Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Adavi Ramudu (2004)





చిత్రం: అడవిరాముడు (2004)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: ప్రబాష్, ఆర్తి అగర్వాల్
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాతలు: చంటి అడ్డాల
విడుదల తేది: 21.05.2004



Songs List:



జింకవేటకు సింహంలా వస్తా పాట సాహిత్యం

 
చిత్రం: అడవిరాముడు (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: హరిహరన్ , చిత్ర


జింక వేటకు సింహంలా  వస్తా 




ఆకాశం సాక్షిగా పాట సాహిత్యం

 
చిత్రం: అడవిరాముడు (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: సోనునిగం, మహలక్ష్మి అయ్యర్


ఆకాశం సాక్షిగా 



నగరం పాట సాహిత్యం

 
చిత్రం: అడవిరాముడు (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: మల్లికార్జున్


నగరం




గోవిందా పాట సాహిత్యం

 
చిత్రం: అడవిరాముడు (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: కార్తీక్, శ్రేయ ఘోషల్ 


గోవిందా



అడుగేస్తే కడలైనా.. పాట సాహిత్యం

 
చిత్రం: అడవి రాముడు (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, మాలతి, సంగీత రాజేస్వరన్

అడుగేస్తే కడలైనా...దారిస్తుందీ
పిలిస్తే పొడి ఇసుకైనా...నీరిస్తుందీ..
మనసిస్తే  శిలైనా ప్రేమిస్తుందీ..హో
జంటను విడదీసే జగమెప్పుడు గెలిచిందీ...
జంటను విడదీసే జగమెప్పుడు గెలిచిందీ...
జన్మల ముడివేసే కధ ఎప్పుడు ముగిసిందీ
ప్రేమబలం చెదరనిదీ ప్రేమ రధం నిలవనిదీ
కత్తులు తీర్చనిదీ కాటిచిన్న కాల్చనిదీ
గాలులు తుంచనిదీ జడివానలు ముంచనిదీ
ఆత్మకున్న అన్నిలక్షణాలు ప్రేమా
కృష్ణుడన్న గీతలోని భావమె ప్రేమా

జంటను విడదీసే జగమెప్పుడు గెలిచిందీ...
జన్మల ముడివేసే కధ ఎప్పుడు ముగిసిందీ

ప్రేమబలం చెదరనిదీ ప్రేమ రధం నిలవనిదీ
చితినైనా బతికించే అమృతమే కాదా ప్రేమించే మనసంటే...
విధినైనా ఎదిరించ్చే నమ్మకమే రదా...ఆ మనసే నిదైతే...
అందుకే పద పద తెగించి ముందుకే సదా ఎదా తలొంచినందుకే
కదా ఇదంతా సహించి ఎందుకే వృదా  వ్యధా భరించి
చూస్తూ కూర్చుంటే బ్రతుకంతా బరువు కదా
బాధే బలమైతే ఎడబాటే బాటవదా
కొండనెత్తు సత్తు వున్న ఎంత ఘనులైనా

జంట చిచ్చు అంటుకున్న మంటనార్పగలరా
జంటను విడదీసే జగమెప్పుడు గెలిచిందీ...
జన్మల ముడివేసే కధ ఎప్పుడు ముగిసిందీ

ప్రేమబలం చెదరనిదీ ప్రేమ రధం నిలవనిదీ
నీకోసం జివించే చెలిమే వెలుగవదా నువు సాగే దారుల్లో...
నీపేరే ధ్యానించ్చే పిలుపే వినలేదా నిను తాకే గాలుల్లో..
ప్రాణమా నువ్వే ఇలా వెలేసి పోకుమా ఎటో అలా 
జతైన పాదమా నువ్వే ఇలా అసలిదిన్యాయమా క్షనమ్ క్షనమ్
వెన్నంటి ప్రేమా నావెంటే కడదాకా నీవుంటే నిప్పే నీరవదా
నిట్టూర్పే తూర్పవదా అష్ట దిక్కులడ్డువచ్చి నిన్ను ఆపగలవా
సప్తసాగరాలు దాటి నన్ను చేరలేవా...

జంటను విడదీసే జగమెప్పుడు గెలిచిందీ...
జన్మల ముడివేసే కధ ఎప్పుడు ముగిసిందీ
ప్రేమబలం చెదరనిదీ ప్రేమ రధం నిలవనిదీ
ప్రేమబలం చెదరనిదీ ప్రేమ రధం నిలవనిదీ




ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాట సాహిత్యం

 
చిత్రం: అడవిరాముడు (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: సంధ్యా , యస్. పి. బాలు

జనక జజ్జినక జనక జజ్జినక జనక జజ్జినక జా జా జా (2)

ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ...
నువ్వు కొంటె చూపు చూస్తేనే.! చలి చలి చలి చలి హా... చలి చలి

పారేసుకోవాలనారేసుకున్నావు అరె అరె అరె అరె
నీ ఎత్తు తెలిపింది కొండగాలీ...
నాకు ఉడుకెత్తిపోతుంది హరి హరి హరి హరి హరి హరి

ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి

రంపంపం పరంపం రంపంపం పరంపం రంపంపం పరంపం రంపం పరపం

నా లోని అందాలు నీ కన్నులా ఆరేసుకోనీ సందేవెళ
హో నాపాట ఈపూట నీ పైటలా దాచేసుకోనీ తొలి పొంగులా

ఆ...నా లోని అందాలు నీ కన్నులా ఆరేసుకోనీ సందేవెళ
హే నాపాట ఈపూట నీ పైటలా దాచేసుకోనీ తొలి పొంగులా

నీ చూపు సోకాలి
నా ఊపిరాడాలి
ఆ నీ చూపు సోకాలి
నా ఊపిరాడాలి
నీ జంట నా తీపి చలిమంటకావాలీ...

నీ వింత కవ్వింతకే కాగిపోవాలీ...
నీ కౌగిలింతలోనే దాగి పోవాలీ...

ఆరేసుకోబోయి పారేసుకున్నాను
హరి... హా... హరి... హా... హరి... హా... హరి... హా
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ...
నాకు ఉడుకెత్తిపోతుంది హరి హరి హాఁ హరి హరి హే హరి హరి

పారేసుకోవాలనారేసుకున్నావు
అరె... ఆఁ... అరె... ఆఁ... అరె... ఆఁ... అరె... ఆఁ

నీ ఒంపులో సొంపులే హరివిల్లు.! నీ చూపులో రాపులే విరిజల్లు
హా... నీ రూపు నా వలపు ఏరువాక నిను తాక నీలిమబ్బు నా కోక

నే రేగి పోవాలి
హా నేనూగిపోవాలి
నే రేగి పోవాలి
నేనూగిపోవాలి
చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలీ...

ఈ జోడు పులకింతలే నా పాట కావాలీ...
ఆ పాట పూబాటగా నిను చేరుకోవాలి...

ఆరేసుకోబోయి పారేసుకున్నాను
హరి... హా... హరి... హా... హరి... హా... హరి... హా
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ...
నువ్వు కొంటె చూపు చూస్తేనే చలి చలి హా చలి చలి హా హా చలి చలి
అరెరరె పారేసుకోవాలనారేసుకున్నావు అరె అరె అరె అరె
నీ ఎత్తు తెలిపిందీ కొండగాలీ...
నాకు ఉడుకెత్తిపోతుంది హరి హరి హరి హరి హరి హరి

లాలా లాలా లాలా లాలా లల ఆఁ... లల ఆఁ... లల ఆఁ... లల ఆఁ

Most Recent

Default