Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

7/G Brindavana Colony (2004)




చిత్రం: 7/G బృందావన కాలనీ (2004)
సంగీతం: యువన్ శంకర్ రాజా
నటీనటులు: రవి కృష్ణ, సోనియా అగర్వాల్
దర్శకత్వం: సెల్వ రాఘవన్
నిర్మాత:  ఏ. యమ్. రత్నం
విడుదల తేది: 15.10.2004



Songs List:



తలచి తలచి చూస్తే పాట సాహిత్యం

 
చిత్రం: 7/G బృందావన కాలనీ (2004)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్
గానం: శ్రేయ ఘోషల్

తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికి ఉంటినీ 
ఓ... నీలో నన్ను చుసుకుంటినీ
తెరచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ రాశా
నీకై నేను బ్రతికి ఉంటిని 
ఓ... నీలో నన్ను చూసుకుంటిని

కొలువు తీరు తరువుల నీడ
చెప్పుకొనును మన కథనెపుడూ
రాలిపోయెనా పూల గంధమా...
రాక తెలుపు మువ్వల సడిని
తలుచుకొనును దారులు ఎపుడూ
పగిలిపోయెనా గాజుల అందమా...
అరచేత వేడిని రేపే చెలియ చేయి నీ చేత
ఒడిలో వాలి కథలను చెప్ప రాసిపెట్టలేదు
తోలి స్వప్నం కానులె ప్రియతమా కనులు తెరువుమా

మధురమైన మాటలు ఎన్నో
కలిసిపోవు నీ పలుకులలో
జగము కరుగు రూపే కరుగునా...
చెరిగిపోని చూపులు అన్ని
రేయి పగలు నిలుచును నీలో
నీదు చూపు నన్ను మరచునా...
వెంట వచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు
కళ్ళ ముందు సాక్ష్యాలున్నా తిరిగి నేను వస్తా
ఒక సారి కాదురా ప్రియతమా ఎపుడు పిలిచినా

తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికి ఉంటినీ 
ఓ... నీలో నన్ను చుసుకుంటినీ





కలలు కనే కాలాలు పాట సాహిత్యం

 
చిత్రం: 7/G బృందావన కాలనీ (2004)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్
గానం: హరీష్ రాఘవేంద్ర, మధుమిత, ఉస్తాద్ సుల్తాన్ ఖాన్

కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గే వేయునా
చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా
ఇది చేరువ కోరే తరుణం ఇరు ఎదలలో మెల్లని చలనం
ఇక రాత్రులు ఇంకొక నరకం వయసులా అతిశయం
ఇది కత్తిన నడిచే పరువం 
నిజ కలలతో తమకమ రూపం
పెళ్ళి కోరును నిప్పుతో స్నేహం దేవుని రహస్యము
లోకంలో తియ్యని భాషా హృదయంలో పలికే భాషా 
మెల్లమెల్లగ వినిపించే ఘోషా

కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గే వేయునా
చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా

తడికాని కాళ్ళతోటి కడలికేది సంభందం
నే వేరు నువ్వేరంటే చెలిమికేది అనుబందం
ఎగరలేని పక్షికేలా పక్షి అనెడి ఆ నామం
తెరవలేని మనస్సుకేలా కలలు గనే ఆరాటం
ఒంటరిగా పాదాలు ఏమికోరి సాగినవో
జ్యోతి వెలిగించిన చేతి కొరకు వెతికినవో
కలలైనా కొన్ని హద్దులు ఉండును 
స్నేహంలో అవి ఉండవుళే
ఎగిరొచ్చే కొన్ని ఆశలు దూకితే 
ఆపుట ఎవరికి సాద్యములే

కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గే వేయునా..
చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా

ఏమైందో ఏమో గాలికి తేమ కాస్త తగ్గెనులే
ఎకాంతం పూసుకొని సంధ్య వేళ పిలిచెనులే

కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గే వేయునా
చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా
తెల్లవారు ఝాముల్లన్నీ నిద్రలేక తెలవారే
కనులు మూసి తనలో తానే మాట్లాడ తోచెనులే
నడిచేటి దారిలో నీ పేరు కనిపించా
గుండెల్లో ఏవో గుసగుసలు వినిపించె
అపుడపుడు చిరు కోపం రాగా 
కరిగెను ఎందుకు మంచులాగ
భూకంపం అది తట్టుకోగల్ము 
మదికంపం అది తట్టుకోలేం




