్న చాకిరేవు బండ నేనట
గుళ్ళో వున్న అమ్మవారి బొమ్మనీవట
మురికిని కడిగినా మనసుని కడిగినా
రెండు రాళ్ళు చేసేదోకటే పేర్లే వేరటా
అవునోకాదో తెలియదు కానీ
నువ్వు చెబుతుంటే ఔనంట
మరి అంతలోనే బుంగమూతి సంగతేంటటా

నాకు తెలుసా మంచి చెడ్డా
నువ్వు చెబితే నేర్చుకుంటా
నిన్ను నమ్మినాను అంతా నీదయా...

చరణం: 2
నిండు కుండ కాదు కనుక తొనుకుతుందది
అంత వింత అందులోన ఏమిటున్నది
నాలో తెలివికి దీన్లో నీటికి
పోలికే గుళుకు గుళుకు పలుకుతున్నది
అమృతం లాంటి హృదయం నీది
అంత కన్న వేరే వరమేది
అది తెలిసి కూడా కసురుకుంటే నేరమెవరిదీ

కోపం వస్తే మండుటెండ
మనసు మాత్రం వెండి కొండ
వాన మబ్బులాంటి వాటం నీదయ్యా
ఏంటో ! నాకు తెలుసా మంచి చెడ్డా
నువ్వు చెబితే నేర్చుకుంటా
నిన్ను నమ్మినాను అంతా నీదయా...
నీ అల్లర్లు అందం
నీ అవకల్లు అందం
నన్ను కవ్వించి నవ్వించి
నీ నేస్తమే మంచి గంధం



ఇవ్వాలి ఇవ్వాళ్ళైనా పాట సాహిత్యం

 
చిత్రం: తారకరాముడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర , యస్. పి. బాలు

అమ్మాయిగారు అమ్మాయిగారు 
ఒట్టేసి చెప్పండమ్మాయిగారు 
ఏంటది?
అందరిలా చూడరుగా నన్నుమీరు ?
అంటే...
ఆ ఏదో నాకు తోచింది మంచో, చెడ్డో చేసేస్తుంటా కదా!
అయితే ...?
అయినా నా మీద ఎప్పుడైనా
కోపం వస్తుందా మీకు ?
రాదులే 
అంటే...
అంటే...
నేనంటే 
నువ్వంటే
మీకెంతో 
నాకెంతో
ఇష్టం అన్నమాటా..

ఇవ్వాలి ఇవ్వాళ్ళైనా మీరు
ఏది...అదీ..అమ్మాయిగారు
చెప్పాలి ఏం కావాలో మీరు
ఏదో అదీ ఆబ్బాయిగారు 
నన్నే మెచ్చారు నేనే నచ్చనన్నారు 
తీరా అది ఇమ్మంటే ఇంకా ఏమో ఆలోచిస్తారు
చాల్లే నీ తీరు విన్నాళ్ళేమనుకుంటారు
అయినా అడిగేదానికి ఉందా లేదా ఏదో ఓ పేరు
ఆ మాట నా నోట ఈ పూట వినిపించనా
ఐ వాంట్ ఎ కిస్ ఫ్రం యు 

ఇవ్వాలి ఇవ్వాళ్ళైనా మీరు
ఏది...అదీ...అమ్మాయిగారు

ఎదురయ్యారా... ఇష్టం అయినా వాళ్ళు
అది కావాలంటారంటగా
ఎద గూటిలో చోటిచ్చాగా నీకు
రుజువింకా చూపాలంటావా
ఏమో గాని అది ఎక్కడుందీ
మీరేం అనుకోనంటే నేనే వెళ్లి తెచ్చుకొందునా
ఓహో వాటం మహా జోరుగుంది
పోనీ పాపం అంటే నీ మోహమాటం రెచ్చిపోయెనా
అంటే కాదనట్టా అవునన్నట్టా తేల్చకుండా
అట్టా నవ్వుతుంటే ఎట్టాగమ్మా...

