చిత్రం: సుస్వాగతం (1998) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ నటీనటులు: పవన్ కళ్యాణ్, దేవయాని దర్శకత్వం: భీమనేని శ్రీనివాస్ నిర్మాత: ఆర్. బి. చౌదరి విడుదల తేది: 01.01.1998
Songs List:
ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి పాట సాహిత్యం
చిత్రం: సుస్వాగతం (1998) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు శ్రీ శ్రీనివాసం శివపారిజాతం శ్రీ వెంకటేశం మనసాస్మరామి శ్రీ శ్రీనివాసం శివపారిజాతం శ్రీ వెంకటేశం మనసాస్మరామి ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలిమేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ ఏ స్వప్నలోకల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలిమేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ తళతళ తారకా మెలికల మేనకా మనసున చేరెగా కలగల కానుకా కొత్తగా కోరికా చిగురులు వేయగా ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలిమేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ తొలిచూపు చాలంట చిత్తాన చిత్రంగ ప్రేమనేది పుట్టగా తొలిచూపు చాలంట చిత్తాన చిత్రంగ ప్రేమనేది పుట్టగా పదిమంది అంటుంటె విన్నాను ఇన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా ఆ కళ్ళలో ఆ నవ్వులో మహిమ ఏమిటో ఆ కాంతిలో ఈనాడేనా ఉదయమైనదో మహిసీమలో ఇన్ని మరుమల్లె గంధాలు మునుపెన్నడు లేని మృదువైన గానాలు మొదటి వలపు కథలు తెలుపు గేయమై తియ్యగా స్వరములు పాడగా ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలిమేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ మహరాణి పారాణి పాదాలకేనాడు మన్నునంట నీయకా మహరాణి పారాణి పాదాలకేనాడు మన్నునంట నీయకా నడిచేటి దారుల్లొ నా గుండె పూబాట పరుచుకుంది మెత్తగా శాంతికే ఆలయం ఆమె నెమ్మదీ అందుకే అంకితం అయినదీ మదీ సుకుమారమే ఆమె చెలిగత్తె కాబోలు సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు చెలియ చలువ చెలిమి కొరకు ఆయువే ఆశగా తపమును చేయగా ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలిమేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ తళతళ తారకా మెలికల మేనకా మనసున చేరెగా కలగల కానుకా కొత్తగా కోరికా చిగురులు వేయగా ఏ స్వప్నలోకల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలిమేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ
హ్యాపి హ్యాపి బర్త్ డేలు పాట సాహిత్యం
చిత్రం: సుస్వాగతం (1998) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: షణ్ముఖ శర్మ గానం: మణికిరన్ హ్యాపి హ్యాపి బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగ శుభాకాంక్షలందజేయుమా మిత్రమా ఆపలేని స్వేచ్చ వుంది అందినంత ఛాన్స్ వుంది అందుకోరా పుత్ర రత్నమా నేస్తమా జీవితానికే అర్ధం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే చిలిపి వయసు వరస తమకు తెలియద హ్యాపి హ్యాపీ ఓ ఓ హ్యాపి హ్యాపి బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగ శుభాకాంక్షలందజేయుమా మిత్రమా తెలియకడుగుతున్నాలే కంప్యూటరేమంటుంది పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేదంది విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది ప్రేమకధలు ఎప్పుడైన ఒకటే బ్రాండ్ ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్ అప్ టు