మేం వయసుకు వచ్చాం పాట సాహిత్యం

 
చిత్రం: 7/G బృందావన కాలనీ (2004)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్
గానం: గంగ, షాలిని సింగ్, ఉన్ని కృష్ణన్, యువన్ శంకర్ రాజా

మేం వయసుకు వచ్చాం పరువానికి వచ్చాం
ఈ ఇరవై ఏళ్ళు అరె వ్యర్థం చేశాం
మా కన్నులలోన కన్నె రూపేనంట
నిత్య కలలే మాకు ఇక భోజనమంట
మేం బేబీనంటవు మరి బేబీ నిస్తవు
మీ మాటే మాయరా మీ రూటే వేరురా
నువు లొట్టలేసి తినగా 
అమ్మాయిలేమి ఆవకాయ్ కాదురా

మేం వయసుకు వచ్చాం పరువానికి వచ్చాం
ఈ ఇరవై ఏళ్ళు అరె వ్యర్థం చేశాం
మా కన్నులలోన కన్నె రూపేనంట
నిత్య కలలే మాకు ఇక భోజనమంట

నిద్ర లేస్తే కాఫీకి బదులు సిగరెట్ తాగ తోచెనులే
చెడ్డ చెడ్డ చానెల్స్ వెతికి రిమోట్ బటన్ అరిగెనులే
ఎండమావిలో వర్షం లాగ బస్టాండ్ ఫిగరే నవ్వెనులే
డిస్కో తెక్ కు తీసుకు పోగా డబ్బు లేక తికమకలే
ఫిబ్రవరి 14th వస్తే ఒంటరిగ మది రగిలే
ఫోన్ లో గుడ్ నైట్ చెప్పా లవర్ లేక తహ తహలే
నువ్వు ఎండు గడ్డిని తెగ మేసే దున్నరా
నువు సందే దొరికితె లైనేసే టైపు రా
నువు లొట్టలేసి తినగా 
అమ్మాయిలేమి ఆవకాయ్ కాదురా

మేం వయసుకు వచ్చాం పరువానికి వచ్చాం
ఈ ఇరవై ఏళ్ళు అరె వ్యర్థం చేశాం
మా కన్నులలోన కన్నె రూపేనంట
నిత్య కలలే మాకు ఇక భోజనమంట

మేడ మీద టాంకు పైన హసుకు కొట్ట తోచెనులే
కాలేజ్ గాళ్స్ దారిన వెళ్తే కంటి చూపు మారెనులే
ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకున్న ఫిగర్ మాత్రం పడలేదే
సారీ అని మేం చెప్పిన కాని శారి అని వినిపించెనులే
కోటిలో ఒక్కరి లాగ ఆమె ముఖమున్నదిలే
కోతినొక అమ్మాయిలాగ ఆమె చెల్లెలున్నదిలే
నువు లొట్టలేసి తినగా 
అమ్మాయిలేమి ఆవకాయ్ కాదురా

మేం వయసుకు వచ్చాం పరువానికి వచ్చాం
ఈ ఇరవై ఏళ్ళు అరె వ్యర్థం చేశాం
మా కన్నులలోన కన్నె రూపేనంట
నిత్య కలలే మాకు ఇక భోజనమంట
మేం బేబీనంటవు మరి బేబీ నిస్తవు
మీ మాటే మాయరా మీ రూటే వేరురా
నువు లొట్టలేసి తినగా  
అమ్మాయిలేమి ఆవకాయ్ కాదురా





కన్నుల బాసలు పాట సాహిత్యం

 
చిత్రం: 7/G బృందావన కాలనీ (2004)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్
గానం: కార్తీక్

కన్నుల బాసలు తెలియవులే
కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మససు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే
ఇది అద్దాల మససు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే
గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే
దెబ్బలెన్నీ తిన్నగాని మనసు మాత్రం మారదులే
ఒక పరి మగువ చూడగనే 
కలిగే వ్యధతను ఎరుగదులే
అనుదినము ఇక తపియించే 
యువకుల మనసులు తెలియవులే

హే... కన్నుల బాసలు తెలియవులే
కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మససు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే

