చిత్రం: పోస్ట్ మాన్ (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: కె. జే. యేసుదాసు
నటీనటులు: మోహన్ బాబు, సౌందర్య, రాశి
దర్శకత్వం: ముప్పలనేని శివ
నిర్మాత: మోహన్ బాబు
విడుదల తేది: 13.01.2000
రాజహంస చీర కట్టి రాజా గుమ్మాది
రాణి గాజులు తొడగాలింకా రావే అమ్మాడి
రాజహంస చీర కట్టి రాజా గుమ్మాది
రాణి గాజులు తొడగాలింకా రావే అమ్మాడి
పన్నీటిలో పసుపు కలిపి
పాదాలకు పూయండమ్మా
ఈ మేని కురులకు సాంబ్రాని వేయండి
ఈ పాల బుగ్గలకు సిరి చుక్క దిద్దండి
ఈ జన్మ మరు జన్మ మా బావే నీకు తోడు నీడమ్మా
రాజహంస చీర కట్టి రాజా గుమ్మాది
రాణి గాజులు తొడగాలింకా రావే అమ్మాడి
అరవిందాలంటి కాళ్ళు అలసి పోకుండా
అరచేతులపైన నిన్ను నడిపించే వాడు
చూడమ్మా నీ వాడమ్మ
కడిగిన ముత్యమంటి మంచి మనసు ఉన్నోడు
కళ్ళల్లోనా నీకు ఇల్లు కట్టుకున్నోడు
నీ పెదవిపైన చిరునవ్వు చదరిపోకుండ చూసుకుంటాను
క్షణమైన నీకు ఎడబాటు లేక ఎదలోన దాచుకుంటాను
నీ కంటి చెమ్మ రాకుండా కాపాడుకుంటా రావమ్మా
పందిట్లో నీకోసం ఆ పెళ్ళి పీటలు సిద్దంగున్నాయి ఓ ఓ ఓ
రాజహంస చీర కట్టి రాజా గుమ్మాది
రాణి గాజులు తొడగాలింకా రావే అమ్మాడి
ఆ భగవంతుడ్ని నేను మీలో చూస్తున్నా
ఈ జన్మకు మీకు ఎంతో రుణపడి పోతున్నా
చాలండి ఇంక మీ చలవా
పుట్టిన ఫలమే లేని ఇంక నీటి బొట్టుకు
పసుపు తాడు కట్టి నుదుట బొట్టు ఎందుకు
ఎవరెవరి అడుగులెటువైవు పడునో ఎరిగింది లేరమ్మా
ఏ నల్లపూసలే పసుపు తాడు జత పడునో తెలిసినది ఆ బ్రహ్మ
విధి చేతిలోని పావురం ఎదురాడలేని జీవులం
నీవైన నేనైనా ఆ దేవుడు తీర్పు మన్నించాలమ్మా
రాజహంస వరుని మెడలో దండ వేస్తుంది
రంగ రంగ వైభోగంగా పెళ్లి అవుతుంది
రాజహంస వరుని మెడలో దండ వేస్తుంది
రంగ రంగ వైభోగంగా పెళ్లి అవుతుంది
********* ********* ********
చిత్రం: పోస్ట్ మాన్ (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: ఉడిత్ నారాయణ్, చిత్ర
లాహిరి లాహిరి లాహిరి
నన్ను చేరుకుంది చెలి మాధురి
ఆహా లాహిరి లాహిరి లాహిరి
నన్ను చేరుకుంది చెలి మాధురి
లాహిరి లాహిరి లాహిరి
నిన్ను అల్లుకుంది నా ఊపిరి
వేకువే జాలువారింది గుండెల్లో
వెన్నలే తెల్లవారింది కళ్లల్లో
కోయిలై ఎదురు చూసింది నేనని
కోవెలై ఎదురు వచ్చింది నీవని
ఆనంద భాష్పలలో చూపుల చుక్కలతో
పోల్చుకున్నాను నీ కంటి పాపల్లో
ఇన్నాలు కలగన్న నా ప్రేమనీ
నీ వోల్లోన వాలెటి పూవ్వుంటి నీదేనినీ ఓ...
