Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Aakhari Poratam (1988)




చిత్రం: ఆఖరి పోరాటం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి ((All)
నటీనటులు: నాగార్జున, శ్రీదేవి, సుహాసిని
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: సి. అశ్వనీదత్
విడుదల తేది: 12.03.1988



Songs List:



తెల్లచీరకు పాట సాహిత్యం

 
చిత్రం: ఆఖరి పోరాటం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, లతా మంగేష్కర్

తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మ జంట ముద్దుల్లో
అవే తీయనీ సరాగాలుగా
ఇలా హాయిగా స్వరాలూదగా
సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై

మల్లెపూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మ జంట ముద్దుల్లో
అహ తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో

వైశాఖం తరుముతుంటే
నీ ఒళ్ళో ఒదుగుతున్నా
 ఆషాఢం ఉరుముతుంటే
నీ మెరుపే చిదుముకున్నా
కవ్వింతలో వాలి పువ్వంత కావాలి
పండించుకోవాలి ఈ బంధమే
నీతోడు కావాలి నే తోడుకోవాలి
నీ నీడలో ఉన్న శృంగారమే
జాబిల్లీ సూరీడూ ఆకాశంలో నిండిన సొగసుల

తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మ జంట ముద్దుల్లో

కార్తీకం అహ్.. కలిసి వస్తే
నీ పరువం అడుగుతున్నా
హేమంతం కరుగుతుంటే
నీ అందం కడుగుతున్నా
ఆకాశ దేశాన ఆ మేఘరాగాలు
పలికాయి నా స్వప్నసంగీతమే
ఈ చైత్రమాసాల చిరునవ్వు దీపాలు
వెలిగాయి నీ కంట నాకోసమే
గిలిగింతే  గీతాలై సింగారానికి సిగ్గులు కలిపిన

తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మ జంట ముద్దుల్లో
అవే తీయనీ సరాగాలుగా
ఇలా హాయిగా స్వరాలూదగా
సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై

తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మ జంట ముద్దుల్లో





స్వాతి చినుకు పాట సాహిత్యం

 
చిత్రం: ఆఖరి పోరాటం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి

పల్లవి:
స్వాతి చినుకు సందెవేళలో... హొయ్
లేలేత వణుకు అందగత్తెలో... హొయ్
మబ్బే కన్ను గీటే అరె మతే పైట దాటే
చలే కొరుకుతుంటే హొయ్ చెలే వదుకుతుంటే
భలేగుంది పడుచు ముచ్చటా హా
భలే కదా గాలి ఇచ్చటా
భలేగుంది పడుచు ముచ్చటా... హా
భలే కదా గాలి ఇచ్చటా...

స్వాతి చినుకు సందెవేళలో... హొయ్
లేలేత వలపు అందగాడిలో... హొయ్
ఈడే ఉరుముతుంటే... నేడే తరుముతుంటే
సరాగాలతోటే స్వరాలల్లుకుంటే
పదా అంది పడుచు పూపొదా.. హొయ్
ఇదే కదా చిలిపి ఆపదా
పదా అంది పడుచు పూపొదా..హోయ్..
ఇదే కదా చిలిపి ఆపదా

చరణం: 1
ఈ గాలిలో ఒకే చలీ ఈ దెబ్బతో అదే బలి
ఈ తేమలో ఒకే గిలీ ఈ పట్టుతో సరే సరి
నీ తీగకే గాలాడక  - నా వీణలే అల్లాడగా
నరాలన్ని వేడి పదాలెన్నొ పాడా
వరాలిచ్చి పోరా వరించాను లేరా
చల్లని జల్లుల సన్నని గిల్లుడు సాగిన వేళా.. కురిసిన

