చిత్రం: వసంతం (2003) సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్ నటీనటులు: వెంకటేష్ , ఆర్తి అగర్వాల్ , కళ్యాణి దర్శకత్వం: విక్రమన్ నిర్మాతలు: యన్. వి.ప్రసాద్, యస్.నాగ అశోక్ కుమార్ విడుదల తేది: 11.07.2003
Songs List:
అమ్మో అమ్మాయేనా పాట సాహిత్యం
చిత్రం: వసంతం (2003) సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్ సాహిత్యం: కులశేఖర్ గానం: హరిహరన్, సుజాత మోహన్ అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభ ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోన నిన్ను మించే సిరిలేదే నగ్నసత్యం నాలో ఏదో సవ్వడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభ ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా నిషా కళ్ళతోటి వలే వేయకమ్మా అరే చిక్కుకోదా యదే చాపలా వయ్యారాల వైపు అలా చూడకయ్యా సిరే కందిపోదా మరీ ఎర్రగా నువ్వే కాని పువ్వు అయితే నేను తుమ్మెదౌతా నువ్వే కాలి మువ్వ అయితే నేను రాగమౌతా నిన్నే దాచుకుంటాలే ప్రియా గుండె కోవెల్లోన బాపు గీసిన బొమ్మకి చెల్లివి నీవు చెలీ ప్రాణం పోసుకువచ్చిన పాటవు నీవు సఖీ అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభ ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా ప్రియా నిన్ను చూసి మదే మారిపోయే అదేమ్మాయో గానీ వానవెల్లువ చెలీ నిన్ను చేరి ఎడారైన గాని వసంతాలు జల్లె పూలవెల్లువ నువే నిద్దరోతే నేను జోలపాటనౌతా నువే దగ్గరైతే హాయిలోనే తేలిపోతా చెలీ నువ్వు ఔనంటే సరాగాల సంబరమౌతా నువ్వు నేను ఏకమై ఇపుడే మనమౌదాం నింగినేల సాక్షిగా ఎపుడో ఒకటౌదాం అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభ ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా కలలోన నిన్ను చూసి మనసారా కోరుకున్నా ఇలలోన ఇంతలోన ఎదురైతే చేరుకున్నా నాలో ఏదో సవ్వడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది
గాలి చిరుగాలి పాట సాహిత్యం
చిత్రం: వసంతం (2003) సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్ సాహిత్యం: సిరివెన్నెల గానం: చిత్ర గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా రూపమే ఉండనీ ఊపిరే నువ్వని ఎన్నడు ఆగనీ పయనమే నీదని గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా చరణం: 1 కనురెప్ప మూసివున్నా నిదరొప్పుకొను అన్నా నిను నిలువరించేనా ఓ స్వప్నమా అమవాస్యలెన్నెయినా గ్రహణాలు ఏవైనా నీ కలను దోచేనా ఓ చంద్రమా తన ఒడిలో ఉన్నది రాయో రత్నమొ పోల్చదు నేలమ్మ ఉలి గాయం చేయకపోతే ఈ శిల శిల్పం కాదమ్మా మేలుకో మిత్రమా గుండెలో జ్వాలలే జ్యోతిగా మారగా చీకటే దారిగా వేకువే చేరగా గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా చరణం: 2 చలి కంచె కాపున్నా పొగమంచు పొమ్మన్నా నీరాక ఆపేనా వాసంతమా ఏ కొండరాళ్ళైనా ఏ కోన ముళ్ళైన బెదిరేన నీ వాన ఆషాఢమా మొలకెత్తే పచ్చని ఆశే నీలో ఉంటే చాలు సుమా కలకాలం నిన్ను అణచదు మన్ను ఎదిగే విత్తనమా సాగిపో నేస్తమా నిత్యము తోడుగా నమ్మకం ఉందిగా కూరిమే సాక్షిగా ఓటమే ఓడగా ... గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా రూపమే ఉండనీ ఊపిరే నువ్వని ఎన్నడు ఆగనీ పయనమే నీదని
