Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Darling (2010)




చిత్రం: డార్లింగ్ (2010)
సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్
నటీనటులు: ప్రభాస్, కాజల్ అగర్వాల్, శ్రద్ధాదాస్
దర్శకత్వం: ఏ. కరుణాకరన్
నిర్మాత: బి.వి.యస్.ఎన్. ప్రసాద్
విడుదల తేది: 23.04.2010



Songs List:



హోసహారే... పాట సాహిత్యం

 
చిత్రం: డార్లింగ్ (2010)
సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కె.కె., లేస్లె లెవీస్

హోసహారే... హోసహారే... 
సాధించే సత్తువ ఉన్నది గుండెలలో 
ప్రేమించే మెత్తని మనసుల మూలలలో 
మా పాట అక్షరమొదలక విన్నదో 
ఫైనున్న జాక్సన్ కిందికి దిగుతాడో 
హోసహారే హోసహారే హెయ్.. 

గుండెల్లో నా పాట గిటార్ అయి మోగిందే 
యేయే యాయియే యేహే యాయియే 
చేతుల్లో నా రాత చప్పట్లై చేరిందే 
యేయే యాయియే యేహే యాయియే 

కష్టం నీకు నేస్తమవగా 
విజయం నిన్ను ఇష్టపడదా 
నీ సంగీతం నీ రధం 
ముందుకు సాగుపద 
ప్రెమన్న ఆయుధం తోడుగ ఉంది కదా 
హోసహో హోసహో హోసహారే హోసహో……..రే 

యే దేసం లో ఐన సందేసం మా పాటే 
యేయే యాయియే యేహే యాయియే హె హెయ్ 
యే వేదిక పై ఐన వేడుక రా మా ఆటే 
యేయే యాయియే యేహే హె హె హెయ్ 
నింగి నేల నది మధ్యన 
పొంగే గంగ మా భావన హెయ్ 
పేదిల్ల గొంతులు కలసిన కాలం ఇదే 
పెదాల వేడిని చాటిన వేల ఇదే హే హే హే హే హెయ్ 

హోసహారే... హోసహారే... 
సాధించే సత్తువ ఉన్నది గుండెలలో 
ప్రేమించే మెత్తని మనసుల మూలలలో 
మా పాట అక్షరమొదలక విన్నదో 
ఫైనున్న జాక్సన్ కిందికి దిగుతాడో 
హోసహారే హోసహో హోసహో హోసహో హోసహో 
హోసహారే హోసహో హోసహో హోసహో హోసహో




ఇంకా ఏదో పాట సాహిత్యం

 
చిత్రం: డార్లింగ్ (2010)
సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: ప్రశాంతిని, సూరజ్ 

ఇంకా ఏదో ఇంకా ఏదో
ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు
సంకెళ్ళతో బంధించకు
ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు
తనలో నీ స్వరం వినరో ఈ క్షణం
అనుకుందేదీ నీలోనే నువు దాచకు
నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా
కనిపించాక మౌనాన్నే చూపించకు
ఇంకా ఏదో ఇంకా ఏదో
ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు

చరణం: 1
మేఘాల ఒళ్ళోనే ఎదిగిందనీ
జాబిల్లి చల్లేనా జడివాననీ
ముళ్ళపై మేమిలా విచ్చుకున్నామనీ
నీకు పూరేకులే గుచ్చుకోవే మరీ
తీరమే ఓరినా తీరులో మారునా మారదూ ఆ ప్రాణం
ఇంకా ఏదో ఇంకా ఏదో
ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు

చరణం: 2
వెళ్ళెళ్ళు చెప్పేసై ఏమవ్వదూ
లోలోన దాగుంటే ప్రేమవ్వదూ
అమృతం పంచడం నేరమే అవదురా
హాయినే పొందడం భారమే అవదురా
హారతే చూపుతూ స్వాగతం చెప్పదా ఇప్పుడే ఆ అందం
ఇంకా ఏదో ఇంకా ఏదో
ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు
సంకెళ్ళతో బంధించకు
ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు
తనలో నీ స్వరం వినరో ఈ క్షణం
అనుకుందేదీ నీలోనే నువు దాచకు
నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా
కనిపించాక మౌనాన్నే చూపించకు




నీవే నీవే... పాట సాహిత్యం

 
చిత్రం: డార్లింగ్ (2010)
సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: జి.వి.ప్రకాష్‌కుమార్

నీవే నీవే... నీవే నీవే...నీవే నీవే... నీవే నీవే...
నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే...
ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా
ఏమైనా అది నీ వల్లే జరిగుంటుందే ఎలా
ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా
కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా
మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువు లేకున్నా
నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే...
నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే...

