చిత్రం: సింహరాశి (2001) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ నటీనటులు: రాజశేఖర్, సాక్షి శివనంద్ దర్శకత్వం: వి.సముద్ర నిర్మాత: ఆర్. బి. చౌదరి విడుదల తేది: 06.07.2001
Songs List:
పేదలంటే ప్రాణమిచ్చె పాట సాహిత్యం
చిత్రం: సింహరాశి (2001) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: వెనిగళ్ళ రాంబాబు గానం: యస్.పి.బాలు, సుజాత మోహన్ పల్లవి: పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు మన్ను మిన్ను కన్న గొప్ప మనసున్నరాజు దానవీరశూరకర్ణ నరసింహరాజు సింహరాశిలో నువు పుట్టినావయ్యా జన్మభూమికే వన్నెతెచ్చినావయ్యా చరణం: 1 పేదోళ్ల బతుకుల్లో పండగ నీవు నూరేళ్లు చల్లగ ఉండాలి నీవు బ్రతుకు బరువై లేకున్న చదువు చదువులమ్మకు అయినాడు గురువు మా పల్లె గుండెల్లో పచ్చబొట్టు నీవు మా కంటిచూపుల్లో సూరీడే నీవు ఏ పుణ్యఫలమో నీ తల్లి రుణమై సింహరాశిలో నువు పుట్టినావయ్యా జన్మభూమికే వన్నెతెచ్చినావయ్యా చరణం: 2 కటిక నేలే నీ పట్టుపరుపు పూరి గుడిసెను గుడి చేసినావు కట్టుపంచే నీకున్న ఆస్తి కోట్లు ఉన్న నిరుపేదవయ్యా కన్నీళ్లు తుడిచే అన్నవు నీవు కన్నోళ్ల కలలే పండించినావు ఈ పల్లెసీమే నీ తల్లి ప్రేమై సింహరాశిలో నువు పుట్టినావయ్యా జన్మభూమికే వన్నెతెచ్చినావయ్యా మట్టి నుంచి పుట్టి పెరిగి మనిషైన వాణ్ణి కట్టుబట్టలుంటే చాలు అనుకున్న వాణ్ణి సాటివారి సేవకై బ్రతికున్న వాణ్ణి పుట్టినప్పుడు మనం తెచ్చిందేముంది గిట్టినప్పుడు మనతో వచ్చిందేముంది
తెలుసా నేస్తమా పాట సాహిత్యం
చిత్రం: సింహరాశి (2001) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: వి.రాంబాబు గానం: హరిహరన్, చిత్ర తెలుసా నేస్తమా నేస్తమా పూజించాననీ నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ మదిలో మౌనరాగమే మెదిలే మెల్లమెల్లగా కదిలే నీలిమేఘమే కరిగే తేనెజల్లుగా తెలుసా నేస్తమా నేస్తమా ప్రేమించాననీ నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ మదిలో మౌనరాగమే మెదిలే మెల్లమెల్లగా కదిలే నీలిమేఘమే కరిగే తేనెజల్లుగా మౌనమే కరగాలి మంత్రమై మ్రోగాలి మదిలో నీ ప్రేమ మందిరమవ్వాలి మమతలే పండాలి మనసులే నిండాలి దైవం పలకాలి దీవెనలివ్వాలి ప్రేమపైన నమ్మకాన్ని పెంచుకున్న చిన్నదాన్ని ప్రేమతోనే జీవితాన్ని పంచుకుంటూ ఉన్నవాణ్ని చెప్పలేని ఎన్ని ఆశలో చిన్ని గుండెలోన తెలుసా నేస్తమా నేస్తమా ప్రేమించాననీ నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ ఎదురుగా రారాజు కదలగా ఈరోజు పరువం పులకించి పరుగులు తీసింది ప్రేమలో మమకారం ఏమిటో తెలిసింది పున్నమిలా ఎదలో వెన్నెల కురిసింది నింగి విడిచి గంగలాగ నిన్ను చేరుకున్నదాన్ని కొంగులోనే దాచుకోవే పొంగుతున్న సాగరాన్ని ఆడపిల్ల మనసు తెలిసిన తోడు నీడ నీవే తెలుసా నేస్తమా నేస్తమా ప్రేమించాననీ నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ మదిలో మౌనరాగమే మెదిలే మెల్లమెల్లగా కదిలే నీలిమేఘమే కరిగే తేనెజల్లుగా
సత్యభామ సత్యభామ పాట సాహిత్యం