లాహిరి లాహిరి లాహిరి
నన్ను చేరుకుంది చెలి మాధురి
లాహిరి లాహిరి లాహిరి
నిన్ను అల్లుకుంది నా ఊపిరి
ఓ ప్రేమా నీవేనా నిన్ను పిలిచే చిరునామా
నీ లేఖ చదివాకా తెలిసింది వలపు తీపీ
పూల మొక్కలు మూగ రెప్పలు
తెరచినప్పుడు ప్రేమ చప్పుడు
పాల మనసులో నీవు తియ్యగా
కదిలినప్పుడు ప్రేమ తప్పదు
నీవే హరిచందనా గిరినందనా బిరివందనా
నీకే అభినందనా అనుబంధమా రుణబంధమా
తెలుసుకున్నాను నీ వెండి అందెల్లో
నా గుండె సవ్వడ్లు ఉన్నాయనీ
నీ నీడలో గడించు నా కది నూరేండ్లనీ
లాహిరి లాహిరి లాహిరి
నన్ను చేరుకుంది చెలి మాధురి
లాహిరి లాహిరి లాహిరి
నిన్ను అల్లుకుంది నా ఊపిరి
ఆ మేఘం చలువెంతో తెలిపింది నీ దేహం
నా రాగం లోలోనా వెలిగెేది నీ స్నేహం
నీవు నిద్రలో చిన్ని పెదవులు
కదిలినప్పుడు చిన్ని చప్పుడు
కళల ఏరులో నీవు నవాల వచ్చినప్పడు ప్రేమ తప్పదు
రావే దీవి కానుక ప్రియమాలికా మునిబాలికా
నీవే నవకాంతిలా ఛామంతిలా శకుంతలా
మిన్ను సెలయేరు దిగి వచ్చి
నీ లాగా అవతరమెత్తింది నా కోసమే
ఏదీ ఏమైనా నిన్ను నన్ను కలిపింది ఆ దైవమే ఓ...
లాహిరి లాహిరి లాహిరి
నన్ను చేరుకుంది చెలి మాధురి
లాహిరి లాహిరి లాహిరి
నిన్ను అల్లుకుంది నా ఊపిరి
********* ********* ********
చిత్రం: పోస్ట్ మాన్ (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: కె. జే. యేసుదాసు, సుజాత
అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ
అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ
సాయంత్ర సంధ్య వేళ నీవే
నా ప్రేమ ముగ్గులోకి రావే
ఆనతివ్వగా నా మోహనాన్ని హారతవ్వనా ప్రియా
అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ
ఆ ఛైత్ర మాసాలె మన ప్రేమ సాక్ష్యాలై
విడరాని బందమై పోగా
నా తోడు నీడల్లె నా కంటి పాపల్లె
గుండెల్లో నిన్ను దాచుకోన
నిన్నే చేరుకోన ఒడిలొ వాలి పోన
నా శ్వాసలో నిశ్వాస నేనై
నా జీవితాన ఆశ నీవై నా చేయినందుకో రావా
అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ
ఆనతివ్వగా నా మోహనాన్ని హారతవ్వనా ప్రియా
కార్తీక వెన్నెల్లో ఎకాంత వేళల్లో
నీడల్లె నిన్ను చేరుకోన
నీ రూపే కళ్ళల్లొ కదలాడె వేళల్లొ
నీ చంటి పాపనై పోన
జగమె మురిసిపోదా ఒకటై కలసి పోగా
ఆకాశమె అక్షింతలేయ
భూమాతయే దీవించ రాదా
ఆ మూడు ముళ్ళు వేసేనా
ఆనతివ్వగా నా మోహనాన్ని హారతవ్వనా ప్రియా
అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ
