చిత్రం: ఆర్య (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నటీనటులు: అల్లు అర్జున్, అను మెహతా, శివబాలాజి ఇతర తారాగణం: సుబ్బరాజు, అభినయశ్రీ, దర్శకత్వం: సుకుమార్ నిర్మాత: దిల్ రాజు విడుదల తేది: 07.05.2004
Songs List:
యు రాక్ మై వరల్డ్ యు నో పాట సాహిత్యం
చిత్రం: ఆర్య (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: విశ్వ గానం: షాన్, ప్రేమ్ జి అమరెన్ Whats up! R u ready to break it down..yeah and keep it a real...yeah Lets get ready to Rumble...stop యు రాక్ మై వరల్డ్ యు నో యు స్టే ఇన్ మై హార్ట్ యు నో మైన్ హూ తెరా దీవాన డోంట్ వాక్ ఎవే ఫ్రమ్ మి యు గాట్ టు లిజన్ టు మి చేస్తా నీకోసం యేదైనా ఆవోనా ఓ... జర దేఖోనా ఓ... యెవరేమన్న జరిగెతుంటె జరగక మానేన జానోనా ఓ... జర సున్లేనా ఓ... మనసే ఉంటె మార్గలెన్నో సంఝోనా యు రాక్ మై వరల్డ్ యు నో యు స్టే ఇన్ మై హార్ట్ యు నో మైన్ హూ తెరా దీవాన డోంట్ వాక్ ఎవే ఫ్రమ్ మి యు గాట్ టు లిజన్ టు మి చేస్తా నీకోసం యేదైనా బీ రెడీ ఓ... ఎవ్రిబడి ఓ... లవ్ అంటేనె గుండెని తాకె తీయ్యని మెలోడీ నోబడి కెన్ టెల్ యు రియల్లీ ఎప్పుడు ఎక్కడ మొదలవుతుందో ప్రేమ గారడి హేయ్ నాచోనా ఓ... జర ఝూమోనా ఓ... ప్రేమిస్తే అరే మనసంత మరి అల్లరిథిల్లాన ఓ జాన ఓ... జర మానోనా ఓ... ప్రేమను మించిన పవర్ లేదీలోకన యు రాక్ మై వరల్డ్ యు నో యు స్టే ఇన్ మై హార్ట్ యు నో మైన్ హూ తెరా దీవాన డోంట్ వాక్ ఎవే ఫ్రమ్ మి యు గాట్ టు లిజన్ టు మి చేస్తా నీకోసం యేదైనా ఓ గీత సెహనో రీట స్నేహం కోరి చెయ్యందిస్తె చూడవె ఎంచేత ఎంచేత నీ జత నాకో వింతా నా గుండెల్లో పుట్టించావే ఏదో గిలిగింత ఔనన్న నువ్వు కాదనన్న నాలో ఉన్నది నువ్వే నన్నది నిజమే ఓ మైన ఎండైన తగు వానైన నీవెంటె నేనుంటానంట ఏమైన యు రాక్ మై వరల్డ్ యు నో యు స్టే ఇన్ మై హార్ట్ యు నో మైన్ హూ తెరా దీవాన డోంట్ వాక్ ఎవే ఫ్రమ్ మి యు గాట్ టు లిజన్ టు మి చేస్తా నీకోసం యేదైనా
నువ్వుంటే (ఏదో ప్రియరాగం వింటున్నా) పాట సాహిత్యం
చిత్రం: ఆర్య (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: సాగర్, సుమంగళి(ఆలాప్) ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమా ఆ సందడి నీదేనా ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో ప్రేమా ఆ సవ్వడి నీదేనా ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే నువ్వుంటే నిజమేగా స్వప్నం నువ్వుంటే ప్రతి మాట సత్యం నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం నువ్వుంటే ప్రతి అడుగు అందం నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం ఓ... పాట పాడదా మౌనం పురివిప్పి ఆడదా ప్రాణం అడవినైన పూదోట చేయదా ప్రేమ బాటలో పయనం దారిచూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం ఎల్లదాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం నువ్వుంటే ప్రతి ఆశ సొంతం నువ్వుంటే చిరుగాలే గంధం నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం