చిత్రం: గిల్లికజ్జాలు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, సునీత
నటీనటులు: శ్రీకాంత్, మీనా , రాశి
దర్శకత్వం: ముప్పలనేని శివ
నిర్మాత: పి. ఉషారాణి
విడుదల తేది: 23.06.1998
ప్రపంచమా క్షమించుమా మాకు నీతో పనేమీ లేదమ్మా
వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా
కాంచన కాంతులు భామ నీ కంచెలు తెంచుకు రామ్మా
కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచనె మా చిరునామా
ఈ ఏకాంతం మనదే స్నేహమా...
వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా
కుడి ఎడమలు ఎరగక మన కథ సాగేనంటా
జత కుదరని ఎదలకు పెరుగగ ఏదో మంటా
ఎవరెవరితో ఎద రగిలితే అది మనకేమంటా
కనులడిగిన కలదను తడుముతు పోదామంటా
మనకు మనకు గల ముచ్చట మరునెవరు చోటెచ్చట
ముడులు విడని బిగి కౌగిట తగు మనకు దొరికేనట
మరి ఆలస్యం ఎంటటా...
ప్రపంచమా క్షమించుమా మాకు నీతో పనేమీ లేదమ్మా
తెరమరుగున నిలువక చొరవగ రారమ్మంటా
అరమరికలు తెలియని చెలిమిని అందిమ్మంటా
కలవర పడు గుస గుస కబురును విన్నానంటా
మనసెరిగిన వరుసకు సరసనె ఉన్నానంటా
ఉరుము వెనుక జడి వానలా ఈ విరహమంత కలిగేదెలా
దిగులు పడకు నువ్వంతలా తొలి వలపు పెగిలె సంకెలా
మరి దూరంగా ఉంటే ఎలా...
వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా
కాంచన కాంతులు భామ నీ కంచెలు తెంచుకు రామ్మా
కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచనె మా చిరునామా
ఈ ఏకాంతం మనదే స్నేహమా...
************ ************ *************
చిత్రం: గిల్లికజ్జాలు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర
మా ఇల్లే చంద్రనివాసం మంచితనపు రాణివాసం
మమకారం మా ముంగిలిలో మధుమాసం
మా ఇల్లే చంద్రనివాసం మంచితనపు రాణివాసం
మమకారం మా ముంగిలిలో మధుమాసం
కన్నవారి దీవెనలే అత్తవారి ఆధరణై
నూరేళ్ళ వరమైన ప్రేమాలయం
ఎన్నెన్నో జన్మల పూజా ఫలం
మా ఇల్లే చంద్రనివాసం మంచితనపు రాణివాసం
మమకారం మా ముంగిలిలో మధుమాసం
సున్నితంగా సొగసరి సిగవిరి విచ్చింది సరసకొచ్చింది వరస కలపగా
సామిరంగా గడసరి మగసిరి నచ్చింది చెలియ వచ్చింది చెలిమి తెలుపగా
కల్యాణ స్వరముల సాక్షిగా కళ్యాణి గుస గుస లాడగా
ఉలుకే పడకా కలిగిన అలజడి చెలి ఒడినడగగ
అందాల శ్రీమతి గారు ఆపకండి నా జోరు
కౌగిట్లో సేవలెవ్వరు చేస్తారు
అయ్యయ్యో ఆయనగారు ఎంతమంచి వారు మీరు
ఏకాంతం చూసి వింతలు చేస్తారు
అమ్మదొంగా పెనిమిటి పదవిని ఇచ్చాక విడిచి పోనుగా
నమ్మకంగా మనువున ముడిపడి ఎంచక్కా బిగిసి పొయ్యాక తగువు పెంచకా
పెద్దాళ్ళు ముచ్చట్లు తీర్చగా ఈ గిల్లి కజ్జాలు వేడుక
వెనకే పడకే నలుగురి ఎదురుగ నలుసుగ చూడక
మా ఇల్లే చంద్రనివాసం మంచితనపు రాణివాసం
మమకారం మా ముంగిలిలో మధుమాసం
మా ఇల్లే చంద్రనివాసం మంచితనపు రాణివాసం
మమకారం మా ముంగిలిలో మధుమాసం
కన్నవారి దీవెనలే అత్తవారి ఆధరణై
నూరేళ్ళ వరమైన ప్రేమాలయం
ఎన్నెన్నో జన్మల పూజా ఫలం
మా ఇల్లే చంద్రనివాసం మంచితనపు రాణివాసం
మమకారం మా ముంగిలిలో మధుమాసం
************ ************ *************
చిత్రం: గిల్లికజ్జాలు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర
ఓ ఓ ఓ ఓ...
