Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Mirchi (2013)





చిత్రం: మిర్చి (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: ప్రబాష్, అనుష్క, రీచా గంగోపాద్యాయ
దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాతలు: వి.వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
విడుదల తేది: 08.02.2013



Songs List:



మిర్చి లాంటి కుర్రాడే పాట సాహిత్యం

 
చిత్రం: మిర్చి (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: చిన్నపొన్ను

హే మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే
కోరస్: మిర్చి మిర్చి మిర్చి మిర్చి
ఏ మిర మిర మీసం తిప్పి మిసైలల్లే దూకాడే
కోరస్: మిర్చి మిర్చి మిర్చి మిర్చి

ఆ మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే
కోరస్: మిర్చి మిర్చి మిర్చి మిర్చి
ఆ మిర మిర మీసం తిప్పి మిసైలల్లే దూకాడే
కోరస్: మిర్చి మిర్చి మిర్చి మిర్చి

ఆ నిప్పుకు మల్లే నికార్సైన ఆకారం
అడుగెట్టిన చోట అదిరిపొద్ది గుడారం
అబ్బా ఇప్పటికన్నా మొదలవుతాది యవ్వరం
ఇది చెప్పుడు చాలు దుమ్మొ దుమ్మొ దుమ్మారమ్

ఆ మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే
కోరస్: మిర్చి మిర్చి మిర్చి మిర్చి
ఆ మిర మిర మీసం తిప్పి మిసైలల్లే దూకాడే
కోరస్: మిర్చి మిర్చి మిర్చి మిర్చి

ఎక్కడికైనా బైదెల్లాడో బంగారం
గుండెలు తట్టి మోగిస్తాడు అలారాం
ఏ దిక్కులు ముట్టి పుట్టిస్తాడో కల్లోలం
ఎన్ని లెక్కలు వేసి ఎవ్వరు మాత్రం చెప్పగలం

మిర్చి మిర్చి మిర్చి
మిర్చి మిర్చి మిర్చి



యాహుం యాహుం పాట సాహిత్యం

 
చిత్రం: మిర్చి (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మికా సింగ్

ఖోల్ తేరీ ఖిడ్కీ ఖోల్ తేరీ ఖిడ్కీ (2)
వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికీ
Lets party party right now oh సోనియే
Lets party party right now

ఖోల్ తేరీ ఖిడ్కీ ఖోల్ తేరీ ఖిడ్కీ
వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికీ
Lets party party right now oh సోనియే
Lets party party right now

Lets live lets live like there is no tomorrow
Lets sing lets dance like we don't know the meaning of sorrow
బుజ్జి లైఫిది మనల్ని నమ్ముకున్నది
దాన్ని ముద్దు చేసి హద్దు దాటుదాం
యాహుం యాహుం బోలో యాహుం యాహుం
కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం
యాహుం యాహుం బోలో యాహుం యాహుం
కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం
యాహుం యాహుం బోలో యాహుం యాహుం
కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం

ఖోల్ తేరీ ఖిడ్కీ ఖోల్ తేరీ ఖిడ్కీ
వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికీ
Lets party party right now oh సోనియే
Lets party party right now

లైఫనేది స్టైలుగున్న జీన్స్ ప్యాంటురా
చిరుగులెన్ని ఉన్నా డోంట్ కేర్
జివ్వుమన్న Champagne నురగ లెక్కలో
ఆల్ ద టైం జోష్ పొంగాలే
రెక్కలున్న డ్రీమ్సున్నాయ్
గాల్లో తేలే గట్సున్నాయ్
క్రేజీ క్రేజీ థాట్సున్నాయ్
కిస్ మీ అంది ఓపెన్ స్కై
జెట్టు స్పీడులో ఫ్రీకి అటిట్యూడ్తో లాంగ్ డ్రైవ్కెళదాం లైఫ్తో

యాహుం యాహుం బోలో యాహుం యాహుం
కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం
యాహుం యాహుం బోలో యాహుం యాహుం
కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం
యాహుం యాహుం బోలో యాహుం యాహుం
కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం
యాహుం యాహుం బోలో యాహుం యాహుం
కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం

ఆక్స్ఫర్డ్ డిక్ష్నరీలో దొరకనందిరా
జిందగీకా అసలు సిసలు మీనింగ్
ఆక్సిజన్లో స్వచ్ఛమైన ఊపిరేదిరా
దాన్లో ఆనందాన్ని చేసి చూడు మిక్సింగ్
సెలబ్రేషన్ స్విచ్ ఆన్
సంబరాల సైక్లోన్
లివ్ లైక్ ఎ ఫుల్ మూన్
కమాన్ ఎవ్రీ సెకండ్ రాక్ ఆన్
ఛోటీ జిందగీ సైజు పెంచలేనిది
దీన్లో హ్యాపీనెస్ రేంజ్ పెంచుదాం

యాహుం యాహుం బోలో యాహుం యాహుం
కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం
యాహుం యాహుం బోలో యాహుం యాహుం
కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం
యాహుం యాహుం బోలో యాహుం యాహుం
కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం
యాహుం యాహుం బోలో యాహుం యాహుం
కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం యాహుం



