చిత్రం: శ్రీమతీ వెళ్లొస్తా (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: జగపతి బాబు, దేవయాని, పూనమ్
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
నిర్మాతలు: సి.వెంకటరాజు, జి.శివరాజు
విడుదల తేది: 18.10.1998
అప్సరసా అప్సరసా అప్సరసా
లిప్స్ రసాలందించావే
మోహనుడా మన్మధుడా మధుప్రియుడా
ముద్దు నిషా ముందుంచావే
లక్కీ పెదవికి ఒక్కసారిగ దక్కెను కిక్కునిధి
దిక్కేతోచక గుక్క తిరగక మధువు మనకు బందీ
అప్సరసా అప్సరసా అప్సరసా
లిప్స్ రసాలందించావే
మోహనుడా మన్మధుడా మధుప్రియుడా
ముద్దు నిషా ముందుంచావే
వంద వెన్నముద్దలు
వెయ్యి తేనె చుక్కలు
హోయ్ వంద వెన్నముద్దలు
వెయ్యి తేనె చుక్కలు
ఒక్కచోటే చేరి ముద్దులాగా మారి
నోటికందించాయి రుచులు
మాటల్లో గోషుండదా యాసుండదా ప్రాసుండదా
ముద్దుల్లో ఊపుండదా కైపుండదా తీపుండదా
మొద్దుగ మారిన సోమరి పెదవికి ముద్దే వ్యాయామం
అప్సరసా అప్సరసా అప్సరసా
లిప్స్ రసాలందించావే
మోహనుడా మన్మధుడా మధుప్రియుడా
ముద్దు నిషా ముందుంచావే
స్వర్గమెంత దూరమో
మోక్షమెంత కష్టమో
స్వర్గమెంత దూరమో
మోక్షమెంత కష్టమో
అనుకున్నా గాని స్వర్గమోక్షాలన్ని
చెంత చేరేనొక్క ముద్దుతో
కాయల్లో చేదుండదా తీపుండదా పులుపుండదా
కిస్సుల్లో మత్తుండదా మాయుండదా హాయుండదా
ఎంతో చిన్నది అయినా గొప్పది కమ్మని కిస్ చబ్ధం
అప్సరసా అప్సరసా అప్సరసా
లిప్స్ రసాలందించావే
మోహనుడా మన్మధుడా మధుప్రియుడా
ముద్దు నిషా ముందుంచావే
లక్కీ పెదవికి ఒక్కసారిగ దక్కెను కిక్కునిధి
దిక్కేతోచక గుక్క తిరగక మధువు మనకు బందీ
*********** *********** **********
చిత్రం: శ్రీమతీ వెళ్లొస్తా (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర
నీ పెదవులతో మాటాడాలని పనిగట్టుకు వచ్చా
నీ పదములతో ఆటాడాలని పరిగెత్తుకు వచ్చా
సరి సరి పద మరి తగపడి తదుపరి
సబ్జెక్ట్ ఇది అని చర్చిద్దాం
అర్జంటుగ కథ కదిలిద్దాం
కలిగే అవసరమేదైనా కలిసి తీర్చుకుందాం
నీ పదములతో ఆటాడాలని పరిగెత్తుకు వచ్చా
సూదంటు సుకుమారం హల్లో హల్లో అంటే ఎలా హలా
మతి అటో ఇటో అవదా
నీ కొంటె వ్యవహారం చలో చలో అంటె ఒళ్ళో మరి చెయ్ డిచ్చో డిచ్చో అనదా
పొద్దుపోదు నిద్దరోదు ముద్దకూడ ముట్టనీదు ఈ అల్లరి
హద్దులేదు ఆపలేదు ముద్దులాటకాపులేదు కానీమరీ
మధన కథ మొదలవదా మనజత కనబడగా
సబ్జెక్ట్ ఇది అని చర్చిద్దాం
అర్జంటుగ కథ కదిలిద్దాం
కలిగే అవసరమేదైనా కలిసి తీర్చుకుందాం
నీ పెదవులతో మాటాడాలని పనిగట్టుకు వచ్చా
నీ పదములతో ఆటాడాలని పరిగెత్తుకు వచ్చా
నా సోకు ఫలహారం గిల్లి గిల్లి తిని తుళ్ళి కళ్ళి
మహ అవస్థ పడిపోవా
నాజూకు నయగారం ఇందా ఇందా అని విందే ఇస్తే కళ్ళు తథాస్తు అనుకోవా
కుళుకులు అరగక కునుకిక కుదరక ఏం తిప్పలో
కొరికిన కనులకు దొరికిన నడుముకు ఏం నొప్పులో
సెగలెగసి సఖి సొగసి తగిలిన తికమకలో
సబ్జెక్ట్ ఇది అని చర్చిద్దాం
అర్జంటుగ కథ కదిలిద్దాం
కలిగే అవసరమేదైనా కలిసి తీర్చుకుందాం
నీ పెదవులతో మాటాడాలని పనిగట్టుకు వచ్చా
నీ పదములతో ఆటాడాలని పరిగెత్తుకు వచ్చా
సరి సరి పద మరి తగపడి తదుపరి
సబ్జెక్ట్ ఇది అని చర్చిద్దాం
అర్జంటుగ కథ కదిలిద్దాం
కలిగే అవసరమేదైనా కలిసి తీర్చుకుందాం
*********** *********** **********
చిత్రం: శ్రీమతీ వెళ్లొస్తా (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, చిత్ర
వనమాలి వనమాలి వెళ్లనులే నిన్నొదిలి
మరుమల్లి మరుమల్లి నీ మనసే నా మజిలీ
గొంతెత్తే చిలకలు మొలకెత్తే వలపులు
తలలెత్తే చైత్రములో
తనువిప్పే వయసులు పురివిప్పే పెదవులు
లయ తప్పే లాహిరిలో
వనమాలి వనమాలి
వెళ్లనులే నిన్నొదిలి
ప్రేమ తపసు నన్నే గెలిచినదీ...
ప్రణయ దనసు నాలో విరిగినదీ...
ప్రేమ తపసు నన్నే గెలిచినది
ప్రణయ దనసు నాలో విరిగినది
గుండెల్లో గాఢంగా భాద్రపదం ఉసిరినిది
కన్నుల్లో మౌనంగా మార్గశిరం మెరిసినది
జతపడు బ్రతుకులు పలు ఋతువులు
అతిథిలల్లే చేరినవి...
వనమాలి వనమాలి
వెళ్లనులే నిన్నొదిలి
ఆకుపచ్చ ప్రాయం వణికినదీ...
గోరువెచ్చ గేయం తొణికినదీ...
ఆకుపచ్చ ప్రాయం వణికినది
గోరువెచ్చ గేయం తొణికినది
పరువంలో వేగంగా పాలకడలి పొంగినది
మోహంలో మొత్తంగా పడుచు పడవ మునిగినది
పరి పరి విధముల విరి శరములు
మరుని మహిమ తెలిపినదీ...
వనమాలి వనమాలి వెళ్లనులే నిన్నొదిలి
మరుమల్లి మరుమల్లి నీ మనసే నా మజిలీ
గొంతెత్తే చిలకలు మొలకెత్తే వలపులు
తలలెత్తే చైత్రములో
తనువిప్పే వయసులు పురివిప్పే పెదవులు
లయ తప్పే లాహిరిలో