Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Allari Mogudu (1992)




చిత్రం: అల్లరి మొగుడు (1992)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: మోహన్ బాబు , మీనా, రమ్యకృష్ణ
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
నిర్మాత: కె. కృష్ణమోహన్ రావు
విడుదల తేది: 14.02.1992



Songs List:



అబ్బా ననుగన్న బాబు పాట సాహిత్యం

 
చిత్రం:  అల్లరి మొగుడు (1990)
సంగీతం:  యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

అబ్బా ననుగన్న బాబు గుర్తొచ్చాడే



నా పాట పంచామృతం ... పాట సాహిత్యం

 
చిత్రం:  అల్లరి మొగుడు (1990)
సంగీతం:  యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

పల్లవి:
నా పాట పంచామృతం ...
నా పాట పంచామృతం.... నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం.... నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం ... 

చరణం: 1
వల్లకి మీటగ పల్లవపాణి... అంగుళి చేయనా పల్లవిని
వల్లకి మీటగ పల్లవపాణి... అంగుళి చేయనా పల్లవిని
శారద స్వరముల సంచారానికి
శారద స్వరముల సంచారానికి... చరణములందించనా

నా పాట పంచామృతం.... నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం ... 

చరణం: 2
గళము కొలను కాగా... ప్రతి పాట పద్మమేగా
పదము వెల్లివిరిసి రాదా... విధిసతి పాదపీఠి కాగా
శృతిలయలు మంగళహారతులై...  స్వరసరళి స్వాగత గీతికలై
ప్రతిక్షణం సుమార్చనం....  సరస్వతీ సమర్పణం
గగనము గెలువగ గమకగతులు సాగ
పశువుల శిశువుల ఫణుల శిరసులూగ... 

నా పాట పంచామృతం.... నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం ... 




బం చిక్ బం బం చెయ్యి బాగా పాట సాహిత్యం

 
చిత్రం:  అల్లరి మొగుడు (1990)
సంగీతం:  యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర  

పల్లవి:
బం చిక్ చిక్ భం చిక్ భం భం
బం చిక్ చిక్ భం చిక్ భం భం
బం చిక్ చిక్ భం చిక్ భం భం
బం చిక్ చిక్ భం

బం చిక్ బం బం చెయ్యి బాగా
ఒంటికి యోగా మంచిదేగా

లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజూగ్గా ఉంచు తీగలాగా
ఈజీయేగా రాజయోగ... ఏజ్‌ని మరిపించెయ్యగా
ఈడు ముడతల... ధూళి దులుపునుగా

చరణం: 1
బ్రీథింగ్ టిక్నిక్ అదుపు నేర్పుతుంది... అందాల తైతక్కకి
ప్రాణాయామం పవరు పెంచుతుంది... పెరిగేటి పరువాలకి

ఆసనాల శాసనాలు లేకుంటే.. 
మాయదారి ఒళ్ళు మాట వినదంతే
ఒంపుసొంపులేవి ఎక్కడుంచాలో.. అంటకట్టెరెక్కడెపుడెయ్యాలో
తూకమెరిగిన తోడు కదా యోగా

బం చిక్ బం బం చెయ్యి బాగా
ఒంటికి యోగా మంచిదేగా
లేజీగా ఒళ్ళు పెంచుకోక
నాజూగ్గా ఉంచు తీగలాగా

చరణం: 2 
పి.టి.ఉషలా పేరు కోరుకుంటే.. పరుగెత్తు కుందేలులా
ఫాట్టి బాడి బరువు కరగదీసే కసరత్తు కానీ ఇలా
విల్లు లాగ ఒళ్ళు వంచు ఈ వేళ... నడుము ఒంగిపోదు ఇంక ఏ వేళ
సోయగాలు సొమ్మసిల్లిపోయేలా... వయసుగాలి కమ్ముకొచ్చు పడువేళ
ఆపగలిగిన కాపు గదా యోగా

బం చిక్ బం బం చెయ్యి బాగా
ఒంటికి యోగా మంచిదేగా
లేజీగా ఒళ్ళు పెంచుకోక
నాజూగ్గా ఉంచు తీగలాగా