నిను చూడక ముందర తెలియదులే పాట సాహిత్యం
చిత్రం: వసంతం (2003) సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్ సాహిత్యం: కులశేఖర్ గానం: హరిహరన్ నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని నిను చూసిన కంటికి ఎప్పటికి నిదురన్నది రాదు మరి మదిలో మరుమల్లెలు వాన కురిసే వేళ పగలే సిరివెన్నెల రాదా చెలియా నీలా ఓ పాలరాతి బొమ్మ నాలోని ఊపిరమ్మ ఓ కొండపల్లిబొమ్మ నీ రాక కొత్త జన్మ నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని రంగు రంగు పూవుల్లో లేనేలేదు ఈ గంధం నిన్ను తాకి పొందిందా చల్లగాలి సాయంత్రం వేల వేల భాషల్లో లేనే లేదు ఇంతందం తేలికైన నీ మాటే సుస్వరాల సంగీతం ఓ నీలోని ఈ మౌనం కవితే అనుకోన నవ కవితే అనుకోన నాలోని ఈ ప్రాణం వెతికే చిరునామా నీవేగా ఓ మైనా సూరీడు జారుకుంటే లోకాలు చీకటేగా నువుగాని దూరమైతే నా గుండె ఆగిపోదా నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని నీలి నీలి కన్నుల్లో ఎన్ని ఎన్ని అందాలు కాటుకమ్మ కలమైతే ఎన్నివేల గ్రంధాలు ముద్దుగుమ్మ నవ్వుల్లో రాలుతున్న ముత్యాలు పంచదార పెదవుల్లో తెంచలేని సంకెళ్లు ఓ నాలోని ఈ భావం ప్రేమే అనుకోనా తొలి ప్రేమే అనుకోనా ఈ వేళ ఈ రాగం వరమే అనుకోన కలవరమా నిజమేనా ఈ ప్రేమ భాష రాక నీతోటి చెప్పలేక నీలాల కంటిపాప రాసింది మౌన లేఖ నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని నిను చూసిన కంటికి ఎప్పటికి నిదురన్నది రాదు మరి మదిలో మరుమల్లెలు వాన కురిసే వేళ పగలే సిరివెన్నెల రాదా చెలియా నీలా ఓ పాలరాతి బొమ్మ నాలోని ఊపిరమ్మ ఓ కొండపల్లిబొమ్మ నీ రాక కొత్త జన్మ
గోదారల్లే పొంగే నాలో సంతోషం పాట సాహిత్యం
చిత్రం: వసంతం (2003) సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్ సాహిత్యం: కులశేఖర్ గానం: యస్.పి.బాలు గోదారల్లే పొంగే నాలో సంతోషం గోరింటల్లే పూచే నాలో ఆనందం హరివిల్లై విరిసిందమ్మ కల్లలోన ఆశ సిరిమువ్వై పలికిందమ్మా గుండెల్లోన శ్వాస కలహంస నడకల్లోన అందాల హైలెస్సా నేడే తెచ్చిందమ్మా మల్లెల వాసంతం నిండా నింపిందమ్మా నాలో సంగీతం గోదారల్లే పొంగే నాలో సంతోషం గోరింటల్లే పూచే నాలో ఆనందం చరణం: 1 గుండెలో వేల ఆశలే నన్ను ఇంతగా పెంచాయిలే కళ్ళలో కోటి కాంతులే పలు వింతలే చూపాయిలే సంక్రాంతే రోజు నామదికి ఈ అనుభవమే నాకు కొత్త గున్నది రానంటునే వచ్చిందమ్మా కొంటె కోయిల రాగాలెన్నో తీసిందమ్మా తియ్యతీయగా గోదారల్లే పొంగే నాలో సంతోషం గోరింటల్లే పూచే నాలో ఆనందం చరణం: 2 గాలిలో మబ్బు రేకులా మనసెందుకో తేలిందిలే హాయిగా పండు వెన్నెల పగలే ఇలా జారిందిలే సందేహం లేదే నాకు మరి ఇది ఆనందం చేసే కొంటె అల్లరి గుండెల్లోన ఉండాలంటే ఎపుడూ ఆరాటం మాటల్లోన చెప్పాలంటే బ్రతుకే పోరాటం గోదారల్లే పొంగే నాలో సంతోషం గోరింటల్లే పూచే నాలో ఆనందం హరివిల్లై విరిసిందమ్మ కల్లలోన ఆశ సిరిమువ్వై పలికిందమ్మా గుండెల్లోన శ్వాస కలహంస నడకల్లోన అందాల హైలెస్సా నేడే తెచ్చిందమ్మా మల్లెల వాసంతం నిండా నింపిందమ్మా నాలో సంగీతం
