Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Pelli Pandiri (1998)





చిత్రం: పెళ్ళి పందిరి (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటినటులు: జగపతిబాబు, రాశి, పృద్విరాజ్
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాతలు: జి.అస్వర్థ నారాయణ్ బాబు,
యమ్.సి.శేఖర్, ఎస్. రమేష్ బాబు
విడుదల తేది: 04.02.1998



Songs List:



నేస్తమా ఇద్దరి లోకం పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్ళి పందిరి (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గురుచరన్
గానం: యస్.పి.బాలు, సునీత


మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం
నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు
ఉహుఁ ఈ అందాలన్నీ చూడలేని నాకళ్ళు కూడా 
ఆయనే చెక్కాడుగా

నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా 
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా 
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
ఈ గుండెలోన నీ ఊపిరుంటే 
ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే
ఊహల రెక్కలపైన ఊరేగే దారులు ఒకటే
చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే

నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా 
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా

మరి లోకంలో ఎన్ని రంగులున్నాయ్
అవి ఎలా ఉంటాయ్

బుగ్గమీద వెచ్చని సిగ్గు వచ్చినపుడు దానిని అడుగు 
ఎర్రదనం అంటే చెబుతుంది
పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు 
తెల్లరంగు అట్టా ఉంటుంది
నీలో నిలువున పులకలు రేగిన వేళ 
నువ్వే పచ్చని పైరువి అవుతావమ్మా
దిగులు రంగే హా హా నలుపు అనుకో హా హా 
ప్రేమ పొంగే హా హా పసుపు అనుకో హా
భావాలను గమనిస్తుంటే ప్రతి రంగును చూస్తున్నట్టే
చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే

నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా 
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా

ఉదయం సాయంత్రం అంటారే
అవి ఎలా ఉంటాయ్

మొదటిసారి నీ గుండెలలో తీయనైన ఆశలురేపి
ఆ కదలిక ఉదయం అనుకోమ్మా
చూడలేని ఆవేదనతో కలత చెంది అలిశావంటే
సాయంత్రం అయినట్టేనమ్మా
నీలో నవ్విన ఆశలు నా చలివైతే 
నేనై పలికిన పలుకులు నీ కులుకైతే
ఇలవు నీవే హా హా రవిని నేనే హా హా
కలువ నీవే హా హా శశిని నేనే హా
ఒక్కరికోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే
చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే

నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
ఈ గుండెలోన నీ ఊపిరుంటే 
ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే
ఊహల రెక్కలపైన ఊరేగే దారులు ఒకటే
చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే



చూడచక్కని జింక పిల్లరా పాట సాహిత్యం

చిత్రం: పెళ్ళి పందిరి (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, స్వర్ణలత

హొయ్ చూడచక్కని జింకపిల్లరా శ్రీరామచంద్ర
హె చంగుమంటు చెంతకొచ్చెరా ఓ రామచంద్ర
నీ కోసమే నేపుట్టి పెరిగా ఇన్నాళ్ళుగా నీకోసం వెతికా
నీ తోడుంటే ప్రతిరోజూ పండగే
నువులేకుంటే బతికేది దండగే
నీ జడ్లోని పువ్వై నే ఉంటానే పువ్వల బుల్లెమ్మా
కళ్లునావి చూపు నీదిరా శ్రీరామచంద్ర
మాట నాది మనసు నీదిరా ఓ రామచంద్ర

చంపకు చారెడు కళ్ళు చమంతులు పూసే వళ్లు 
నీ నవ్వే మల్లెల జల్లే చిలకమ్మా
ఆ అన్నీ నీకే ఇస్తా నీ వెంటే నేనడిసొస్తా 
నీ వాకిల ముందర ముగ్గై నేనుంటా
గుండెల నిండా ప్రేమండాలి భామ 
దాన్ని ఏంచేయాలో నువ్వే చెబుదువ రామ్మా
నలుగురు ముందు తాళిని కట్టేమామ 
ఆ తరుతెంజేయలో చెబుతాలేమ్మా
ఊరంతా పచ్చంగా పందిల్లేయనా
పదుగురులో పదిలంగా పెళ్ళాడేయనా
నీ మెడ్లోని గోలుసై నీ గుండెల్లో కాపురమెట్టెయ్ నా
మాట నాది మనసు నీదిరా శ్రీరామచంద్ర
ఆ ఒళ్లు నాది ఊపిరి నీదిరా ఓ రామచంద్ర