బంగరు బొమ్మా నీ అనురాగం నాకు సొంతమా
అల్లరి కన్నా ఈ అనుమానం నీకు న్యాయమా
ఇది కరగని కల అనుకోన
కల కాదని ఎదురుగ ఉన్నా
ఒళ్ళో ఇలా వాలిన పెన్నిధి వద్దనగలనా
వెయ్యేళ్లిలా నీ పద సన్నిధి స్వర్గమె అననా
బంగరు బొమ్మా నీ అనురాగం నాకు సొంతమా
అల్లరి కన్నా ఈ అనుమానం నీకు న్యాయమా
హరివిల్లె తరునిగ మారి దివి నుంచి దిగొచ్చెనా
సుకుమారి కుసమకుమారి నను కోరి తపించెనా
మెరుపల్లె చొరవగ చేరి వరమాలై వరించదా
చినుకల్లే చిలిపిగ గిల్లి వరదల్లె అల్లేయనా
అందాల వెల్లువ నాపే సంగ్రాన్నై స్వాగతమనన
అందిస్తా... విందిస్తా...
జయించనా నీ హృదయాన్నే ప్రియ వదన
జపించనా నీ పేరే మధన...
బంగరు బొమ్మా నీ అనురాగం నాకు సొంతమా
అల్లరి కన్నా ఈ అనుమానం నీకు న్యాయమా
గత జన్మల పరిచయమేదో చేసింది నిరీక్షణా
అదికాస్త పరిణయమైతే నీ నీడై తరించనా
చెలి సంకెలు నను రమ్మంటే చెరసాలై బిగించినా
ఋణమేదో జతపడమంటే మనసారా తపించనా
ప్రణాయాల స్వరముల వాన అడిగింది యవ్వన వీణ
కురిపిస్తా... మురిపిస్తా....
ఫలించునా నోచిన నోములు నీ వలన
లాలించనా వలపుల ఒడిలోన...
బంగరు బొమ్మా నీ అనురాగం నాకు సొంతమా
అల్లరి కన్నా ఈ అనుమానం నీకు న్యాయమా
ఇది కరగని కల అనుకోన
కల కాదని ఎదురుగ ఉన్నా
ఒళ్ళో ఇలా వాలిన పెన్నిధి వద్దనగలనా
వెయ్యేళ్లిలా నీ పద సన్నిధి స్వర్గమె అననా
************ ************ *************
చిత్రం: గిల్లికజ్జాలు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర
నింగి నేల ఉయ్యాలా
నువ్వు నేను ఊగాలా
జత సంగీతాల జంపాల
జగమంతా మైకం నింపాల
చలి సందెగాలి తందనాల తాళం వెయ్యాలా
నింగి నేల ఉయ్యాలా
నువ్వు నేను ఊగాలా
కొండకోనల గుండు కోయిల
కుహు కుహు పులకగా నీ పలకరింపులా
ఎండవేళలా వెండి వానల
మిల మిల చిలకగ చిరునవ్వుల కిల కిల
కమ్మని సైగల వేగం అమ్మడు పువ్వును తాకి
లోపల దాగిన ఊసుల వైనం బయటకి లాగి చెలరేగాల చిలిపి తనాల
కన్నుల విందుల చేసిన అన్నుల మిన్నును చూసి
ఒంటరి తుంటరి ఆశలు తొందర తొందర చేసి
తరిమే వేళ నిను చేరేలా
మన ప్రేమ యాత్ర సాగక సిరివెన్నెల పాటలా
నింగి నేల ఉయ్యాలా
నువ్వు నేను ఊగాలా
సోకు తానుల రాకుమారిలా
కన్నె కల నువ్వు అలా నను కవ్విస్తే ఎలా
కోటి తారలా కాంతి ధారలా
తళ తళ ఊహల నను కమ్మేస్తే ఎలా
బంధువులందరి ముందర బంగరు బంధనమేసి
అందిన సుందరి ఒంటికి చందన సేవలు చేసి లాలించనా రస లీలగా
అల్లరి చిందులు వేసిన పిల్లడి వైఖరి చూసి
మల్లెల మంచం వేసి మెల్లగ మచ్చిక చేసి
పాలించినా మహారాణిలా
మన కయ్యమంత చూసి కందిపోదా వెన్నెలా
నింగి నేల ఉయ్యాలా
నువ్వు నేను ఊగాలా
జత సంగీతాల జంపాల
జగమంతా మైకం నింపాల
చలి సందెగాలి తందనాల తాళం వెయ్యాలా