స్వాతి చినుకు సందెవేళలో.. హొయ్
లేలేత వణుకు అందగత్తెలో.. హొయ్
మబ్బే కన్ను గీటే అరె మతే పైట దాటే
సరాగాలేతోటే స్వరాలల్లుకుంటే
పదా అంది పడుచు పూపొదా... హొయ్
ఇదే కదా చిలిపి ఆపదా
భలేగుంది పడుచు ముచ్చటా ...హా
భలే కదా గాలి ఇచ్చటా

చరణం: 2
యా యా యా యా యా యా....
ఈ వానలా కథేమిటో నా ఒంటిలో సొదెందుకో
నీకంటిలో కసేమిటో నాకంటినీ తడెందుకో
తొలివానలా గిలిగింతలో 
పెనవేసినా కవ్వింతలో
ఎదే మాట రాకా పెదాలందు ఆడా
శృతే మించిపోయి లయే రేగిపోగా
మబ్బుల చాటున ఎండలు సోకిన అల్లరి వేళా మెరిసిన

స్వాతి చినుకు సందెవేళలో హొయ్
లేలేత వలపు అందగాడిలో హొయ్
ఈడే ఉరుముతుంటే నేడే తరుముతుంటే
చలే కొరుకుతుంటే హొయ్ చెలే వదుకుతుంటే
భలేగుంది పడుచు ముచ్చటా హా
భలే కదా గాలి ఇచ్చటా
పదా అంది పడుచు పూపొదా హొయ్
ఇదే కదా చిలిపి ఆపదా




గుండెలో తకిట పాట సాహిత్యం

 
చిత్రం: ఆఖరి పోరాటం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, చిత్ర

గుండెలో తకిట




అబ్బ దీని సోకు పాట సాహిత్యం

 
చిత్రం: ఆఖరి పోరాటం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి: 
అబ్బ దీని సోకు సంపంగి రేకు 
అంటుకుంటె షాకు నన్నంటుకోకు 
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు 
అమ్మ రాకు రాకు నేనున్నవైపు 
లే గులాబి మొగ్గలాటి ఎర్రబుగ్గలంటుకున్న ముద్దులన్ని మోతపుట్టే 
సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లే 

అబ్బ దీని సోకు సంపంగి రేకు 
అంటుకుంటె షాకు నన్నంటుకోకు 
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు 
అమ్మ రాకు రాకు నేనున్నవైపు 

చరణం: 1 
దోర అందాలు చూశాక నేను దోచుకోకుంటె ఆగేదెలా 
కొమ్మ వంగాక కొంగొత్త పండు దాచినా నేను దాగేదెలా 
సందెపొద్దింక సన్నగిల్లాక చిన్నగా గిల్లుకోనా 
చిమ్మచీకట్లే సిగ్గుపడ్డాక నిన్ను నేనల్లుకోనా 
ఒడ్డులేని ఏరు ఒడేల భామా అడ్డులేని ప్రేమా ఇదేనులే 
ముద్దుపెట్టగానె ముళ్ళుజారిపోయే 
వెల్లువంటి ఈడు మీద ఒళ్ళు ఒళ్ళు వంతెనేసి చాటు చూసి దాటుతుంటే తంటా 

అబ్బ దీని సోకు సంపంగి రేకు 
అంటుకుంటె షాకు నన్నంటుకోకు 
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు 
అమ్మ రాకు రాకు నేనున్నవైపు 
లే గులాబి మొగ్గలాటి ఎర్రబుగ్గలంటుకున్న ముద్దులన్ని మోతపుట్టే 
సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లే 

అబ్బ దీని సోకు సంపంగి రేకు 
అంటుకుంటె షాకు నన్నంటుకోకు 

చరణం: 2 
ఎన్ని బాణాలు వేస్తావు నీవు తీపిగాయలతో చెప్పనా 
ఎన్ని కోణాలు ఉన్నాయినీలో కంటికే నోరు మూసెయ్యనా 
ఎంత తుళ్ళింత లేత ఒళ్ళంతా కౌగిలే కప్పుకోనా 
మెచ్చుకున్నంత ఇచ్చుకున్నంత మెత్తగా పుచ్చుకోనా 
తెడ్డులేని నావా చలాకి ప్రేమా సందు చూసి పాడే సరాగమే 
బొట్టు పెట్టగానే గట్టు జారిపోయే 
వెన్నెలంటి సోకులన్ని ఈలవేసి ఇవ్వబోతే ముందుగానె దోపిడైతె టాటా 