గుడిలో దేవుడుకన్నా నువ్వేలే నాకు మిన్నా 
నీ కాలికి అంటిన మాట్టే బొట్టంటా
మేడలు మిద్దెలకన్నా ముద్దొచ్చే పెదవులె మిన్నా 
నీ కమ్మని ముద్దే కట్నం లెమ్మన్నా
కొంగులు జారే కమ్మని రాతిరి లోన 
నువ్వు కోరిన పండు కొరికిస్తాలే మామ
కాటుక మరకలు అంటే కౌగిలిలోనా 
తెల్లారులు నిన్ను కరిగిస్తాలే భామ్మ
నీ మాటే నే వింటా ఏ నాటికీ
సై అంటే సై అంటా సయ్యాటకి
చంగట్టేసి పట్టేసి చుట్టేస్త సిగ్గుల చిలకమ్మా

హె చూడచక్కని జింకపిల్లరా శ్రీరామచంద్ర
హె చంగుమంటు చెంతకొచ్చెరా ఓ రామచంద్ర
నీ కోసమే నేపుట్టి పెరిగా ఇన్నాళ్ళుగా నీకోసం వెతికా
నీ తోడుంటే ప్రతిరోజూ పండగే
నువులేకుంటే బతికేది దండగే
నీ జడ్లోని పువ్వై నే ఉంటానే పువ్వల బుల్లెమ్మా
కళ్లునావి చూపు నీదిరా శ్రీరామచంద్ర
ఆహా హా మాట నాది మనసు నీదిరా ఓ రామచంద్ర



అనగనగా ఒక నిండు చందమామా పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్ళి పందిరి (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

అనగనగా ఒక నిండు చందమామా
నిరుపేద కలువతో చెలిమి చేసెనమ్మా
అంతలోనె తెలవారిపోయెనమ్మా...
ఆ కన్నె కలువ కల కరిగిపోయెనమ్మా...

పచ్చని జంటను విడదీసిన ఆపాపం ఎవ్వరిదీ
పచ్చని జంటను విడదీసిన ఆపాపం ఎవ్వరిదీ
కధ మొదలవగానే కాలం కత్తులుదూసిందీ
కధ మొదలవగానే కాలం కత్తులుదూసిందీ

ఓ...ఓఓ,    ఓ...ఓఓ,   ఓ...ఓఓఓ
ఓ...ఓఓ,    ఓ...ఓఓ,   ఓ...ఓఓఓ

అనగనగా ఒక నిండు చందమామా
నిరుపేద కలువతో చెలిమి చేసెనమ్మా

ఆశలెన్నొ విరిసేలా బాసలెన్నొ చేశాడు
ఉన్నపాటుగా కన్నుమరుగయే చలువ చంద్రుడూ
ఆశలెన్నొ విరిసేలా బాసలెన్నొ చేశాడు
ఉన్నపాటుగా కన్నుమరుగయే చలువ చంద్రుడూ
రేరాజును రాహువు మింగాడో
అమవాస్యకు ఆహుతి అయ్యాడో
రేరాజును రాహువు మింగాడో
అమవాస్యకు ఆహుతి అయ్యాడో
అటు ఇటూ వెతుకుతూ నిలువునా రగులుతూ 
వెన్నెల ఉండని వేకువ వద్దని
కలువ జన్మ వడలిపోయెనమ్మా
ఓ ఓ ఓ ఓ ఓ

ఓ...ఓఓ,    ఓ...ఓఓ,   ఓ...ఓఓఓ
ఓ...ఓఓ,    ఓ...ఓఓ,   ఓ...ఓఓఓ

అనగనగా ఒక నిండు చందమామా
నిరుపేద కలువతో చెలిమి చేసెనమ్మా

గుప్పెడంత గుండెల్లో ఉప్పెనైన సంద్రంలో
చిక్కుకున్న ఈ చిన్న ఆశకీ శ్వాస ఆడదే
దిక్కులన్ని చూస్తున్నా నింగిని నిలదీస్తున్నా
దిక్కులేని ఈ దిగులు ప్రశ్నకీ బదులు దొరకదే
చిరునవ్వులు పూసిన మంట ఇదీ
కన్నీటిని కోరని కోత ఇదీ...
చిరునవ్వులు పూసిన మంట ఇదీ
కన్నీటిని కోరని కోత ఇదీ...
ఓటమై ముగెసెనా గెలుపుగా మిగిలెనా
జాబిలి వెన్నెల మాటునరేగినా
జ్వాలలాంటి వింతబ్రతుకు నాది 
ఆ ఆ ఆ ఆ ఆ

