Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Aadi (2002)




చిత్రం: ఆది (2002)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: జూ. యన్. టి. ఆర్, కీర్తి చావ్లా
దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 28.03.2002



Songs List:



అయ్యో రామ ఆంజనేయ పాట సాహిత్యం

 
చిత్రం: ఆది (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి. బాలు, గోపికా పూర్ణిమ

అయ్యో రామ ఆంజనేయ ఎంత పని చేశావు
బ్రహ్మచారిగాడి ముందు భామనేమో నిలిపావు
పిట్టా ముగ్గులో దించేసింది ఓరయ్యా
ఎట్టా వేగనీకన్నెగుంట తోటి తస్సాదియ్య
గట్టివాడు ఆంజనేయ ఎంత ప్లాను వేశాడో
తోకపట్టి నిన్ను కాస్త సీనులోకి దించాడు
ఎర్రాబుగ్గల కుర్రవాడ్ని చూసి ఓరయ్యో
ఎట్టావదలను లవ్ లో దించక ఓ హనుమయ్యో

ఏంటే నీ గొప్ప జర చెప్పవే గుంపప్పా 
ఏముందని నిన్ను ప్రేమించాలి
అదిరే సొగసుంది మతిపోయే ఫిగరుంది 
ఇంకేంకావలో సెలవీవయ్యో
పైన ఎన్ని అందాలున్నా లోపలుంది తెలిసేదెట్టా తెలియకుండా చనువిచ్చేదెట్టా
పైటచాటు పాగావేసే లోపలున్నది పసిగట్టేసే 
అప్పుడైనా తెలియక పోదయ్యో

అయ్యో రామ ఆంజనేయ ఎంత పని చేశావు
గట్టివాడు ఆంజనేయ ఎంత ప్లాను వేశాడు

ఓకే అంటాలే నా ఒడ్లోకొస్తావా నే కోరింది కొరికిస్తావా
ప్రేమించానంటే నా ప్రాణం ఇచ్చేయ్ నా 
అరె నీలోని సగమైపోనా హొయ్
పొద్దుటేళా ముద్దివ్వాలి మద్దినేళ మురిపించాలి 
రాతిరేళా రాణై రావాలి...
ముందుకొస్తే ముద్దై పోనా ముట్టుకుంటే మధువైపోనా రాతిరేళా రెట్టించేసేయ్ నా...

అయ్యో రామ ఆంజనేయ ఎంత పని చేశావు
బ్రహ్మచారిగాడి ముందు భామనేమో నిలిపావు
పిట్టా ముగ్గులో దించేసింది ఓరయ్యో
ఎట్టా వేగనీకన్నెగుంట తోటి తస్సాదియ్య
గట్టివాడు ఆంజనేయ ఎంత ప్లాను వేశాడో
తోకపట్టి నిన్ను కాస్త సీనులోకి దించాడు
ఎర్రాబుగ్గల కుర్రదాన్ని చూసి ఓరయ్యో
ఎట్టావదలను లవ్ లో దించక ఓ హనుమయ్యో





సున్నుండా తీసుకో... పాట సాహిత్యం

 
చిత్రం: ఆది (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: మురళి, రాధిక

యమ యమ యమ యమా సున్నుండా తీసుకో...
యమ యమ యమ యమా సిగ్గుపడక తీసుకో...
సున్నుండ తీసుకో ఓ బావ 
సిగ్గు పడకుండా తీసుకో నా బావ
సున్నుండ ఇచ్చుకో ఓ భామ 
ఇచ్చి నా గుండె పుచ్చుకో నా భామ
ఎడా పెడా ఎడా పెడా లాగించుకో 
అదో ఇదో ఏదోలాగా అరిగించుకో
హడా విడా హడా విడా వడ్డించుకో 
అందంతో కలిపేస్తే తింటా కాస్కో
సున్నుండ చూసుకో...
సున్నుండ ఇచ్చుకో...

పడుచుతనం పైకి నువు పాములాగ పాకి 
చకా చకా చకా చకా తాడేసుకో పసుపు తాడేసుకో
ఉడుకుతనం మెచ్చి నా ఉడుంపట్టు నచ్చి 
పకా పకా పకా పకా పండిచ్చుకో బ్రతుకు పండించుకో
నా లేత తళుకుల్ని తాలింపేస్కో 
నా సిగ్గు తలుపుల్ని తోసేస్కో
నీ చీకూచింతల్ని చాలించేస్కో 
నా చాతిఫై నువ్వు చాపేస్కో
హత్తుకొని చూస్కో నన్నెత్తుకొని ఉస్కో
కిందపడి మీదపడి పెట్టుబడి రాబట్టుకో

