చిత్రం: ఆత్మబంధువు (1985) సంగీతం: ఇళయరాజా నటీనటులు: జెమిని గణేషన్, రాధ దర్శకత్వం & నిర్మాత: పి. భారతీరాజా విడుదల తేది: 15.08.1985
Songs List:
మనిషికో స్నేహం పాట సాహిత్యం
చిత్రం: ఆత్మబంధువు (1985) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, యస్.జానకి మనిషికో స్నేహం మనసుకో దాహం లేనిదే జీవం లేదు జీవితం కానే కాదు మమతనే మధువు లేనిదే చేదు మనిషికో స్నేహం మనసుకో దాహం ఒక చిలక ఒద్దికైంది మరు చిలక మచ్చికైంది వయసేమో మరిచింది మనసొకటై కలిసింది కట్టగట్టి ఆపాలన్నా గంగ పొంగులాగేనా ప్రేమలేని నాడీ నేల పూవులిన్ని పూచేనా మనిషిలేని నాడు దేవుడైన లేడు మంచిని కాచే వాడు దేవుడికి తోడు మనిషికో స్నేహం మనసుకో దాహం మనిషికో స్నేహం మనసుకో దాహం లేనిదే జీవం లేదు జీవితం కానే కాదు మమతనే మధువు లేనిదే చేదు మనిషికో స్నేహం మనసుకో దాహం వయసు వయసు కలుసుకుంటే పూరి గుడిసె రాచనగరు... ఇచ్చుకోను పుచ్చుకోను.. ముద్దులుంటే పొద్దుచాలదు ప్రేమ నీకు కావాలంటే పిరికివాడు కారాదు గువ్వ గూడు కట్టే చోట కుంపటెట్టి పోరాదు ఓర్వలేని సంఘం ఒప్పుకోదు నేస్తం జాతి మత భేదాలన్నీ స్వార్థపరుల మోసం మనిషికో స్నేహం మనసుకో దాహం మనిషికో స్నేహం మనసుకో దాహం లేనిదే జీవం లేదు జీవితం కానే కాదు మమతనే మధువు లేనిదే చేదు మనిషికో స్నేహం మనసుకో దాహం
పట్టి తెచ్చానులే..పాట సాహిత్యం
చిత్రం: ఆత్మ బంధువు (1985) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.జానకి, యస్.పి.బాలు పట్టి తెచ్చానులే..పండు వెన్నెల్నీ నేనే.. అహ నా మావ కోసం ! పట్టి తెచ్చానులే పండు వెన్నెల్నీ నేనే.. అహ నా మావ కోసం పట్టి తెచ్చానులే పండు వెన్నెల్నీ నేనే.. అహ నా మావ కోసం ఏది ఏది చూడనీవే దాన్ని.. కళ్ళు ముయ్యి చూపుతానూ అన్నీ.. ఏది ఏది చూడనీవే దాన్ని.. కళ్ళు ముయ్యి చూపుతానూ అన్నీ.. పట్టి తెచ్చానులే పండు వెన్నెల్నీ నేనే.. అహ నా మల్లి కోసం మనసున సెగలెగసే..ఏం మాయో వెలుపల చలి కరిచే వయసుకు అది వరసా..వరసైన పిల్లదానికది తెలుసా మాపిటికి చలిమంటేస్తా..కాచుకో కాసంతా ఎందుకే నను ఎగదోస్తా..అందుకే పడి చస్తా చింతాకులా..చీరా గట్టీ..పూచిందీ పూదోటా కన్నే పువ్వూ..కన్నూ కొడితే..తుమ్మెదకూ దొంగాటా దోబూచి నీ ఆటా..ఊహూ ! పట్టి తెచ్చానులే పండు వెన్నెల్నీ నేనే..అహ నా మల్లి కోసం ఏది ఏది చూడనీవే దాన్ని.. కళ్ళు ముయ్యి చూపుతానూ అన్నీ.. ఏది ఏది చూడనీవే దాన్ని.. కళ్ళు ముయ్యి చూపుతానూ అన్నీ.. పట్టి తెచ్చానులే పండు వెన్నెల్నీ నేనే.. అహ నా మల్లి కోసం పొద్దు ఉంది ముద్దులివ్వనా..ఇచ్చాక ముద్దులన్ని మూట గట్టనా మూటలన్ని విప్పి చూడనా..చూసాక నూటొకటి లెక్కజెప్పనా నోటికీ నూరైతేనే..కోటికీ కొరతేనా కోటికీ కోటైతేనే..కోరికలు కొసరేనా నోరున్నదీ..మాటున్నదీ..అడిగేస్తే ఏం తప్పు రాతిరయ్యిందీ..రాజుకుందీ..చిటపటగా చిరునిప్పు అరె పోవే పిల్లా అంతా దూకు.. పట్టి తెచ్చానులే పండు వెన్నెల్నీ నేనే..అహ నా మావ కోసం పట్టి తెచ్చానులే పండు వెన్నెల్నీ నేనే..అహ నా మావ కోసం ఏది ఏది చూడనీవే దాన్ని.. కళ్ళు ముయ్యి చూపుతానూ అన్నీ.. ఏది ఏది చూడనీవే దాన్ని.. కళ్ళు ముయ్యి చూపుతానూ అన్నీ.. పట్టి తెచ్చానులే పండు వెన్నెల్నీ నేనే..అహ నా మల్లి కోసం
