చిత్రం: బాబీ (2002) సంగీతం: మణిశర్మ నటీనటులు: మహేష్ బాబు, ఆర్తి అగర్వాల్ దర్శకత్వం: శోభన్ నిర్మాత: కె.కృష్ణ మోహన్ రావు విడుదల తేది: 01.11.2002
Songs List:
ఈ జెండా పసిబోసి చిరునవ్వురా పాట సాహిత్యం
చిత్రం: బాబీ (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: శక్తి గానం: శంకర్ మహదేవన్ పల్లవి: ఈ జెండా పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండా అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా వీర స్వాతంత్య్ర పోరాట తొలిపిలుపురా మన వెలలేని త్యాగాల ఘనచరితరా తనచనుబాలతో పోరు నేర్పిందిరా ఉరికొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా ఆ తెల్లోడి గుండెల్ని తొలిచేసిన అమ్మురా వందేమాతరం మనదే ఈ తరం వందేమాతరం పలికే ప్రతి తరం ఈ జెండా పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండా అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా చరణం: 1 శాస్ర్తానికి ధ్యానానికి ఆదిగురువురా మనదేశం మానవాళికే వైతాళిక గీతంరా భారతం ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మనదేశం ఎన్నో మతాల సహజీవన సూత్రంరా భారతం ఆ దైవం మనకోసం సృష్టించే ఈ స్వర్గం ఈ ప్రాణాలు పోసింది ఆ తల్లిరా తన దేహాన్ని ధైర్యాన్ని పంచిందిరా మనమేమిస్తే తీరేను ఆ రుణమురా ఇక మనకేమి ఇచ్చిందనడగొద్దురా భారతీయులుగా పుట్టాము ఈ జన్మకిది చాలురా వందేమాతరం మనదే ఈ తరం వందేమాతరం పలికే ప్రతి నరం ఈ జెండా పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండా అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా చరణం: 2 పిచ్చికుక్కలా ఉగ్రవాదమే రెచ్చిపోయి కాటేసినా వెన్ను చూపని ఉక్కు సైన్యానికే సలామురా మంచు మల్లెల శాంతి కపోతం నెత్తుటి తడిలో తడిసినా చెక్కు చెదరని ఐకమత్య మొక్కటే సవాలురా మానవుడే మా వేదం మానవతే సందేశం మా శతకోటి హృదయాలదొక మాటరా ఉక్కు పిడికిలితో అణిచేను నీ బలుపురా చావు ఎదురైనా భయపడదు మా గుండెరా శత్రువెవడైనా తలవంచదీ జెండరా ఫిరంగుల్ని ఎదిరించి తొడగొట్టి నిలిచిందిరా వందేమాతరం మనదే ఈ తరం వందేమాతరం పలికే ప్రతి నరం ఈ జెండా పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండా అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా వీర స్వాతంత్య్ర పోరాట తొలిపిలుపురా మన వెలలేని త్యాగాల ఘనచరితరా తన చనుబాలతో పోరు నేర్పిందిరా ఉరికొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా ఆ తెల్లోడి గుండెల్ని తొలిచేసిన అమ్మురా వందేమాతరం మనదే ఈ తరం వందేమాతరం పలికే ప్రతి తరం
వా... వారెవ్వా వవ్వా రెవ్వా పాట సాహిత్యం
