చిత్రం: ఆరెంజ్ (2010) సంగీతం: హరీస్ జైరాజ్ నటీనటులు: చరణ్ తేజ్, జనీలియ దర్శకత్వం: భాస్కర్ నిర్మాత: కె.నాగబాబు విడుదల తేది: 26.11.2010
Songs List:
ఊలా ఊలాలా (సిడ్నీ నగరం) పాట సాహిత్యం
చిత్రం: ఆరెంజ్ (2010) సంగీతం: హరీస్ జైరాజ్ సాహిత్యం: సురేంద్ర కృష్ణ, కేదారినాధ్ పరిమి గానం: కారుణ్య ఊలా ఊలాలా అలా చూస్తేనే చాలా ఇలా నా కళ్లు నిన్నే చుస్తుండాలా చాలా లవ్లీ గా ఇలా రేపావు గోల మదే సీలొన సర్ఫింగ్ చెస్థోందిలా సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్లు నిన్ను దాచుంటుంది సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈరోజైనా చూపించింది This is the time to fall in love fall in love o my love Welcome to my heart I'm in love. I'm in love your my love your my love సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్లు నిన్ను దాచుంటుంది సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈరోజైనా చూపించింది This is the time to fall in love fall in love o my love Welcome to my heart I'm in love. I'm in love your my love your my love ఊలా ఊలాలా అలా చూస్తేనే చాలా ఇలా నా కళ్లు నిన్నే చుస్తుండాలా చాలా లవ్లీ గా ఇలా రేపావు గోల మదే సీలొన సర్ఫింగ్ చెస్థోందిలా సాగర తీరాన ఉదయంలా ఎదో తాజా ఉల్లాసమె ఎంతో బాగుంది ఈ నిమిషం సునామిలా సంతోషమే తెలుసుకున్నది కొంచమే ఆ కొంచంలోనే ఎంతో నచ్చావే కలుసుకోమని ఆత్రమే ఓ లావా లాగ లో లో పొంగిందే ఇవ్వాళే రాలే పాత బాదే నిన్ను చూడ ఆ లేత అల్లర్లే లాగాయిలా నేల విడి పాదం అదిందిలా అ ఏడు రంగుల్ని మార్చానిల నాలో తాజా ప్రేమే ఆరంజ్ లా అప్పుడే పుట్టిన పాపలా నువ్వు కొంత కాలం విచ్చినావుగా ఇప్పుడే వచ్చిన శ్వాసలో నువ్వు చల్ల గాలి చల్లినావుగా ఇవ్వాళే వాలే కొత్త హయే నిన్ను చూడ ఊలా ఊలాలా అలా చూస్తేనే చాలా ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాలా చాలా లవ్లీగా ఇలా రేపావు గోల మాదేసీ లోనే సర్ఫింగ్ చేస్తుందిలా సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైన చూపించింది This is the time to fall in love fall in love o my love Welcome to my heart I am in love I am in love you are my love
చిలిపిగా చూస్తావలా పాట సాహిత్యం
చిత్రం: ఆరెంజ్ (2010) సంగీతం: హరీస్ జైరాజ్ సాహిత్యం: వనమాలి గానం: కార్తిక్ చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా చివరికి నువ్వే అలా వేస్తావే వల నీతో వేగేదెలా ఓ ప్రేమా కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగున్న నీ కల కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది ఆపై చేదెక్కుతోందిలా కడదాక ప్రేమించే దారేదో పోల్చేదేలా చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా చివరికి నువ్వే అలా వేస్తావే వల నీతో వేగేదెలా నిన్నే ఇలా చేరగా మాటే మార్చి మాయే చెయ్యాలా నన్నే ఇక నన్నుగా ప్రేమించని ప్రేమేలా ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుండాలా నన్నింతగా ఊరించేస్తూ అల్లెస్తుందే నీసంకెల కొంచం మధురము కొంచం విరహము వింతలో నువ్వు నరకం కొంచం స్వర్గము కొంచం శాంతము గొంతులో చాలు గరళం కొంచం పరువము కొంచం ప్రణయము గుండెనే కోయు గాయం కొంచం మౌనము కొంచం గానము ఎందుకీ ఇంద్రజాలం ఇన్నాళ్ళుగా సాగినా ప్రేమ నుంచి వేరై పోతున్నా మళ్లీ మరో గుండెతో స్నేహం కోరి వెళుతున్నా ప్రేమనే దాహం తీర్చే సాయం కోసం వేచానిలా ఒక్కో క్షణం ఆ సంతోషం నాతో పాటు సాగేదెలా ఎలా చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా చివరికి నువ్వే అలా వేస్తావే వల నీతో వేగేదెలా ఓ ప్రేమా కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగున్న నీ కల కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది ఆపై చేదెక్కుతోందిలా కడదాక ప్రేమించే దారేదో పోల్చేదెలా కొంచం మధురము కొంచం విరహము వింతలో నువ్వు నరకం కొంచం పరువము కొంచం ప్రణయము గుండెనే కోయు గాయం కొంచం మధురము కొంచం విరహము కొంచం పరువము కొంచం ప్రణయము
నేను నువ్వంటూ వేరై ఉన్నా పాట సాహిత్యం
చిత్రం: ఆరెంజ్ (2010) సంగీతం: హరీస్ జైరాజ్ సాహిత్యం: వనమాలి గానం: నరేష్ అయ్యర్, నదీష్ నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీవేళా నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా ! ఓ గర్ల్.. నువ్వే లేకుంటే లిసన్ గర్ల్.. ఏమౌతానో..ఓఓ.. నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా కాదంటే నామీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా !! ఒకసారి చూసి నే వలచానా నను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో గాఢంగా... గాగా.. నా ప్రేమలోతులో మునిగాకా నువు పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తావేకంగా నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీవేళా నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా ఓ...! నిజాయితీ ఉన్నోడినీ నిజాలనే అన్నోడినీ అబద్దమే రుచించనీ అబ్బాయినీ ఒకే ఒక మంచోడినీ రొమాన్సులో పిచ్చోడినీ పర్లేదులే ఒప్పేసుకో సరేననీ ముసుగేసుకోదు ఏనాడూ... ఓఓ.. నా మనసే ఓ భామా .. ఓఓ.. నను నన్నుగానే చూపిస్తూ కాదన్నా పోరాడేదే నా ప్రేమా ఓఓ..! నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీవేళా నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా ! తిలోత్తమా తిలోత్తమా ప్రతీక్షణం విరోధమా ఇవాళ నా ప్రపంచమే నువ్వే సుమా ఓ ఓ గ్రహాలకే వలేసినా దివే అలా దిగొచ్చినా ఇలాంటి ఓ మగాడినే చూళ్ళేవమ్మా ఒకనాటి తాజ్ మహలైనా నా ముందూ పూరిల్లే ఇకపైన గొప్ప ప్రేమికుడై లోకంలో నిలిచే పేరే నాదేలే...ఓఓఓ.. ! నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీవేళా నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా ! నువ్వే లేకుంటే ఏమౌతానో నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా కాదంటే నామీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా !! ఒకసారి చూసి నే వలచానా నను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో గాఢంగా నా ప్రేమలోతులో మునిగాకా నువు పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తావేకంగా ఓఓ...ఓఓ... నానానా..నానన్నాన్నా...హో...
హాల్లో రమ్మంటే వచ్చేసిందా పాట సాహిత్యం
చిత్రం: ఆరెంజ్ (2010) సంగీతం: హరీస్ జైరాజ్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: విజయ్ ప్రకాష్ హాల్లో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా హాల్లో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా నా మనసిది ఓ ప్రేమనది నా గుండె తడి నీపై వెల్లువై పొంగినది హాల్లో రమ్మంటే హాల్లో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా 24 carrot lovely ప్రేమ 24 x7 నీ పై కురిపిస్తున్నా ఎంత నువ్వు నన్ను తిట్టుకున్నా Every second నీకై పడి చస్తున్నా ఏడు రంగులుగ సులువుగ ఏడు రంగులుగ సులువుగ విడి మరి పోని తెల్ల తెల్లనైన మనసిది ఎన్నో కలలుగ విరిసిన పువ్వుల రుతువై నీ కొరకే చూస్తున్నది నువ్వంటే ఇష్టం అంటోంది సరేలే అని బదులు ఇస్తే తప్పేముంది హాల్లో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా అందమైన కలలు చూస్తు ఉన్నా అందులోన నేను నీతో ఉన్నా అందుకోసమే నీ ఆనందాన ఈ క్షణాన్ని నీకే సొంతం అన్నా ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్ కావాలంటే చదువుకో మనసుతో గంగలాంటి నా ప్రేమ ఇది జీవ నధి నాధం చేతులారా గుండెలో నింపుకో సరే నువ్వెంత వద్దన్నా ప్రేమగ పెరిగిపోతున్నా ప్రేమ గా ఓ ఓ ఓ హాల్లో... హాల్లో... హాల్లో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా నా మనసిది ఓ ప్రేమనది నా గుండె తడి నీపై వెల్లువై పొంగినది హాల్లో రమ్మంటే వచ్చేసిందా పొ పొ పొమ్మంటు నువ్వంటే హాల్లో రమ్మంటే వచ్చేసిందా పొ పొ పొమ్మంటు నువ్వంటే
ఓ రేంజ్ పాట సాహిత్యం
చిత్రం: ఆరెంజ్ (2010) సంగీతం: హరీస్ జైరాజ్ సాహిత్యం: వనమాలి గానం: బెన్ని దయాల్ ఓ రేంజ్
రూబ రూబ హే రూబ రూబ పాట సాహిత్యం
చిత్రం: ఆరెంజ్ (2010) సంగీతం: హరీస్ జైరాజ్ సాహిత్యం: వనమాలి గానం: షాహిల్ హదా, చిన్మయి రూబ రూబ హే రూబ రూబ రూపం చూస్తే హాయ్ రబ్బ తౌబ తౌబ హే తౌబ తౌబ తు హై మేరి మెహబూబా అయ్యయ్యో ఏ మాయో నీ వెంట తరుముతోందే ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తుందే సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టుగుందే రూబ రూబ రూ... ఊఊ... రూబ రూబ హే రూబ రూబ రూపం చూస్తే హాయ్ రబ్బ తౌబ తౌబ హే తౌబ తౌబ తు హై మేరి మెహబూబా ఇంచి దూరమే అంటున్నా ఎలా వుండగలవు అంటుంది నిన్ను తాకమని తొందర చేసే నా మదే కొంటె చేతలే చేస్తున్నా తనేం చేసిన కాదనదే ఎంత సేపు కలిసున్నా ఆశే తీరదే ఓ ఈ ఆనందంలో సదా ఉండాలనుందే ఆ మైకంలోనే మదే ఊరేగుతుందే నీతో సాగే ఈ పయనం ఆగేనా ఇక ఏ నిమిషం రూబ రూబ హే రూబ రూబ రూపం చూస్తే హాయ్ రబ్బ తౌబ తౌబ హే తౌబ తౌబ తు హై మేరి మెహబూబా రెక్కలోచ్చినట్టుంటుందే మదే తేలిపోతుంటుందే రేయి పగలు మాట్లాడేస్తున్నా చాలదే నవ్వు నాకు తెగ నచ్చిందే నడుస్తున్న కళ నచ్చిందే నిన్ను వీడి ఏ వైపుకు అడుగే సాగదే ఓ నువ్వేమంటున్నా వినాలనిపిస్తూ ఉందే రోజూ నీ ఊసే కలల్నే పంచుతుందే నీతో ఉంటె సంతోషం కాదా నిత్యం నా సొంతం రూబ రూబ హే రూబ రూబ రూపం చూస్తే హాయ్ రబ్బ తౌబ తౌబ హే తౌబ తౌబ తు హై మేరి మెహబూబా అయ్యయ్యో ఏ మాయో నీ వెంట తరుముతోందే ఉన్నట్టుండి నన్నేదో ఊపెస్తుందే సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టుగుందే రూబ రూబ రూ...ఊఊ...
ఏ వైపుగా (Unreleased/Theatrical Version) పాట సాహిత్యం
చిత్రం: ఆరెంజ్ (2010) సంగీతం: హరీస్ జైరాజ్ సాహిత్యం: గానం: సుచిత్ సురేసన్ ఏ వైపుగా