Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sathamanam Bhavati (2017)




చిత్రం: శతమానం భవతి (2017)
సంగీతం: మిక్కీ జే మేయర్
నటీనటులు: శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్
కథ, దర్శకత్వం, మాటలు, స్క్రీన్ ప్లే : సతీష్ వేగేశ్న
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 14.01.2017



Songs List:



మెల్లగా తెల్లారిందో ఎలా పాట సాహిత్యం

 
చిత్రం: శతమానం భవతి (2017)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహ్రా, మోహన్ భోగరాజ్

మెల్లగా తెల్లారిందో ఎలా 
వెలుతురే తెచ్చేసిందో ఇలా
బోసి నవ్వులతో మెరిసే పసి పాపల్లా
చేదతో బావులలో గలా గలా
చెరువులో బాతుల ఈతల కల
చేదుగా ఉన్నా వేపను నమిలే వేళ
చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో
బాటలే కలిపేస్తూ మనసారా
మమతల్ని పండించు అందించు హృదయంలా
చలిమంటలు ఆరేలా గుడి గంటలు మోగేలా
సుప్రభాతాలే వినవేలా
గువ్వలు వచ్చే వేళ నవ్వులు తెచ్చే వేళా
స్వాగతాలవిగో కనవేలా

పొలమారే పొలమంతా ఎన్నాళ్లో నువ్వు తలచి
కళమారే ఊరంతా ఎన్నేళ్లో నువ్వు విడిచి 
వొదట అందరి దేవుడి గంట
మొదటి బహుమతి పొందిన పాట
తాయిలాలకు తహ తహ లాడిన పసి తనమే గుర్తొస్తుందా
ఇంతకన్నా తియ్యనైనా జ్ఞాపకాలే
దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయానా
నువ్వూగిన ఉయ్యాలా ఒంటరిగా ఊగాలా
నువ్వెదిగిన ఎత్తే కనపడక
నువ్వాడిన దొంగాట బెంగల్లే మిగలాలా
నన్నెవరు వెతికే వీల్లేక

కన్నులకే తియ్యదనం రుచి చూపే చిత్రాలే
సవ్వడితో సంగీతం పలికించే సెలయెళ్లే
పూల చెట్టుకి ఉందో భాష అలల మెట్టుకి ఉందో భాష
అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్టాడే భాష
పలకరింపే పులకరింపై పిలుపునిస్తే 
పరవశించడమే మనసుకి తెలిసిన భాష
మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు
పల్లెటూరేగా ఇంకెవరు
ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు
కాదనేవారే లేరెవరు





శతమానం భవతీ పాట సాహిత్యం

 
చిత్రం: శతమానం భవతి (2017)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: చిత్ర, విజయ్ యేసుదాసు

వధువేమొ.. అలమేలు
వరుడట.. శ్రీవారు
మనువాడి.. కలిసారు
చెలిమి కలిమి ఒకరికొకరు.. ఈ జంటను దీవించగ
దేవతలందరి నోట.. పలికేను చల్లని మాట
శతమానం భవతీ
శతమానం భవతీ
శతమానం భవతీ
శతమానం భవతీ


మీసకట్టు కుంకుమ బొట్టూ
కంచి పట్టు పంచె కట్టూ
అల్లుకుంది అనుబంధము
మమతలు ముడివేస్తూ
తను.. తన.. తాళి బొట్టూ
ఆమె.. తన.. ఆయువు పట్టూ

ఏకమైంది దాంపత్యము.. ఏడడుగులు వేస్తూ
నాలొ సగం నీవంటు.. నీలొ సగం నేనంటూ
జనుమలు జతపడు వలపుగ ఇరుమనసులకొక 
తలపుగ కలగలిసిన ఒక తనువుకు
శతమానం భవతీ
శతమానం భవతీ


