Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Chatrapati (2005)





చిత్రం: ఛత్రపతి (2005)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: ప్రభాస్, శ్రియ శరన్, ఆర్తి అగర్వాల్, భానుప్రియ
దర్శకత్వం: ఎస్. ఎస్. రాజమౌళి
నిర్మాత: బి.వి.యస్.యన్.ప్రసాద్
విడుదల తేది: 30.09.2005



Songs List:



A వచ్చి B పై వాలె పాట సాహిత్యం

 
చిత్రం: ఛత్రపతి (2005)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్.యమ్.కీరవాణి ,  మాతంగి

A వచ్చి B పై వాలె B వచ్చి C పై వాలె C వచ్చి D పై వాలిందే
వన్నొచ్చి టూపై వాలె టూవచ్చి త్రీ పై వాలె త్రీ వచ్చి ఫోర్ పై వాలిందే
A B C అంటే నాలో అందం
వన్ టూ త్రీ అంటే నీలో వేగం
వేగంతో అందాన్నే గుణకారం చెయ్యాలే
ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు
ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు
ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు
ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

చరణం : 1
నీ సెల్లు నంబర్ కనిపెట్టా నీ ఇల్లు నంబర్ కనిపెట్టా
నీ ఒళ్లు నంబర్ కనిపెట్టానే
ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
నీ గ్రీన్ సింబల్ కనిపెట్టా ఆటీన్ సింబల్ కనిపెట్టా
ప్రోటీన్ సింబల్ కనిపెట్టాలే

ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
నీ నంబరు నా సింబలు ఓ కుంభకోణంగా
నవంబరు డిసెంబరు ఆరంభ కాలంగా
ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

A వచ్చి B పై వాలె  B వచ్చి C పై వాలె C వచ్చి D పై వాలిందే
వన్నొచ్చి టూపై వాలె టూవచ్చి త్రీ పై వాలె త్రీ వచ్చి ఫోర్ పై వాలిందే

ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు
ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు
ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు
ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు
ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు
ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు
ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

చరణం : 2
మా నాన్ననడిగి యస్సంటా పెదనాన్ననడిగి యస్సంటా
మా ఫ్యాన్స్‌ నడిగి యస్సంటాలే
ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
మా బామ్మనడిగి కిస్సంటా తాతమ్మనడిగి కిస్సంటా
జేజమ్మనడిగి కిస్సంటాలే

ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
నా యస్సుని నీ కిస్సుతో సరికూడుకున్నాక
వయస్సుని వయస్సుతో తెగవాడుకున్నాక
ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

A వచ్చి B పై వాలె  B వచ్చి C పై వాలె C వచ్చి D పై వాలిందే
వన్నొచ్చి టూపై వాలె టూవచ్చి త్రీ పై వాలె త్రీ వచ్చి ఫోర్ పై వాలిందే

ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు
ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు
ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు
ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు
ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు
ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు
ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు



అగ్నిస్ఖలన సందగ్ధరిపు పాట సాహిత్యం

 
చిత్రం: ఛత్రపతి (2005)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్తా
గానం: యమ్.యమ్.కీరవాణి, మాతాంగి

అగ్నిస్ఖలన సందగ్ధరిపు
వర్గ ప్రళయ రథ ఛత్రపతి
మధ్యందిన సముద్యత్ కిరణ
విద్యుద్యుమణి ఖని ఛత్రపతి
తజ్జంతజణు తద్ధింధిరణ
ధింధిం తకిట నట ఛత్రపతి
ఉర్వీవలయ సంభావ్యవర 
స్వచ్ఛందనుమతి

కుంభీనికర కుంభస్థగురు
కుంభీ వలయపతి ఛత్రపతి
ఝంఝాపవన గర్వాపహర
వింధ్యాద్రి సమధృతి ఛత్రపతి
చండప్రబల దుర్దండజిత
దుర్జండ భట పతి ఛత్రపతి
శత్రుప్రకర విచ్ఛేదకర
భీమార్జునప్రతి

కుంభీనికర కుంభస్థగురు
కుంభీ వలయపతి ఛత్రపతి
ఝంఝాపవన గర్వాపహర
వింధ్యాద్రి సమధృతి ఛత్రపతి
చండప్రబల దుర్దండజిత
దుర్జండ భట పతి ఛత్రపతి
శత్రుప్రకర విచ్ఛేదకర 
భీమార్జునప్రతి

ధిగ్ ధిగ్ విజయ ఢంకానినద 
ఘంటారవ తుసిథ ఛత్రపతి
సంఘస్వజన విద్రోహిగణ
విధ్వంసవ్రతమతి ఛత్రపతి
ఆర్తత్రాణ ధృష్టద్యుమ్న
క్షాత్రస్పూర్తి ధీధితి 
భీమక్ష్మాపతి శిక్షాస్మృతి స్తపతి