ఓ లాలిపాపకు లైనేవేస్తే పాట సాహిత్యం
చిత్రం: వసంతం (2003) సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్ సాహిత్యం: చంద్రబోస్ గానం: శంకర్ మహదేవన్ ఓ లాలిపాపకు లైనేవేస్తే తప్పేం కాదయ్యో తప్పేం కాదయ్యో ఓ లౌలి బేబి కి లైటింగ్ కొడితే తప్పేం కాదయ్యో తప్పేం కాదయ్యో ఓ స్టన్నింగ్ బ్యూటీకి కుడి కన్నె గీటేస్తూ సైగే చేస్తే తప్పేం కాదోయ్ అరె అడపిల్లకి అందముండటం తప్పుకాదురయ్యో మరి అందముందని గుర్తు చేయటం తప్పుకాదురయ్యో ఎవరడ్డు చెప్పనంతవరకు తప్పుకాదురో నువు భాధపెట్టనంతవరకు తప్పుకాదురో పడుచు భామకి బీటు కొట్టడం తప్పుకాదురయ్యో మరి బీటు కొట్టుతూ గౌరవించడం తప్పుకాదురయ్యో ఓ లాలిపాపకు లైనేవేస్తే తప్పేం కాదయ్యో తప్పేం కాదయ్యో ఓ లౌలి బేబి కి లైటింగ్ కొడితే తప్పేం కాదయ్యో తప్పేం కాదయ్యో షాపింగ్ చేసే వేళ అరె చూసి చూడక నువ్వు డాషే ఇస్తే తప్పేం కాదోయ్ హే ట్రావెల్ చేసే వేళా అరె తెలిసి తెలియక నువ్వు టచ్చే ఇస్తే తప్పేం కాదోయ్ అంత చేసినాక సారి చెప్పి ఊరిస్తే తప్పేం కాదయ్యో ఐసే చేసినాక మాటే కలిపి ట్రీటిస్తే తప్పేం కాదయ్యో అరె బుద్ధిమంతుడి పోజుకొట్టడం తప్పుకాదురయ్యో మరి ముద్దుగుమ్మని ఫ్లాట్ చెయ్యడం తప్పుకాదురయ్యో పెద్దాల్లు నీది తప్పు అంటే వప్పుకోకురో కొన్నేళ్ల ముందు వాళ్ళ కథలు గుర్తు చేయరో పెద్ద పెద్ద పొరపాట్లు చేయడం తప్పు తప్పురయ్యో మరి చిన్న చిన్న సరదాలు పొందడం తప్పుకాదురయ్యో ఓ లాలిపాపకు లైనేవేస్తే తప్పేం కాదయ్యో తప్పేం కాదయ్యో ఓ లౌలి బేబి కి లైటింగ్ కొడితే తప్పేం కాదయ్యో తప్పేం కాదయ్యో కాఫీ క్లబ్బుల్లోన కిల్లాడి లేడీతోటి చిప్పే చేస్తే తప్పేంకాదోయ్ డిస్కో టెక్కుల్లోన ఓ హస్కీ లడకి తోటి స్టెప్పె వేస్తే తప్పేంకాదోయ్ సెల్ పోనుల్లోన ఎస్ ఎమ్ ఎస్ పంపి కిస్ ఇస్తే తప్పేంకాదయ్యో ఇంటర్నెట్లోనా ఈ మెయిల్ పంపి కవ్విస్తే తప్పేంకాదయ్యో ఈ సాఫ్ట్వేర్ నే వాడుకోవడం తప్పుకాదురయ్యో ఈ ఫాస్ట్ ట్రెండ్ నే ఫాలో కావడం తప్పుకాదురయ్యో ఆడాల్ల మనసు తెలుసుకొనుట తప్పుకాదురో మగవాడి పొగరు తెలుపుకొనుట తప్పుకాదురో నా మాటలన్ని నువు వినకపోతే అది మొదటి తప్పురయ్యో నా బాటలోనే నువు నడవకుంటే అది మరో తప్పురయ్యో ఓ లాలిపాపకు లైనేవేస్తే తప్పేం కాదయ్యో తప్పేం కాదయ్యో ఓ లౌలి బేబి కి లైటింగ్ కొడితే తప్పేం కాదయ్యో తప్పేం కాదయ్యో ఓ స్టన్నింగ్ బ్యూటీకి కుడి కన్నె గీటేస్తూ సైగే చేస్తే తప్పేం కాదోయ్ అరె అడపిల్లకి అందముండటం తప్పుకాదురయ్యో మరి అందముందని గుర్తు చేయటం తప్పుకాదురయ్యో ఎవరడ్డు చెప్పనంతవరకు తప్పుకాదురో నువు భాధపెట్టనంతవరకు తప్పుకాదురో పడుచు భామకి బీటు కొట్టడం తప్పుకాదురయ్యో మరి బీటు కొట్టుతూ గౌరవించడం తప్పుకాదురయ్యో
జాంపండువే పాట సాహిత్యం