అందగాడు అందరివాడూ
అందుబాటు బంధువు వీడు
రేవు పక్క రేపల్లెకు నచ్చిన చెలికాడూ
పంచదార నవ్వుల వాడూ
పాతికేళ్ల పండుగ వీడూ
తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు
ఉగ్గుపాలె గోదారై
ఊపిరి గాలే గోదారై
గల గల పరుగుల కలలుగ అలలెగసిన
తలువయసుకు నలుపెరుగని పసి మనసుకు
శతమానం భవతీ
శతమానం భవతీ
శతమానం భవతీ
శతమానం భవతీ




నాలో నేను నీలో నేను పాట సాహిత్యం

 
చిత్రం: శతమానం భవతి (2017)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సమీరా భరద్వాజ్

నాలో నేను నీలో  నేను నువ్వంటే నేను రా
నాతో నేను నీతో నేను నీవెంటే నేను రా
ఎంత ఎంత నచ్చేస్తున్నావో ఏమని చెప్పను
ఎంత ఎంత ముద్దొస్తున్నావో
ఎంత ఎంత అల్లేస్తున్నావో
నువ్విలానాలోనుంచి నన్నే  
మొత్తంగా తీసెసావు

చల్లగాలి చక్కలిగింతల్లో నువ్వే
చందమామ వెన్నెల కాంతుల్లో  నువ్వే నువ్వే 

రంగు రంగుల కుంచెల గీతం లో నువ్వే
రాగమైన పెదవుల అంచుల్లో నువ్వే నువ్వే  

అటు ఇటు ఎక్కడో నువ్వు ఎటు నిలిచినా
మనసుకు పక్కనే నిన్నిలా చూడనా
నీది ధ్యాసలో నను నేను మరిచిన 
సంతోషంగా సర్లే అనుకొన్న ఎన్నాళ్లయినా
కళలుకిన్ని రంగులు పూసింది నువ్వే 
వయసుకిన్ని మెలికలు నేర్పింది నువ్వే నువ్వే 

నిన్న లేని సందడి తెచ్చింది నువ్వే
నన్ను నాకు కొత్తగా చూపింది నువ్వే నువ్వే 

మనసుకు నీ కల అలవాటు అయ్యిలా
వదలిని ఓ క్షణం ఊపిరే తీయగా
నా నలువైపులా తియ్యని పిలుపుల
మైమరిపించే మెరుపులా సంగీతం
నీ నువ్వేగా 





నిలవదే మది నిలవదే పాట సాహిత్యం

 
చిత్రం: శతమానం భవతి (2017)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: యస్.పి.బాలు

నిలవదే మది నిలవదే
సిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి

దేవదాసే కాళిదాసై
ఎంత పొగిడినా
కొంత మిగిలిపోయేంత
అందం నీది

నిలవదే మది నిలవదే
సిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి

అలా నువ్వు చూస్తే చాలు
వెళుతూ వెళుతూ వెనుతిరిగి
ఆదో లాంటి తేనెల బాణం
దిగదా ఎదలోకి

నువ్వు నడిచే దారులలో
పూల గంధాలే ఊపిరిగా
కథ నడిచే మనసు కదే
హాయి రాగాల ఆమనిగా
దినమొక రకముగా పెరిగిన సరదా
నినువిడి మనగలదా

నిలవదే మది నిలవదే
సిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి

నన ననన నానాన
రురు రురురు రూరూరు
లల లలల లాల
హహా హాహాహా

ఎలా నీకు అందించాలో ఎదలో కదిలే మధురిమలు
నేనే ప్రేమలేఖగ మారి ఎదుటే నిలిచాను
చదువుకునే బదులిడని చెప్పుకోలేవులే మనసా
పదములతో పనిపడని మౌనమే ప్రేమ పరిబాష
తెలుపక తెలిపిన వలపొక వరమని కడలిగ అలలెగశా

నిలవదే మది నిలవదే
సిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి

దేవదాసే కాళిదాసై
ఎంత పొగిడినా
కొంత మిగిలిపోయేంత
అందం నీది




హైలో హైలెస్సారే పాట సాహిత్యం

 
చిత్రం: శతమానం భవతి (2017)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: శ్రీమణి 
గానం: ఆదిత్య అయ్యర్, రోహిత్ పరిటాల, మోహన్ భోగరాజ్, దివ్య దివాకర్ 

గొబ్బియల్లో గొబ్బియల్లో కొండానయ్యకు గొబ్బిల్లు
ఆదిలక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిల్లు

కన్నె పిల్లల కోర్కెలు తీర్చే 
వెన్నాలయ్యకు గొబ్బిల్లు
ఆ వెన్నాలయ్యకు గొబ్బిల్లో
ముద్దులగుమ్మ బంగరు బొమ్మ 
రుక్మిణమ్మకు గొబ్బిల్లో
ఆ రుక్మిణమ్మకు గొబ్బిల్లు

గొబ్బియల్లో గొబ్బియల్లో కొండానయ్యకు గొబ్బిల్లు
ఆదిలక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిల్లు

హైలో హైలెస్సారే హరిదాసులు వచ్చారే
దోసిట రాసులు తేరే కొప్పును నింపేయ్రే
డూ డూ బసవను చూడే వాకిట నిలుచున్నాడే
అల్లరి చేస్తున్నాడే సందడే మొనగాడె

కొత్త అల్లుళ్ళ అజమాయిషీలే
బావ మరదళ్ల చిలిపి వేషాలే 
కోడి పందాల పరవల్లే 
తోడు పేకాట రాయుల్లే
వాడ వాడంతా సరదాల చిందులేసేలా ..

భగ భగ భగ భగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కణ కణ కణ కణ కిరణ కాంతులే 

ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే 
చక చక చక చక మేకర్ రాశిలో 
మెరిసే మురిసే సంక్రాంతే 

భగ భగ భగ భగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కణ కణ కణ కణ కిరణ కాంతులే

ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే
చక చక చక చక మేకర్ రాశిలో
మెరిసే మురిసే సంక్రాంతే 

మూనాళ్ల సంబరమే ఉత్సవమే 
ఏడాది పాటంతా జ్ఞాపకమే 
క్షణం తీరిక క్షణం అలసట 
వశం కానీ ఉత్సాహమే 

రైతు రారాజుల రాతలే మారగా 
పెట్టు పోతలతో అందరికి చేయూతగా 
మంచి తరుణాలకే పంచ పరమాణ్ణమే 
పంచి పెట్టేలా మనలోని మంచి తనమే 

భగ భగ భగ భగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కణ కణ కణ కణ కిరణ కాంతులే

ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే 
చక చక చక చక మేకర్ రాశిలో 
మెరిసే మురిసే సంక్రాంతే 

హే భగ భగ భగ భగ 
గణ గణ గణ గణ 
హే కణ కణ కణ కణ
హే భగ భగ భగ భగ 
గణ గణ గణ గణ 
ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే 

రోకళ్ళు దంచేటి ధాన్యాలే 
మనసుల్ని నింపేటి మాన్యాలే 
స్వరం నిండుగా సంగీతాలుగా 
సంతోషాలు మన సొంతమే 
మట్టిలో పుట్టిన పట్టు బంగారమే 
పెట్టి చేసారు మన చిన్ని హృదయాలనే 
సాన పెట్టేయిలా కోరుకుంటే అలా 
నింగి తారల్ని ఈ నెలలో పండించేలా 

భగ భగ భగ భగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కణ కణ కణ కణ కిరణ కాంతులే

ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే 
చక చక చక చక మేకర్ రాశిలో 
మెరిసే మురిసే సంక్రాంతే

సాన పెట్టేయిలా కోరుకుంటే అలా
నింగి తారల్ని ఈ నెలలో పండించేలా

భగ భగ భగ భగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కణ కణ కణ కణ కిరణ కాంతులే

ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే
చక చక చక చక మేకర్ రాశిలో
మెరిసే మురిసే సంక్రాంతే

Most Recent

Default