చిత్రం: బాబీ (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: యస్. పి. బాలు, సునీత వా... వారెవ్వా వవ్వా రెవ్వా (6) కళ్ళల్లో ద్రాక్షరసం వళ్ళంతా చెరుకు రసం పరువం దానిమ్మరసం చిట్టి పెదవి తేనే రసం రా వా... వా... దీన్ని పట్టబోతే పాదరసం రా... చూపు సప్పోట రసం వయసే బత్తాయి రసం నవ్వే నారింజ రసం నీటుగాడు నిమ్మరసం రా వా... వా... వీడి కొంటెతనం శొంఠి రసం రా... వా... వారెవ్వా వవ్వా రెవ్వా (2) చరణం: 1 ఆ పక్క మాయక్క ఎన్నెల్లో గుమ్మాడి ఈ పక్క మాసెల్లి ఎన్నెల్లో గుమ్మాడి నడిమద్యనా నేను ఎన్నెల్లో గుమ్మాడి నిదరోతామాగదిలో ఎన్నెల్లో గుమ్మాడి చిమ్మ చీకటిలోన క్కూ క్కూ క్కూ తిన్నగ నాకాడికొచ్చి క్కూ క్కూ క్కూ బుగ్గ నిమరగలవా నువ్వు వా వా ముద్దులెట్టగలవా నువ్వు తలుపు కిర్రుమనకుండా గురివిందా గుమ్మాడి తైలాలు పోసిపెట్టు గురివిందా గుమ్మాడి గొళ్ళాలు ఎయ్యకుండా గురివిందా గుమ్మాడి దగ్గరగ ఏసిపెట్టు గురివిందా గుమ్మాడి కాళ్ళకింద ఎత్తుపీట క్కూ క్కూ క్కూ పెట్టుకొని నిద్దరోతే క్కూ క్కూ క్కూ గుర్తుపట్టి ముద్దులు పెడతా వా వా గుట్టంత దోచుకు పోతా వా... వారెవ్వా వవ్వా రెవ్వా (3) చరణం: 2 మీ అమ్మ మీ నాన్న గురివిందా గుమ్మాడి ఎదురూగ ఉన్నా గానీ గురివిందా గుమ్మాడి ఊరి జనం అంత గూడి గురివిందా గుమ్మాడి చూత్తానే ఉన్నగాని గురివిందా గుమ్మాడి అటూ ఇటూ చూడకుండ క్కూ క్కూ క్కూ తిన్నగ నాకాడికొచ్చి క్కూ క్కూ క్కూ వదిలి పెట్టకుండా నన్ను... వా వా వడిసి పట్టగలవా నువ్వు... ఊరి చెరువులోన నువ్వు ఎన్నెల్లో గుమ్మాడి కలువ పూలు కోత్తావుండు ఎన్నెల్లో గుమ్మాడి మంచినీళ్ళ కోసం వచ్చి ఎన్నెల్లో గుమ్మాడి కాలుజారి కేకలెడతా ఎన్నెల్లో గుమ్మాడి కాపాడేటట్టు నువ్వు క్కూ క్కూ క్కూ నా నడుము పట్టుకుంటే క్కూ క్కూ క్కూ అందరు సూత్తుండగా నేను... వా వా వంటికదుము కుంటా నిన్నూ... చరణం: 3 సూపు సూపు కలవాలని గురివిందా గుమ్మాడి తిరణాళ్ళు వత్తాయంట ఎన్నెల్లో గుమ్మాడి ఇద్దరొక్కటవ్వాలని గురివిందా గుమ్మాడి ఎదిగేనంట కంది సేను ఎన్నెల్లో గుమ్మాడి వత్తుకో కూడదని క్కూ క్కూ క్కూ ఇసక మెత్తగుంటదంట క్కూ క్కూ క్కూ వయసుకొస్తే ఆడ పిల్ల క్కూ క్కూ క్కూ ఉరుకుతాది గోదారల్లె క్కూ క్కూ క్కూ ఇచ్చి పుచ్చు కోవాలని క్కూ క్కూ క్కూ కుర్ర జంట కోరుకుంటే క్కూ క్కూ క్కూ తాటిచెట్టు సాటు చాలు... వా వా తానినాన నన్నా నా అ... అ... చూపు సప్పోట రసం వయసే బత్తాయి రసం నవ్వే నారింజ రసం నీటుగాడు నిమ్మరసం రా వా... వా... వీడి కొంటెతనం శొంఠి రసం రా... కళ్ళల్లో ద్రాక్షరసం వళ్ళంతా చెరుకు రసం పరువం దానిమ్మరసం చిట్టి పెదవి తేనే రసం రా వా... వా... దీన్ని పట్టబోతే పాదరసం రా...
