చిత్రం: నిర్మలా కాన్వెంట్ (2016) సంగీతం: రోషన్ సాలూరి నటీనటులు: రోషన్ మేక, శ్రీయ శర్మ, రోషన్ కనకాల, నాగార్జున అక్కినేని దర్శకత్వం: జి. నాగ కోటేశ్వర రావు నిర్మాత: నాగార్జున అక్కినేని, నిమ్మగడ్డ ప్రసాద్ విడుదల తేది: 16.09.2016
Songs List:
కొత్త కొత్త భాష పాట సాహిత్యం
చిత్రం: నిర్మలా కాన్వెంట్ (2016) సంగీతం: రోషన్ సాలూరి సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: ఏ.ఆర్..అమీన్ కొత్త కొత్త భాష కొత్త ప్రేమ భాష నీకు నాకు మధ్య హ్మ్మ్ అక్షరాలు లేవు డిక్షనరీలు లేవు గ్రామర్ ఐన లేదే హ్మ్మ్ నీ నా కన్నుల్లోన నీ నా నవ్వుల్లోన మౌనం మోగించే భాష లెమ్మీ లెమ్మీ సే ఎంయూ మిస్ యు ఓ కేయూ కిస్ యు ఓ ఏల్ యూ లవ్ యు ఓ ఓ హే ఐ లవ్ యు ఎం యూ మిస్ యు ఓ కే యూ కిస్ యు ఓ ఏల్యూ లవ్ యు ఓ ఓ హే ఐ లవ్ యు బేబీ హూ పిచ్చి పిచ్చి భాష అచ్చమైన భాష అచ్చు వేయలేమే హ్మ్మ్ ఆశలెన్ని ఉన్న కోరికెంతో ఉన్న చేరి వెయ్యగలదే హ్మ్మ్ నీ నా నీడల్లోన నీ నా శ్వాసల్లోన నిండే నింగైనా భాష లెమ్మీ లెమ్మీ సే టీయూ టచ్ యు ఓ హెచ్యూ హాగ్ యు ఓ ఏల్ యూ లవ్ యు ఓ ఓ హే ఐ లవ్ యు టీయూ టచ్ యు ఓ హెచ్ యూ హాగ్ యు ఓ ఏల్ యూ లవ్ యు ఓ ఓ హే డార్లింగ్ ఐ లవ్ యు కొత్త కొత్త భాష కొత్త ప్రేమ భాష కొత్త కొత్త భాష కొత్త ప్రేమ భాష నీకు నాకు మధ్య హ్మ్మ్
ముందు నుయ్య పాట సాహిత్యం
చిత్రం: నిర్మలా కాన్వెంట్ (2016) సంగీతం: రోషన్ సాలూరి సాహిత్యం: చంద్రబోస్ గానం: కైలాష్ కెహర్ ముందు నుయ్య వెనక గొయ్య వీడికెంత కష్టమయ్యా ఏమిటో ఈ ప్రేమ మాయ యేటి లోకి లాగేనయ్యా కూతకొచ్చిన కుర్రగాడు కూలబడుతూ లేస్తున్నాడు బక్కపలచ పిల్లగాడు భారమెత్తుకుంటున్నాడు దిక్కుతోచక ఉన్నాగాని ఒక్కడే అవుతున్నాగాని మనసునేమో ఇక్కడ వదిలి మనిషి మాత్రం నడవవలిసినగతి ఎంత చిత్రం ఎంత చిత్రం ఎంతెంత చిత్రం రా ఎంత చిత్రం ఎంత చిత్రం ఎంతెంత చిత్రం రా వీడి వీడి తస్సాదీయ వీడికెంత కష్టమయ్యా ఏమిటో ఈ ప్రేమ మాయ యేటి లోకి లాగేనయ్యా ఊరు కొత్త నీరు కొత్త ఉండవలసిన తీరు కొత్త ఏఉరయ్యే ప్రతివారు కొత్త ఎదురు ఈత ఎట్ట ఎట్టా చిలక పక్కన లేకుండానే గోరువంక ఎగిరేదెట్టా పౌరుషానికి పోయినాక పోరు తప్పదని తెలిసిన బ్రతుకెంత చిత్రం ఎంత చిత్రం ఎంతెంత చిత్రం రా ఎంత చిత్రం ఎంతెంత చిత్రం రా చూడు చూడు చిన్నవాడు ప్రేమలో పడి పోయినాడు లోకమేదో చూడనొడు లోతులో దిగిపోయాడు భారమేమో బోలెడంత రూపమేమో వెళడాంత సమస్యేమో సింధువంత వయసు ఏమో బిందువంతా ఆశయం ఆకాశమంత అనుభవం మరి అంతంత పరువుకు పేరు కోసం ప్రాణమంటి ప్రేమ కోసం జారిపోయిన విలువల కోసం విలువ కలిగిన గెలుపుకోసం పట్టుదలని పెట్టుబడీగాపెట్టదలచిన చిన్నవాడికి ఎంత కష్టం ఎంత కష్టం ఎంతెంత కష్టం రా ఎంత కష్టం ఎంత కష్టం ఎంతెంత కష్టం రా
ఏమో ఎవరితో పాట సాహిత్యం
