చిత్రం: అన్నవరం (2006) సంగీతం: రమణ గోగుల నటీనటులు: పవన్ కళ్యాణ్, అసీన్, సంధ్యా దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు నిర్మాత: పరాస్ జైన్ విడుదల తేది: 29.12.2006
Songs List:
రాక్షస రాజ్యం పాట సాహిత్యం
చిత్రం: అన్నవరం (2006) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: మాస్టర్జి గానం: రమణ గోగుల రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలియుద్దం కత్తికి ఖండగ నరికేటందుకు ఉన్నానెప్పుడు నే సిద్దం ఏయ్ ఇది నా వేదం గుండెల శపదం గగన విహారం రణరంగం కొరిమిలో కత్తికి పెట్టిన కత్తులు కావా ఎప్పూడు పరిహారం ఏయ్ దహధన కత్తులకు ఊపిరిపోసిన గూటం దెబ్బది ఈ ఘాతం గన గన మండే నిప్పుల కొరిమిలో కాలే కత్తుల కోలాటం చరణం: 1 పల్లె మాతల్లి మాకు బువ్వను పెట్టింది జాబిల్లి సిరిమల్లి సుఖసంపదలిస్తుంది కలిగంజి తాగైనా మేం చల్లంగుంటుంటే దాస్థికం దౌర్జన్యం మామెతుకులు దోస్తుంటే మన ఉణికిని చిత్రం చేసినోడి మూలాలను చేదించి జనజాతి రక్షణకు కత్తిపట్టిన పోతురాజులం మేమేలే రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలియుద్దం కత్తికి ఖండగ నరికేటందుకు ఉన్నానెప్పుడు నే సిద్దం చరణం: 2 దూళికి జూకు దమరుకు మళ్ళి భేరిలైలేద్దాం సెల్లం గొడ్డలి భల్లెం మాకు ఆయుధాలమవుతాం కత్తులు కాళ్ళై సమరంలో కవాతు చేస్తాయి - సై సై సుత్తులు వేళ్ళై యుద్దంలో బాకులు దూస్తాయ్ - రైరై బ్రతకాలంటే చావడానికే సిద్ధంగున్నోళ్ళం మాబ్రతికే హక్కును కాలరాస్తే అంతుతేల్చుకోవడం రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలియుద్దం కత్తికి ఖండగ నరికేటందుకు ఉన్నానెప్పుడు నే సిద్దం
లూసియా పాట సాహిత్యం
చిత్రం: అన్నవరం (2006) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: చంద్రబోస్ గానం: రమణ గోగుల లూసియా ఆకాశం నీరునిప్పు నేల ఈగాలి నాకోసం చెప్పిందల్లా చేస్తూ ఉండాలి ఆకాశం నీరునిప్పు నేలఈగాలి నాముందు చేతులు కట్టి దండం పెట్టాలి చల్ చల్ సంతోషం నా ఇంట్లోనే నట్టింట్లోనే చల్ చల్ ఆనందం ఉంది ఒంట్లోనే చల్ చల్ ఉత్సాహం వరదయ్యే నవనాడుల్లోనే చల్ చల్ ఉత్తేజం నేనే నేనేలే - లూసియా చరణం: 1 నింగిలా వెలుగుతా నీటివలె పొంగిపారుతా గాలిలా నిండుగా జ్వాలనై మంటరేపుతా నేలలా కదులుతా లోకాన్నే కదిలించేస్తా పంచభూతాలును నాలో చూపుతా చూపుతా చల్ చల్ గడియారం ఉన్నది చూడు నాచేతుల్లో చల్ చల్ నాటైమును నేనే నడిపిస్తా చల్ చల్ పుస్తకము పెన్ను ఉంది నా గుప్పెట్లో చల్ చల్ నా చరిత నేనే రాసేస్తా - లూసియా చరణం: 2 రాజునై బంటునై రెంటినీ నేనేనంటా యుద్దము, శాంతము మద్యలో