చిత్రం: ఖడ్గం (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నటీనటులు: శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సంగీత, సోనాలి బింద్రే, కిమ్ శర్మ దర్శకత్వం: కృష్ణవంశీ నిర్మాత: సుంకర మధుమురళి విడుదల తేది: 29.11.2002
Songs List:
మేమే… ఇండియన్స్ పాట సాహిత్యం
చిత్రం: ఖడ్గం (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శక్తి గానం: హనీ తికమక పెట్టే అమాయకత్వం చకచకలాడే వేగం అలాగ ఉంటాం, ఇలాగ ఉంటాం, ఆకతాయిలం మేము.... ఏయ్ చెప్పేదేదో అర్ధమయ్యేట్టు చెప్పరా..! అరె భాయ్..! ఇస్ర్టెటుగానే చేప్తా ఇనుకో హే…సత్యం పలికే హరిశ్చంద్రులం సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చస్తాం సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చస్తాం నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమేరా కష్టం అరె..! ముక్కుసూటిగా ఉన్నది చెప్తాం నచ్చకుంటే మీ కర్మం అరె..! కష్టమొచ్చినా కన్నీళ్లొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనస్సులం మేమే… ఇండియన్స్ మేమే… ఇండియన్స్ మేమే… ఇండియన్స్ అరె..! మేమే ఇండియన్స్ కోరస్: మేమే… ఇండియన్స్ (4) వందనోటు జేబులో ఉంటే నవాబు నైజం పర్సు ఖాళి అయ్యిదంటే పకీరు తత్వం కళ్ళులేని ముసలవ్వలకు చెయ్యందిస్తాం పడుచుపోరి ఎదురుగ వస్తే పళ్ళికిలిస్తాం ప్రేమ కావాలంటాం పైసా కావాలంటాం ఏవో కలలే కంటాం తిక్క తిక్కగా ఉంటాం ఏడేళ్ళయినా టీవి సీరియల్ ఏడుస్తూనే చూస్తాం తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డాన్సింగ్ చేస్తాం కోర్టు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడికోటేస్తాం అందరు దొంగలే అసలు దొంగకే సీటు అప్పచెప్పేస్తాం రూలూ ఉంది… హ హ రాంగూ ఉంది… హె హె రూలూ ఉంది రాంగూ ఉంది తప్పుకు తిరిగే లౌక్యం ఉంది కోరస్: మేమే… ఇండియన్స్ (3) అరె..! మేమే… ఇండియన్స్ సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం (4) కలలు కన్నీళ్ళెన్నో మన కళ్ళల్లో ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో శత్రువుకే ఎదురు నిలిచిన రక్తం మనది ద్వేషాన్నే ప్రేమగ మార్చిన దేశం మనది ఈశ్వర్ అల్లా ఏసు ఒకడే కదరా బాసు దేవునికెందుకు జెండా కావాలా పార్టీ అండా మాతృభూమిలో మంటలు రేపే మాయగాడి కనికట్టు అన్నదమ్ములకు చిచ్చును పెట్టే లుచ్చాగాళ్ళ పని పట్టు భారతీయులం ఒకటేనంటూ పిడికిలెత్తి వెయ్ ఒట్టు కుట్రలు చేసే శత్రు మూకల తోలు తీసి ఆరబెట్టు దమ్మే ఉంది… హ హ ధైర్యం ఉంది… ఆ ఆ దమ్మే ఉంది ధైర్యం ఉంది తలవంచని తెగ పొగరే ఉంది మేమే… ఇండియన్స్ మేమే… ఇండియన్స్ మేమే… ఇండియన్స్ అరె..! మేమే ఇండియన్స్ సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం ఓ..! సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చస్తాం నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమేరా కష్టం ఓ..! ముక్కుసూటిగా ఉన్నది చెప్తాం నచ్చకుంటే మీ కర్మం అరె..! కష్టమొచ్చినా కన్నీళ్లొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనస్సులం మేమే… ఇండియన్స్ మేమే… ఇండియన్స్ మేమే… ఇండియన్స్ అరె..! మేమే ఇండియన్స్ మేమే… ఇండియన్స్ (,4)
నువ్వు నువ్వు నువ్వే నువ్వు పాట సాహిత్యం