డేట్ ట్రెండ్ మాది టోటల్ చేంజ్ పాత నీతులింక మాకు నో ఎక్స్చేంజ్ ఫ్రెండులాంటి పెద్దవాడి అనుభవాల సారమే శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే కలను వదిలి ఇలను తెలిసి నడుచుకో హ్యాపీ హ్యాపీ హ్యాపి హ్యాపి బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగ శుభాకాంక్షలందజేయుమా మిత్రమా సా సగమనిస సనిపమప గమప గమప గమప గమపని అయ్యయ్యయ్యయ్యో అయ్యో అయ్యయ్యయ్యో నిసనిసగ నిసనిసగ నిసనిస పనిపని మపనిసగ గజిబిజిగా గజిబిజిగా గజిబిజి గజిబిజి గజిబిజిగా మ్యూజిక్కా మ్యాజిక్కా మజా కాదు చాలంజీ బాపూజీ బాపూజీ దనేకులా మా వీధి నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా నేల విడిచి సామైతే టైం వేస్టురా ఈ ధీమా ముందు వెనుక గమనిస్తే విజయం నీది సుమా రోజా నవ్వు రమ్మంటున్న రోజు కదా తాకకుండా ఊరుకుంటే తప్పు కదా నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా చూడకుండా చెయ్యి వేస్తే ఒప్పు కదా ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులింక దక్కునా లక్ష్యమందకుండ లైఫుకర్ధమింక ఉండునా తెగువ తెలుపు గెలుపు మనకి దొరకగ హ్యాపి హ్యాపీ హ్యాపి హ్యాపి బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగ శుభాకాంక్షలందజేయుమా మిత్రమా ఆపలేని స్వేచ్చ వుంది అందినంత ఛాన్స్ వుంది అందుకోరా పుత్ర రత్నమా నేస్తమా జీవితానికే అర్ధం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే చిలిపి వయసు వరస తమకు తెలియద హ్యాపి హ్యాపీ ఓ ఓ హ్యాపి హ్యాపి బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగ శుభాకాంక్షలందజేయుమా మిత్రమా
సుస్వాగతం నవరాగమా పాట సాహిత్యం
చిత్రం: సుస్వాగతం (1998) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: షణ్ముఖ శర్మ గానం: హరిహరన్, చిత్ర తందాన తాననానా తందనానా తాననానా తందాన తాననానా తందనానా తాననానా సుస్వాగతం నవరాగమా పలికిందిలే ఎద సరిగమ ప్రియ దరహాసమ ప్రేమ ఇతిహాసమ నీ తొలి స్పర్శలో ఇంత సుఖ మైఖమ ఇది ప్రణయాలు చిగురించు శుభతరుణమా ఆ... ఆ... పనిస గానినిసా (2) పిందల్లే రాలే పువ్వా చిన్ని చిన్ని నవ్వులివ్వ నీకోసం ప్రేణం పెట్టే చిన్నవాడ్ని చేరవా సుస్వాగతం... నవరాగమా... అంతేలేని వేగంతోని ప్రేమేవస్తుంటే నేను ఆనకట్ట వేయలేనే ఆహ్వానిస్తుంటే పట్టే తప్పే విరహంలోనే మునిగిపోతుంటే ఇక క్షేమంగానే జీవిస్తా నీ చెయ్యందిస్తుంటే ఆ చేతులే నీకు పూల దండగా మెడలోన వేసి నీ జంట చేరనా నా చూపు సూత్రంగా ముడిపడగా నాజూకు చిత్రాల రాజ్యమేలనా మౌనమేమాని గానమై పలికే నా భావన ఆ... ఆ... పనిస గానినిసా (2) శిలలాంటి గుండెకోసం శిల్పమల్లే మారిపోయి చిత్రాల ప్రేమకోసం చక్కనైన వేళలో సుస్వాగతం... నవరాగమా... పపప ససస గప పపప ససస నిదప (2) సూరీడున్నాడమ్మా నిన్నే చూపడానికి రేయి ఉన్నాదమ్మా కలలో నిన్నే చేరడానికి మాట మనసు సిద్ధం నీకే ఇవ్వడానికి నా కళ్ళు పెదవి ఉన్నాయి నీతో నవ్వడానికి ఏనాడు చూశానో రూపు రేఖలు ఆనాడే రాశాను చూపులేఖలు ఏ రోజు లేవమ్మా ఇన్ని వింతలు ఈవేళ నాముందు ప్రేమ పుంతలు ఏడు వింతలను మించేవింత మనప్రేమే సుమా ఆ... ఆ... పనిస గానినిసా (2) వర్షించే పూలమాసం చిన్నవాడి ప్రేమకోసం అందాల నీలాకాశం అందుకున్న సంబరం సుస్వాగతం నవరాగమా పలికిందిలే ఎద సరిగమ ప్రియ దరహాసమ ప్రేమ ఇతిహాసమ నీ తొలి స్పర్శలో ఇంత సుఖ మైఖమ ఇది ప్రణయాలు చిగురించు శుభతరుణమా సుస్వాగతం... నవరాగమా...