ఈజీయేగా రాజయోగ ఏజ్‌ని మరిపించెయ్యగా
ఈడు ముడతల ధూళి దులుపునుగా

బం చిక్ బం బం చెయ్యి బాగా
ఒంటికి యోగా మంచిదేగా
లేజీగా ఒళ్ళు పెంచుకోక
నాజూగ్గా ఉంచు తీగలాగా

బం చిక్ బం బం చెయ్యి బాగా
ఒంటికి యోగా మంచిదేగా
లేజీగా ఒళ్ళు పెంచుకోక
నాజూగ్గా ఉంచు తీగలాగా





నీలి మబ్బు నురగలో పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి మొగుడు (1992)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

నీలి మబ్బు నురగలో కాలు జారిపడ్డ వేళ ఎన్ని దెబ్బలో ఏమో
బాత్ టబ్బు షవరులో ఈడు ఉలికిపడ్డ వేళ నీకు నిద్దరే నో నో
అకస్మాత్తుగా అదే మత్తుగా సుఖం ఎక్కడో పుట్టగా

నీలి మబ్బు నురగలో కాలు జారిపడ్డ వేళ ఎన్ని దెబ్బలో ఏమో
బాత్ టబ్బు షవరులో ఈడు ఉలికిపడ్డ వేళ నీకు నిద్దరే నో నో
అకస్మాత్తుగా అదే మత్తుగా రహస్యం రుచే చూడగా

చరణం: 1
హొమగుండమయ్యె భామ కౌగిలి కవ్వింతలే కేరింతలై జ్వలించగా
ప్రేమ కోటి రాసి పెరిగె ఆకలి ముద్దెంగిలి తీపెక్కువై నోరూరగా
ఎడతెగనీ తపనా  - ఎడమవగా తగునా
వగరు వయసు అడుగు ముడుపులన్నీ తడిమి చూసి తపన పెంచనా

నీలి మబ్బు నురగలో కాలు జారిపడ్డ వేళ ఎన్ని దెబ్బలో ఏమో
బాత్ టబ్బు షవరులో ఈడు ఉలికిపడ్డ వేళ నీకు నిద్దరే నో నో

చరణం: 2
ఊసులాడుకున్న రాసలీలలో తెల్లారని ఉయ్యాలలే ఊపేసుకో
ఊపిరంటుకున్న తీపి మంటలో వేన్నీళ్ళకే చన్నీళ్ళుగా వాటేసుకో
కథ ముదిరే మదనా  - లయలివిగో లలనా
జలక జతుల కలికి కులుకులన్నీ చిలుక చుట్టి పులకరించనా

నీలి మబ్బు నురగలో కాలు జారిపడ్డ వేళ ఎన్ని దెబ్బలో ఏమో
బాత్ టబ్బు షవరులో ఈడు ఉలికిపడ్డ వేళ నీకు నిద్దరే నో నో
అకస్మాత్తుగా అదే మత్తుగా రహస్యం రుచే చూడగా
నీలి మబ్బు నురగలో కాలు జారిపడ్డ వేళ ఎన్ని దెబ్బలో ఏమో ఏమో
బాత్ టబ్బు షవరులో ఈడు ఉలికిపడ్డ వేళ నీకు నిద్దరే నోనో నోనో
అకస్మాత్తుగా అదే మత్తుగా సుఖం ఎక్కడో పుట్టగా




ముద్దిమ్మంది ఓ చామంతి పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి మొగుడు (1990)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
ముద్దిమ్మంది ఓ చామంతి
మనసిమ్మంది ఓ పూబంతి
చలి రాతిరిలో జత జాతరలో ఎటు పోను జాబిలి
రహదారులన్నీ తారలైన వేళ    

ముద్దిమ్మంది ఓ చామంతి
మనసిమ్మంది ఓ పూబంతి
చలి రాతిరిలో జత జాతరలో ఎటు పోను జాబిలి
రహదారులన్నీ తారలైన వేళ   

చరణం: 1
ముందరున్న ముద్దరాలి ముద్దు.. చెల్లిద్దు.. ఇటు చూద్దూ
మండుతున్న మోహనాంగి మత్తు... కలిగిద్దు.. ఇటు రద్దు
పెదవి పొడుపు కథ విప్పేద్దు... చెప్పేద్దు గుట్టు
అదుపు పొదుపు ఇక చాల్లెద్దు... చంపేద్దు బెట్టు
అనువైన అందుబాటు చూడమంది 