ఇవ్వాలి ఇవ్వాళ్ళైనా మీరు
ఏది...అదీ...అమ్మాయిగారు

పసిపాపలా పంతం పట్టావంటే కొరికేస్తా రెండు బుగ్గలు
అలవాటుగా ఒప్పో తప్పో అంటే
కొడతారా చెంప దెబ్బలు
అబ్బా...అదేం కాదు వెర్రి నాయనా
ఏమీ అర్ధంకాదెమయ్య నీకు ఎట్టా చెప్పినా
ఇచ్చేదేదో ఇస్తే సంతోషించనా
ఉత్తి మాటలతోనే ఊరిస్తుంటే ఊరుకుందునా
అంతా బాహాటంగా అడిగేస్తావేం బండరామయ్య 
ఇది కాయా పండా నువ్వే చెప్పయ్యా 
నాకేం తెలుసండీ 

ఇవ్వాలి ఇవ్వాళ్ళైనా మీరు
ఏది...అదీ...అమ్మాయిగారు
చెప్పాలి ఏం కావాలో మీరు
ఏదో అదీ ఆబ్బాయిగారు
నన్నే మెచ్చారు నేనే నచ్చనన్నారు
తీరా అది ఇమ్మంటే ఇంకా ఏమో ఆలోచిస్తారేంటండి
చాల్లే నీ తీరు విన్నాళ్ళేమనుకుంటారు
అయినా అడిగేదానికి ఉందా లేదా ఏదో ఓ పేరు
ఆ మాట... నా నోట....ఈ పూట వినిపించనా ఏవండీ...
ఐ వాంట్ ఎ కిస్ ఫ్రం యు
తనదాననా...న.....నన.
తనదాననా...





సెట్టు మీది ఉసిరికీ పాట సాహిత్యం

 
చిత్రం: తారకరాముడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు

పల్లవి:
సెట్టు మీది ఉసిరికీ సంద్రాన ఉప్పుకి
సుట్టరికం బెట్టాడు సిత్తరాల దేవుడు        

చరణం: 1
మబ్బులోని నీరుకి మట్టీ సాటు వేరుకి
వానవంతెనేసాడు జాడ లేని దేవుడు
కలవనట్టు అనిపిస్తాది నేలా ఆకాశం
తెలుసుకుంటే కనిపిస్తాది తెగిపోని సావాసం   

చరణం: 2
జన్మలున్నవో లేవో ఆ బెమ్మదేవుడికి ఎఱుక   
జన్మలున్నవో లేవో ఆ బెమ్మదేవుడికి ఎఱుక
ఆ కొమ్మకి నీకూ ఋణమేటంటే
సెప్పగలదా సిలకా సెప్పగలదా సిలకా
సెప్పగలదా సిలకా సెప్పగలదా సిలకా




హయ్ హయ్ వెన్నెలమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: తారకరాముడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు

హాయి హాయి హాయి వెన్నెలమ్మ హాయి హాయి హాయి హాయి
తియ్యతియ్యనైన పాట పాడనీయి బాధ పోనీ రానీ హాయి
చురుకుమనే మంటకు మందును పూయమని
చిటికెలలో కలతను మాయం చేయమని
చలువ కురిపించని ఇలా ఇలా ఈ నా పాటని 

కనులు తుడిచేలా ఊరడించి ఊసులాడే భాషే రాదులే
కుదురు కలిగేలా సేవజేసి సేదదీర్చే ఆశే నాదిలే
వెంటనే నీ మది పొందనీ నెమ్మది
అనితలచే ఎదసడిని పదమై పలికే మంత్రం వేయని 

మొరటుతనమున్నా పువ్వులాంటి నిన్నుకాచే ముల్లై నిలవనా
మన్నులో వున్నా చిగురువేసే నీకు నేనే వేరై ఒదగనా
నువ్విలా కిలకిలా నవ్వితే దివ్వెలా
కడవరకు ఆవెలుగు నిలిపే చమురై నేనే ఉండనా