చరణం: 1
ఒక నిమిషములోన సంతోషం
ఒక నిమిషములోన సందేహం
నిదురన కూడ హే... నీ ధ్యానం
వదలదు నన్నే హో... నీ రూపం
ఆలోచిస్తూ పిచ్చోణ్ణయ్యా నేనే... చెలియా...
ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా
కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా
మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువు లేకున్నా
నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే...
నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే...

చరణం: 2
నడకలు సాగేది నీ వైపే
పలుకులు ఆగింది నీ వల్లే
ఎవరికి చెబుతున్నా నీ ఊసే
చివరికి నేనయ్యా నీలానే
చుట్టూ అంతా తిట్టేస్తున్నా నేనే... విననే
ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా
కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా
మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువు లేకున్నా
నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే...
నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే...
ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా
ఏమైనా అది నీ వల్లే జరిగుంటుందే ఎలా





ఎ బుల్లే నా తింగరి బుల్లే పాట సాహిత్యం

 
చిత్రం: డార్లింగ్ (2010)
సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మల్లికార్జున్ ,  ప్రియా హిమేశ్ 

హే సనా నానా నా నా
హే తనా నానా నా నా

ఎ బుల్లే నా తింగరి బుల్లే
మల్లే నా బంగారుమల్లే
దిల్లే గుల్ గోలైందే నీవల్లే
ఎ బుల్లే నా తింగరి బుల్లే
మల్లే నా బంగారుమల్లే
లే లే నా లేత కాలం నీవల్లే
నీ యెనకోచ్చేసాలే
నీ నిగ నిగ నచ్చాసాలే
నీ మెరుపుకు పడిసచ్చాలే ఇలా కిల్లా
అరే పడి పడి మనసిచ్చాలే
నీ కథకు మలుపిచ్చాలే
నీ కలలకు కలలిచ్చాలే
నిన్నే నువ్వు మెచ్చేలా 
యె బళ్ళే బళ్ళే లే లే
బేబీ పట్నం నాదేలే
బళ్ళే బళ్ళే లే లే భారీ కట్నం నువ్వేలే
బళ్ళే బళ్ళే లే లే బేబీ పట్నం నాదేలే
బళ్ళే బళ్ళే లే లే భారీ కట్నం నువ్వేలే
ఎ బుల్లే నా తింగరి బుల్లే
మల్లే నా బంగారుమల్లే
దిల్లే గుల్ గోలైందే నీవల్లే
ఎ బుల్లే నా తింగరి బుల్లే
మల్లే నా బంగారుమల్లే
లే లే నా లేత కాలం నీవల్లే

వో రుక్కమ్మో, ఏం కిక్కమ్మో
వోళ్ళంతా నీలో వరహాలే
ఒక్కోక్కటీ నే లేక్కేదాటలే
అన్నీ నీవేలే, ఆజా అన్నాలే
ఆవురావురుమన్నావే ఆదా తోడై ఉంటాలే
నీ వయసుకు వయసుకు వొంపులవల్లే
నీ సొగసుకు అత్తరు జల్లే
నీ కులుకుల మెలికల్లోనే మెలిపడిపోతాలే
ఎ బుల్లే నా తింగరి బుల్లే
మల్లే నా బంగారుమల్లే
దిల్లే గుల్ గోలైందే నీవల్లే
ఎ బుల్లే నా తింగరి బుల్లే
మల్లే నా బంగారుమల్లే
లే లే నా లేత కాలం నీవల్లే

నా లెక్కల్లో, ఆ చుక్కల్లో
నువ్వంటే జిగి జిగి జాబిల్లీ
నీ తళుకే తళ తళ కిరణాలే
యేసెయ్ పగ్గాలే,పెట్టేయ్ లగ్గాలే
తమలపాకులు చుడతాలే
తాంబూలానై పోతాలే
నీ కిరి కిరి కథకలి గిల్లీ
జర గరమై చలరేగేనా
నరనరమున చేరమయ్యెనా
ఎమమ్మో గోదారె హే హే హే
బుల్లే నా తింగరి బుల్లే
మల్లే నా బంగారుమల్లే
దిల్లే గుల్ గోలైందే నీవల్లే
ఎ బుల్లే నా తింగరి బుల్లే
మల్లే నా బంగారుమల్లే
లే లే నా లేత కాలం నీవల్లే
నీ యెనకోచ్చేసాలే
నీ నిగ నిగ నాచ్చేసాలే
నీ మెరుపుకు పడిసచ్చాలే ఇలా కిల్లా
అరే పడి పడి మనసిచ్చాలే
నీ కథకు మలుపిచ్చాలే
నీ కలలకు కలలిచ్చాలే
నిన్నే నువ్వు మెచ్చేలా 
యె బళ్ళే బళ్ళే లే లే
బేబీ పట్నం నాదేలే
బళ్ళే బళ్ళే లే లే భారీ కట్నం నువ్వేలే
బళ్ళే బళ్ళే లే లే బేబీ పట్నం నాదేలే
బళ్ళే బళ్ళే లే లే భారీ కట్నం నువ్వేలే