చిత్రం: ఖడ్గం (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: సుమంగళి నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ నాలోనే నువ్వు నాతోనే నువ్వు నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు నా పెదవిపైన నువ్వు నా మెడవంపున నువ్వు నా గుండె మీద నువ్వు ఒళ్ళంతా నువ్వు బుగ్గల్లో నువ్వూ ముగ్గల్లే నువ్వు ముద్దెసే నువ్వూ నిద్దర్లో నువ్వూ పొద్దుల్లో నువ్వు ప్రతి నిమిషం నువ్వూ... నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ చరణం: 1 నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు నా మనసును లాలించే చల్లదనం నువ్వు పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు నా ప్రతి యుద్ధం నువ్వూ నా సైన్యం నువ్వు నా ప్రియ శత్రువు నువ్వూ నువ్వూ మెత్తని ముల్లై గిల్లే తొలి చినుకే నువ్వు నచ్చే కష్టమ్ నువ్వూ నువ్వూ... నువ్వూ... నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ చరణం: 2 నా సిగ్గును దాచుకునే కౌగిలివే నువ్వు నా వన్నీ దోచుకునే కోరికవే నువ్వు మునిపంటితో నను గిచ్చే నేరానివి నువ్వు నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు తీరని దాహం నువ్వు నా మోహం నువ్వు తప్పని స్నేహం నువ్వూ నువ్వూ తీయని గాయం చేసే అన్యాయం నువ్వు అయినా ఇష్టం నువ్వూ నువ్వూ... నువ్వూ... నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ మైమరిపిస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు నే కోరుకునే నా మరోజన్మ నువ్వు కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు నాకే తెలియని నా కొత్తపేరు నువ్వు నా అందం నువ్వు ఆనందం నువ్వు నేనంటే నువ్వూ నా పంతం నువ్వు నా సొంతం నువ్వు నా అంతం నువ్వూ... నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ
అహ అల్లరి అల్లరి చూపులతో పాట సాహిత్యం
చిత్రం: ఖడ్గం (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: చిత్ర, రాక్విబ్ అహ అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే ఇహ మెల్లగ మెల్లగ ఎదలోన చిరు గిల్లుడు షురువాయే అరె చెక్కిలి గిలి గింతాయే ఈ తిక్క గాలి వలనా మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాతిరి దయ వలనా తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్కదిన్న అరె తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్క తక్కదిన్న ఊఉ..! బుగ్గే నిమురుకుంటే నాకు అరె మొటిమై తగులుతుంటది లేలేత నడుములోని మడత తన ముద్దుకై వేచి ఉన్నది ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే మొత్తం నేలమీది మల్లెలన్నీ తన నవ్వుల్లో కుమ్మరిస్తడే తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్కదిన్న అరె తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్క తక్కదిన్న ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఆఆ...ఆఆఆ ఆఆఆ దరెనా… ఆఆఆ… దరెనా… ఆఆఆ… నా పనినిససస నిసగరినిస పనినిససస నిసగరినిప పనినిససస నిసగరినిస పనినిససస నిసగరినిప మమప నీప నీప నిసనిప మమప నీప నీప రిసనిప మమప నీప నీప నిసనిప మమప గగ పగగప పేరే పలుకుతుంటే చాలు నా పెదవే తీయగవుతది తన చూపే తాకుతుంటే నన్ను అబ్బ నా మనసు పచ్చిగవుతది మెరిసే మెరుపల్లె వానొస్తే అబ్బ నా గుండెలోన పిడుగు పడుతుంటదే ఎదపై ఒక్కసారి హత్తుకుంటే ఇక నా ఊపిరాగిపోతదే తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్కదిన్న అరె తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్క తక్కదిన్న