చిత్రం: వసంతం (2003) సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్ సాహిత్యం: వేటూరి గానం: ఉదిత్ నారాయన్, సుజాత జాంపండువే దోర జాంపండువే పూ చెండువే మల్లె పూ చెండువే నీ పాలబుగ్గ ఎర్రమొగ్గలేస్తే నా మనసున తైతక్క రవి చూడని రవికను చూస్తే నా వయసుకు తలతిక్క జాంపండునే దోర జాంపండునే పూచెండునే మల్లె పూచెండునే చరణం: 1 ఊగింది ఊగింది నా మనసు ఊగింది నీకంటి రెప్పల్లో అవి ఏం చిటికెలో అవి ఏం కిటుకులో ఉరికింది ఉరికింది నా వయసు ఉరికింది నీ నడుము ఒంపుల్లో అవి ఏం కులుకులో అవి ఏం మెలికలో ఇది పంచదార చిలకా అంచులన్నీ కొరకా మీదికొచ్చి వాలమాకా ఓ చందనాల చినుకా కుందనాల మొలకా కోక డాబు కొట్టమాకా నువ్వే నేనుగా తిరిగాం జంటగా నిప్పే లేదుగా రగిలాం మంటగా జాంపండునే దోర జాంపండునే పూ చెండువే మల్లె పూ చెండువే చరణం: 2 ఒళ్లంత తుళ్లింతై చెమటెంత పడుతున్నా ఆ చెమట చేరని చోటు చూపించవే అది చూపించవే కళ్లంత కవ్వింతై ఓ వింత చెబుతున్నా ఆ చెమట చేరని చోటు ఈ పెదవులే కొరికే పెదవులే నువ్వు ఆడ సోకు చూపి ఈడ కొంత దాచి కుర్రగుండె కోయమాకా నన్ను కౌగిలింతలడగ కచ్చికొద్దీ కొరకా కన్నె సైగ కోరమాకా మరిగే ఉందిగా చొరవే చేయగా పరువేం పోదుగా ఒడిలో చేరగా జాంపండువే దోర జాంపండువే పూ చెండువే మల్లె పూ చెండువే నా పాలబుగ్గ ఎర్రమొగ్గలేస్తే నీ మనసున తైతక్క రవి చూడని రవికను చూస్తే నీ వయసుకు తలతిక్క జాంపండువే దోర జాంపండువే పూ చెండువే మల్లె పూ చెండువే
ఓ జాబిలి విన్నావా పాటని పాట సాహిత్యం
చిత్రం: వసంతం (2003) సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్ సాహిత్యం: కులశేఖర్ గానం: చిత్ర ఓ జాబిలి విన్నావా పాటని నీ నీడలో కలకాలం సాగని ఈ అల్లరే మా ఎదకు పండగని ఈ నవ్వులే మాకు తొలి పున్నమని చిన్నారి జీవితాలె చిందులేసి ఆడని ఓ జాబిలి విన్నావా పాటని నీ నీడలో కలకాలం సాగని మెళకువలో కలలుగనే అందమైన మనసులివి ఉరకలతో ఉరుములతో పరుగుతీయు వయసులివి పసిమదిలో కసి ముదిరి చేరువైన గెలుపులివి జగడములో ఎగసి పడే తీపి తీపి అలకలివి తాయం పలికే కొంటె రాగమై కాలం వడిలో జంట తాలమై వెండిపూల వెన్నెలలో బ్రతుకు సాగని ఓ జాబిలి విన్నావా పాటని నీ నీడలో కలకాలం సాగని అలజడిలో అలసటలో సేద తీర్చు స్వర్గమిది కలత కూడా కలత పడే మంచితనపు మలుపులివి భువనములో ప్రతి మనిషి మరువలేని ఘటనులివి హృదయములో పదిలముగా నిలిచిపోవు గురుతులివి ఎగసే ఎదలో ఎన్ని ఆశలో ఉరికే మదిలో ఎన్ని ఊసులో చిన్ననాటి చిలిపితనం తిరిగిరాదులే ఓ జాబిలి విన్నావా పాటని నీ నీడలో కలకాలం సాగని ఈ అల్లరే మా ఎదకు పండగని ఈ నవ్వులే మాకు తొలి పున్నమని చిన్నారి జీవితాలె చిందులేసి ఆడని
అమ్మో అమ్మాయేనా (Bit Song) పాట సాహిత్యం
చిత్రం: వసంతం (2003) సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్ సాహిత్యం: కులశేఖర్ గానం: హరిహరన్ అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభ ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోన నిన్ను మించే సిరిలేదే నగ్నసత్యం నాలో ఏదో సవ్వడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది
గాలి చిరుగాలి (Bit Song) పాట సాహిత్యం
చిత్రం: వసంతం (2003) సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్ సాహిత్యం: సిరివెన్నెల గానం: చిత్ర గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా రూపమే ఉండనీ ఊపిరే నువ్వని ఎన్నడు ఆగనీ పయనమే నీదని గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా