Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ashok (2006)

చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: జూ.యన్. టి.ఆర్, సమీరా రెడ్డి
దర్శకత్వం: సురేంధర్ రెడ్డి
నిర్మాత: వల్లూరిపల్లి రమేష్
విడుదల తేది: 14.07.2006

Songs List:

గోల గోల రంగోల పాట సాహిత్యం

చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: రవి వర్మ , సుజాతా మోహన్ 

గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొగినేల 
గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొగినేల 
ఓ పువ్వుల బాల

గోల గోల రంగోల మేళతాలా మేఘాలతేడా ఏదో వచ్చేవేళా
వేలా వేవేల విరహాల తెర దించాల
నీలా నవనీలా మువలీల జరిపించాలా

దింతనత్త దింతాసరియా తెరుకోవే చెలియా సఖియా
దింతనత్త దింతాసరియా చేరుకుంటే చలియాగిలియా
దింతనత్త దింతాసరియా చూడమంటా విధియా తధియా
దింతనత్త దింతాసరియా వెయ్యమంటా తలుపుల గడియా

గోల గోల గోల గోల
గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొగినేల 
గోల గోల రంగోల మేళతాలా మేఘాలవేళా  ఏదో వచ్చేవేళా 

తడబడుతున్నా ఓ క్షణమున స్థిరపడుతున్నా నీ సరసన చూడాలి సుందన వదన
భయపడుతున్నా ఓ క్షణమున బలపడుతున్నా నీ మనస్సున చెయ్యాలి చీకటి రచన

ఔనన్నా కాదన్నా హరినారాయణ నీ పైనా ఇకపైనా వడ్డీ వెయ్యనా
కలవమ్మా కలపమ్మా ఇక ద్వారాలిలా ప్రియమైనా నీలోనా నను పారేసుకోనా

దింతనత్త దింతాసరియా తెరుకోవే చెలియా సఖియా
దింతనత్త దింతాసరియా చేరుకుంటే చలియాగిలియా
దింతనత్త దింతాసరియా చూడమంటా విధియా తధియా
దింతనత్త దింతాసరియా వెయ్యమంటా తలుపుల గడియా

గోల గోల గోల గోల
గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొగినేల 
గోల గోల రంగోల మేళతాలా మేఘాలవేళా  ఏదో వచ్చేవేళా

అడుగెడుతున్న నీ సొగసును అడిగేస్తున్నా ఒక వరసన సాగాలి పెదవుల భజన
నసపెడుతున్నా మగతనమున వశమవుతున్నా పరవశమున నేర్పాలి నడుముకి నటన
వింటున్న ప్రియమైన  నీ ఆలాపనా వింటానే ఇకపైన కసిప్రేలాపనా
సరసాన సిగ్గన్తా శ్రీ కృష్ణార్పనా పగలైనా రాత్రైనా నిన్ను ప్రశ్నించగలదా

దింతనత్త దింతాసరియా తెరుకోవే చెలియా సఖియా
దింతనత్త దింతాసరియా చేరుకుంటే చలియాగిలియా
దింతనత్త దింతాసరియా చూడమంటా విధియా తధియా
దింతనత్త దింతాసరియా వెయ్యమంటా తలుపుల గడియా

గోల గోల గోల గోల
గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొగినేల 
గోల గోల రంగోల మేళతాలా మేఘాలవేళా  ఏదో వచ్చేవేళా

నువ్వసలు నచ్చలే పాట సాహిత్యం

చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: జాస్సి గిఫ్ట్ , చిత్ర 

నువేసుకున్న డ్రెస్సు నచ్చలే

ఏకాంతంగా ఉన్నా పాట సాహిత్యం

చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: కారుణ్య

ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా 
నీకై నేను అలోచిస్తున్నా
ఏ పని చేస్తూ ఉన్నా ఎటు పయనిస్తూ ఉన్నా 
నిన్నే నేను ఆరాధిస్తున్నా
ఎన్నెన్నో కళ్ళు నా వైపే చూస్తూ ఉన్నా
నిలువెల్లా కళ్ళై నీకోసం చూస్తూ ఉన్నా
ఎన్నెన్నో పెదవుల పలుకులు వినిపిస్తున్నా
నీ పెదవుల పిలుపుల కోసం పడిచస్తున్నా
నా తనువంతా మనసై ఉన్నా…

ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా…

రాయని లేఖలు ఎన్నో నా అరచేతుల్లో
ఇంకా కమ్మని సంగతులెన్నో నా ఎద గుండెల్లో
కురవని చినుకులు ఎన్నో పెదవుల మేఘంలో
ఇంకా తిరగని మలుపులు ఎన్నో జతపడు మార్గంలో
మనసైన ఆకర్షణలో మునకేస్తున్నా 
ప్రియమైన సంఘర్షణలో పులకిస్తున్నా
నా వయస్సంతా వలపై ఉన్నా…

ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా…

స్పందన నేనై ఉంటా నీ హృదయంలోనా
చల్లని లాలన నేనై ఉంటా నీ అలసటలోనా
అర్చన నేనై ఉంటా నీ ఒడిగుడిలోనా
వెచ్చని రక్షణ నేనై ఉంటా ఒడిదుడుకుల్లోనా
నీ జీవననదిలో పొంగే నీరవుతున్నా 
సంతోషం ఉప్పొంగే కన్నీరవుతున్నా
శతజన్మాల ప్రేమౌతున్నా…

ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా...

ఒక చిన్ని నవ్వే నవ్వి పాట సాహిత్యం

చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: KK

ఒక చిన్ని నవ్వే నవ్వి… యుధ్దాలెన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి… బంధాలెన్నో కలపొచ్చూ (2)
చిరునవ్వుల దీపం వెలిగించూ… నీ బాధలకీగతి తొలగించూ
చిరునవ్వుల బాణం సంధించూ… శత్రువులే ఉండరు గమనించూ

మనిషన్నోడే మనసారా… తానే నవ్వొచ్చూ
మనసున్నోడే తనవారిని… కూడా నవ్వించూ
పైనున్నోడే నీ నవ్వును… చూసి దిగి వచ్చూ
నీతో పాటే తన కష్టం మరవచ్చూ…

ఒక చిన్ని నవ్వే నవ్వి… యుధ్దాలెన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి… బంధాలెన్నో కలపొచ్చూ

నీ గుండెల్లోనా గాయాలెన్నున్నా… పెదవుల్లో నవ్వే వాటికి మందూ
నీ కన్నుల్లోనా కన్నీరెంతున్నా… అదరాల నవ్వే వాటికి హద్దూ
త్వరగా నిను చూసి… నవ్వేవారు నిద్దుర పోయేట్టూ
సరిగా నీ నవ్వుని నిచ్చెన చేసి… ఎక్కర పై మెట్టూ

నీ కోపం నువ్వే కరిగించు… నీ రూపం నువ్వే వెలిగించూ
ఈ పాఠం నువ్వే పాటించు… పది మందికి నువ్వే చాటించూ

ఒక చిన్ని నవ్వే నవ్వి… యుధ్దాలెన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి… బంధాలెన్నో కలపొచ్చూ

ఏడ్చేవాళ్ళుంటే ఇంకా ఏడ్పించీ… కసితీరా నవ్విస్తుందీ లోకం
నవ్వే వాళ్లుంటే నవ్వులు నటియించి…కడుపారా ఏడుస్తుందీ కాలం
కనుకే లోకాన్నే ఎదిరించేటి… మార్గం కనిపెట్టు
కదిలే కాలాన్నే ఎదురీదేటి… ధైర్యం చూపెట్టూ

ఈ జీవిత సత్యం గుర్తించూ… ఆనందం నీవై జీవించూ
నీ చలనం నువ్వే గమనించూ… సంచలనం నువ్వే సృష్టించు

ఒక చిన్ని నవ్వే నవ్వి… యుధ్దాలెన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి… బంధాలెన్నో కలపొచ్చూ (2)

జాబిలికి వెన్నెలనిస్తా పాట సాహిత్యం

చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిహరన్, శ్రీ వర్ధిని

జాబిలికి వెన్నెలనిస్తా

ముంతాజ్ మహల్ పాట సాహిత్యం

చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: దేవన్ ఏకాంబరం, తన్విషా

ముంతాజ్ మహల్  కట్టించాడే షాజహాను 

Most Recent

Default