నువ్వుంటే ప్రతిమాట వేదం నువ్వుంటే ప్రతిపలుకు రాగం నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం ఓ ఉన్నచోట ఉన్నానా ఆకాశమందుకున్నానా చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపాన ఆమెలోని ఆనందసాగరం నన్ను ముంచు సమయాన హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీవల్లే సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీవల్లే ప్రేమా ఓ ప్రేమా ఇది శాశ్వతమనుకోనా నువ్వుంటే దిగులంటూ రాదే నువ్వుంటే వెలుగంటూ పోదే నువ్వుంటే మరి మాటలు కూడ పాటైపోతాయే నువ్వుంటే ఎదురంటూ లేదే నువ్వుంటే అలుపంటూ రాదే నువ్వుంటే ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలే
ఓ మై బ్రదరూ పాట సాహిత్యం
చిత్రం: ఆర్య (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: రవివర్మ ఏం బ్రదర్ ఒన్ సైడ్ లవ్వా? చూడు బ్రదర్ ఒన్ సైడ్ లవర్స్ ఎప్పుడూ బాధ పడకూడదు ఎందుకంటే ఒన్ సైడ్ లవ్ అంత రాయల్ లవ్ ఈ ప్రపంచంలోనే లేదు మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం మనం ఇచ్చేవాళ్లం వాళ్లు తీసుకునేవాళ్లు మనదే అప్పర్ హ్యాండు హొయ్ ఓ మై బ్రదరూ అరె చెబుతా వినరో ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు ఆ నా సలహాలు వింటే ఎవరూ ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు హెయ్ ఐ లవ్ యు అన్న పదం గమనించర భాయి యు లవ్ మి అని అర్థం అక్కడ లేదోయి ఐ లవ్ యు అన్న పదం గమనించర భాయి యు లవ్ మి అని అర్థం అక్కడ లేదోయి ఓ మై బ్రదరూ చెబుతా వినరో ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు నా సలహాలు వింటే ఎవరూ ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు అవరు హే ఒన్ వే రూటులో వెళ్లిపో సూటిగా ఎవరూ ఎక్కడా ఆపరు గనక ఒన్ సైడ్ ప్రేమనే చేసెయ్ స్వేచ్ఛగా ప్రేమను ఇమ్మని అడగవు గనక మదనపడి మెదడు చెడే ట్రాజిక్ లవ్ కన్నా అసలు ఫెయిలయ్యే ఛాన్సు లేని ఒన్ సైడ్ లవ్ మిన్నా అరె ఈ కిటుకే తెలిసుంటే దేవదాసు ఐనా కుడి ఎడమైతే పాట పాడి గ్లాసు దాసుడవునా ఓ మై బ్రదరూ ఓ మై బ్రదరూ అరె చెబుతా వినరో ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు నా సలహాలు అరె వింటే ఎవరూ ఇక పైన ఎపుడూ మజ్నులే అవరు హే ఒకరా ఇద్దరా కన్నుల ముందర తిరిగే అప్సరసలు ఎందరు ఉన్నా పరవాలేదురా పరువేం పోదురా లైనెయ్ సోదరా అందరి పైనా ఏ ఒక్కరినో ప్రేమ భిక్ష అడుక్కునే కన్నా ప్రతి అందాన్ని ప్రేమిస్తు సరదా పడు నాన్నా ఈ లైలాచే చిక్కనంటే నానా హైరానా ఒక వేళ ఒప్పుకుంటే అదే కమిట్మెంటు ఔనా ఓ మై బ్రదరూ ఓ మై బ్రదరూ అరె చెబుతా వినరో ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు నా సలహాలు అరె వింటే ఎవరూ ఇక పైన ఎపుడూ మజ్నులే అవరు ఎహేయ్ అది సరే రా ఒన్ సైడ్ లవ్ వలన మనకొచ్చే లాభాలేంటి అదీ చెప్తా విను అమ్మాయ్ మనసుని దోచెయ్యాలని ట్రిమ్ముగ డ్రస్సులెయ్యనక్కర్లెద్దు అది ఇవ్వాలని ఇది ఇవ్వాలని తీరని అప్పులు చెయ్యక్కర్లెద్దు అరె సెల్ ఫోన్లో సొల్లు కబుర్లు చెప్పక్కర్లెద్దు ఏ బైక్ పైన షికార్లకీ తిప్పక్కర్లెద్దు ఓ కూల్ డ్రింక్లో రెండు స్ట్రాలు పెట్టక్కర్లెద్దు ఓ సినిమాకీ టిక్కెట్లు పెట్టక్కర్లెద్దు ఓ మై బ్రదరూ ఓ మై బ్రదరూ చెబుతా వినరో ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు నా సలహాలు వింటే ఎవరూ ఇక పైన ఎపుడూ మజ్నులే అవరు