సాయంత్ర సంధ్య వేళ నీవే
నా ప్రేమ ముగ్గులోకి రావే
ఆనతివ్వగా నా మోహనాన్ని హారతవ్వనా ప్రియా
అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ
********* ********* ********
చిత్రం: పోస్ట్ మాన్ (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: ఉడిత్ నారాయణ్, స్వర్ణలత
బావ బావ లగ్గమెట్టుకోర
బాస చేసి బంతులాడుకోర
ఓసి భామ బాసికాలు తేనా
బిందెలోన ఉంగరాలు తియ్నా
ఆరడుగుల నీ తోడుగా ఏడడుగులేయన
నీ నడుములో లే మడతలో నా ముడుపు తీయనా
ఓ జల్ది జల్ది జల్ది షాదీ చేసుకుందామా
ఓ అల్లి బిల్లి గిల్లి కజ్జాలాడు కుందామా
దండలు మార్చుకున్న హే హే హే
బావ బావ లగ్గమెట్టుకోర
బిందెలోన ఉంగరాలు తియ్నా
హే గుండెలోన నేను ఉండబోతే
ఎద నిండా అందాలే చోటే లేదే
ఒట్టు బావ గుండె నిండ నువే
వదిగున్నావని పొంకం వెలుపలి కొచ్చే
భామా వచ్చి పదహారు కళలు ఇచ్చి చూపించు రుచి
బావా ఉంది పద్దెనిమిదేళ్ల నుండి నీ కొరకు పిచ్చి
ఇరవైనాలు గంటాల నా చుట్టూర
తిరుగుతావు ఆగిపోని గడియారంలా
పెద్దముళ్లు చిన్నముళ్లు కలిసే వేళ
కల్లోన నీ అల్లరి ఎలా చెప్పాలా
మరి జల్ది జల్ది జల్ది జల్ది లిప్స్ మిలోన
సిరి అమ్మా నాన్న తోటి డేట్ ఫిక్స్ కావాలా
ముద్దులు పెట్టకు నాకే ఏ ఏ ఏ
బావ బావ లగ్గమెట్టుకోర
బిందెలోన ఉంగరాలు తియ్నా
గట్టు మీద నువ్వు వస్తవుంటే
గరికల్లే నీ పాదం ముద్దాడేనా
బుగ్గమీద తిష్ట వేసుకునే
మెరిసేటి నీ పచ్చ బొట్టై లేదా
బావా పస్తు ఎన్నాళ్లు ఇంక పుస్తి కట్టేయి బెస్ట్
భామా పెళ్ళి కాకున్న ముందు ఒళ్ళో కొచ్చేయి మస్తు
ఇన్లాండ్ లెటర్ లాగ నన్ను విప్పకు
లోన దాచుకున్న ఓనమాలు చూడకు
తెలిగ్రాము లాగ నిన్ను అందుకుంటాలే
పులకరింత పట్నానికి చేరుస్తాలే
నా కాలి మెట్టి పెట్టావంటే మొత్తం ఇస్తాలే
అరె అంతదాకా నేను ఎలా తట్టుకోవాలే
గడిపే ఊహాలతోనే ఏ ఏ ఏ
బావ బావ లగ్గమెట్టుకోర
బాస చేసి బంతులాడుకోర
హే ఓసి భామ బాసికాలు తేనా
బిందెలోన ఉంగరాలు తియ్నా
ఆరడుగుల నీ తోడుగా ఏడడుగులేయన
నీ నడుములో లే మడతలో నా ముడుపు తీయనా
ఓ జల్ది జల్ది జల్ది షాదీ చేసుకుందామా
ఓ అల్లి బిల్లి గిల్లి కజ్జాలాడు కుందామా
దండలు మార్చుకున్న హే హే హే హే
బావ బావ లగ్గమెట్టుకోర
బిందెలోన ఉంగరాలు తియ్నా
********* ********* ********
చిత్రం: పోస్ట్ మాన్ (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: ఉడిత్ నారాయణ్, స్వర్ణలత
సార్ పోస్ట్...
మేడమ్ పోస్ట్...