సుమ్మా మాసూరియా పాట సాహిత్యం

 
చిత్రం: ఛత్రపతి (2005)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కళ్యాణి మాలిక్, సునీత, స్మిత

సుమ్మా మాసూరియా  సుమ్మా మాసూరియా  సూదంటూ రాయిలా నీ ఎంట నేనయా 
నీ ఎంట నేనయా నీ ఎంట నేనయా
నీకు నాకు మధ్యన రగసమేది లేదయా
రగసమేది లేదయా రగసమేది లేదయా 
ఇద్దరికి తెలిసిన ఇషయమొకటి ఉందయ్యా

యా యా యా యా ఐ లైక్ దిస్ యా
యా యా యా యా ఐ వాంట్ దిస్ యా
యా యా యా యా ఐ లైక్ దిస్ యా
యా యా యా యా ఐ వాంట్ దిస్ యా

కధలో మలుపే కసిగా తిరిగెనయ్యా
రామయ్యా వస్తావయ్యా 
సుమ్మా మాసూరియా 
రామయ్యా వస్తావయ్యా 
సుమ్మా మాసూరియా 
రామయ్యా వస్తావయ్యా 
సుమ్మా మాసూరియా 

సుమ సుమ సుమ సుమ సుమ సుమ 
సుమ్మా మాసూరియా  సుమ్మా మాసూరియా 
మాటలతో పెంచనా మందులేని ఫోబియా 
మందులేని ఫోబియా సుమ్మా మాసూరియా 
ముదురుతుంటే చూపనా మధ్య రాత్రి మానియా 
మధ్య రాత్రి మానియా సుమ్మా మాసూరియా 
తగ్గడానికుందిగా అందమైన ఐడియా 

యా యా యా యా ఐ లైక్ దిస్ యా
యా యా యా యా ఐ వాంట్ దిస్ యా
యా యా యా యా ఐ లైక్ దిస్ యా
యా యా యా యా ఐ వాంట్ దిస్ యా

రెడియా స్టడియా జరుగును దోపిడియా 
రామయ్యా వస్తావయ్యా
సుమ్మా మాసూరియా 
రామయ్యా వస్తావయ్యా
సుమ్మా మాసూరియా 
యా యా వస్తావయ్యా
సుమ్మా మాసూరియా 

సొగసరి సన్యాసం మంట గలిసేలేవయ్యా
మగసిరి విన్యాసం కంట పడినయా
వెనకటి వేదాంతం బూడిదాయే చూడయ్యా 
సూక్ష్మంలో మోక్షం భోదపడెనయ్యా
జగమే ఒక మాయ సుఖమే ఒక లోయ 
అందులో పడిపోయా సుమ్మా మసూరియా 

యా యా యా యా ఐ లైక్ దిస్ యా
యా యా యా యా ఐ వాంట్ దిస్ యా
యా యా యా యా ఐ లైక్ దిస్ యా
యా యా యా యా ఐ వాంట్ దిస్ యా

వ్రతమే చెడినా ఫలమే దొరికెనయా
రామయ్యా వస్తావయ్యా 
సుమ్మా మాసూరియా 
రామయ్యా వస్తావయ్యా 
సుమ్మా మాసూరియా 
రామయ్యా వస్తావయ్యా 
సుమ్మా మాసూరియా 



నల్లనివన్నీ నీళ్లని పాట సాహిత్యం

 
చిత్రం: ఛత్రపతి (2005)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర

నల్లనివన్నీ నీళ్లని తెల్లనివన్నీ పాలని
అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా
నేను చేసిన తప్పు చెరిగిపోయేనా
జరిగిన కథ విని ఏ కడలి నవ్వింది
మమతకే తగనని తొలిసారి తెలిసింది

నల్లనివన్నీ నీళ్లని తెల్లనివన్నీ పాలని
అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా
నేను చేసిన తప్పు చెరిగిపోయేనా

చరణం: 1
వేయి కన్నుల కావేరిని కడుపులోన దాచుకున్నా
అంతులేని కడలి లోతును నేను చూస్తున్నా
కడుపులో నిను మోయకున్నా 
అమ్మ తప్పును కడుపులోన
దాచుకున్నా నిన్ను చూస్తున్నా
జరగనే జరగదు ఇకపైన పొరపాటు
నమ్మరా అమ్మని నీ మీద నా ఒట్టు

నల్లనివన్నీ నీళ్లని తెల్లనివన్నీ పాలని
అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా
నేను చేసిన తప్పు చెరిగిపోయేనా

చరణం: 2
తప్పటడుగులు వేసినా తల్లిగా విసిరేసిన
ఈ దారి తప్పిన తల్లిని వదిలెయ్యకు
చచ్చిపుడుతా నాయనా బిడ్డగా నీ కడుపున
జరగనే జరగదు ఇకపైన పొరపాటు
నమ్మరా అమ్మని నీ మీద నా ఒట్టు