చరణం: 1
అడవిలో కాచే వెన్నెల 
అనుభవించెదెవ్వరులే
కన్నులా అనుమతి పొంది 
ప్రేమ చెంతకు చేరదులే
దూరాన కనబడు వెలుగు దారికే చెందదులే
మెరుపులా వెలుగును పట్టగ 
మిణుగురు పురుగుకి తెలియదులే
కళ్ళు నీకు సొంతమట కడగళ్ళు నాకు సొంతమట
అల కడలి దాటగనే నురగలిక ఒడ్డుకు సొంతమట

కన్నుల బాసలు తెలియవులే
కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగా
అద్దాల మససు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే

చరణం: 2
లోకాన పడుచులు ఎందరున్నను 
మనసొకరిని మాత్రమే వరియించులే
ఒక పరి దీవించ ఆశించగా 
అది ప్రాణంతోనే ఆటాడులే
మంచు బిందువొచ్చి ఢీకొనగ
ఈ ముల్లె ముక్కలు అయిపోయెలే
భువిలో ఉన్న అబద్దాలే 
అరె చీరను కట్టి స్త్రీ ఆయలే
ఉప్పెనొచ్చినా కొండ మిగులును 
చెట్లు చేమలు మాయమౌనులే
నవ్వువచ్చులే ఏడుపొచ్చులే 
ప్రేమలు రెండు కలసివచ్చులే
ఒక పరి మగువ చూడగనే 
కలిగే వ్యధ తను ఎరుగదులే
అనుదినము ఇక తపియించే 
యువకుల మనసులు తెలియవులే

ఏ... కన్నుల బాసలు తెలియవులే
కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగా
అద్దాల మససు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే

గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే
దెబ్బలెన్నీ తిన్నగాని మనసు మాత్రం మారదులే



ఇది రణరంగమా పాట సాహిత్యం

 
చిత్రం: 7/G బృందావన కాలనీ (2004)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్
గానం: హరీష్ రాఘవేంద్ర

ఇది రణరంగమా లేక అగ్ని గుండమా 
విధి నడిపే ప్రేమ అర్ధమవదే
ఇది రణరంగమా లేక అగ్ని గుండమా 
విధి నడిపే ప్రేమ అర్ధమవదే

అగ్ని కణము నీటి గుణము రెంటిని కలిపితే నువ్వేనా 
ఇవతలి వైపు దేవతవైతే అవతలి వైపు దెయ్యమువా 
సమయం తింటావ్ మెదడుని తింటావ్ 
నన్నే తింటావ్ తప్పు కాదా 
పని పాట లేని పిల్లా ఇంట్లో నీకు తిండి లేదా 
చూపులు తగలగ మాటలు పెగలగ 
ఉరుములు మెరుపులు ఆరంభం 
పాదం కేశం నాభి కమలం రగులు కొనగా ఆనందం 
ధగ ధగమని వెలిగెను జ్వాల 
సెగ సెగమని ఎగిరెను బాలా 
తహతహమని తపనల గోల 
కసి కసియని కౌగిలి ఏలా 

మిత్రుల బృందం ఎదురే వస్తే పక్కకి తొలగి నడిచితిని 
పొద్దుట నిన్ను చూస్తానంటూ రాత్రినంతా గడిపితిని 
ఇట్టా ఇట్టా రోజులు గడవగ ఇంకా నన్నేం చేస్తావు 
మాయా మంత్రం తెలిసిన దానా త్వరగా నన్ను చంపెదవా 
ఏ తాడైనా నీ తలపుల్ని బిగిసేలాగ కడుతుందా 
నన్నే కాల్చగ ఎముకల గూడు నీ పేరేగా చెబుతుంది 
చిటపటమని చిందేస్తావా వదులొదులని విదిలిస్తావా 
దడదడమని జడిపిస్తావా ఒంటరిగా వదిలేస్తావా 

ఇది రణరంగమా లేక అగ్ని గుండమా 
విధి నడిపే ప్రేమ అర్ధమవదే




పడుచును చూడక ముందు పాట సాహిత్యం

 
చిత్రం: 7/G బృందావన కాలనీ (2004)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్
గానం: హరీష్ రాఘవేంద్ర

పడుచును చూడక ముందు
నీ లైఫే లైఫ్ కాదు
రాళ్ళూ రప్పలు అయినా
అరె మీకే పడతాం పడుచులు అంటె
పడుచును చూడక ముందు
నీ లైఫే లైఫ్ కాదు
రాళ్ళూ రప్పలు అయినా
అరె మీకే పడతాం పడుచులు అంటె