అబ్బ దీని సోకు సంపంగి రేకు 
అంటుకుంటె షాకు నన్నంటుకోకు 
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు 
అమ్మ రాకు రాకు నేనున్నవైపు 
లే గులాబి మొగ్గలాటి ఎర్రబుగ్గలంటుకున్న ముద్దులన్ని మోతపుట్టే 
సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లే 

అబ్బ దీని సోకు సంపంగి రేకు 
అంటుకుంటె షాకు నన్నంటుకోకు 
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు 
అమ్మ రాకు రాకు నేనున్నవైపు 




ఎప్పుడు ఎప్పుడు పాట సాహిత్యం

 
చిత్రం: ఆఖరి పోరాటం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల తప్పుల బుగ్గల్లొ 
హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో
ఇప్పటికిప్పుడు శిస్తుల కుంపటి పెట్టకు గుండెల్లో 
తాకిడికో దూకుడుకో చిక్కిన చెక్కిలిలో
నీ వంపుల సొంపే నా వంటికి పంపే 
అల్లికలో అందికలో మల్లిక పూసిన మాపటిలో
ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల తప్పుల బుగ్గల్లొ 
హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో....

ఒక మాటు ఒడిని మీటి వలపు రాగాలు దాచేసుకుంటాలే
పొద చాటు కధలు దాటి చిలిపి గారాలు పోగేసుకుంటాలే
ఎప్పటికప్పుడు దప్పిక తీరని కమ్మని దాహాలే 
ఏమని చెప్పను నీకు జవాబులు పైటల పాప
అచ్చట ముచ్చట ఇప్పటికిప్పుడు పెంచిన మోహాలే 
ఎంతని ఆపను నిన్ను మరీ మది బిత్తరపోక
చక్కని చుక్క తన సొంతం అనుకోమాక 
బలవంతపు కోరికలే ఓపికలై మోజులు తెచ్చిన అమ్మడిలో

ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల తప్పుల బుగ్గల్లొ 
హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో....

పొరపాటో తెరకు చాటో వయసు ఆటాడుకోవాలి ఈనాడే
అది ఆటో పెదవి గాటో మధుర గాయాలు నాటాలి లోలోనే
చప్పున ఆరని నిప్పుల కుంపటి రేపిన పాపాలే 
చల్లని వెన్నెల చిచ్చుల ఉచ్చులు వేసెను నాకే
అచ్చిక మచ్చిక పిచ్చిక బుచ్చిక చేసిన అందాలే 
జంటగ గుట్టల రెప్పల గంటలు కొట్టెను నేడే
చమ్మని చక్కే మన ఆట మల్లెల పక్కే మన తోట 
నవ్వులతో పువ్వులతో కింకలు పెట్టిన ప్రేమలలో

ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల తప్పుల బుగ్గల్లొ 
హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో
ఇప్పటికిప్పుడు శిస్తుల కుంపటి పెట్టకు గుండెల్లో 
తాకిడికో దూకుడుకో చిక్కిన చెక్కిలిలో
నీ వంపుల సొంపే నా వంటికి పంపే 
అల్లికలో అందికలో మల్లిక పూసిన మాపటిలో
ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల తప్పుల బుగ్గల్లొ 
హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో
ఇప్పటికిప్పుడు శిస్తుల కుంపటి పెట్టకు గుండెల్లో 
తాకిడికో దూకుడుకో చిక్కిన చెక్కిలిలో....

Most Recent

Default