చిత్రం: అమీ తుమీ (2017)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: పవన్ చరణ్ , సాహితి చాగంటి, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భార్గవి
నటీనటులు: అవసరాల శ్రీనివాస్, అదితి మ్యాకల్ , అడవి శేషు , ఇషా రెబ్బా
దర్శకత్వం: మోహన్ కృష్ణ ఇంద్రగంటి
నిర్మాత: కె.సి.నరసింహా రావు
విడుదల తేది: 09.06.2017
అయ్య బాబోయ్
అయ్య బాబోయ్ అండి
అయ్య బాబోయ్ అండి
ఇక చంపుక తినక
సంగతి ఎంటో సరిగ చెప్పు
సరిగ అంటె సరిగమ పదనిస
సనిదప మగరిస
అసలైందండి మొదలైందండి చూద్దాం రండి
వస్తే కాదంటాన
హొ హొ హొ హొ
ఇస్తే చేదంటాన
హొ హొ హొ హొ
చాల్లేవోయ్ బెట్టు
ఎంత వరకు
ఇది ఇలా రద్దు
అంత బెరుకెందుకు
దేనికింత తొందరా
అంటూ పది మంది నవ్వుకోర
మగ పురుషుడికేంటి గాబర
అయ్య బాబోయ్
అయ్య బాబోయ్ అండి
అయ్య బాబోయ్ అండి
కొంచెం దూరం ఉండని
మాట మంతి సాగని
చి అదేంటి ఉతుత్తి మాటలేన
కరునించవే కన్యామణి
అసలె నే కుర్రాడిని
కనకె కద కవ్విస్తున్న
అటు ఇటని పరుగు పెడితే
పడుచుతనం పరువు చెడిపోద
ఒంటరి కన్నెవే
కనీసం కంగారైన లేదా
ఉంది గాని అది వేరేలాంటిది
అయ్య బాబోయ్
అయ్య బాబోయ్ అండి
పాపాయ్ అండి
ఇంత పనైపొతుందని
అనుకోలేదే అమ్మని
చ... ఇంతేన ముందింక చాలా ఉంది
గుప్చుప్పని ఆర్పేయని
గుప్పిట్లో ఈ నిప్పుని
అసలిపుడేగ కనువిప్పు
అడ్డుపడకు ఆగమనకు
ఒంటి ఉడుకు ఉఫ్ఫుమని ఊదకు
పసి పరువలకు
ప్రమాదం కాదా పైకి రాకు
త్వరపడు మరి జత జగడాలకు
అయ్య బాబోయ్
అయ్య బాబోయ్ అండి
అయ్య బాబోయ్ అండి
ఆ హహ కారం ఒహొ కారం విన్నవా
అది హాహా కారం ఆవకాయ కారం కాదండి
ఆహా కరం ఆహా కరం ఆహా ఆహా ఆహా కరం
********* ********* *********
చిత్రం: అమీ తుమీ (2017)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: స్వీకర్ అగస్తీ , రమ్యా బెహ్రా
తకధిమి తాన ధింతనా తాన
తెగబడు ఈడు తొందరిది కన్నా
తకధిమి తాన ధింతనా తాన
తగువుల మారి తంతు ఇది రన్నా
కళ కళలాడు మండపం లోన
ఫెళ ఫెళమంటు పెళ్లి జరిగేన
వలదను వారు వెంట పడుతున్న
వలచిన వారు మాటవినరన్న
ఎంతటి నిఘా కాపు కాస్తున్న
తుంటరి దగా దాగునా
ఎంచక్కహ రాసిపెట్టుంటె
తదుపరి కదే ఆగునా
పట్టండి పుస్తె కట్రా
కొట్టండి పెల్లార్కెస్త్రా
తేల్చేద్దాం అమీ తుమీ...
తకధిమి తాన ధింతనా తాన
తెగబడు ఈడు తొందరిది కన్నా
తకధిమి తాన ధింతనా తాన
తగువుల మారి తంతు ఇది రన్నా
ఎక్కడ్ర మేళతాళాలు
అడ్రస్సు చెప్పి చావరా
భాంచన్ కాల్ మొక్త బాబు
నాకేమి ఎర్క లేదయా
చస్తాడ ఏంటొ వాడ్నొదిలెయ్
నడిరోడ్లొ ఏంటి జాతర
ఊరికే గొడవేంటి రా మొగడా
గూగుల్లో కొట్టి చూడరా
సిగ్గుతొ మొహం దించుకో కొంచం
పెళ్లికి అదో ముచ్చట
అంతటి మహా నేరమేం చేసాం
ఎందుకు తలొంచాలట...
సరదాల కంగారేమి
జరిపిద్దాం రామరామి
కానున్న అమీ తుమీ...
తకధిమి తాన ధింతనా తాన
తెగబడు ఈడు తొందరిది కన్నా
తకధిమి తాన ధింతనా తాన
తగువుల మారి తంతు ఇది రన్నా
తకధిమి తాన ధింతనా తాన
వలదను వారు వెంట పడుతున్న
తకధిమి తాన ధింతనా తాన
వలచిన వారు మాటవినరన్న
తకధిమి తాన ధింతనా తాన
కళ కళలాడు మడపం లోన
తకధిమి తాన ధింతనా తాన
ఫెళ ఫెళమంటు పెళ్లి జరిగేన