చిత్రం: అబ్బాయిగారి పెళ్లి (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి సుందరమూర్తి
గానం: యస్.పి. బాలు, చిత్ర
నటీనటులు: సుమన్ , సిమ్రాన్, సంఘవి
దర్శకత్వం: శరత్
నిర్మాత: యమ్. ఏ. గఫూర్
విడుదల తేది: 01.01.1997
ఓయీనా తిలోతమ్మ ఒడిలో వసంతమ
ఒదిగే వయ్యారమా పూబాణమా
ఎగసె తరంగమ ఎదలో మృదంగామ
ఎగిరే పతంగమ నా ప్రాణమా
ఉలిపిరి నడుము మీద
చెయ్యి సాగాని సొగసరి
లయాలమీద నిన్ను చేరని
ఓయీనా తిలోతమ్మ ఒడిలో వసంతమా
ఒదిగే వయ్యారమా పూబాణమా
ఎగసె తరంగమ ఎదలో మృదంగామ
ఎగిరే పతంగమా నా ప్రాణమా
చరణం: 1
నిన్ను అంటుకోక కన్నులంటుకోక
ఎరగని రుచినెకోరి ఎదుట పడ్డానే
పాడు సిగ్గుపోకా నీకు చిక్కలేకా
వలపుల బడిలో నీనే వెనక పడ్డాలే
బుగ్గల మందారాలు మొగ్గల సింగరాలు
పైటల బంగారాలు నావే లెవమ్మా
నచ్చేవని ఇచ్చానంటే
రెచ్చిపోతావు పొదరిళ్లలో పోరాటాని వేళ
ఓయీనా తిలోతమ్మ ఒడిలో వసంతమా
ఒదిగే వయ్యారమా పూబాణమా
ఎగసె తరంగమ ఎదలో మృదంగామ
ఎగిరే పతంగమా నా ప్రాణమా
చరణం: 2
కోడేగాలి వీచి నా కొంగులారాబోసి
సొగసుల గుడిలో నీకే గంట కోటాలే
రూపురేఖ సోకి నా ఊపిరంత ఆగి
ఆలిగినదే వీయదే ఆరతిచ్ఛాలే
అందని ఆకాశాలు పొందని
ఆనందాలు జాబిలి సంగీతాలు
నేను విన్నాలే
నువ్వు నేను పువ్వు నవ్వు
ఒక్కటైయక చెలి తెనల్లో
తనాలాడే వేల
ఓయీనా తిలోతమ్మ ఒడిలో వసంతమా
ఒదిగే వయ్యారమా పూబాణమా
ఎగసె తరంగమ ఎదలో మృదంగామ
ఎగిరే పతంగమా నా ప్రాణమా
ఉలిపిరి నడుము మీద
చెయ్యి సాగాని సొగసరి
లయాలమీద నిన్ను చేరని
చిత్రం: అబ్బాయిగారి పెళ్లి (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర
పల్లవి :
ఎన్నియల్లో ఒళ్లో పూలజల్లో
మల్లియల్లో తల్లో వాన విల్లో
ఎన్నియల్లో ఒళ్లే చెమ్మగిల్లో
మల్లియల్లో మంచే తేనెజల్లో
ఒళ్లోకొస్తే వయ్యారాలు
ఇళ్లోకొస్తే సంసారాలు పగలే తారలు
ఎన్నియల్లో ఒళ్లో పూలజల్లో
మల్లియల్లో తల్లో వాన విల్లో
ఎన్నియల్లో ఒళ్లే చెమ్మగిల్లో
మల్లియల్లో మంచే తేనెజల్లో
చరణం: 1
నడిచొచ్చే నచ్చే వయసులివీ
చెలి సొగసులివీ దొరికాయి దోరగా
కలిసొచ్చే పిచ్చి మనసులివీ
కసి వరసలివీ కలిశాయి కమ్మగా
మొగుడికి నచ్చు కన్నె మొగ్గల్లే గిచ్చు
తలగడ మంత్రం తాళి కట్టాక చదవచ్చు
ప్రేమించుకుంటే వేళాపాళా
లేనే లేవులే... లేనే లేవులే
ఎన్నియల్లో ఒళ్లే చెమ్మగిల్లో
మల్లియల్లో మంచే తేనెజల్లో
ఎన్నియల్లో ఒళ్లో పూలజల్లో
మల్లియల్లో తల్లో వాన విల్లో
చరణం: 2
చిటికేస్తే కాసే కనులు ఇవి
ప్రియ కలలు ఇవి నడిరేయే నావగా
తడిచేసే తేనె పెదవులివి
రసపదవులివి తుడిచేస్తా ముద్దుగా
పలకని మాట పదారు వన్నెల పాట
పరువపు బాట కులుకుల కులాస తోట
పెళ్లాడుకుంటే లైలా మజ్ను
గాథే లేదులే... గాథే లేదులే
ఎన్నియల్లో ఒళ్లో పూలజల్లో
మల్లియల్లో తల్లో వాన విల్లో
ఎన్నియల్లో ఒళ్లే చెమ్మగిల్లో
మల్లియల్లో మంచే తేనెజల్లో
ఒళ్లోకొస్తే వయ్యారాలు
ఇళ్లోకొస్తే సంసారాలు పగలే తారలు
గాథే లేదులే... గాథే లే దులే