చిత్రం: అభి (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: వేటూరి (All Songs)
గానం: మాలతి
నటీనటులు: కమలాకర్, సొనాలి జోషి
దర్శకత్వం: డా౹౹. కిరణ్
నిర్మాత: బుచ్చేపల్లి సుబ్బారెడ్డి
విడుదల తేది: 2004
వంగ తోట మలుపు కాడ కొంగుపట్టి లాగాడే
సందు చూసి సైగే చేసి గోల చేశాడే ఏ... ఏ... ఏ...
వంగ తోట మలుపు కాడ కొంగుపట్టి లాగాడే
సందు చూసి సైగే చేసి గోల చేశాడే
హే... హే... హే...
వంగ తోట మలుపు కాడ కొంగుపట్టి లాగాడే
సందు చూసి సైగే చేసి గోల చేశాడే
చుట్టు కొలత చూస్తానంటూ గుట్టు కాస్తా లాగాడే
బక్క పలచ నడుమే తడిమి బంతులాడాడే
అందమంత ఇచ్చేమంటూ నన్ను చంపుకు తింటాడే
పచ్చబొట్టు లాగే నన్ను అంటి ఉంటాడే
హయ్య రామ హయ్య రామ
హయ్య రామ హయ్యయ్యో
హయ్య రామ హయ్య రామ
హయ్య హయ్యయ్యో
వంగ తోట మలుపు కాడ కొంగుపట్టి లాగాడే
సందు చూసి సైగే చేసి గోల చేశాడే
హే వచ్చినీడు వచ్చినట్టే అరె గిచ్చి గిచ్చి చంపుతుంటే
కుచ్చిళ్ళ వంకలో వత్తిళ్ల వంకతో ఒళ్ళంత తొక్కినారే
పచ్చి పచ్చి సిగ్గులెన్నో చెక్కిళ్ళ మీద పిచ్చి పిచ్చి మొగ్గలేస్తే
బుంగమ్మ మూతికి బుగ్గమ్మ బంతికి
ముద్దెట్టి పోయినాడే హే
అయ్యబాబోయ్ ఎక్కడోడే
చక్కనోడే గాని తిక్కలోడు
గోడెక్కి వస్తడు గోరుముద్దలిస్తడు
తుఫాను లాంటి వాడు బాలక్రిష్ణుడు
వంగ తోటా... వంగ తోటా...
వంగ తోట మలుపు కాడ కొంగుపట్టి లాగాడే
సందు చూసి సైగే చేసి గోల చేశాడే
హే గోంగూర సేను కాడ లంగోటి కాడ కంగారు పెట్టినాడే
వంగుంటే వాలుగా తొంగుంటే తోడుగా వాటేయ్య వచ్చినాడే
ఒంగోలు సంత కాడ శృంగారపోడు తింగేటు చూసినోడే
తూచేది తూచక సూచాయి తప్పక దోచేసి పోయినాడే
అయ్యబాబోయ్ పిల్లగాడే గంప దించి నా కొంప ముంచినాడు
మ్యాట్నీకి రమ్మని నడిరేత్రి రమ్మని దీపాలు పెట్టగానే ఏసుకుంటడు
వంగ తోటా... వంగ తోటా...
వంగ తోట మలుపు కాడ కొంగుపట్టి లాగాడే
సందు చూసి సైగే చేసి గోల చేశాడే
చుట్టు కొలత చూస్తానంటూ గుట్టు కాస్తా లాగాడే
బక్క పలచ నడుమే తడిమి బంతులాడాడే
అందమంత ఇచ్చేమంటూ నన్ను చంపుకు తింటాడే
పచ్చబొట్టు లాగే నన్ను అంటి ఉంటాడే
హయ్య రామ హయ్య రామ
హయ్య రామ హయ్యయ్యో
హయ్య రామ హయ్య రామ
హయ్య హయ్యయ్యో
******** ******* ********
చిత్రం: అభి (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: వేటూరి (All Songs)
గానం: సాగర్, సుమంగళి
ఎవరో అతనెవ్వరో అతిధిగ వచ్చాడు
నిదరే పోతున్న నా ఎదనే కదిపాడు
ఎవరో తను ఎవ్వరో ఎదురే వచ్చింది
వివరం ఏం చెప్పను విరహం రేపింది
తెలవారే వేళా కలగన్నా తననే
అది ప్రేమో ఏమో ఏమిటో...
ఎవరో తను ఎవ్వరో ఎదురే వచ్చింది
నిదరే పోతున్న నా ఎదనే కదిపాడు
అణువణువు అతని తలపై ఏతించ సాగె
అనుదినము వినని కథలే వినిపించేనే
చెలి మనసు అడిగి మనసు వెంటాడే సాగె
తొలివలపో జతకు పిలుపో బదులే రాదే
మనసంటే నేరం మనసంటే భారం
నిలిచేనా ప్రాణం ఒంటిగా...
ఎవరో తను ఎవ్వరో ఎదురే వచ్చింది
వివరం ఏం చెప్పను విరహం రేపింది
ఎవరో అతనెవ్వరో అతిధిగ వచ్చాడు
నిదరే పోతున్న నా ఎదనే కదిపాడు
హో పరిచయమే ఓ పరిమళమై గంధాలు పూసే
పరువమిలా ఓ పరవశమై గ్రంథం రాసే
ప్రతి నిమిషం బ్రతుకు సుఖమై ఉయ్యాలలూగే
జతకలిసే అతని కొరకే ఎదురే చూసి
హృదయంలో దాహం తడిపే ఓ మేఘం
ఎపుడో నీ స్నేహం ఓ ప్రియా...
ఎవరో అతనెవ్వరో అతిధిగ వచ్చాడు
నిదరే పోతున్న నా ఎదనే కదిపాడు
తెలవారే వేళా కలగన్నా తననే
అది ప్రేమో ఏమో ఏమిటో...