నల్లనివన్నీ నీళ్లని తెల్లనివన్నీ పాలని
అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా
నేను చేసిన తప్పు చెరిగిపోయేనా



మన్నేల తింటివిరా కృష్ణా పాట సాహిత్యం

 
చిత్రం: ఛత్రపతి (2005)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్తా
గానం: టిప్పు , స్మిత, కళ్యాణి మాలిక్

శ్రీ కనక మహాలక్ష్మి కి జై
శ్రీ సింహాచలం నరసింహ స్వామికి జై
శ్రీ అన్నారం సత్యన్నారాయణ స్వామికి జై
శ్రీ రాజ రాజేశ్వరి వరప్రసాద మహారాజ
శ్రీ పసలపూడి పంకజం గారికి 
పర్వ కళ నాట్యమండలికి జై
అందుచేత ఆడియన్స్ లారా 
రసిక సిఖామణులారా
వాసికెక్కిన వైజగు వాసులరా
మన్ను తిన్న కృష్ణయ్యను
మందలించిన యశోధమ్మతో 
ఆ వెన్న దొంగ
నువ్వు తొక్కవయ్యా హార్మోని
పోలీస్ బాబు గారు చూస్తున్నారు

కన్నయ్య బాలురు గొల్లులు చెప్పిరిగాని
ఏ పాపమెరుగునే తల్లి
ఎలెస్ ఏటిరా ఈ ఎదవ గోల
నేను మన్నసలే తినలేదే తల్లి
ఏయ్ అబద్ధాలడతావు
మన్ను తినడానికి నీకు ఏం కర్మ పట్టిందిరా 
నీకు వెన్నల్లేవా జున్నులేవా
అరిసెల్లేవా పోని అటుకుల్లేవా 
నీకు నీకు...
ఎంటవుతుందిరా..?
నీకు పంచదార పూరీలు లేవా 
నీకు మిరపకాయ బజ్జీలు లేవా
నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా 
లడ్డు మిఠాయి నీకు 
లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తి
మన్నేల తింటివిరా కృష్ణా 
మన్నేల తింటివిరా కృష్ణా 
మన్నేల తింటివిరా కృష్ణా 
లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తి
మన్నేల తింటివిరా కృష్ణా

పొద్దుకాల తడిపిదూడా
పొదుగుపాలు తాగబోతే 
ఆ తాగబోతే 
లాగిపెట్టి తన్నిందే మట ్టిమూతి కంటిందే 
అయ్యయ్యో
ఉల్లి పెసరట్లు లేవా రవ్వా మినపట్లు లేవా అప్పలెనకా పప్పులు లేవా 
కొట్టిన కొబ్బరి చిప్పలు లేవా
నీకు కాకినాడా కాజాలు లేవా 
నీకు మైసూరు బొండాలు లేవా
నును బందారు లడ్డూలు లేవా
ఆహ ఆత్రిపురం పూతరేకులు లేవా 
రంగు జాంగిరి నీకు రమ్యముగా చేయిస్తి
మన్నేల తింటివిరా కృష్ణా 
మన్నేల తింటివిరా కృష్ణా

ఏటిగట్టు తోటలోనా
మొక్కనాటి నీరు పెట్టి
ఎరువు మీద ఎరువేసి ఏపుగా పెంచినట్టి 
చెక్కరకేలి గెలలు లేవా
పంపర పనస తొనలు లేవా 
పూరిల్లేవా బూరెల్లేవా తేనెల్లో ముంచిన గారెల్లేవా 
నీకు కాశ్మీరు యాపిల్సు లేవా
అరెరే పాలకొల్లు బత్తాయి లేదా 
ఇటు వడ్లమూడి నారింజ లేదా 
అయ్యో కాబోలి దానిమ్మలు లేవా 
పాల ముంజలు నీకు పరువముగా చేయిస్తి మన్నేల తింటివిరా కృష్ణా 
నువు మన్నేల తింటివిరా కృష్ణా




గుండుసూది గుండుసూది పాట సాహిత్యం

 
చిత్రం: ఛత్రపతి (2005)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్.యమ్.కీరవాణి, సునీత

గుండుసూది గుండుసూది
గుచ్చుకుంది గుండుసూది
గుంజిందయ్యో గుండె నాది
గుట్టులాగిందయ్యో పండు లోది
గుండుసూది గుండుసూది
గుచ్చుకుంటే తప్పు నాది
తగ్గించనా నెప్పి నీది 
హాయి తెప్పించనా ఊది ఊది