ఇదేదో బాగుందే చెలి పాట సాహిత్యం

 
చిత్రం: మిర్చి (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: విజయ్ ప్రకాష్, అనిత కార్తికేయన్

కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే
చాటుగ నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే
ఘాటుగ పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే
రాటుగ సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే
లేటుగు ఇంతందాన్ని చూశానా అనిపిస్తుందే 
నా మనసే నీవైపొస్తుందే

ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి

నీ మతి పోగొడుతుంటె నాకెంతో సరదాగుందే
ఆశలు రేపేడుతుంటే నాకెంతో సరదాగుందే
నిన్నిల్లా  అల్లాడిస్తే నాకెంతో సరదాగుందే
అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుందే
నీ కష్టం చూస్తూ  అందం అయ్యయ్యొ అనుకుంటునే
ఇలాగే ఇంకాసేపంటుంటే

ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
 
తెలుసుకుంటావా తెలుపమంటావా 
మనసు అంచుల్లో నించున్న నా కలని
ఎదురు చూస్తున్న ఎదుటనే ఉన్న
బదులు దొరికేట్టు పలికించు నీ స్వరాన్ని
వేల గొంతుల్లోన మోగిందే మౌనం నువ్వున్న చోటే నేనని
చూసి చుడంగానే చెప్పిందే ప్రాణం నేన్నీదాన్నై పోయానని

ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
 
తరచి చూస్తూనే తరగదంటున్న తళుకు వర్ణాల నీ మేను పూలగనీ
నలిగిపొతునే వెలిగిపొతున్న తనివి తీరేట్టు సంధించు చూపులన్ని
కంటి రెప్పలు రెండు పెదవుల్లా మారి నిన్నే తీరేస్తామన్నాయే
నేడో రేపో అది తప్పదుగా మరి నీకోసం ఎదైనా సరే

ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి



పండగలా దిగివచ్చావు పాట సాహిత్యం

 
చిత్రం: మిర్చి (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కైలాష్ కెహర్

పండగలా దిగివచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు
మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు

పండగలా దిగివచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు
మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు

అయ్యంటే ఆనందం అయ్యంటే సంతోషం మా అయ్యకు అయ్యై నీవు
కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం ఇట్టాగే పదికాలాలు ఉండనివ్వు

పండగలా దిగివచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు
ఓ మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు

ఓ జోలాలి అనలేదే చిననాడు నిన్నెపుడూ ఈ ఊరి ఉయ్యాలా
ఓ నీ పాదం ముద్దాడి పులకించి పోయిందే ఈ నేల ఈయాలా
మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా
ఓ మా పిల్ల పాపల్లో మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా
గుండె కలిగిన గుణము కలిగిన అయ్యా కొడుకువుగా
వేరు మూలము వెతికి మా జత చేరినావు ఇలా

పండగలా దిగివచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు
ఓ మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు

ఓ పెదవుల్లో వెన్నెళ్ళు గుండెల్లో కన్నీళ్ళు ఇన్నాళ్లు ఇన్నేళ్ళు
ఓ అచ్చంగా నీవల్లే మా సామి కళ్ళల్లో చుశామీ తిరనాళ్లు
ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిశాయి ముంగిల్లు
మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా మీ వాళ్ళు అయినోళ్ళు
అడుగు మోపిన నిన్ను చూసి అదిరె పలనాడు
ఇక కలుగు దాటి బయట పడగా బెదరడా పగవాడు

పండగలా దిగివచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు
ఓ మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు




బార్బీ గర్ల్ పాట సాహిత్యం

 
చిత్రం: మిర్చి (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: జస్ప్రీత్ జాస్జ్, సుచిత్ర

ఆరడుగుల అందగాడు
నన్ను బార్బీ గర్ల్ అన్నాడూ
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి
నన్ను బేబీ డాల్ అన్నాడూ

హాల్లో సంగారిట హాల్లో సంగారిట
నువ్వే నా హార్లిక్స్ బూస్ట్ అండ్ బోర్న్విట
మైహూమా అగరిత మైహూమా అగరిత
ఇందా నా అందాన్నే తాగై గట గట
పిల్లా నీ కళ్ళల్లో దాగుందో తల్వారే
పిల్లోడి కండల్లో దాగుందో పట్కారే
చున్నిలా చుట్టేస్తా అజారే ఏ ఏ ఏ ఏ
బార్బీ గర్ల్ ఉమ్మా బేబీ డాల్ ఉమ్మా
ఒళ్లే జిగెల్ జిగెల్ జిగెల్ మంటూందే
బార్బీ గర్ల్ ఉమ్మా బేబీ డాల్ ఉమ్మా
గుండె గుభెల్ గుభెల్ గుభెల్ మంటూందే
హాల్లో సంగారిట హాల్లో సంగారిట
నువ్వే నా హార్లిక్స్ బూస్ట్ అండ్ బోర్న్విట
మైహూమా ఆగరిత మైహూమా ఆగరిత
ఇందా నా అందాన్నే తాగై గట గట