ముద్దిమ్మంది ఓ చామంతి
మనసిమ్మంది ఓ పూబంతి

చరణం:  2
వేడి వేడి ఈడు ఊదుకుంటూ చవి చూద్దూ... చెలి విందు
వేడుకైన జోడు చూడమంటూ జరిపిద్దు... జడ కిందు
నిదర నదిని కసుకందేలా కరిగిద్దు.. పొద్దు
మదన పదవి మనకందేలా చెరిపేద్దు.. హద్దు
సడిలేని సద్దుబాటు చేయమంది     

ముద్దిమ్మంది ఓ చామంతి
మనసిమ్మంది ఓ పూబంతి
చలి రాతిరిలో జత జాతరలో ఎటు పోను జాబిలి
రహదారులన్నీ తారలైన వేళ   

ముద్దిమ్మంది ఓ చామంతి
మనసిమ్మంది ఓ పూబంతి




రేపల్లె మళ్ళీ మురళి విన్నది పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి మొగుడు (1992)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

రేపల్లె మళ్ళీ మురళి విన్నది 
కోరస్: తననా 
మా పల్లె కలే పలుకుతున్నది 
కోరస్: తననా 
ఆ జానపదం జల్లుమన్నది 
కోరస్: తననా 
ఆ జానజతై అల్లుకున్నదీ
మొగలి పువ్వు మారాజుకి మొదటి కానుకా 
ఎదను పరిచి వేసెయ్యనా ప్రణయ వేదికా
మల్లె నవ్వు మారాని ఈ గొల్ల గోపికా 
మూగ మనసు వింటున్నది మురళి గీతికా 
కోరస్: తననా 
రేపల్లె మళ్ళీ మురళి విన్నది 
కోరస్: తననా 
మా పల్లె కలే పలుకుతున్నది

కోరస్: 
తానన తందానన తజుం తజుం జుం
తానన తందానన తజుం తజుం తజుం తజుం

ఆ పెంకితనాల పచ్చిగాలి ఇదేనా 
పొద్దుపోని ఆ ఈలలేనా ఈ ఆలాపన
ఆ కరుకు తనాల కన్నె మబ్బు ఇదేనా 
ఇంతలోనే చిన్నారి చినుకై చెలిమే చిలికెనా
అల్లరులన్ని పిన్నలగ్రోవికి స్వరములిచ్చేనా
కళ్ళెర్రజేసే కిన్నెర సానికి సరళి నచ్చేనా
మెత్తదనం - కో: తందననా
మెచ్చుకొని గోపాల క్రిష్ణయ్య గారాలు చెల్లించనా
కోరస్: తననా

రేపల్లె మళ్ళీ మురళి విన్నది కోరస్: తననా 
మా పల్లె కలే పలుకుతున్నది
మొగలి పువ్వు మారాజుకి మొదటి కానుకా 
మూగ మనసు వింటున్నది మురళి గీతికా 

కోరస్: ససని సరి సరి సరి పనిని సగ పని నిని నిని నిని

నీ గుండె వినేలా వెంట వెంట ఉండేలా 
గొంతులోని రాగాలు పంపాను ఈ గాలితో
ఆ ప్రేమపదాల గాలిపాట స్వరాల 
పోల్చుకొని కలిపేసుకున్నాను నా శ్వాసలో
ఎక్కడ ఉన్నా ఇక్కడ తిన్న వెన్నె వేణువయ్యే
కొంగును లాగి కొంటెదనాలే కంటికి వెలుగయే
వన్నెలలో  - కో: తందననా
వెన్నెలలే వెచ్చని వెల్లువలయ్యే వరసిదీ

రేపల్లె మళ్ళీ మురళి విన్నది
మా పల్లె కలే పలుకుతున్నది
ఆ జానపదం జల్లుమన్నది
ఆ జానగతై అల్లుకున్నదీ
మొగలి పువ్వు మారాజుకి మొదటి కానుకా 
ఎదను పరిచివేసెయ్యనా ప్రణయ వేదికా
మల్లె నవ్వు మారాని ఈ గొల్ల గోపికా 
మూగ మనసు వింటున్నది మురళి గీతికా

లాలాల లలా లాల లాలలా
లాలాల లలా లాల లాలలా


Most Recent

Default