లోకం పీకే నరకాలి పాట సాహిత్యం
చిత్రం: బాబీ (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: శక్తి గానం: కల్పన లోకం పీకే నరకాలి పెట్రోలేసి కాల్చాలి ఈ సృష్టికే ప్రతిసృష్టే చెయ్యాలి మనుషుల బ్రైనే వాష్ చేసి మనషుల స్కానింగే తీసి క్లోనింగ్ తో నవలోకం చెయ్యాలి చీరాపి లుంగీ కట్టెయ్ వోణీ తీసేయ్ తగలెట్టేయ్యి నిప్పులోన ఈతకొట్టెయ్ టబ్బులోన హార్ట్ వేసి సబ్బు రుద్దేయి కన్నులుండి ఎం లాభం కలలెప్పుడు కనుకుంటే కలగన్నా ఏం లాభం కలలో భయము బీభత్సం ఓ టేక్ ఇట్ ఈజీ ఏ స్వర్గంలాంటి ఇళ్ళు ఉన్నా ఏం లాభం ఫ్రీడమ్ లేకుంటే లోకం పీకే నరకాలి పెట్రోలేసి కాల్చాలి నవరక్తమే నరాల్లో నింపాలి మనిషిగ పుట్టి ఏం లాభం మనుషులకుందా ఆనందం ప్రతి మనిషిలో పగా ద్వేషం స్వార్ధం సరదాగా పొగ తాగే జల్సాగా తెగ తాగే ఆకలేస్తే హత్య చేసై - హూ కేర్స్ డబ్బు ఉంటే తప్పు పట్టదీ లోకం బతుకంటే చావడమే చస్తూనే బతకాలి జగమంతా జగడాలే మనిషికి మనిషే విషమవుతుంటే హేయ్ టేక్ ఇట్ ఈజీ ఏ చద్దామన్నా హే హే హే పుట్టడం మళ్ళీ ఖాయం మరి చడవడమెందుకులే ఎవరెస్ట్ నే కోక్ టిన్ చేసి రెయిన్బో నేమో స్ట్రా చేసి సూర్యుడికే తాగించేద్దాం ఫ్రూట్ చేసి చుక్కలు కోసి ఫ్రై చేసి మెరుపుల నూడిల్స్ ఏ చేసి తినిపించుదాం చంద్రుడికే ఆకేసి గుండేలే బండవుతుంటే మమతలే మసి అవుతుంటే మనుషులే రాక్షససులైతే నడిచే శవాలు బ్రతికేమి లాభం నా ఒంటిలో లావా పొంగి ఊహాలే నిప్ఫై మాడి నిలువునా కాల్చేస్తుంటే హే ఎన్నాళ్ళు ఏడ్చినా ఏమి లాభం హే టేక్ ఇట్ ఈజీ హే టేక్ ఇట్ ఈజీ బేబీ టేక్ ఇట్ ఈజీ టేక్ ఇట్ ఈజీ టేక్ ఇట్ ఈజీ లోకం పీకే నరకాలి పెట్రోలేసి కాల్చాలి ఈ సృష్టికే ప్రతిసృష్టే చెయ్యాలి డబ్బుంటే ఏం లాభం కొనడం కష్టం సంతోషం ఈ హిస్టరీ తిరగేసి రాసేద్దాం నలుగురుకోసం బ్రతకొద్దు పెద్దల మాటే వినవద్దు - డోంట్ కేర్ పది మందికై నువ్వు కారాదు ఖైదు ఇండియన్ కల్చర్ వదిలేసి వయసును కంప్యూటర్ చేసి కళలే కను కళ్లే కెమెరా చేసి
పుల్లని పుల్లట్టు పాట సాహిత్యం
చిత్రం: బాబీ (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భారతి బాబు గానం: మనో పుల్లని పుల్లట్టు పంటికంట గానే జివ చచ్చిన జన్మకే జీవమొచ్చెరా ఇది అట్టంటే పుల్లని పుల్లట్టు పంటికంట గానే జివ చచ్చిన జన్మకే జీవమొచ్చెరా వేసేటి అట్లమీద యావ పుట్టగానే AC లో తిండి మీద ఎగటు పుట్టెరా పుల్లని పుల్లట్టు పంటికంట గానే జివ చచ్చిన జన్మకే జీవమొచ్చెరా వేసేటి అట్లమీద యావ పుట్టగానే AC లో తిండి మీద ఎగటు పుట్టెరా ఫైవ్ స్టార్ మీద బెట్టు మన అట్టే బెస్ట్ మీ అందరి మీద ఒట్టు మినపట్టే టేస్ట్ ఫైవ్ స్టార్ మీద బెట్టు మన అట్టే బెస్ట్ మీ అందరి మీద ఒట్టు మినపట్టే టేస్ట్ పుల్లని పుల్లట్టు పంటికంట గానే జివ చచ్చిన జన్మకే జీవమొచ్చెరా వేసేటి అట్లమీద యావ పుట్టగానే AC లో తిండి మీద ఎగటు పుట్టెరా రాతిరోలులోన పిండి రవ్వలోన కలిపి రేకు పెనం మీదన రవ్వంత నూనె దులిపి కట్లే పొయ్యి మీద దాన్ని అట్లకాడతో కాల్చి పొడి కారం పైనచల్లి పొగసూరకుండ తీసి కాలుతున్న అట్టుముక్క నాలుక మీదెట్టుకుంటే కాలుతున్న అట్టుముక్క నాలుక మీదెట్టుకుంటే నాషాలానికెక్కి మంచి హుషారు పుట్టిస్తదిరా పుల్లట్టు అబ్బబ్బబ్బ పుల్లని పుల్లట్టు పంటికంట గానే జివ చచ్చిన జన్మకే జీవమొచ్చెరా వేసేటి అట్లమీద యావ పుట్టగానే AC లో తిండి మీద ఎగటు పుట్టెరా కట్లెట్ లు పిజ్జా లు దీని ముందు దిగదుడుపు నూడుల్స్ చికెన్ రోల్స్ అరగవుర పరగడుపు హాట్ డాగ్స్ బర్గర్ లని ఇంగిలిపీసు మరిగినోడు ఫాస్ట్ ఫుడ్ తిన్నాక టేస్ట్ మరచిపోతాడు తెలుగింటి పుల్లట్టును తిన్నోడు ఎవడైనా ఓ తెలుగింటి పుల్లట్టును తిన్నోడు ఎవడైనా పదేల్లైన మరచిపోడు పదే పదే అడుగుతాడు పుల్లట్టు అట్టు అట్టు అట్టు పుల్లని పుల్లట్టు పంటికంట గానే జివ చచ్చిన జన్మకే జీవమొచ్చెరా వేసేటి అట్లమీద యావ పుట్టగానే AC లో తిండి మీద ఎగటు పుట్టెరా పుల్లని పుల్లట్టు పంటికంట గానే జివ చచ్చిన జన్మకే జీవమొచ్చెరా వేసేటి అట్లమీద యావ పుట్టగానే AC లో తిండి మీద ఎగటు పుట్టెరా
అడుగడుగు పాట సాహిత్యం
చిత్రం: బాబీ (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: శక్తి గానం: హరిహరన్, రంజిత్ చిత్రం: బాబీ (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: శక్తి గానం: హరిహరన్, రంజిత్ పల్లవి: అడుగడుగు గుండెనడుగు తడబడిన ఈడునడుగు ఏ మంత్రమో వేసావే మనసునే మగతగా కమ్మావే నీ నవ్వుతో చంపావే వయసునే వరదలా ముంచావే గుండెలనుండి గుసగుసలేవో వెన్నులో పాకాయిలే ఊహకురాని తహ తహలేవో తాపం పెంచాయిలే నా నర నరం జివ్వంది తనువుతో అనుభవం అడిగింది చరణం: 1 కోరికేదో తొలిమొటిమై పూసే తేనెలాగా చిరు చెమటై పోసే మాయ ఇది ఎవరిమాయ సిగ్గు నూనూగు చిగురే వేసే ఉగ్గపట్టి ప్రాణాలే తీసే మంత్రం చెలివేసే మంత్రం చూపడిగితే చెప్పలేని వయసు కోత ఆ ఆ ఆ వెన్నులోన చిలుకుతున్న తీపి బాధ... గుండెలనుండి గుసగుసలేవో వెన్నులో పాకాయిలే ఊహకురాని తహ తహలేవో తాపం పెంచాయిలే నా నరం జివ్వంది తనువుతో అనుభవం అడిగింది అడుగడుగు గుండెనడుగు తడబడిన ఈడునడుగు చరణం: 2 గోరువెచ్చని ఊపిరికే వేడికొసలు చిరు తాకిడికే మేను మెరుపులా మెరిసింది ఈడు మెలికలే తిరిగింది చెలియ తుంటరి నవ్వులకే తలుపు తీయని కౌగిలికే వయసు భగ్గున మండింది తియ్య తియ్యగా కాల్చింది చిగురాకులగా నా ఒళ్లే సెగ చిమ్మి వణుకుతూ ఉంది తమకాన్ని రేపే ని పెదవి నవనాడులాపుతూ ఉంది నా నర నరం జివ్వంది తనువుతో అనుభవం అడిగింది... అడుగడుగు గుండెనడుగు తడబడిన ఈడునడుగు గుండెలనుండి గుసగుసలేవో వెన్నులో పాకాయిలే ఊహకురాని తహ తహలేవో తాపం పెంచాయిలే ఏ మంత్రమో వేసావే మనసునే మగతగా కమ్మవే నీ నవ్వుతో చంపావే వయసునే వరదలా ముంచావే