చరణం: 1
డోంట్ టచ్ మీ మెత్తంగా
డోంట్ కిస్ మీ తీయంగా
ప్లీజ్ గిచ్ మీ కారంగా
పెదవుల్లో ల్యాండ్మైనే
జర పేల్చేసేయ్ రా తీవ్రంగా
ఊ ఒల్లేమో ఓ పక్క మంటేక్కీ ఉన్నాది
143 సెంటిగ్రేడ్ సెగల్లో ఉన్నాది
పిల్లేమో ఫ్రీజర్ లో చాక్లేట్ లా ఉన్నది
యమ్మీ యమ్మీ టేస్ట్ చూసుకో
బార్బీ గర్ల్ ఉమ్మా బేబీ డాల్ ఉమ్మా
గుండె జిగెల్ జిగెల్ జిగెల్ మంటూందే
బార్బీ గర్ల్ ఉమ్మా బేబీ డాల్ ఉమ్మా
గుండె గుభెల్ గుభెల్ గుభెల్ మంటూందే

చరణం: 2
బ్రేక్ చేస్తా బీడియాన్ని
షేప్ చేస్తా పర్వాణి
అటాక్ చేస్తా పరువాన్ని
తుఫ్ఫనై దూకేస్తా నిఖెల్టు పిల్ల ఫట్తని
ఏయ్ హైజ్యాక్ చేస్తావో కిడ్నాప్ చేస్తావో
తగినట్టుండాలది నీ నా స్పీడు కి
హైప్నాటైస్ అవ్తావో మెస్మెరైజే అవ్తావో
ఓపెన్ సీజన్ ఫుల్ రొమాన్స్ కి
బార్బీ గర్ల్ బేబీ డాల్
గుండె జిగెల్ జిగెల్ జిగెల్ మంటుందే
బార్బీ గర్ల్ బేబీ డాల్
గుండె గుభెల్ గుభెల్ గుభెల్ మంటుందే




నీ చూపుల పొంగిన పొగరు పాట సాహిత్యం

 
చిత్రం: మిర్చి (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కైలాష్ కెహర్

నీ చూపుల పొంగిన పొగరు
మా ఊపిరి దీపపు చమురు
ఇకపై మా రేపటి వెలుగెవరూ
ముందడుగై నడిపేదెవరు
ముప్పును తెగనరికేదెవరు
నువు లేనిదే కన్నీరే ఊరు



డార్లింగే ఓసీ నా డార్లింగే పాట సాహిత్యం

 
చిత్రం: మిర్చి (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: దేవి శ్రీ ప్రసాద్, గీతామాధురి

నీటిలోని చాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసెమో గిల గిల కొట్టెస్కుంటందే
డార్లింగే ఓసీ నా డార్లింగే డార్లింగే ఏంది ఈ ఫీలింగే
హేయ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాతిరీ కల్లోకొచ్చిందే
డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే ఏంది ఈ ఫీలింగే
ఓ సచిన్ బేటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు
బుర్ర గిర్ర గిర్ర మందే డార్లింగే
రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలో కుక్కేసినట్టు
ఉక్క పోసేస్తందే రారో డార్లింగే
ఎహె చేసిన వైటింగ్ చాల్లేగాని ఇప్పటికిప్పుడు పెట్టావే మీటింగే

డార్లింగే ఓసీ నా డార్లింగే డార్లింగే బేగిరాయె డార్లింగే
డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బేగిరారో డార్లింగే

హేయ్ నువ్వో చిచ్చు బుడ్డి నేనో అగ్గీపుల్ల రాయె పిల్ల మోగించేద్దాం దీపావళి మోత
నువ్వో కత్తి పీట నేనేమో ఆపిలంట నీ పర పర చూపుల కోత నాకు ఇష్టమంటా
హేయ్ గల్ఫ్ సెంట్ బుడ్డల్లే గుప్పు గుప్పుమన్నదే ఒంటి నిండా చల్లెసుకుంట రాయె డార్లింగే
గంప కింది కోడల్లే పూటకో ముద్దిచ్చి ,ప్రేమగా పెంచుకుంట రారో డార్లింగే

డార్లింగే ఓసీ నా డార్లింగే డార్లింగే బేగిరాయె డార్లింగే
డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బేగిరారో డార్లింగే

ఓ జడ్లో తురుముకున్న మల్లెపూల చండే నలిగి
విల విలా నిన్ను తిట్టే రోజు ఎప్పటికొస్తాదబ్బి
పెద్దోళ్లిచ్చుకున్న పాత పందిరి మంచం ఇరిగి
గొల్ళు మానె టైమ్ తొందర్లోనే రానున్నదే బేబీ
ఉట్టి మీది బొబ్బట్టు నోటి లోన పడేట్టూ
అవురావురంటు ఏదో చేసేయ్ డార్లింగే
అయ్యా కత్తిలాంటి నీ వయసు రంగు రంగు పుల్ల ఐస్ టేస్టే చూసేస్కుంట వచ్చెయ్ డార్లింగే

డార్లింగే ఓసీ నా డార్లింగే డార్లింగే బేగిరాయె డార్లింగే
డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బేగిరారో డార్లింగే

Most Recent

Default