చిత్రం: అంతః పురం (1998) సంగీతం: ఇళయరాజా నటినటులు: జగపతిబాబు, సౌందర్య, సాయి కుమార్, ప్రకాష్ రాజ్ దర్శకత్వం: కృష్ణవంశీ నిర్మాత: పి.కిరణ్ విడుదల తేది: 30.11.1998
Songs List:
అస్సలేం గుర్తుకురాదు పాట సాహిత్యం
చిత్రం: అంతః పురం (1998) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: చిత్ర హే... నా ననననాన ననననాన ననననా హే... నా ననననాన ననననాన ననననా అస్సలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అస్సలేం తోచదునాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడకా హే... నా ననననాన ననననాన ననననా హే... నా ననననాన ననననాన ననననా నా ననననాన ననననాన ననననా నా ననననాన ననననాన ననననా అస్సలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా నీలో ఉందీ నాప్రాణం, అది నీకు తెలుసునా?? ఉన్నాన్నేను నీకోసం, నువ్వు దూరమైతే బతకగలనా?? ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా!! గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించనీ... ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించనీ... అల్లుకోమని గిల్లుతున్నది చల్చల్లని గాలి... తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి!! ఏకమయే... ఏకమయే ఏకాంతం లోకమయే వేళ అహ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల!! అస్సలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా నీలో ఉందీ నాప్రాణం, అది నీకు తెలుసునా?? ఉన్నాన్నేను నీకోసం, నువ్వు దూరమైతే బతకగలనా?? ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా!! కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకుని బంధించనీ... కౌగిలింతల సీమలో కోట కట్టుకుని కొలువుండనీ... చెంత చేరితే చేతి గాజులు చేసే గాయం జంట మద్యన సన్నజాజులు హా హాకారం!! మళ్ళీ... మళ్ళీ... మళ్ళీ... మళ్ళీ... ఈ రోజు రమ్మన్నా రాదేమో! నిలవని చిరకాలమిలాగే ఈ క్షణం!! అస్సలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా నీలో ఉందీ నాప్రాణం, అది నీకు తెలుసునా?? ఉన్నాన్నేను నీకోసం, నువ్వు దూరమైతే బతకగలనా?? ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా!!
చమకు చమకు పాట సాహిత్యం
చిత్రం: అంతః పురం (1998) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: మనో, స్వర్ణలత చమకు చమకు
కళ్యాణం కానుంది పాట సాహిత్యం
చిత్రం: అంతఃపురం (1999) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: చిత్ర పల్లవి: కళ్యాణం కానుంది కన్నె జానకికీ కళ్యాణం కానుంది కన్నె జానకికీ.. వైభోగం రానుంది రామచంద్రుడికీ వైభోగం రానుంది రామచంద్రుడికీ దేవతలే దిగి రావాలి.. జరిగే వేడుకకీ రావమ్మా సీతమా.. సిగ్గు దొంతరలో రావయ్యా రామయ్యా.. పెళ్ళి శోభలతో వెన్నెల్ల్లో నడిచే మబ్బుల్లాగా వర్షంలో తడిసే సంద్రంలాగా ఊరేగే పువ్వుల్లో.. చెలరేగే నవ్వుల్లో అంతా సౌందర్యమే..ఏ.. అన్నీ నీ కోసమే..ఏ..ఏ వెన్నెల్ల్లో నడిచే మబ్బుల్లాగా వర్షంలో తడిసే సంద్రంలాగా చరణం: 1 లలల.. లలలల.. నాలో ఎన్ని ఆశలో.. అలల్లా పొంగుతున్నవీ నీతో ఎన్ని చెప్పినా.. మరెన్నో మిగులుతున్నవీ కళ్ళల్లోనే వాలీ.. నీలాకాశం అంతా.. ఎలా ఒదిగిందో ఆ గగనాన్ని ఏలే.. పున్నమి రాజు ఎదలో.. ఎలా వాలాడో నక్షత్రలన్నీ ఇలా కలలై వచ్చాయీ చూస్తూనే నిజమై అవీ ఎదటే నిలిచాయి అణువణువు అమృతంలో తడిసింది అద్భుతంగా.. వెన్నెల్ల్లో నడిచే మబ్బుల్లాగా వర్షంలో తడిసే సంద్రంలాగా చరణం: 2 ఇట్టే కరుగుతున్నది.. మహాప్రియమైన ఈ క్షణం వెనకకు తిరగనన్నది.. ఎలా కాలాన్ని ఆపడం మదిలా మంటే.. నేడు తీయని శృతిగా మారి.. ఎటో పోతుంటే కావాలంటే చూడు.. ఈ ఆనందం మనతో.. తను వస్తుందీ.. ఈ హాయి అంతా.. మహా భద్రంగా దాచి పాపాయి చేసి.. నా ప్రాణాలే పోసి నూరేళ్ళ కానుకల్లే.. నీ చేతికియ్యలేనా.. ఆకాశం అంతఃపురమయ్యిందీ.. నాకోసం అందిన వరమయ్యిందీ రావమ్మా మహరాణి.. ఏలాలీ కాలాన్నీ అందీ ఈ లోకమే.. అంతా సౌందర్యమే..ఏ.. ఆకాశం అంతఃపురమయ్యిందీ.. నాకోసం అందిన వరమయ్యిందీ
సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా! పాట సాహిత్యం
చిత్రం: అంతః పురం (1998) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: శంకర్ మహదేవన్ వీరభద్రుడే సాక్షి రుద్రుడే సాక్షి పసుపు కుంకుమ సాక్షి పంతమే సాక్షి పచ్చి నెత్తురుతో ఓ పోతుగడ్డా కక్ష కడిగింది మా ఆడబిడ్డా కసితీరే వేళ సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా! కోరస్: సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా! తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా! హే అశ్శరభా దరువెయ్ దశ్శరభా! మనమియ్యాలా… కోరస్: ఇయ్యాలే ఎయ్యాలా జాతర చెయ్యాలా రారే రారే సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా! కోరస్: తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా! చరణం: 1 కారం తిన్న కండలివీ..! రగతం మరిగే కత్తులివీ మీసం దువ్వే దమ్ములివీ రోషం రగిలే రొమ్ములివీ ఎవరైనా రానీ, కో: ఓ ఓ ఓ ఏవైనా కానీ, కో: ఓ ఓ ఓ నీ సేవలోనే, కో: నీ సేవలోనే మేమున్నాం సామీ...!! కోరస్: మేమున్నాం సామీ మనసు కలిసెనంటే ఉసురైనా ధార పోస్తాం మనసు విరిగెనంటే మరి ఊరుకోం హే సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా! తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా! చరణం: 2 అది అహోబిలం మనకున్న మహాబలం కాదా! పెరిగే తాపం నరికే నరసిమ్హుడా శివుణ్ణి మన శ్రీశైలం కట్టేసిందా లేదా కోరస్: మనమా దొరకి భటులం అయ్యాం కదా బ్రహ్మం గారి జ్ఞానం...!! కోరస్: వేమన వేదం అందించిన పుణ్యం... కోరస్: మనకే సొంతం నా నా నా ఆ నా నా ఈ రతనాల సీమ ...!! కోరస్: ఈ రతనాల సీమ ఆ రాయల చిరునామా.!! కో: ఆ రాయల చిరునామా కోరస్: ఏడుకొండల పైన కొలువైన యెంకటరమణ మనం పిలవగానే తనే దిగిరాడా హే సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా హే అశ్శరభా, కో: అశ్శరభా దరువెయ్ దశ్శరభా...!! కోరస్: దశ్శరభా మనమియ్యాలా... కోరస్: ఇయ్యాలే ఎయ్యాలా జాతర చెయ్యాలా రారే రారే సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా
సూరీడుపువ్వా జాబిల్లి గువ్వా పాట సాహిత్యం
చిత్రం: అంతః పురం (1998) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: జానకి జానకి గారికి నంది అవార్డ్ వొచ్చిన చక్కని పాట ఓ.. ఓ.. ఓ.. ఓ... సూరీడుపువ్వా జాబిల్లి గువ్వా చినబోయినావెందుకే మాకంటి చలువ కోనేటి కలువ కన్నీటి కొలువెందుకే నడిరేయి జాములో తడి లేని సీమలో... సూరీడుపువ్వా జాబిల్లి గువ్వా చినబోయినావెందుకే మాకంటి చలువ కోనేటి కలువ కన్నీటి కొలువెందుకే చరణం: 1 బతుకే బరువు ఈ నేలకి.. కరుణే కరువు ఈ నీటికి వెలుగే రాదు ఈ వైపుకి.. శ్వాసే చేదు ఈ గాలికి ఆకాశమే మిగిలున్నది ఏకాకి పయనానికి ఆ శూన్యమే తోడున్నది నీ చిన్ని ప్రాణానికి నిదురించునే నీ తూరుపు నిట్టూర్పే ఓదార్పు అందాల చిలక అపరంజి మొలక అల్లాడకే అంతగా పన్నీటి చినుకా కన్నీటి మునకా కలలన్ని కరిగించగా చరణం: 2 ఏవైపునందో ఏమో మరి జాడే లేదే దారి దరి ఏమవుతుందో నీ ఊపిరి వేటాదిందే కాలం మరి నీ గుండెల్లో గోదావరి నేర్పాలి ఎదురీతని నీకళ్ళలో దీపావళి ఆపాలి ఎద కోతని పరుగాపని పాదలతో కొనసాగని నీ యాత్రని శ్రీ వేంకటేశా ఓ శ్రీనివాసా ఈ మౌనం ఎన్నాళ్ళయా అల వైకుంఠాన అంతఃపురాన ఏ మూల వున్నావయ్య ఓ నామాల దేవరా ఈ నీ మాయ ఆపరా శ్రీ వేంకటేశా ఓ శ్రీనివాసా ఈ మౌనం ఎన్నాళ్ళయా అల వైకుంఠాన అంతఃపురాన ఏ మూల వున్నావయ్య