నేనేనంటా పయనము, గమ్యము మొత్తము నేనేనంటా నేటినై, రేపువైపు సాగుతుంటా సాగుతుంటా చల్ చల్ నాముందు నావెనకాల నేనే ఉంటా చల్ చల్ నాపోటీ నేనే వస్తుంటా చల్ చల్ నాకళ్ళు నన్నే చూసి కుళ్ళేనంట చల్ చల్ నాదిష్టి నేనే తీస్తుంటా - లూసియా ఆకాశం నీరునిప్పు నేల ఈగాలి నాకోసం చెప్పిందల్లా చేస్తూ ఉండాలి ఆకాశం నీరునిప్పు నేలఈగాలి నాముందు చేతులు కట్టి దండం పెట్టాలి చల్ చల్ సంతోషం నా ఇంట్లోనే నట్టింట్లోనే చల్ చల్ ఆనందం ఉంది ఒంట్లోనే చల్ చల్ ఉత్సాహం వరదయ్యే నవనాడుల్లోనే చల్ చల్ ఉత్తేజం నేనే నేనేలే - లూసియా
జర్ర సుడు సుడు మెహబూబ పాట సాహిత్యం
చిత్రం: అన్నవరం (2006) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: చంద్రబోస్ గానం: టిప్పు జర్ర సుడు సుడు మెహబూబ జంతర్ మంతర్ సుడు దిల్రూబ జర్ర సుడు సుడు మెహబూబ జంతర్ మంతర్ సుడు దిల్రూబ బుర్ర తిరిగెను మహ బాగా బుద్ది మారెనుగా జర్రుమని ఎద జారెనుగా జంట కోరెనుగా మక మక తిక తిక మకెగా ఇక నఖ షిఖ షఖ లఖ తొలి ప్రణయపు గమనికేగా తెలిసెనికా జర్ర సుడు సుడు మెహబూబ జంతర్ మంతర్ సుడు దిల్రూబ జర్ర సుడు సుడు మెహబూబ జంతర్ మంతర్ సుడు దిల్రూబ వీలు చుసి ఈలలు వేస్తే శీలమేమి చెడదు కద చెరదీసి లాలన చేస్తే చెడ్డపేరేం రాదు కద మీద కొచ్చి కిరి కిరి చేస్తే నీ సొమ్మేమి అరగదుగా ఆడపిల్లను వంచన చేస్తే ఉసురు తగులును తెలుస తెలుస జర్ర సుడు సుడు మెహబూబ జంతర్ మంతర్ సుడు దిల్రూబ జర్ర సుడు సుడు మెహబూబ జంతర్ మంతర్ సుడు దిల్రూబ కండ కలిగిన వీరుల్లర గుండె కోతని కనలెర అంగరక్ష్క యొధుల్లార ప్రేమరక్షకులవరెరా పొరగాణ్ణి దారికి తెచ్ఛి పోరితో ముడి వేశాక రాష్ట్రమైన అడిగేయండి రాసి ఇస్తా ఫ్రీగా ఫ్రీగా ఫ్రీగా ఫ్రీగా జర్ర సుడు సుడు మెహబూబ జంతర్ మంతర్ సుడు దిల్రూబ జర్ర సుడు సుడు మెహబూబ జంతర్ మంతర్ సుడు దిల్రూబ
నీవల్లె నీవల్లె పాట సాహిత్యం
చిత్రం: అన్నవరం (2006) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: చంద్రబోస్ గానం: కళ్యాణి నీవల్లె నీవల్లె నీవల్లె నీవల్లె నా గుండెల్లో దడదడలే నీ వల్లే నీవల్లె నీవల్లె నీవల్లె నీవల్లె నా అందంలో అలజడులే నీ వల్లే నా చెంపల్లో చేతుల్లో అడుగుల్లో వణుకులు నీ వల్లే నా మాటల్లో ఆటల్లో మార్గంలో మలుపులు నీ వల్లే హేయ్ నీవల్లె నీవల్లె నీవల్లె నీవల్లె నా గుండెల్లో దడదడలే నీ వల్లే మామూలు రూపు మామూలు తీరు ఏముంది నీలోన ఆకర్షణ ఏదో ఉంది పడిపొయా నీపైన నిను తలచుకొనే అలవాటే మారెను యసనమై నిను గెలుచుకొనే ఈ ఆటే తెలిసెను ప్రణయమై ఓ నీవల్లె నీవల్లె నీవల్లె నీవల్లె నా గుండెల్లో దడదడలే నీ వల్లే ఓ నవ్వు