జనవరి మాసం పాట సాహిత్యం

 
చిత్రం: 7/G బృందావన కాలనీ (2004)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్
గానం: కునాల్, మాతాంగి 

జనవరి మాసం అరె మంచు కురిసే సమయం
కళ్ళల్లోన మైకం దేహమంతా తాపం
నా మెడ చివరీన నీ పెదవులు తాక
అహ నాలో నాలో నాలో కొత్త సెగలే సెగలే రగల
నా సిగ్గు ఎగ్గు నిగ్గులన్ని చిక్కుకొని చావా
జనవరి మాసం అరె మంచు కురిసే సమయం
కళ్ళల్లోన మైకం దేహమంతా తాపం

సైయ్య సైయ్య నాతోటే నువ్ 
మియా మియా న వీటా నువ్
మంచం మంచం ఇంకెందుకులే
చూపే పడితే నువ్ గుల్లేలే
కామం లేని ప్రేమ అది ప్రేమ కాదు
చేతులు కట్టి నిలువ ఇది గుడి కాదు
తుమ్మెద వాలని పువ్వు అది పువ్వే కాదు
ఆదివాసులు అడ మగ సిగ్గే పడలేదు
మార్గశిర మాసం మొగ్గ విరిసే తరుణం
మంచు లోన మండే వెన్నెల కిరణం

తొలిసారి నాలో ఒక గాయం తీపెక్కే
ముఖమున సిగ్గు ఒక ముగ్గే వేసేలే
ఒక చూపేమో వద్దంటుంటే 
మరు చూపే రమ్మంది
ఒక చెయ్ నిన్నే నెట్టేస్తుంటే 
ఒక చెయ్ లాగుతూ వుంది
నా తడి జుట్టులోన నీ వేళ్లేదో వెతక
నా ప్రేమ ద్వారాలన్ని నీ వేడి ముద్దులడగా
నీ సిగ్గు ఎగ్గు నిగ్గులన్ని చిక్కుకొని చావా

జనవరి మాసం అరె మంచు కురిసే సమయం
కళ్ళల్లోన మైకం దేహమంతా తాపం
నా మెడ చివరీన నీ పెదవులు తాక
అహ నాలో నాలో నాలో కొత్త సెగలే సెగలే రగల
సిగ్గు ఎగ్గు నిగ్గులన్ని చిక్కుకొని చావా
జనవరి మాసం అరె మంచు కురిసే సమయం
కళ్ళల్లోన మైకం దేహమంతా తాపం





తలచి తలచి చూశా పాట సాహిత్యం

 
చిత్రం: 7/G బృందావన కాలనీ (2004)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్
గానం: కె. కె (కృష్ణ కుమార్ కున్నత్)

తలచి తలచి చూశా 
వలచి విడిచి నడిచా
నీకై నేను బ్రతికే ఉంటినీ
ఓ... నీలో నన్ను చూసుకొంటినీ
తెరచి చూసీ చదువు వేళా
కాలిపోయే లేఖ బాలా
నీకై నేను బ్రతికే ఉంటినీ
ఓ... నీలో నన్ను చూసుకొంటినీ

కొలువు తీరు తరువుల నీడ
నిన్ను అడిగె ఏమని తెలుప
రాలిపోయిన పూలా మౌనమా
రాక తెలుపు మువ్వల సడినీ
దారులడిగె ఏమని తెలుపా
పగిలిపోయిన గాజులు పలుకునా.
అరచేత వేడిని రేపే చెలియ చేతులేవీ
ఒడిన వాలి కదలను చెప్పా సఖియ నేడు ఏదీ
తొలి స్వప్నముగియక మునుపే నిదురే చెదిరెలే

తలచి తలచి చూశా 
వలచి విడిచి నడిచా
నీకై నేను బ్రతికే ఉంటినీ
ఓ... నీలో నన్ను చూసుకొంటినీ

మధురమైన మాటలు ఎన్నో
మారుమ్రోగే చెవిలో నిత్యం
కట్టెకాలు మాటే కాలునా...
చెరిగి పోని చూపులు నన్నూ
ప్రశ్నలడిగే రేయి పగలూ
ప్రాణం పోవు రూపం పోవునా...
వెంట వచ్చు నీడకూడా
మంట కలిసి పోవూ
కళ్ళ ముందు సాక్ష్యాలున్నా నమ్మలేదు నేనూ
ఒకసారి కనిపిస్తావనీ బ్రతికే ఉంటినీ 


Most Recent

Default