సున్నుండ చూసుకో...
సున్నుండ ఇచ్చుకో...
సున్నుండ తీసుకో ఓ బావ 
సిగ్గు పడకుండా తీసుకో నా బావ

ఇంటిలోకి వచ్చి నట్టింటిలోకి వచ్చి 
చిటా చిటా చిటా చిటా మంటేసుకో అందమంటేసుకో
గడపలోకి వచ్చి అడిగింది నాకు ఇచ్చి 
కిటా కిటా కిటా కిటా మెక్కేసుకో మంచమెక్కేసుకో
అంగట్లో నా గొప్ప చాటించేస్కో 
సందిట్లో నామీద చెయ్యేస్కో
ముద్దుల్తో నా నోరు మూయించేస్కో 
పొద్దల్లా నా బరువు మోసేస్కో
ఆడుమరి ఖోఖో రహదారి ఇక రోఖో
వెంటబడి వెచ్చబడి రాత్రిబడి పెట్టేసుకో

సున్నుండ చూసుకో ఓ బావ 
సిగ్గు పడకుండా తీసుకో నా బావ
సున్నుండ ఇచ్చుకో ఓ భామ 
ఇచ్చి నా గుండె పుచ్చుకో నా భామ
హా ఎడా పెడా ఎడా పెడా లాగించుకో 
అదో ఇదో ఏదోలాగా అరిగించుకో
హడా విడా హడా విడా వడ్డించుకో 
అందంతో కలిపేస్తే తింటా కాస్కో
ఏయ్ హా హా హా హా....




తొలిపిలుపే నీ తొలిపిలుపే పాట సాహిత్యం

 
చిత్రం: ఆది (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి. బాలు, చిత్ర

తొలిపిలుపే నీ తొలిపిలుపే 
మనసుకు తెలిపెను పసివలపే
తొలిపిలుపే నీ తొలిపిలుపే 
వయసుకు తెరిచెను చలి తలుపే
తొలిపిలుపే నిన్ను నన్ను కలగలిపే
తొలిపిలుపే నీలో నాలో కలలను కదిపే

తొలిపిలుపే నీ తొలిపిలుపే 
మనసుకు తెలిపెను పసివలపే
తొలిపిలుపే నీ తొలిపిలుపే 
వయసుకు తెరిచెను చలి తలుపే

చరణం: 1
ఒక చూపుతోటి ఒక చూపుకలిపి 
వెనుచూపు లేని జత పయనమిది
ఒక చేయిలోన ఒక చేయివేసి ఒకటయ్యే చెలిమిది
ఒక మాటతోటి ఒక మాట కలిపి 
మొగమాటమైన మగువాట ఇది
ఒక గుండెతోటి ఒక గుండెచేరి ఒదిగుండే కథ ఇది
ప్రతిపదమూ ప్రియా అని వలచినది
ప్రతిఫలమూ ఆశించని మమతల వ్రతమిది

తొలిపిలుపే నీ తొలిపిలుపే 
మనసుకు తెలిపెను పసివలపే
తొలిపిలుపే నీ తొలిపిలుపే 
వయసుకు తెరిచెను చలి తలుపే

చరణం: 2
మనసైన వేళ  కనుసైగ చాలు 
పలు దేశభాషలిక దేనికిలే
అధరాల పాల చిరుధార చాలు ఆహారం దేనికే
ఎదురైన వేళ కౌగిళ్ళు చాలు 
ఏ ఇల్లు వాకిలిక ఎందుకులే
మన చుంబనాల సవ్వళ్ళు చాలు సంగీతం ఎందుకే
ఇరువురికీ ఏడో రుచి తెలిసినదీ
మనుగడకీ మరోముడై ముడి పడు ముడుపిది

తొలిపిలుపే నీ తొలిపిలుపే 
మనసుకు తెలిపెను పసివలపే
తొలిపిలుపే నీ తొలిపిలుపే 
వయసుకు తెరిచెను చలి తలుపే
తొలిపిలుపే నిన్ను నన్ను కలగలిపే
తొలిపిలుపే నీలో నాలో నిదురను చిదిపే

తొలిపిలుపే నీ తొలిపిలుపే 
మనసుకు తెలిపెను పసివలపే
తొలిపిలుపే నీ తొలిపిలుపే 
వయసుకు తెరిచెను చలి తలుపే




నీ నవ్వుల తెల్లదనాన్ని పాట సాహిత్యం

 
చిత్రం: ఆది (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: మల్లికార్జున్, సునీత

నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది 
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది 
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
నీ కోకను సీతాకోక నీ పలుకులు చిలకల మూక
నీ చూపును చంద్రలేఖ నీ కొంగును ఏరువాక 
బదులిమ్మంటు బతిమాలాయి 
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
అసలివ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ

నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది 
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ

చరణం: 1 
నీ బుగ్గల్లోని సిగ్గులు కొన్ని మొగ్గలకైన ఇవ్వద్దు
నా వైపే మొక్కిన నీకైతే అది మొత్తం ఇవ్వచ్చు
నీ బాసల్లోని తియ్యదనాన్ని తెలుగు భాషకే ఇవ్వద్దు
నాకోసం వేచే నీకైతే అది నాసిగ ఇవ్వచ్చు
భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు
భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు
నీకే మొక్కే నాకే ఇవ్వచ్చూ...

నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది 
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ... 
నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది 
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...

చరణం: 2
నీ అందం పొగిడే అవకాశాన్ని కవులకు సైతం ఇవ్వద్దు
మరి నాకై పుట్టిన నీకైతే - అది పూర్తిగ ఇవ్వచ్చు
నీ భారం మోసే అదృష్టాన్నె భూమికి సైతం ఇవ్వద్దు
నీనంటే మెచ్చిన నీకైతే  - అది వెంటనే ఇవ్వచ్చు
నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు
నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు
నీకై బ్రతికే నాకే ఇవ్వచ్చూ...

నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది 
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ... 
నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది 
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...
నా వాకిట ముగ్గులు నీకే నా దోసిట మల్లెలు నీకే
నా పాపిట వెలుగులు నీకే నా మాపటి మెరుపులు నీకే
ప్రాయం ప్రణయం ప్రాణం నీకే ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా...
బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా...
 



చికి చికి చికిభం పాట సాహిత్యం

 
చిత్రం: ఆది (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: పోతుల రవికిరణ్
గానం: టిప్పు

చికి చికి చికిభం




పట్టు ఒకటో సారి పాట సాహిత్యం

 
చిత్రం: ఆది (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్, గంగ

పట్టు ఒకటో సారి నస పెట్టు రెండో సారి 
ముద్దులెట్టు మూడో సారి ముడెట్టు ప్రతి సారి
పెట్టు నాల్గో సారి జతకట్టు ఐదో సారి 
అందమెట్టు ఆరో సారి ఆకట్టు ప్రతి సారి
గుండెలు గుణించు ఓ సారి 
సిగ్గులు భాగించు ఓ సారి
లవ్వులు లెక్కించు ఓ సారి 
ఆపై అందిస్త ఓ పట్టుశారీ

అమ్మాయి నీ అందం సముద్రమే 
అందులో నా మనసే అణిగే మనిగే మునిగే
అబ్బాయి నీ వేగం విమానమే 
అందుకే నా సొగసే వొణికే జనికే బెనికే 
చిన్న వయసులో పాఠశాలకి 
పొగరున్న వయసులో వచ్చానే పైటశాలకి
ఆరు ఏళ్లలో చెమ్మచెక్కకి 
పదహారు ఏళ్లలో వచ్చాగా చుమ్మ చెక్కకి

పట్టు ఒకటో సారి నస పెట్టు రెండో సారి 
ముద్దులెట్టు మూడో సారి ముడెట్టు ప్రతి సారి
పెట్టు నాల్గో సారి జతకట్టు ఐదో సారి 
అందమెట్టు ఆరో సారి ఆకట్టు ప్రతి సారి

ఇంగ్లీషులో ఎన్నెన్నో పదాలలో 
ఈ మూడే నచ్చినివి లివరు ఫ్లవరు లవరు
లోకంలో ఎన్నెన్నో బంధాలలో  
ఈ మూడే తెలిసినవి మదరు ఫాదరు తమరు
నేను ఇప్పుడూ బ్రహ్మ చారిని 
నువు కోరినప్పుడు అయిపోతా భామ చారిని
నేను ఇప్పుడూ అందగత్తెని 
నువు తాకినప్పుడు అయిపోతా అగరుబత్తిని

పట్టు ఒకటో సారి నస పెట్టు రెండో సారి 
ముద్దులెట్టు మూడో సారి ముడెట్టు ప్రతి సారి
పెట్టు నాల్గో సారి జతకట్టు ఐదో సారి 
అందమెట్టు ఆరో సారి ఆకట్టు ప్రతి సారి
గుండెలు గుణించు ఓ సారి 
సిగ్గులు భాగించు ఓ సారి
లవ్వులు లెక్కించు ఓ సారి 
ఆపై అందిస్త ఓ పట్టుశారీ

Most Recent

Default