నవ్వి ఓ చూపు రువ్వి వెళ్లావు చల్లగ ఆ నవ్వుతో ఆ చనువుతో కల్లోలం ఒళ్ళంతా కొంత కరుకు తనం కరుణ గుణం కలిపితె నువ్వేలే కొంటె మనసుతనం మనిషి వలే ఎదిగితే నువ్వేలే నీవల్లె నీవల్లె నీవల్లె నీవల్లె నా గుండెల్లో దడదడలే నీ వల్లే నీవల్లె నీవల్లె నీవల్లె నీవల్లె నా కళ్ళల్లో కొత్త కథలే నీ వల్లే నా చేతుల్లో చేతల్లో నడకల్లో అడుగులు నీ వల్లే నా మాటల్లో ఆటల్లో మార్గంలో మార్పులు నీ వల్లే హే నీవల్లె నీవల్లె నీవల్లె నీవల్లె నా గుండెల్లో దడదడలే నీ వల్లే
అన్నయ్య అన్నావంటే ఎదురవనా పాట సాహిత్యం
చిత్రం: అన్నవరం (2006) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: చంద్రబోస్ గానం: మనో, గంగ అన్నయ్య అన్నావంటే ఎదురవనా అలుపై ఉన్నావంటే నిదురవనా కలలె కన్నవంటే నిజమై ముందుకు రానా కలతై ఉన్నావంటే కథనవనా అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చుడు చెల్లిపోని బంధం నేనమ్మ చిట్టి చెల్లెమ్మ వెళ్ళిపోని చుట్టం నేనమ్మ అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మ ప్రాణమైన చెల్లిస్తానమ్మ చూపులోన దీపావలి నవ్వులోన రంగోలి పండుగలు నీతో రావలి నా గుండెలొన వేడుక కావలి రూపులోన బంగరు తల్లి మాట మరుమల్లి రాముడింట ప్రేమను పంచాలి ఆ సీత లాగ పేరుకు రావలి నీలాంటి అన్నగాని ఉండే ఉంటే తోడు నీడ అనాటి సీతకన్ని కష్టలంటు కలిగుండేవ వ్వహ్... చెల్లిపోని బంధం నేనమ్మ చిట్టి చెల్లెమ్మ వెళ్ళిపోని చుట్టం నేనమ్మ అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మ ప్రాణమైన చెల్లిస్తానమ్మ కాలి కింది నేలను నేనే నీలి నింగి నేనే కన్నులోని నీరే నేనమ్మ ఆ నన్ను నువ్వు జారనికమ్మ ఇంటి చుట్టు గాలిని నేనే తోరణాన్ని నేనే తుళసి చెట్టు కొటని నేనమ్మా నీ కాపలాగా మారనివమ్మ ముక్కోటి దేవతల అందే వరం అన్నవరం ఇట్టంటి అన్న తోడు అందరికుంటే భుమే స్వర్గం చెల్లిపోని బంధం నేనమ్మ చిట్టి చెల్లెమ్మ వెళ్ళిపోని చుట్టం నేనమ్మ అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మ ప్రాణమైన చెల్లిస్తానమ్మ అన్నయ్య అన్నావంటే ఎదురవనా అలుపై ఉన్నావంటే నిదురవనా కలలె కన్నవంటే నిజమై ముందుకు రానా కలతై ఉన్నావంటే కథనవనా అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చుడు చెల్లిపోని బంధం నేనమ్మ చిట్టి చెల్లెమ్మ వెళ్ళిపోని చుట్టం నేనమ్మ అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మ ప్రాణమైన చెల్లిస్తానమ్మ
ఆ దేవుడు నాకోసం పాట సాహిత్యం
చిత్రం: అన్నవరం (2006) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: చంద్రబోస్ గానం: చిత్ర ఆ దేవుడు నాకోసం