మూగైన హృదయమా పాట సాహిత్యం
చిత్రం: ఆత్మ బంధువు (1985) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, యస్.జానకి మూగైన హృదయమా నీ గోడు తెలుపుమా ఓదార్చి తల్లివలే లాలించే ఎడదను ఇమ్మనీ అడుగుమా మూగైన హృదయమా నీ గోడు తెలుపుమా కాచావు భారము అయినావు మౌనము రాకాసి మేఘము మూసేస్తే చీకటులు ముంచేస్తే అణగడు సూర్యుడు ఆరడు మనసన్నది మాసిపోనిది సొత్తు ఉన్నది సుఖమే లేనిది ఈ వేదనా ఎన్నినాళ్లదీ ఓదార్చినా ఒడ్డు లేనిది నా పాటకే గొంతు పలికింది లేదు నా కళ్లకీనాడు కన్నీళ్లు రావు తడిలేని నేలైనావు తొలకరులు కురిసే తీరు ఎవ్వరూ అన్నది... నిన్నెరిగిన మనిషి అన్నది మూగైన హృదయమా నీ గోడు తెలుపుమా ఓదార్చి తల్లివలే లాలించే ఎడదను ఇమ్మనీ అడుగుమా మనసేడ్చినా పెదవి నవ్వెను పైపైది ఈ పగటి వేషము నీ గుండెలో కోవెలున్నది ఏ దేవతో వేచియున్నది ఇన్నాళ్లు మూసిన ఈ పాడు గుడిని ఏ దేవతిక వచ్చి తెరిచేదనీ ఈ కోకిలుంటే చాలు జరిగేను ఏదైనాను ఎవ్వరీ కోయిల... చిగురాశల చిట్టి కోయిల అరె నీవా కోయిల ఏ కొమ్మ కోయిల విన్నానే కనులెదుట కన్నానే పొంగులై హృదయము పొర లెనే నేనే ఆ కోయిల ఉన్నా నీ లోపల విన్నాను కనులెదుట కన్నాను మారునా... నీ వెత తీరునా
నీదాన్నీ ఉన్నాననీ పాట సాహిత్యం
చిత్రం: ఆత్మ బంధువు (1985) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.జానకి నీదాన్నీ ఉన్నాననీ నా తోడై నువ్వున్నావనీ గుండెలోనా ఉన్నా ఊసు..
నేరేడు తోటంతా పాట సాహిత్యం
చిత్రం: ఆత్మ బంధువు (1985) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, యస్.జానకి పల్లవి: నేరేడు తోటంతా ఆ... నేడే పండింది నేడే పండింది నోరే ఊరిందమ్మా ఆ... నన్నిపుడే రమ్మందమ్మా నీలాల కళ్లదాన నా జోడి పిల్లదాన ..నేరేడు తోటంతా ఆ.. చరణం: 1 నేడే పండింది నేడే పండింది.. రుచినే సూడాలంటే... ఇది పొద్దు కాదంది ఇది ఈ పొద్దు కాదంది అరె ఎలమావి కొమ్మల్లో...ఎదురొచ్చి నాతోటి ఎవరన్న పాడేది పంట భలే పండిందనీ...పాట ఏదో పాడానే ..పాట ఏదో పాడానే పాట సద్దు విన్నావటే ..పాట సద్దూ విన్నావటే పాటసద్దూ విన్నావటే.. పాట సద్దు విన్నానయ్యా..నీ పాట సద్దు విన్నానయ్యా కూ అంటే కో అన్నాను.. కోకిలమ్మనయ్యాను .. కోకిలమ్మనయ్యాను ఏ... ఇననట్టే ఊరించకే నా సత్తా చూస్తావులే నీ ఆట నే కట్టిస్తాను పంతానికి వచ్చావంటే ..ఓడిస్తాను పందెమెంతా ఓ..డిస్తాను పందెమెంతా వయసున్న వాణ్ణే నేను .. నువ్వే ఓడిపోతావు అహ నువ్వే ఓడి... అహ నువ్వే ఓడి...
ఏ గువ్వా... ముద్దు గువ్వా...పాట సాహిత్యం
చిత్రం: ఆత్మ బంధువు (1985) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, యస్.జానకి పల్లవి: ఏ గువ్వా... ముద్దు గువ్వా... ఏ గువ్వా... చిట్టిగువ్వా... ఓ జోడు ఉంటే దాన్ని తోడితెచ్చి మా పంచలోకి వచ్చి గూడుకట్టు పోట్లాట ఇల్లు కట్టు బంగారు గూడు ఇప్పుడిల్లాలు లేదు వచ్చి నాతోటి పాడు .. చరణం: 1 ఏ గువ్వా... చిట్టిగువ్వా... ఏ గువ్వా... అయ్య అన్నదాంట్లో ఎంతో అర్థముంది కాని కొంపలోనే కొంత గోడు ఉంది పెళ్ళాన్నై వచ్చి నా గూడు చూసి అద్దివ్వమంటే... అహ్హహ్హా ఏం చేయనయ్యా ఏ గువ్వా... చిట్టిగువ్వా... ఏ ఎవరే... అది ఎవరే...