చిత్రం: సింహరాశి (2001) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: పోతుల రవికిరణ్ గానం: ఉదిత్ నారాయణ్, సుజాత మోహన్ సత్యభామ సత్యభామ సంగతేంటమ్మా
అమ్మా అని పిలిచి పిలిచి పాట సాహిత్యం
చిత్రం: సింహరాశి (2001) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: విజయ్ కుమార్ గానం: యస్.జానకి అమ్మా అని పిలిచి పిలిచి గుండె కోయకురా ఆకలని ఏడ్చి ఏడ్చి ఏడిపించకురా గర్భగుడి లాంటి అమ్మ ఒడి పాము పడగయ్యింది రా చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా
రాణి రాణి రాణి రంగసాని రాణి పాట సాహిత్యం
చిత్రం: సింహరాశి (2001) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: విజయ్ కుమార్ గానం: యస్.పి.బాలు, స్వర్ణలత రాణి రాణి రాణి రంగసాని రాణి కాని కాని కాని రాసలీలలన్ని రాణి రాణి రాణి రంగసాని రాణి కాని కాని కాని రాసలీలలన్ని హాఁ... రాణి రాణి రాణి రంగసాని రాణి రమ్మంటే రావేరా కోరస్: అరె రమ్మంటే రావేరా కాని కాని కాని రాసలీలలన్ని కమ్మంగా కానీరా కోరస్: అరె కమ్మంగా కానీరా కండలు తిరిగిన మామ కోరివచ్చాను కాదందువా పూజలు చేసే మామ కొంగు పూజను చేయించవా పట్టే పట్టూ హే పట్టే పట్టూ ఏ కోడి కూసిన ఆపకుండ నీ దమ్ము చూపెట్టూ రాణి రాణి రాణి ఏయ్... రంగసాని రాణి హాఁ... కాని కాని కాని హాఁ... రాసలీలలన్ని ఆఁ రాణి రాణి రాణి రంగసాని రాణి రమ్మంటే రావేరా కాని కాని కాని రాసలీలలన్ని కమ్మంగా కానీరా ఎంతకాలం ఒంటరి గుంటావు జంటగ నన్నుంచుకో అంతులేని తుంటరి ఆశలు వెంటనే తీర్చేసుకో ఎయ్ మాటలన్ని చాలించి కాస్త పైటింక సరిచేసుకో వెంటపడి వేదించకింక నీ దారి నువు చూసుకో ఆడ జాతిలోనే నేనందమైన దాన్ని మొగలిపూల పొదలో వయసొచ్చి ఉన్నదాన్ని ఉఁ అంటే సరదాగా ఉందామయ్యా ఆ మూడు స్వర్గాలు చూద్దామయ్యా నే తలుచుకుంటే సాగదు నీ బ్రహ్మాచర్యము పట్టే పట్టూ హే పట్టే పట్టూ ఏ కోడి కూసిన ఆపకుండా నీ దమ్ము చూపెట్టూ రాణి రాణి రాణి రంగసాని రాణి రమ్మంటే రావేరా కాని కాని కాని రాసలీలలన్ని కమ్మంగా కానీరా సృష్టిలోని అందాలు అన్నీ నాలోనే చూపించనా స్వర్గలోక భోగాలు అన్నీ తెల్లార్లు అందించనా మేను చూపి మంచుకొండను కరిగించలేవమ్మడూ అందమంత ఆరబోసినా లొంగడు హనుమంతుడు ఈడు పంటకొచ్చి నీ పట్టుదలకు మెచ్చా నులక మంచమేసి ముస్తాబు చేసుకొచ్చా వంపులతో వజ్రాన్ని కొయ్ లేవమ్మా వలవేస్తే సూరీడు పడబోడమ్మా నీ సోకు చూసి మోసపోని మగాడినమ్మా పట్టే పట్టూ హే పట్టే పట్టూ ఏ కోడి కూసిన ఆపకుండా నీ దమ్ము చూపెట్టూ హే రాణి రాణి రాణి రంగసాని రాణి రమ్మంటే రావేరా కోరస్: అరె రమ్మంటే రావేరా కాని కాని కాని రాసలీలలన్ని కమ్మంగా కానీరా కోరస్: అరె కమ్మంగా కానీరా పస్తైన ఉంటుంది గానీ గడ్డి మేయదు ఏ సింహాము ఆహా... ప్రాణాలు ఇస్తాడు గానీ తప్పు చేయడు నరసింహాము ఏయ్... అరె పట్టుకోవద్దు నను ముట్టుకోవద్దు మీ ఆడజాతికే అవమానమే తెచ్చే తప్పు చేయొద్దు హూఁ... రాణి రాణి రాణి రా... రంగసాని రాణి రా... కాని కాని కాని ఏయ్... రాసలీలలన్ని హాఁ... రాణి రాణి రాణి రంగసాని రాణి కాని కాని కాని రాసలీలలన్ని