చిత్రం: వీధి (2006)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం:
గానం: చిత్ర
నటీనటులు: శర్వానంద్, గోపిక
దర్శకత్వం: వి.దొరైరాజ్
నిర్మాత: రామోజీరావు
విడుదల తేది: 2006
బృందావనికే చిందులు నేర్పే
వెన్నెల వేళకు వన్నెలు కూర్చి
రాశావు ఓ రాసలీల
జనకు జనకు జనరే జనకు జనకు జనరే
జనకు జనకు జన జనకు జనకు జన
పదము కదిలే కృష్ణా కృష్ణ
డమకు డమకు ఎద డోలు మోగే కృష్ణ
కృష్ణ కృష్ణ కృష్ణ
జనకు జనకు జన జనకు జనకు జన
పదము కదిలే కృష్ణా కృష్ణ
డమకు డమకు ఎద డోలు మోగే కృష్ణ
బృందావనికే చిందులు నేర్పి
వెన్నెల వేళకు వన్నెలు కూర్చి
రాశావు ఓ రాసలీల
వలపుల పాటే ఆలకిస్తూ మల్లెల ఆటలు
రేపావు ఓ తీపి గోల
ఓ పక్కన రక్కసి మూకలతో సమరాలను చేశావు
ఈ పక్కన చక్కని చుక్కలకే చీరలు దాచావు
చూశాము నంద నందన ఓ కన్నయ్య
మా కన్నుల వెలుగే నీవయ్యా గోపాలా
చూశాము నంద నందన ఓ కన్నయ్య
మా కన్నుల వెలుగే నీవయ్యా
మురళి రవళి విని మధుర సరళి కని
మురిసె యమున కృష్ణా కృష్ణ
ఉలికి ఉలికి పడి ఊయలూగె కృష్ణ
ఏ కోటదో చిలకమ్మా ఈ తోటకొచ్చింది
పలుకే నేర్చిందా తన కులుకే మార్చిందా
ఈ గాలిలో రాగలే ఆ గొంతు పాడింది
మనసే మురిసిందా హరివిల్లై విరిసిందా
గుండెల్లో సంగీతాలు శృతి చేసిన సంతోషాలు
అందంగా తారలు తీసి ఎగరేయనీ
కన్నుల్లో మెలిగే కలలు కమ్మనిచిరు ఆశల అలలు
కోలాటాలాడే వేళకు తెరతీయని
ఈ ఈడులో ఒక వేడిలో అడుగేస్తే సయ్యా సయ్యా
బృందావనికే చిందులు నేర్పే
వెన్నెల వేళకు వన్నెలు కూర్చి
రాశావు ఓ రాసలీల
కొలను నీటి అలలపైన సాగే దీపతోరణాలు
కలికి తనము కోరుకున్న కల ఈ కాంతి నందనాలు
దీపాంజలి ప్రేమ రూపాంజలి
దివ్యాంజలి కిరణ కావ్యాంజలి
ఓ చిన్నిది చూపులతో బాణాలు వేసింది
ఎవరా సోగ్గాడు తొలి తిరిగే చేశాడు
మాటన్నది మరిచాడు మెలికెల్ని తిరిగాడు
అవునా కుర్రోడా సిగ్గెందుకు వెర్రోడా
రా రమ్మని పిలిచెను రాధ
ప్రేముంటే చెప్పేయ్ రాదా
లోలోపల ఎందుకు బాధ ఓ మాధవా
సరసాలే సాగేవేళ సన్యాసం కుదరదు బాల
సందట్లో సందేహాలు సరికాదురా
ఈ కేళిలో రంగేళిలో సరదాలు సయ్యా సయ్యా
బృందావనికే చిందులు నేర్పే
వెన్నెల వేళకు వన్నెలు కూర్చి
రాశావు ఓ రాసలీల
గోపి కృష్ణ గోపాల కృష్ణ మువ్వా గోపాలా
రాధా కృష్ణ జై జై కృష్ణ వేణుగోపాల
గోపి కృష్ణ గోపాల కృష్ణ మువ్వా గోపాలా
రాధా కృష్ణ జై జై కృష్ణ వేణుగోపాల