తకదిమి తోం తకదిమి తోం పాట సాహిత్యం
చిత్రం: ఆర్య (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సురేంద్ర కృష్ణ గానం: టిప్పు హేయ్ తకదిమి తోం తకదిమి తోం తరికిట తరికిట తకదిమి తోం చిందులు వేసే వయసుకి తకదిమి తోం తకదిమి తోం తకదిమి తోం సరిగమ పదమని తకదిమి తోం ఉరకలు వేసే మనసుకు తకదిమి తోం కష్టం నష్టం ఎదురైన నచ్చినదె చేసేద్దాం అలవాటైతే చేదైనా తకదిమి తోం తప్పో ఒప్పో చేసేద్దాం తొలి అడుగే వేసేద్దాం అనుభవమైతే ఏదైనా తకదిమి తోం కృషి ఉంటే నీ వెంటేరా ఈ లోకం గాయేంగె జోష్ కె లియె జీయేంగె ప్యార్ కె లియె హేయ్ తకదిమి తోం తకదిమి తోం తరికిట తరికిట తకదిమి తోం చిందులు వేసే వయసుకి తకదిమి తోం తకదిమి తోం తకదిమి తోం సరిగమ పదమని తకదిమి తోం ఉరకలు వేసే మనసుకు తకదిమి తోం చిరునవ్వుతో అటు చీకటిని ఇటు ఓటమిని తరిమెయ్యరా ఆ ఓర్పుకి తకదిమి తోం ఉల్లాసమె ఓ వెల్లువలా ఓ ఉప్పెనలా ఉరకాలిర ఆ జోరుకి తకదిమి తోం పరిగెడదాం పరిగెడదాం గెలిచే వరకు పరిగెడదాం గురి చూశాక మనకింక తిరుగేది గాయేంగె జోష్ కె లియె హేయ్ తకదిమి తోం తకదిమి తోం తరికిట తరికిట తకదిమి తోం చిందులు వేసే వయసుకి తకదిమి తోం నీ మాటతో అటు నిశ్శబ్దం ఇటు ఓ యుద్ధం ఆగాలిరా ఆ నేర్పుకి తకదిమి తోం నీ ప్రేమతో ఆ శత్రువునె ఓ మిత్రునిగా మార్చాలిరా ఆ గెలుపుకి తకదిమి తోం ఒకటౌదాం ఒకటౌదాం ప్రేమను పంచగ ఒకటౌదాం ప్రేమించే మనసుంటే మహరాజే జీయేంగె ప్యార్ కె లియె హేయ్ తకదిమి తోం తకదిమి తోం తరికిట తరికిట తకదిమి తోం చిందులు వేసే వయసుకి తకదిమి తోం కష్టం నష్టం ఎదురైన నచ్చినదె చేసేద్దాం అలవాటైతే చేదైనా తకదిమి తోం తప్పో ఒప్పో చేసేద్దాం తొలి అడుగే వేసేద్దాం అనుభవమైతే ఏదైనా తకదిమి తోం కృషి ఉంటే నీ వెంటేరా ఈ లోకం గాయేంగె జోష్ కె లియె జీయేంగె ప్యార్ కె లియె
ఫీల్ మై లవ్ పాట సాహిత్యం
చిత్రం: ఆర్య (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: కె.కె. క్లింటన్ సెరెజో ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్ నాప్రేమను భారంగానో నాప్రేమను దూరంగానో నాప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్ నాప్రేమను మౌనంగానో నాప్రేమను హీనంగానో నాప్రేమను శూన్యంగానో కాదో లేదో ఏదో కాదో ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్ హే... నేనిచ్చే లేఖలన్నీ చించేస్తూ ఫీల్ మై లవ్ నేపంపే పువ్వులనే విసిరేస్తూ ఫీల్ మై లవ్ నే చెప్పే కవితలన్నీ ఛీ కొడుతూ ఫీల్ మై లవ్ నా చిలిపి చేష్టలకే విసుగొస్తే ఫీల్ మై లవ్ నా ఉనుకే నచ్చదంటూ నా ఊహే రాదనీ నేనంటే కిట్టదంటూ నా మాటే చేదనీ నా జంటే చేరనంటూ అంటూ అంటూ అనుకుంటూనే ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్ ఎరుపెక్కి