చరణం: 1
తగిన వేళల తొలిసారి
తెగని వేళల మలిసారి
హే పడక వేళల ప్రతిసారి
పగటి వేళల ఒకసారి
ఈ కోప తాపాలన్ని తీరేలాగ నన్నే 
ఊపాలి బ్రహ్మచారి
నీ గోరు వంకల్లోన చేరేవేళ నేనే 
అయిపోనా భామచారి
అమ్మమ్మ అబ్బబ్బబ్బా
హయ్యయ్యయ్యో అంతా వినక
అచ్చచ్చో చిచ్చో పిచ్చో 
సిగ్గులకే సెలవిచ్చో వచ్చేయి వెనక
చూపాలయ్యో ఊపు నీది 
నాకు చెప్పాలయ్యో తీపి సోది

గుండుసూది గుండుసూది
గుచ్చుకుంటే తప్పు నాది
గుంజిందయ్యో గుండె నాది
గుట్టులాగిందయ్యో పండు లోది

చరణం: 2
నీకు బోలెడు అది ఉంది 
నాకు బుట్టెడు ఇది ఉంది
ఉఁ ఎత్తిపోతల పదునుంది 
ఉక్కపోతల పని ఉంది
మత్తుల్లో గమ్మత్తుల్లో ముంచెత్తాలి నేడే
తేనెల్లో ఈది ఈది
చాటుల్లో మాటుల్లోన ఆడే ఆటల్లోన 
మారాలి తేది తేది
ఇంకింకా ఇంకా ఇంకా 
కావాలింకా అహా చురక
స్త్రీలంక చూడాలింకా 
నాతోనే కూడింక ఛీపో అనక
నచ్చావయ్యో ఉగ్రవాది 
నిన్ను చేసెయ్యనా జన్మ ఖైదీ

గుండుసూది గుండుసూది 
గుచ్చుకుంటే తప్పు నాది
గుంజిందయ్యో గుండె నాది
హాయి తెప్పించనా ఊది ఊది



గల గల గల గల పాట సాహిత్యం

 
చిత్రం: ఛత్రపతి (2005)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: జస్సి గిఫ్ట్, చిత్ర

గల గల గల గల గజ్జెలు తొడిగిన గ్రంథసాంగి
నీ కోసమే నేనేస్కొనొచ్చా గలా గళ్లలుంగి 
కుర్ కుర్ కుర్ర కొర కొర చూపుల కొంటె కోణంగి
నా మనసు లో ఏం దాగి వుందో
చూస్కో తొంగి తొంగి 
చన్నీళ్ళో వేన్నీళ్ళు పోసి చల్లంగ వేడెక్కజేసి 
నవ్వుల్లో నాజూకు తీసి నమిలేసి

గల గల గల గల గజ్జెలు తొడిగిన గ్రంథసాంగి 
నీ కోసమే నేనేస్కొనొచ్చా గలా గళ్లలుంగి 
కుర్ కుర్ కుర్ర కుర్ర కొర కొర చూపుల కొంటె కోణంగి 
నా మనస్సులో ఏం దాగి వుందో చూస్కో తొంగి తొంగి

పండు కోయగలవా దాని తొక్క తియ్యగలవా తొక్కలా బిరుసెక్కిన నా తిక్క తీర్చగలవా 
పండు పిండగలనే దాని తొక్క మొక్కగలనే 
పక్కలో మగ దిక్కునై రసమొక్కు తీర్చగలనే వలుచుకో వాటేసి వయసు వరహ 
అదరహొ అందాల ఆడతరహా 
తమాయించుకోరా దరువేసి

గల గల గల గల గజ్జెలు తొడిగిన గ్రంథసాంగి 
నీ కోసమే నేనేస్కొనొచ్చా గలా గళ్లలుంగి 

పట్టి చూడగలవా ఎద గట్టు డాటగలవా 
గుట్టుగా రసపట్టులో చెలి ఉట్టికొట్టగలవా 
పట్టు పట్టగలనే జడపట్టి దూకగలనే 
గుట్టుగా ఊరొచ్చిన చిరు చట్టి పట్టుగలనే 
అందుకెవరున్నారు  నేను మినహ 
అందుకే విన్నాను లేడి సలహ 
తమాయించుకోరా తలుపేసి

గల గల గల గల గజ్జెలు తొడిగిన గ్రంథసాంగి
నీ కోసమే నేనేస్కొనొచ్చా గలా గళ్లలుంగి 
కుర్ కుర్ కుర్ర కుర్ర కొర కొర చూపుల కొంటె కోణంగి
నా మనసు లో ఏం దాగి వుందో
చూస్కో తొంగి తొంగి
చన్నీళ్ళో వేన్నీళ్ళు పోసి చల్లంగ వేడెక్కజేసి 
నవ్వుల్లో నాజూకు తీసి నమిలేసి

Most Recent

Default