సడి చేయకమ్మా గాలి పాట సాహిత్యం

 
చిత్రం: తారకరాముడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు

సడి చేయకమ్మా గాలి
చల్లంగా పాడమ్మా లాలి
సడి చేయకమ్మా గాలి
చల్లంగా పాడమ్మా లాలి

నా కన్న తండ్రీ నిదురించు వేళ
నా కళ్లు నిండి వెలిగేటి వేళ
ఎన్నో జన్మాల బంధం ఇది
కదిలిస్తే చెదిరేను ఏమో... గాలి
తరగని కలలాగ ఆ కళ్ళలో
నన్నే కలకాలం కొలువుండని

సడి చేయకమ్మా గాలి
చల్లంగా పాడమ్మా లాలి

నా కన్న తండ్రీ నిదురించు వేళ
నా కళ్లు నిండి వెలిగేటి వేళ




రాముడు మంచి బాలుడు పాట సాహిత్యం

 
చిత్రం: తారకరాముడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు

రాముడు మంచి బాలుడు అని అంతా అంటారు
నన్ను జూసి అంతా అంటారు
రాముడు మంచి బాలుడు అని అంతా అంటారు
నన్ను జూసి అంతా అంటారు
ఆహ క్షేమమేనా అబ్బి అంటే నావాళ్ళవుతారు
పాదమాగిన చోటే సొంతూరు
ఆదరించిన వాళ్లే అయినోళ్లు
కాదు పోరా అంటే రారా అంటది రిపింకో ఊరు

రాముడు మంచి బాలుడు అని అంతా అంటారు
నన్ను జూసి అంతా అంటారు
ఆహ క్షేమమే నా అబ్బి అంటే నావాళ్ళవుతారు
వాళ్ళే నావాళ్ళవుతారు

గాలి లాలి పాడే నేల తల్లి ఒళ్ళో
ఆదమరిచి నేను నిద్దరోతాను

వెన్ను తట్టి లేపే పిట్ట పాట వింటూ
మేలుకొని నేను సూర్యుడవుతాను
అష్టదిక్కుల మధ్యన నేను దిక్కులేనివాడిని కాదు
చుట్టు పక్కల ఉండేవాళ్లే చుట్ట పక్కాలనుకుంటాను
గడ్డి పూవులు కూడా నాకు నవ్వులెన్నో నేర్పించాయి
గుబ్బి గవ్వలు కూడా నాకు ఆడుకుందుకు పనికొచ్చాయి
దుఃఖం అంటే మాత్రం అర్థం నాకు చెప్పలేదు ఎవరు

రాముడు మంచి బాలుడు అని అంతా అంటారు
నన్ను జూసి అంతా అంటారు
ఆహ క్షేమమే నా అబ్బి అంటే నావాళ్ళవుతారు
వాళ్ళే నావాళ్ళవుతారు

ఓయ్ రాముడోయ్ కాస్త చంటిగాడిని చూస్కో
అట్టాగేనక్క

ఆయీ ఆయీ అంటూ ఊయలూపుతాను
చిన్ని తల్లి నీకు అమ్మనౌతాను
అమ్మలాగే నాకు అన్నంపెట్టు చాలు
ఆయువున్నదాకా అమ్ముడౌతాను
నువ్వు వరస కలుపుకుంటే
నీ కొడుకు నవకపోను
నాకు చేతనైన సేవ నీకు చేయ్యలేకపోను
మన సొంతం అంటూ వేరే ఏ బంధం లేదంటారు
మనమంతా మానవులమే ఆ బంధం చాలంటారు
అనుకోవడంలోనే అంతావుందని పెద్దలు అంటారు

రాముడు మంచి బాలుడు అని అంతా అంటారు
నన్ను జూసి అంతా అంటారు
రాముడు మంచి బాలుడు అని అంతా అంటారు
నన్ను జూసి అంతా అంటారు
ఆహ క్షేమమేనా అబ్బి అంటే నావాళ్ళవుతారు
పాదమాగిన చోటే సొంతూరు
ఆదరించిన వాళ్లే అయినోళ్లు
కాదు పోరా అంటే రారా అంటది రేపింకో ఊరు

Most Recent

Default