ఓ...ఓఓ,    ఓ...ఓఓ,   ఓ...ఓఓఓ
ఓ...ఓఓ,    ఓ...ఓఓ,   ఓ...ఓఓఓ

కలువని చంద్రుని ఎందుకు కలిపాడు
ఆ కలయిక కలగా ఎందుకు మార్చాడు
ఆ కధ రాసిన దేవుడన్న వాడు 
కరుణన్నది ఎరుగని కటిక గుండెవాడు 
నా కధలో ఆ దేవుడు ఎంతటి దయ చూపించాడూ
అడగక ముందె ఇంతటి పెన్నిధి నాకందించాడూ 
కలలే కరగని ఈ చంద్రునీ నేస్తం చేశాడూ
ఎపుడూ వాడని ఈ కలువనీ చెలిగా ఇచ్చాడూ

ఓ...ఓఓ,    ఓ...ఓఓ,   ఓ...ఓఓఓ
ఓ...ఓఓ,    ఓ...ఓఓ,   ఓ...ఓఓఓ



దోస్త్ మేరా దోస్త్ పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్ళి పందిరి (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, మనో

దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం
బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం

దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం
బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం

దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం

నిదరలో ఇద్దరమూ ఒకేలా కలగంటాం
ఆ హా హా ఆహా ఏ హే హే ఏహే
నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతాం
ఓ హో హో ఓహో ఆ హా హా ఆహా
హే నేలల్లే నేనొదిగుంటా నువు ఎదుగుతు ఉంటే
మబ్బుల్తో మన కథ చెబుతా వింతగ వింటుంటే
నీలా నాలా సావాసంగా నింగి నేలా కలవాలంటూ
మబ్బె కరిగి ఇలపై జల్లై రాదా
మన్ను మిన్ను కలిపే హరివిళ్ళవదా

హే దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం
హే బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం

దోస్త్ మేరా దోస్త్ హా తూ హై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం

చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది
ఆ హా హా ఆహా ఓ హో హో ఓహో
ధరిత్రికి ఈ చెలిమే ప్రమాణం అంటుంది
ఓ హో హో ఓహో ఏ హే హే ఏహే
హే ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం
స్వార్ధానికి అర్ధం మార్చే శాస్త్రం రా స్నేహం
ఊరు వాడ ఔరా అంటూ ఆశర్యంతో చూస్తూ ఉంటే
రాద్దాం నేస్తం కాలం చదవని కావ్యం
లోకం మొత్తం చదివే ఆరో వేదం

హే దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం
బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం

దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం
బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం



ఇదే మంచి రోజంది ముచ్చటగా పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్ళి పందిరి (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, స్వర్ణలత

ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచ భూతాలు సాక్షులుగా
ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచ భూతాలు సాక్షులుగా

చినుకులనే అక్షింతలుగా
మెరుపులతో దీవించెనుగా
మేఘాల పెళ్లిపందిరి

ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచ భూతాలు సాక్షులుగా
ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచ భూతాలు సాక్షులుగా

చినుకులనే అక్షింతలుగా 
మెరుపులతో దీవించెనుగా
మేఘాల పెళ్లిపందిరి

కలల రాణి కనులలోని కటిక చీకటి
చెలిమి వీడి చలువలోన కరుగుతున్నది
నిదరలోనే నిలిచిపోదు కాలమన్నది
వెలుగువేలు రేయిచెలిమి అందుకున్నది
వరాల పెన్నిది వరించు తున్నది 
తరంగమై మది తదాస్తు అన్నది

గుండెల్లో ఈనాడు గంగల్లే పొంగింది
రంగేళి దీపావళి
ముంగెల్లో ఈనాడు సంక్రాంతి ముగ్గల్లే
చేరింది నా నెచ్చెలి

ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచ భూతాలు సాక్షులుగా

మావిమాలునల్లుకున్న మాలవిలతా
జీవితాన్ని పంచుతున్న ప్రేమదేవత
గుడికి చేరే గరికపువ్వులాంటి నా కధ
బ్రతుకు తీపి తెలుసుకుంది నేడు నా ఎద
కళ్యాణ మంత్రమై దీవించే ఈ క్షణం
వెయ్యేళ్ళ బంధమై రమ్మంది కాపురం
పారాణి పాదాల తారాడు నాధాలకాహ్వానమందిచనా
నాలోని ప్రాణాలు పూమాలగా చేసి నీ పూజ కందించనా

ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచ భూతాలు సాక్షులుగా
ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచ భూతాలు సాక్షులుగా

చిరునవ్వులనే అక్షింతలుగా
సొగసులతో దీవించెనుగా
అందాల పెళ్లిపందిరి

ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచ భూతాలు సాక్షులుగా
ఇదే మంచి రోజంది ముచ్చటగా
ఇలా పంచ భూతాలు సాక్షులుగా


Most Recent

Default