చూస్తూనే కళ్ళారా ఫీల్ మై లవ్ ఏదోటి తిడుతూనే నోరారా ఫీల్ మై లవ్ విధిలించి కొడుతూనే చెయ్యారా ఫీల్ మై లవ్ వదిలేసి వెళుతూనే అడుగారా ఫీల్ మై లవ్ అడుగులకే అలసటొస్తే చేతికి శ్రమ పెరిగితే కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకాగితే ఆపైన ఒక్కసారి హృదయం అంటూ నీకొకటుంటే ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపంగానో నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను ద్వేషంగానో నాప్రేమను భారంగానో నాప్రేమను దూరంగానో నాప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్
అ అంటే అమలాపురం పాట సాహిత్యం
చిత్రం: ఆర్య (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: వేటూరి గానం: మాలతి, రంజిత్ హెయ్ అ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఇ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం హెయ్ అ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఇ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం ఉ అంటే ఉంగాపురం ఊ అంటే ఊగే జనం ఎ అంటే ఎత్తు పల్లం గాలమేస్తే వాలుతారు కుర్ర కులం పాలకొల్లు చేరినప్పుడే పిల్లడో పైట జారుడెక్కువాయరో యానాము చేరినా ఈనాము మారునా ఫ్రెంచ్ పిడేలు ఆగునా హెయ్ ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో ఓరకంటి చూపుతోనె సంపుతుంటడు ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో గాలి తోని గాలమేసి లాగుతుంటడు హెయ్ అ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఇ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం హేయ్ గాజువాక చేరినాక మోజు పడ్డ కుర్ర మూక నన్ను అడ్డకాగి చంపినారురో కూరలేని చీరకట్టు జారిపోయే గుట్టుమట్టు చూస్తే రొంపిలోకి దింపకుంటరా రాజనిమ్మా పండునప్పుడే ఎప్పుడో రాజమండ్రి రాజుకుందిరో చిత్రాంగి మేడలో చీకట్లో వాడలో చీరంచు తాకి చూడరో హెయ్ అ అంటే అ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఇ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం ఏయ్ కొంచం బీటు మార్చండ్ర బాబు ఇరగదీసిండు హేయ్ అల్లువారి పిల్లగాడ అల్లుకోర సందెకాడ సొంత మేనమామా వాటమందుకో రేనిగుంట రాణివంట బిట్రగుట్ట దేవివంట నువ్వు సిగ్నలిచ్చి రైలు నాపుకో హే ఒంటి లోన సెట్టు పుట్టెరో ఎన్నడో ఒంటి పూస తేలు కుట్టెరో నేనాడదాన్నిరో ఆడింది ఆటరో అమ్మోర బాజిపేటరో అ అంటే... అ అంటే... అ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఇ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం ఉ అంటే ఉంగాపురం ఊ అంటే ఊగే జనం ఎ అంటే ఎత్తు పల్లం గాలమేస్తే వాలుతారు కుర్ర కులం పాలకొల్లు చేరినప్పుడే పిల్లడో పైట జారుడెక్కువాయరో యానాము చేరినా ఈనాము మారున ఫ్రెంచ్ పిడేలు ఆగునా హెయ్ ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో ఓరకంటి చూపుతోనె సంపుతుంటడు ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో గాలి తోనిగాలమేసి లాగుతుంటడు ఈల వేసి లాగుతారు ఆంధ్రా జనం