Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bhadrachalam (2001)




చిత్రం: భద్రాచలం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: శ్రీహరి, సింధు మీనన్
దర్శకత్వం: యన్. శంకర్
నిర్మాత: మేడికొండ మురళీకృష్ణ
విడుదల తేది: 06.12.2001



Songs List:



ఇదే నా పల్లెటూరు పాట సాహిత్యం

 
చిత్రం: భద్రాచలం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: వందేమాతరం శ్రీనివాస్, ఉష

ఇదే నా పల్లెటూరు ఇదే నా తల్లిగారు
మావూరి పాడిపంట రాములోరి దీవెనంటా
తల్లీ గోదావరి నీళ్లు కడిగే సీతమ్మ పాదాలు

ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా హాయ్ హాయ్ హాయ్... 

చరణం: 1
రామునికి బాణమొకటే 
భార్య సీతమ్మ ఒకటి
ఆ రాముడంటి కొడకు 
ఇంటింటా ఉంటే ఒకడు

ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా జోయ్ జోయ్ జోయ్...

ఒక దేవుడే తనకు ఒక ధర్మమే తనది
హనుమంతుడే మనకు ఆదర్శమే ఐతే

ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా హాయ్ హాయ్ హాయ్... 

చరణం: 2
తొలకరిలో వానచుక్క 
రుచిచూస్తే తేనెచుక్క
భూమిపై మోముపైన 
చిన్ని గరిక నవ్వుతుంటే

ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా జోయ్ జోయ్ జోయ్...

ఆలమంద పాలధార 
మీటుతున్నదో సితార
కడుపునిండ పాలు తాగి లేగదూడలాడుతుంటే

ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా హాయ్ హాయ్ హాయ్....




ఓ ఓ చెలియా పాట సాహిత్యం

 
చిత్రం: భద్రాచలం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: కుమార్ సాను, స్వర్ణలత

ఓ ఓ చెలియా



కుడ కుడడ రోడ్డులో పిల్ల ఉంది పాట సాహిత్యం

 
చిత్రం: భద్రాచలం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: వేటూరి
గానం: ఉదిత్ నారాయణ్, స్వర్ణలత

కుడ కుడడ రోడ్డులో పిల్ల ఉంది
అది రానంటుంది నన్నే రమ్మంది





చేనేత చీరకట్టి పాట సాహిత్యం

 
చిత్రం: భద్రాచలం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కవితా కృష్ణమూర్తి, జస్విందర్ సింగ్ నిరోల

చేనేత చీరకట్టి



ఒకటే జననం ఒకటే మరణం పాట సాహిత్యం

 
చిత్రం: భద్రాచలం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: శంకర్ మహదేవన్, చిత్ర

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ 
అలుపు లేదు మనకు
బతుకు అంటె గెలుపూ 
గెలుపు కొరకె బ్రతుకు

కష్టాలు రానీ కన్నీళ్ళు రానీ 
ఏమైన గానీ ఎదురేది రానీ
ఓడిపోవద్దు రాజీపడొద్దు
నిద్రే నీకొద్దు నీకేది హద్దు

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ 
అలుపు లేదు మనకు
బతుకు అంటె గెలుపూ 
గెలుపు కొరకె బ్రతుకు

రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి
ఆ గెలుపూ చప్పట్లే గుండెలలో మోగాలీ
నీ నుదిటీ రేఖలపై సంతకమే చేస్తున్నా 
ఎదనిండా చిరునవ్వే చిరునామై ఉంటున్నా 
నిన్నే వీడని నీడవలే నీతో ఉంటా ఓ నేస్తం
నమ్మకమే మనకున్న బలం

నీలికళ్ళలో మెరుపూ మెరవాలి
కారు చీకట్లో దారి వెతకాలి
గాలివానల్లో ఉరుమై సాగాలి
తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ 
అలుపు లేదు మనకు
బతుకు అంటె గెలుపూ 
గెలుపు కొరకె బ్రతుకు

నిదరోకా నిలుచుంటా వెన్నెలలో చెట్టువలె
నీకోసం వేచుంటా కన్నీటీ బొట్టువలె
అడుగడుగు నీ గుండె 
గడియారం నేనవుతా
నువు నడిచే దారులలో 
ఎదురొచ్చి శుభమవుతా
రాసిగ పోసిన కలలన్నీ 
దోసిలి నిండా నింపిస్తా
చేతులు చాచిన స్నేహంలా

ముట్టుకున్నావా మువ్వా అవుతుంది
పట్టుకున్నావా పాటే అవుతుంది
అల్లుకున్నావా జల్లే అవుతుంది
హత్తుకున్నావా వెల్లువౌతుంది

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ 
అలుపు లేదు మనకు
బతుకు అంటె గెలుపూ 
గెలుపు కొరకె బ్రతుకు

Most Recent

Default