ప్రాణమా ప్రాణమా... పాట సాహిత్యం

 
చిత్రం: డార్లింగ్ (2010)
సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: రాహుల్ నంబియార్, బృందం

తాననాననానా... (2)
ప్రాణమా ప్రాణమా...
అరే సంద్రంలాగా పొంగావే ఈరోజున
సిరి వర్షం లాగా కురిశావే ఎద చాటున
చూపులతో ఏం చెప్పావే అంతగా
ఊపిరితో ముడిపెట్ట్టావే వింతగా

చరణం: 1
తాననాననానా...
నిన్నా మొన్నా లేని సంతోషాల బాణీ
వింటున్నానే మెల్లగా ఈ చోట
చిన్నా పెద్దా చేరి చూస్తూ ఉన్నా గానీ
ఆగేలాగ లేదిక నీ ఆట
దూరాన్ని దూరంగా తోశావే మౌనంగా
ప్రాయాలు పులకించు ఈ మలుపులో

ప్రాణమా ప్రాణమా...
అరే సంద్రంలాగా పొంగావేఈరోజున
సిరి వర్షంలాగా కురిశావేఎద చాటున


సపమప గమగా... (4)
నిదని పదమపా
సపమప గమగా... (2)
నిదని పదమపా
గమపని సాసానిరీ
సాసానిరీ నీదా సనీదా
సని సాసాని మరి సాసా
నిసరి నీద పమ దమారి మరినిరి

చరణం: 2
తాననాననానా...
గిల్లీక జ్జాలన్నీ మళ్లీ గుర్తొచ్చేలా
గడిచాయమ్మా రోజులు హాయి హాయిగా
ఎన్నాళ్లైనా గానీ ఎపుడూ గుర్తుండేలా
నిలిచాయమ్మా నవ్వులు తియతియ్యగా హో...
ఈ జన్మలోనైనా ఏ జన్మలోనైనా
తన జంటగా నన్ను నడిపించగా
ప్రాణమా ప్రాణమా...ప్రాణమా....
ప్రాణమా ప్రాణమా...అరే సంద్రంలాగా పొంగావే ఈరోజున
సిరి వర్షంలాగా కురిశావేఎద చాటున
చూపులతో ఏం చెప్పావే అంతగా
ఊపిరితో ముడిపెట్ట్టావే వింతగా




ఆకాశం కన్నా పైనా పాట సాహిత్యం

 
చిత్రం: డార్లింగ్ (2010)
సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: బెన్నీ దయాల్ 

ఘుమ్ ఘుమ్ యె యొ
ఘుమ్ ఘుమ్ యె యొ (4)

ఆకాశం కన్నా పైనా
నక్షత్రాలుంటాయంటా ఐతే ఎంటంటా
నేనే చెప్పేస్తా రాలాలంటా అంటా

ఘుమ్ ఘుమ్ యె యొ
ఘుమ్ ఘుమ్ యె యొ (6)

ఎవదేవా దేవా దేమవుతాదో
ఎమవుతాదో ఎమో
ఎవడెవడికి ఎవడికి
ఎదురవుతాదో ఎదురవుతాదో ఎమో
నీదే నీకు ఈడు తోడే
నేస్తమనుకుంటే ఆగిపోదు సందడే
ఇవ్వాలంతా నవ్వేవాడేలే అది మొనగాడే

ఘుమ్ ఘుమ్ యె యొ
ఘుమ్ ఘుమ్ యె యొ (4)


నిజమవదని కలగనకుండా
కలగనకుండా ఉంటే
నిదురలో ఆ సంతోషాన్నే 
మిస్ ఐపోతావ్ అంతే హో
తేది మారితే ఎదీ మారదోయ్
నీలా నువ్వు ఉన్నావంటే
ఆవారాగా తిరగడం వో
అదృష్టం అంతే యె..

ఘుమ్ ఘుమ్ యె యొ
ఘుమ్ ఘుమ్ యె యొ (4)

ఆకాశం కన్నా పైనా
నక్షత్రాలుంటాయంటా ఐతే ఎంటంటా
నేనే చెప్పేస్తా రాలాలంటా అంటా


Most Recent

Default