మనుషుల్లో జెంటిల్ మాన్ పోస్ట్ మాన్
జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మాన్
మనుషుల్లో జెంటిల్ మాన్ పోస్ట్ మాన్
జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మాన్
పోస్ట్ మాన్ లేని ఊరు వేస్టురా కన్నా
నీ బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ మాన్ తెలుసుకో నాన్న
పట్నాలకైనా పల్లెలకైనా వార్తలెన్నో మోసుకొచ్చే
వారధేరా పోస్ట్ మాన్ సారధేరా ఈ పోస్ట్ మాన్
మనుషుల్లో జెంటిల్ మాన్ పోస్ట్ మాన్
జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మాన్
రామయ్య ఉంగరాన్ని సీతమ్మకిచ్చిన
హనుమానేరా మొదటి పోస్ట్ మాన్
ముల్లోకాల వార్తలెన్నో అక్కడకిక్కడ లింక్ పెట్టిన
నారధుడేరా మేటి పోస్ట్ మాన్
రాజు రాణుల ప్రేమపురాణం
రాజమహేంద్రం కోట రహస్యం
మేఘాలలో వేగాలతో
రెక్కలు చాటున భద్రం చేసి
గమ్యం చేర్చిన వార్త విహారి
పావురమేరా స్పీడు పోస్ట్ మాన్
భూగోళం మీద ఉన్న ప్రతి ఒకరితోను
ఉత్తర బంధం ఉన్న ఉత్తముడేరా
ప్రేమ పెళ్ళి అనుబంధాలకి
మానవ జీవన సంబంధాలకి
ఉత్తరమేసి ముందుకు నడిపే వాడు
కులము మతము పట్టనివాడు
పేద గొప్ప చూడని వాడు
సరిహద్దుల్లో సైన్యానికి ప్రేమ పెద్దలు పంచేవాడు
ప్రజలందరికి చుట్టము వీడు
సహనము తోనే రోజు సాగేవాడు
శుభము జయము మీకు అందిస్తాడు
ఏ హే మనుషుల్లో జెంటిల్ మాన్ పోస్ట్ మాన్
జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మాన్
మనుషుల్లో జెంటిల్ మాన్ పోస్ట్ మాన్
జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మాన్
పోస్ట్ మాన్ లేని ఊరు వేస్టురా కన్నా
నీ బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ మాన్ తెలుసుకో నాన్న
పట్నాలకైనా పల్లెలకైనా వార్తలెన్నో మోసుకొచ్చే
వారధేరా పోస్ట్ మాన్ సారధేరా ఈ పోస్ట్ మాన్
హే హే...
********* ********* ********
చిత్రం: పోస్ట్ మాన్ (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: కె. జే. యేసుదాసు, చిత్ర
కు కు కు కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ
కమ్మనైన కబురే తేవమ్మా
గు గు గు గోరువంక ఇన్ని మాటలెందుకింక
గూటిలోని చోటే నీదమ్మా
ఏ మనసు తొలిసారి కలిసిందో ఎవరంటే తెలిసిందో ఇది ప్రేమది
ఏ జంట మలిసారి వలచిందో బదులిమ్మని అడిగిందో
ఆ ప్రేమని
వీచే గాలి చల్లదనాలు దీవెనలేనంటా
పూచే పువ్వై నిదురించేది నీ ఒడిలోనంటా
కు కు కు కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ
కమ్మనైన కబురే తేవమ్మా
ఆరు రుతువుల నింగి తోటలో
తోటమాలికి ఈ తొందరెందుకో
తొడునీడగా చేయి వీడక
బాటసారిని తీరాన చేర్చుకో
నీలాల నింగి ఆ తారలన్ని
ఏ ప్రేమ చేసిన చిరు సంతకం
జతగా ఓ ప్రేమ కథగా
ఎన్నేళ్ల కైనా ఉందాములే...
ఎన్నో జన్మల అనుబంధాలే హారతులవ్వాలి
నవ్వే నువ్వై నువ్వే నేనై ఒకటై పోవాలి
కు కు కు కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ
కమ్మనైన కబురే తేవమ్మా
గు గు గు గోరువంక ఇన్ని మాటలెందుకింక
గూటిలోని చోటే నీదమ్మా
ఇంద్ర దనసులో ఏడు రంగులు
పల్లవించని నీ మేని సొంపులో
తాజ్మహల్ లో ఉన్న వైభవం
తొంగి చూడని తొలి ప్రేమలేఖలు
నీ మాటలన్ని నా పాటలైతే
నిను దాచుకోన నా కవితగా
పలికే నా పాటలోన కలకాలముంటా నీ ప్రేమనై
కలిసి ముందుకు సాగేటందుకు అడుగులు కలపాలి
ముద్దు ముచ్చట తీరేటందుకు ముడులను వేయాలి
కు కు కు కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ
కమ్మనైన కబురే తేవమ్మా
గు గు గు గోరువంక ఇన్ని మాటలెందుకింక
గూటిలోని చోటే నీదమ్మా