ఖడ్గం ఖడ్గం పాట సాహిత్యం
చిత్రం: ఖడ్గం (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు ఓం... ఓం... ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఓంకారనాదంతో అంకురించిన వేదధాత్రికి సంకేతం ఈ ఖడ్గం హ్రీంకారనాదంలో సంచరించే ఆదిశక్తికి ఆకారం ఈ ఖడ్గం యుగయుగాలుగా గమనమాగని ఘనత ఈ ఖడ్గం తరతరాలుగా తరలి వచ్చిన చరిత ఈ ఖడ్గం తన కళ్ళ ముందే సామ్రాజ్య శిఖరాలు మన్నుపాలైనా క్షణమైన తన గాథ గతములో విడిచి ధ్రుతి ఒడి చేరనిదీ ఖడ్గం ఊటతో పడమరను దాటి పూర్వార్ధిపై నిత్య ప్రభాతమై వెలుగుతున్నదీ భరత ఖడ్గం కేవలం ఆయుధం కాదు ఈ ఖడ్గం ఏదో మహాద్భుతం ఉన్నదీ ఖడ్గం కేవలం ఆయుధం కాదు ఈ ఖడ్గం ఏదో మహాద్భుతం ఉన్నదీ ఖడ్గం మూడువన్నెల కేతముగ మింటికి ఎగసి కాలానికెదురేగు యశోరాశి ఈ ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం హరిని ధరపై అవతరించగ గెలుచుకొచ్చిన భక్తి ఖడ్గం నరునిలో దైవాంశనే దర్శించి కొలిచిన ముక్తిమార్గం ఆర్తరక్షణకై ధరించిన ధీరగుణమీ ఖడ్గం ధూర్తశిక్షణకై వహించిన కరకుతనమీ ఖడ్గం హూంకరించి అహంకరించి అధిక్రమించిన ఆకతాయిల అంతు చూసిన క్షాత్రసత్వం అస్తమించని అర్థఖడ్గం శరణుకోరి శిరస్సువంచి సమాశ్రయించిన అన్ని జాతుల పొదువుకున్న ఉదారతత్వం జగతి మరువని ధర్మఖడ్గం నిద్దుర మత్తును వదిలించే గెంజాయల జిలుగీ ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం చిక్కటి చీకటి చీల్చుకువచ్చే తెల్లని వెలుగీ ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం మట్టిని చీల్చుకు చిగురించే సిరి పచ్చని చిగురీ ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం గెంజాయల జిలుగీ ఖడ్గం తెలతెల్లని వెలుగీ ఖడ్గం సిరిపచ్చని చిగురీ ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
గోవిందా గోవిందా పాట సాహిత్యం
చిత్రం: ఖడ్గం (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్ గానం: శ్రీ , దేవి శ్రీ ప్రసాద్ పల్లవి: గోవిందా గోవిందా గోవిందా గోవిందా నుదుటిరాతను మార్చేవాడా ఉచితసేవలు చేసేవాడా లంచమడగని ఓ మంచివాడా లోకమంతా ఏలేవాడా స్వార్థమంటూ లేనివాడా బాధలన్నీ తీర్చేవాడా కోర్కెలే నెరవేర్చేవాడా నాకు నువ్వే తోడూనీడా గోవిందా గోవిందా గోవిందా గోవిందా అరె బాగుచెయ్ నను గోవిందా బాగుచెయ్ నను గోవిందా జూబ్లీహిల్స్‌లో బంగ్లా ఇవ్వు లేనిచో హైటెక్‌సిటీ ఇవ్వు హైజాకవ్వని ఫ్లైటొకటివ్వు వెంటతిరిగే శాటిలైటివ్వు పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్‌గాళ్లకిచ్చి నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చెయ్‌రా మెచ్చీ... గోవిందా గోవిందా గోవిందా గోవిందా బాగుచెయ్ నను గోవిందా పైకి తే నను గోవిందా గోవిందా గోవిందా అరె గోవిందా గోవిందా చరణం: 1 పెట్రోలడగని కారు ఇవ్వు బిల్లు ఇవ్వని బారు ఇవ్వు కోరినంత ఫుడ్డు పెట్టి డబ్బులడగని హోటలు ఇవ్వు అసెంబ్లీలో బ్రోకర్ పోస్టో రాజ్యసభలో ఎంపీ సీటో పట్టుపడని మ్యాచ్‌ఫిక్సింగ్ స్కాముల సంపాదనివ్వు ఓటమెరుగని రేసులివ్వు లాసురాని షేరులివ్వు సింగిల్ నంబర్ లాట్రీలివ్వు ట్యాక్స్ అడగని ఆస్తులివ్వు పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్‌గాళ్లకిచ్చి నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చెయ్‌రా మెచ్చీ... గో గో గో గో గోవిందా గోవిందా బాగుచెయ్ నను గోవిందా చరణం: 2 వందనోట్ల తోటలివ్వు గోల్డ్ నిధుల కోటలివ్వు లేకపోతే వెయ్యిటన్నుల కోహినూర్ డైమాండ్స్ ఇవ్వు మాస్ హీరో ఛాన్సులివ్వు హిట్టు సినిమా స్టోరీలివ్వు స్లిమ్ముగున్న సొమ్ములున్న హీరోయిన్నే వైఫుగా ఇవ్వు హాలీవుడ్‌లో స్టూడియోనివ్వు స్విస్సుబ్యాంక్‌లో బిలియన్లివ్వు కోట్లుతెచ్చే కొడుకులనివ్వు హీరోలయ్యే మనవలనివ్వు నన్ను కూడా సీఎం చెయ్యి లేకపోతే పీఎం చెయ్యి తెలుగుతెరపై తిరుగులేని తరిగిపోని లైఫునియ్యి॥ గోవిందా గోవిందా బాగుచెయ్ నను గోవిందా బాగుచెయ్ నను గోవిందా అరె పైకి తే నను గోవిందా గోవిందా గోవిందా లక్కుమార్చి నన్ను కరుణిస్తే తిరుపతొస్తా త్వరగా చూస్తే ఏడుకొండలు ఏసి చేస్తా ఎయిత్ వండర్ నీ గుడి చేస్తా గోవిందా గోవిందా ఏడుకొండలు ఏసి చేస్తా బాగుచెయ్ నను గోవిందా ఎయిత్ వండర్ నీ గుడి చేస్తా అయ్యబాబోయ్ దేవుడు మాయమైపోయాడేంటీ..?
ముసుగు వెయ్యద్దు మనసు మీద పాట సాహిత్యం
చిత్రం: ఖడ్గం (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: కల్పన పల్లవి: ఊఁ ముసుగు వెయ్యద్దు మనసు మీద వలలు వెయ్యద్దు వయసు మీద హే ముసుగు వెయ్యద్దు మనసు మీద వలలు వెయ్యద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో ముసుగు వెయ్యద్దు మనసు మీద వలలు వెయ్యద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా అనుభవించందె తెలియదంటె తప్పు అంటారా మనసు చెప్పిందె మనకు వేదం కాదనే వారె లేరురా మనకు తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటె ఏంటిరా హా ముసుగు వెయ్యద్దు మనసు మీద వలలు వెయ్యద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో ముసుగు వెయ్యద్దు మనసు మీద వలలు వెయ్యద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో చరణం: 1 సూర్యుడైనా చూపగలడ రేయిచాటున్న రేపుని అఁ చీకటైనా ఆపగలదా వచ్చేకలల్ని వద్దనీ పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశని హా దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ల ముందుండగా అందుకోకుండా ఆగిపోతూ ఉసూరు మంటే ఎలా...? ఈ ఉడుకూ ఈ దుడుకూ ఈ వెనక్కి తిరగని పరుగు ఉండదుగా కడవరకూ ఈ వయస్సునిలాగె కరిగిపోనీకు ముసుగు వెయ్యద్దు మనసు మీద వలలు వెయ్యద్దు వయసు మీద ఊఁ ముసుగు వెయ్యద్దు, వలలు వెయ్యద్దు ఎగరనివ్వాలి, తుఫాను వేగాలతో... చరణం: 2 కొంతకాలం నేలకొచ్చాం అతిధులై వుండి వెళ్లగా కోటలైనా కొంపలైనా ఏవీ స్ధిరాస్ధి కాదుగా కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా నిన్న లేవైనా గుర్తుకొస్తే తీపి అనిపించనీ ఉన్నకొన్నాళ్ళు గుండెనిండా సరదాలు పండించనీ నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలసినడుద్దాం సావాసం సంతోషం ఇవి అందించి అందర్లో నవ్వు నింపుదాం ముసుగు వెయ్యద్దు మనసు మీద వలలు వెయ్యద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా అనుభవించందె తెలియదంటె తప్పు అంటారా మనసు చెప్పిందె మనకు వేదం కాదనే వారె లేరురా మనకి తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటె ఏంటిరా ముసుగు వెయ్యద్దు మనసు మీద వలలు వెయ్యద్దు వయసు మీద