అరె ఫిగరు మాట పక్కనెట్టు గురు గురూ పాట సాహిత్యం
చిత్రం: సుస్వాగతం (1998) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: సిరివెన్నెల గానం: మనో, యస్. ఏ. రాజ్ కుమార్ అరె ఫిగరు మాట పక్కనెట్టు గురు గురూ ఫ్రెండ్ తోటి మందుకొట్టు గురు గురూ లైఫ్ కున్న గొప్ప గిఫ్ట్ లోవ్వే గురూ లవ్ లేని లైఫ్ సుద్ద వేస్టే గురూ అటు చూస్తే లవ్ మత్తు ఇటు బాటిల్ గమ్మత్తు తీరిగ్గా మందేసి ఏసేద్దాం పై ఎత్తు అరె ప్రేమలోన పడ్డవాడు గురు గురూ బతికి బట్టకట్టలేదు గురు గురూ మత్తులోన మనసు కొద్ది సేపే గురూ మనసులోని ప్రేమ కరిగిపోదోయ్ గురూ అటు చూస్తే ఎగ్జామ్స్ ఇటు చూస్తే ఫ్రీ డ్రింక్స్ అయ్యయ్యో స్టూడెంట్స్ మీకెన్ని కస్టమ్స్ మందు తాగేస్తే మనిషి తూళ్తాడు మందు ఆపేస్తే ప్రభుత్వాలే కూలిపోతాయ్ అర్ యు స్యూర్ - ఎస్ బాస్ చరణం: 1 డే అండ్ నైట్ కష్టపడి పుస్తకాల్ని వెయ్యిసార్లు తిరగేద్దాం పేపర్లు లీక్ అయితే బోరుమంటు గుక్కపెట్టి ఏడ్చేద్దాం రామబ్రహ్మం ఒక్కడుంటే లక్షలాది పిల్లగాళ్ల కష్టమంత మట్టిపాలురా సోదరా ఉంది గురూ రీటెస్టు ఉంది గురూ వేస్ట్ గురూ అది ఓ రొష్టు గురూ కంప్యూటర్లో మిస్ఫీడైతే బ్రతుకే చీకటి మూత గురూ చీటికీ మాటికి ఎగ్జామ్స్ వస్తే మెదడే మోడై పోవుగురూ చదువుకున్న వాటికంటే చదువులేని వాడేమిన్న లోక రీతి చూడు సోదరా అవును గురూ నువ్వే రైట్ గురూ పాస్ ఐనా అదే మన ఫేటు గురూ అరె ఫిగరు మాట పక్కనెట్టు గురు గురూ ఫ్రెండ్ తోటి మందుకొట్టు గురు గురూ లైఫ్ కున్న గొప్ప గిఫ్ట్ లోవ్వే గురూ లవ్ లేని లైఫ్ సుద్ద వేస్టే గురూ చరణం: 2 అరె మస్తీ చెయ్యర మాస్తానా మస్తుగ ఉంది మైఖాన మస్తీ చెయ్యర మాస్తానా మస్తుగ ఉంది మైఖాన ఉరికనే మందేస్తూ మత్తులోన మునగమాకు ఓ బ్రదరు గోల్డ్ మెడలు తెచ్చుకున్న గవర్నమెంట్ జాబ్ రాదు ఏ క్లవరు అడ్డదారి తొక్కినోళ్లు అందళాలు ఎక్కుతుంటే సిన్సియర్ కి చోటు ఏదిరా సోదరా తప్పు గురూ - ఎలాగో చెప్పు గురూ మనసుంటే మార్గం ఉంది గురూ స్వార్ధం ముదిరిన ఈ దేశంలో ప్రతిభకు స్థానం లేదు గురూ తలలను వంచుకు పోయే యువకులు మనుషులు కానే కాదు గురూ ఊరు మీద కోపమొచ్చి చూరుకింద కూలబడితే లైఫ్ కింక అర్ధమేందిరా నిరాశే వద్దుగురు టుమారో మనది గురూ అవును గురూ టుడే మందెయ్యి గురూ హా అరె ఫిగరు మాట పక్కనెట్టు గురు గురూ ఫ్రెండ్ తోటి మందుకొట్టు గురు గురూ లైఫ్ కున్న గొప్ప గిఫ్ట్ లోవ్వే గురూ లవ్ లేని లైఫ్ సుద్ద వేస్టే గురూ అటు చూస్తే లవ్ మత్తు ఇటు బాటిల్ గమ్మత్తు తీరిగ్గా మందేసి ఏసేద్దాం పై ఎత్తు అరె ప్రేమలోన పడ్డవాడు గురు గురూ బతికి బట్టకట్టలేదు గురు గురూ మత్తులోన మనసు కొద్ది సేపే గురూ మనసులోని ప్రేమ కరిగిపోదోయ్ గురూ అటు చూస్తే ఎగ్జామ్స్ ఇటు చూస్తే ఫ్రీ డ్రింక్స్ అయ్యయ్యో స్టూడెంట్స్ మీకెన్ని కస్టమ్స్
కం కం అని వెల్కమ్ అంటూ పాట సాహిత్యం
చిత్రం: సుస్వాగతం (1998) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: షణ్ముఖ శర్మ గానం: ఎస్. ఏ. రాజ్ కుమార్, అనురాధ శ్రీరాం కం కం అని వెల్కమ్ అంటూ
ఆలయాన హారతిలో పాట సాహిత్యం
చిత్రం: సుస్వాగతం (1998) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్. పి. బాలు ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకి ఇవ్వమ్మా నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం ఎదర ఉంది నడిరేయన్నది ఈ సంధ్యా సమయం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం సూర్యబింబమే అస్తమించనిదె మేలుకోని కల కోసం కళ్ళు మూసుకొని కలవరించెనే కంటిపాప పాపం ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా రేయిచాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం