చిత్రం: సోలో (2011)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: హరి చరణ్
నటీనటులు: నారా రోహిత్, నిషా అగర్వాల్
దర్శకత్వం: పరశురాం
నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్
విడుదల తేది: 25.11.2011
నా ప్రేమ కధకూ నేనే కదా విలనూ
నా రాత నాదీ తప్పు ఎవరిదననూ
నా ప్రేమ కధకూ నేనే కదా విలనూ
నా రాత నాదీ తప్పు ఎవరిదననూ
అరె గుండె తీసి దానమిచ్చినానూ
ప్రేమ కర్ణుడల్లె పొంగిపోయానూ
కనరాని గాయమై పోను పోనూ
కన్నీటి తడి నీలోన దాచినానూ
ఏమిచెప్పను మామా అరె ఎంతని చెప్పను మామా
ఆడి తప్పని ప్రేమ ఇది గాడి తప్పిన ప్రేమా
విస్వదాభిరామ వినురవేమా
గొంతు దిగని గరళమేర ప్రేమా
విస్వదాభిరామ వినురవేమా
గొంతు దిగని గరళమేర ప్రేమా
కన్ను నాదే వేళు నాదే చిటికలోనె చీకటాయె జీవితం
వాడిపోదే వీడిపోదే ముళ్లు లాగ గిల్లుతోంది జ్ఞాపకం
ఏపెద్దమ్మ కూర్చుందొ నెత్తిమీద
పోటుగాడి లాగ పాటించ మర్యాదా
నా కొమ్మను నేనే నరుక్కున్నా కాదా
తలుచుకుంటే పొంగుతుందీ బాధా
ఏమిచెప్పను మామా అరె ఎంతని చెప్పను మామా
ఆడి తప్పని ప్రేమ ఇది గాడి తప్పిన ప్రేమా
విస్వదాభిరామ వినురవేమా
గొంతు దిగని గరళమేర ప్రేమా
విస్వదాభిరామ వినురవేమా
గొంతు దిగని గరళమేర ప్రేమా
అమ్మలేదు నాన్న లేడు అక్కచెళ్లి అన్న తంబి లేరులే
అన్నీ నువ్వే అనుకున్న ప్రేమా
చేతులార చేయిజారిపోయెనే
ఈ సోలో లైఫులోన ఒక్క క్షణమూ
ఎందుకొచ్చిందో ఇంత కాంతి వెల్లిపోను
సర్లే అనుకున్నా సర్దుకోలేకున్నా
అగ్నిగుండం మండుతోంది లోనా
ఏమిచెప్పను మామా అరె ఎంతని చెప్పను మామా
ఆడి తప్పని ప్రేమ ఇది గాడి తప్పిన ప్రేమా
విస్వదాభిరామ వినురవేమా
గొంతు దిగని గరళమేర ప్రేమా
విస్వదాభిరామ వినురవేమా
గొంతు దిగని గరళమేర ప్రేమా