Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Preyasi Raave (1999)




చిత్రం: ప్రేయసి రావే (1999)
సంగీతం: యమ్.యమ్. శ్రీలేఖ
నటీనటులు: శ్రీకాంత్, రాశి, బబ్లూ పృధ్విరాజ్, సంఘవి
దర్శకత్వం: చంద్రమహేష్
నిర్మాత: డా౹౹ డి. రామానాయుడు
విడుదల తేది: 19.11.1999



Songs List:



మేనకవో ప్రియ కానుకవో పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేయసి రావే (1999)
సంగీతం: యమ్.యమ్. శ్రీలేఖ
సాహిత్యం: వెనిగళ్ల రాంబాబు
గానం: యస్.పి. బాలు, యమ్.యమ్. శ్రీలేఖ

మేనకవో ప్రియ కానుకవో
అలరించే అభిసారిఖావో
మురిపించవే మరిపించవే పరువాల స్వర్గసీమ
అందించు ప్రేమా చిందించు ప్రేమా
మేనకనే ప్రియ కానుకనే
అలరించే అభిసారికనే
నిలిచిందిలే నీ చంతనే సరసాల స్వప్నసీమ
చిందించు ప్రేమా  అందించు ప్రేమా 

అందిఅందని చందమామ 
ఎన్ని అందాలు నీలో దాచావమ్మా
చిందే అందాల విందుకోసం
మకరందాలు నీకై దాచానయ్య
నా రాణివై పారాణివై అలివేణివై రావే
తెరతీయవా దరిచేరవా చిరుగాలివై నీవే
సరసాలనే శృతిచేయగా సరదాగ సాగుదామా
చిందించు ప్రేమా  అందించు ప్రేమా 

మేనకవో ప్రియ కానుకవో
అలరించే అభిసారికవో
మురిపించవే మురిపించవే పరువాల స్వర్గసీమ
అందించు ప్రేమా 
చిందించు ప్రేమా

నిన్నే ఈ కన్నె కోరుకుంది తన చిన్నారి మనసే నేదంది
నీమీద ఆశపెంచుకున్నా ఇక నీతోనే జీవితమనుకున్నా
చెలి గుండెలో కొలువుండిపో తొలిప్రేమలా నీవే
పులకింతవై పూబంతివై ఓ ప్రేయసి రావే
ఆకాశమే మనకోసమే సృష్టించె ప్రాణయలోకం

అందించు ప్రేమా చిందించు ప్రేమా
మేనకనే ప్రియ కానుకనే
అలరించే అభిసారికనే
మురిపించవే మరిపించవే పరువాల స్వర్గసీమ
అందించు ప్రేమా 
చిందించు ప్రేమా



నీ కోసం నీ కోసం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేయసి రావే (1999)
సంగీతం: యమ్.యమ్. శ్రీలేఖ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, చిత్ర

నీ కోసం నీ కోసం జీవించా చిలకా
నా ప్రాణం నీ వేనే మణితునకా
నా కోసం నా కోసం నిన్నే నా జతగా 
ఏ దైవం పంపేనో బహుమతిగా
నిన్నూ నన్నూ పెనవేసే ప్రేమే సాక్షిగా
కన్నూ కన్నూ కలబోసే కలలే పండగా
మిన్నూ  మన్నూ ఏకంచేద్దాం హరివిల్లుగా

నా కోసం నా కోసం నిన్నే నా జతగా 
ఏ దైవం పంపేనో బహుమతిగా

చరణం: 1
నా ఊపిరిలో ఉయ్యలేసి నూరేళ్ళ కాలం 
నిను లాలించాలి వెచ్చని కలల్ని పంచాలి
నీ స్నేహంలో స్నానం చేసి నా కన్నే దేహం
తరించిపోవాలి తీయని స్వరాలు పాడాలి
పరులకు ఎన్నడు తెలియని చల్లని చలిమితో 
ఈ నా అనురాగం నీ గుండెనే మీటనీ
విరహపు వేడికి కనబడక విడవని జోడుగ ముడి పడగా 
అల్లే ఈ బంధం కలకాలముండి పోనీ

నీ కోసం నీ కోసం జీవించా చిలకా 
నా ప్రాణం నీ వేనే మణితునకా

చరణం: 2
కాసేపైన కల్లోనైనా నీ ఊహ లేని క్షణాలు ఉన్నాయా 
ఒంటరి తనాలు ఉన్నాయా
ఏం చేస్తున్నా ఎటు చూస్తున్నా నీ రూపు లోనే 
ప్రతీది చూస్తున్నా నిన్నే ప్రపంచమంటున్నా
మమతలు చిందిన మధువులు విందుకు 
అతిధులుగా ఆహ్వానిద్దాం ఆరారు కాలాలనీ
అలలకు అందని జాబిలిని వెన్నెల వానగ దించుకొని
గెలిచే సంద్రంలా సంతోషం పొంగిపోనీ

నా కోసం నా కోసం నిన్నే నా జతగా 
ఏ దైవం పంపేనో బహుమతిగా
నిన్నూ నన్నూ పెనవేసే ప్రేమే సాక్షిగా
కన్నూ కన్నూ కలబోసే కలలే పండగా
మిన్నూ  మన్నూ ఏకంచేద్దాం హరివిల్లుగా
ఆఆఆ ఆఆఆ ఆఆఆ ఆఆఆ ఆఆఆ ఆఆఆ ఆఆఆ
ఆఆఆ ఆఆఆ ఆఆఆ ఆఆఆ ఆఆఆ ఆఆఆ ఆఆఆ



ప్రేమంటే నేడు తెలిసినాది పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేయసి రావే (1999)
సంగీతం: యమ్.యమ్. శ్రీలేఖ
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యస్.పి. బాలు, చిత్ర

ప్రేమంటే నేడు తెలిసినాది




ఓ నా ప్రేమా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేయసి రావే (1999)
సంగీతం: యమ్.యమ్. శ్రీలేఖ
సాహిత్యం: ఘంటాడి కృష్ణ 
గానం: యస్.పి. బాలు, చిత్ర

ఓ నా ప్రేమా



తెంచుకుంటే తెగిపోతుందా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేయసి రావే (1999)
సంగీతం: యమ్.యమ్. శ్రీలేఖ
సాహిత్యం: వెన్నెలకంటి 
గానం: యస్.పి. బాలు

తెంచుకుంటే తెగిపోతుందా



వెయిటింగ్ టు కిస్ యు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేయసి రావే (1999)
సంగీతం: యమ్.యమ్. శ్రీలేఖ
సాహిత్యం:  చంద్రబోస్
గానం: యస్.పి. బాలు, సుజాత 

వెయిటింగ్ టు కిస్ యు




We Have Freedom పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేయసి రావే (1999)
సంగీతం: యమ్.యమ్. శ్రీలేఖ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్.యమ్. శ్రీలేఖ

We Have Freedom

Most Recent

Default