లాలు దర్వాజా కాడ పాట సాహిత్యం
చిత్రం: బాబీ (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: శక్తి గానం: కార్తీక్ , కల్పన ఏ పిల్లా పిల్లా లస్కురి పిల్లా లగ్గోరి పిల్లా లడాయి పిల్లా బడాయి పిల్లా సొగసరి పిల్లా సోకుల పిల్లా పిల్లా పిల్లా లాలు దర్వాజా కాడి నా ముద్దుల రంభాయి లాలు దర్వాజా కాడి నా ముద్దుల రంభాయి లాలు గూడ రబ్బరు బొమ్మ నా ముద్దుల రంభాయి లాలు లాలు పొట్టిరో లగ్జనకరి పట్టిరో లబో దిబో బొమ్మరో లోలాకు గుమ్మరో లాలు దర్వాజా కాడి నా ముద్దుల రంభాయి లాలు గూడా రబ్బరు బొమ్మ నా ముద్దుల రంభాయి లాలు లాలు పొట్టిరో లగ్జనకరి పట్టిరో లబో దిబో బొమ్మరో లోలాకు గుమ్మరో రాయే రాయే పిల్లా రాలుగాయి పిల్లా ముందరుందే బ్రతుకు ముందుకెయ్యవే అడుగు చింత ఎందుకు పిల్లో - ఓ చిన్నాదాన చిందులెయ్యవే పిల్లో - ఓ కుర్రాదాన అడుగు వెయ్యాలంటే కాలు వణుకుతుంది పెదవి విప్పాలంటే అదురుతోంది గుండే చెప్పలేని భయము ఓ చిన్నావాడ తొలచి వేస్తూవుంది ఓ కుర్రావాడ హే దమ్ములుంటే చాలే పిల్లా రెండే రెండంట చావు బ్రతుకంట ఇంకేం లేవంట జీవితమంటే కలిసే బ్రతుకైన కలిసే చావైన వదలను నీ చేయి ఏదేమైనా కలిసే బ్రతుకంట కలిసే చావంట వదలను నీ చేయి ఏదేమైనా హే చార్మినార్ చౌరస్తాలో నా ముద్దుల రాంబాబు చాందినిలో వస్తివి పిలగో నా ముద్దుల రాంబాబు లాలు లాలు పిల్లడో లల్లాయి పోరడు లొల్లి పెట్టే గుంటడు లవ్వంటు వదలదు కట్టు కట్టు బండి జోడెడ్ల బండి ఇంపైన బండి ఇరుసెయ్యని బండి బండెక్కే పిలగా ఓ చిన్నావాడ జోరుగెల్లర పిలగో ఓ కుర్రవాడ మూల మలుపుల కాడ ఎత్తు వంపుల కాడ జోడు కొండల కాడ మోటు బావి కాడ బండి భద్రం పిల్లో ఓ చిన్నాదాన గుండె పదిలం పిల్లో ఓ కుర్రాదాన నువ్వే నా తోడైవుంటే... ఒక్క రోజే చాలు పట్టు వెయ్యి స్వర్గాలు నీ గుండె సవ్వడినై ఉంటానంటా ఒక్క నవ్వే చాలు పిలిచొస్తా లోకాలు గుండె నిండా నువ్వే వుంటానంటే గుండె నిండా నువ్వే వుంటానంటే గుండె నిండా నువ్వే వుంటానంటే లాలు దర్వాజా కాడి నా ముద్దుల రంభాయి లాలు గూడ రబ్బరు బొమ్మ నా ముద్దుల రంభాయి లాలు లాలు పొట్టిరో లగ్జనకరి పట్టిరో లబో దిబో బొమ్మరో లోలాకు గుమ్మరో లాలు లాలు పిల్లడో లల్లాయి పోరడు లొల్లి పెట్టే గుంటడు లవ్వంటు వదలదు లాలు లాలు పొట్టిరో లగ్జనకరి పట్టిరో లబో దిబో బొమ్మరో లోలాకు గుమ్మరో లాలు లాలు పిలడో లల్లాయి పోరడు లొల్లి పెట్టే గుంటడు లవ్వంటు వదలదు