చిత్రం: నిర్మలా కాన్వెంట్ (2016) సంగీతం: రోషన్ సాలూరి సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: సిద్దర్ద్ మహదేవన్ ఏమో ఎవరితో ఉండాల్సింది ఎవరో పైవాడే తేల్చుతాడు మనకేం తెలియదురో హోం ఏమో ఎవరితో ఉండాల్సింది ఎవరో పైవాడే తేల్చుతాడు మనకేం తెలియదురో గుండె నుంచి గుండె దాకా తీగ ఎదో ఉంటుంది కంటి తోటి చూడలేమంటే తెలుసుకోరో రో రో రో పడరో నీ వెలుగు ఎవరో హే వెతికే పనిలో పడరో ఇక్కడుందో ఎక్కడుందో రో రో రో పడరో నీ వెలుగు ఎవరో హే వెతికే పనిలో పడరో ఇక్కడుందో ఎక్కడుందో ఎన్నో మనసులు తెల్లని కాగితాలై నీ ముందే ఎగురుతాయి ఏవో రాయమని కార్డు విసిరి అన్ని చెదిరి ఒక్కటే మిగులుతుంది దాన్ని పైనే రాయగలవోయ్ రాసుకోరో రో రో రో రో పడరో నీ వెలుగు ఎవరో నీ యెదలో జతగా ఉందిరో ప్రేమ లేఖై భాగ్య రేఖా రో రో రో రో పడరో నీ వెలుగు ఎవరో నీ యెదలో జతగా ఉందిరో ప్రేమ లేఖై భాగ్య రేఖా రో రో రో రో పడరో నీ వెలుగు ఎవరో నీ యెదలో జతగా ఉందిరో ప్రేమ లేఖై భాగ్య రేఖా
ఒక్కోసారి పాట సాహిత్యం
చిత్రం: నిర్మలా కాన్వెంట్ (2016) సంగీతం: రోషన్ సాలూరి సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: శ్రీకాంత్, దామిని ఒక్కోసారి ఓ ముద్దు ఒక్కో చోట ఓ ముద్దు ఒక్కోలాగ ఓ ముద్దు సరే ఇవ్వవా ఓ... ఓ... సరే ఇవ్వవా ఓ... ఓ... సరే ఇవ్వనా ఓ... ఓ... సరే ఇవ్వనా ఓ... ఓ... చరణం: 1 నీలి కంటిపై ముద్దు నీలం దాని అర్ధం నా కలల రాణివి నువ్వేనని చెప్పడం ..అహ... ఓ... ఎర్ర పెదవి పై పెట్టె ముద్దు పగడం దాని అర్ధం నే ప్రేమించేది నిన్నే అని చెప్పడం .. అచ్చ... పాల బుగ్గపై ముద్దె మంచి ముత్యం అన్ని పాలు పంచుకుంటానని అర్ధం ఓ...కెంపుల మరిందే ముద్దు నీ నుదిటిపై నా నీ గెలుపుని నా గెలుపుగా అనుకొమనెనా సరే ఇవ్వవా... హూ సరే ఇవ్వనా... ఓఊ చరణం: 2 లేత చేతిపై పెట్టె ముద్దు వజ్రం దాని అర్ధం నీ చేతిని నేనెప్పుడు వదలనని చెప్పడం - ఊహు... చిట్టి నడుముపై పెట్టే ముద్దు పచ్చ దాని అర్ధం నీ చిలిపి మనసు ఇక నాదె అని అర్ధం - అవునా... ముక్కు పక్కన ముద్దే వైదూర్యం నా శ్వసలోన కలిసిపొమ్మని అర్దం ముద్దుకో అర్దాన్నిల చెబుతోంది ప్రాయం... ప్రతి ముద్దుకో రత్నాన్నిలా ఇస్తోంది ప్రాణం... సరే ఇవ్వవా... ఓఊ సరే ఇవ్వనా... ఓఊ
కొత్త కొత్త భాష పాట సాహిత్యం
చిత్రం: నిర్మలా కాన్వెంట్ (2016) సంగీతం: రోషన్ సాలూరి సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: అక్కినేని నాగార్జున కొత్త కొత్త భాష కొత్త ప్రేమ భాష నీకు నాకు మధ్య హోఓ అక్షరాలు లేవు డిక్షనరీలు లేవు గ్రామర్ ఐన లేదే హోఓ నీ నా కన్నుల్లోన నీ నా నవ్వుల్లోన మౌనం మోగించే భాష లెమ్మీ లెమ్మీ సే ఎంయూ మిస్ యు ఓ కేయూ కిస్ యు ఓ ఏల్ యూ లవ్ యు ఓ ఓ హే ఐ లవ్ యు ఎం యూ మిస్ యు ఓ కే యూ కిస్ యు ఓ ఏల్యూ లవ్ యు ఓ ఓ హే ఐ లవ్ యు హూ పిచ్చి పిచ్చి భాష అచ్చమైన భాష అచ్చు వేయలేమే హోఓ ఆశలెన్ని ఉన్న కోరికెంతో ఉన్న చేరి వెయ్యగలదే హోఓ నీ నా నీడల్లోన నీ నా శ్వాసల్లోన నిండే నింగైనా భాష లెమ్మీ లెమ్మీ సే టీయూ టచ్ యు ఓ హెచ్యూ హాగ్ యు ఓ ఏల్ యూ లవ్ యు ఓ ఓ హే ఐ లవ్ యు టీయూ టచ్ యు ఓ హెచ్ యూ హాగ్ యు ఓ ఏల్ యూ లవ్ యు ఓ ఓ హే ఐ లవ్ యు హే ముద్దు ముద్దు భాష ముచ్చటయినా భాష ముందుకెళ్లమంది దూరమైనా కొద్దీ దగ్గరవుతూ ఉంది దారి చూపుతుందే హోఓ నీ నా గుండెల్లోనా నీ నా ప్రాణంలోనా పొంగే ప్రాయాల భాష లెమ్మీ లెమ్మీ సే న్ యూ నీడ్ యు ఓ ప్ యూ ఫీల్ యు ఓ ల్ యూ లవ్ యు ఓ హే ఐ లవ్ యు న్ యూ నీడ్ యు ఓ ప్ యూ ఫీల్ యు ఓ ల్ యూ లవ్ యు ఓ హే ఐ లవ్ యు