Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Allari Priyudu (1993)





చిత్రం: అల్లరి ప్రియుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాల
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: కె.రాఘవేంద్రరావు
విడుదల తేది: 19.03.1993



Songs List:



చెప్పకనే చెబుతున్నవి పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి ప్రియుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు, చిత్ర

కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను
తమకంతో పాల బుగ్గ తొలి ముద్దును కోరెను
తడి ఆరని పెదవులపై తొణికిన వెన్నెల మెరుపులు
చెప్పకనే...చెప్పకనే...
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని

చిలిపిగ నీ చేతులు అణువణువు తడుముతుంటె
మోహపు తెరలిక తొలిగేనా హహా హహా
చలి చలి చిరుగాలులు గిలిగింత రేపుతుంటె
ఆశల అల్లరి అణిగేనా హహా హహా
పదాలతోనే వరించనా సరాగమాలై తరించనా
స్వరాలతోనే స్పృశించనా సుఖాల వీణా శృతించనా
ఆ వెన్నెల ఈ కన్నుల రేపెక్కిన ఆ కోరిక
పొగలై సెగలై యదలో రగిలిన క్షణమే
చెప్పకనే... చెప్పకనే...
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని

తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం
యవ్వన గిరులను తడిమెననా హహా హహా
నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం
మదనుడు మలుపులు తెలిసెననీ హహా హహా
తెల్లారనీకే వయ్యారమా అల్లాడిపోయే ఈ రేయిని
సవాలు చేసే శృంగారమా సంధించమాకే ఓ హాయిని
ఆ మల్లెల కేరింతలు ఈ నవ్వుల లాలింతలు
వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే
చెప్పకనే... చెప్పకనే...
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని



ఏం పిల్లది పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి ప్రియుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఏం పిల్లది ఎంత మాటన్నది
ఏం కుర్రది కూత బాగున్నది
ఓయ్ సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది
చెక్కిలి పై కెంపులు నా సొంతం అంది
ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది
బాగున్నది కోడె ఈడన్నది...
ఈడందుకే వీధి పాలైనది...
కమ్మని కల కళ్ళెదుటకు వచ్చేసింది
కొమ్మకు జత వీడేనని ఒట్టేసింది
ఎప్పుడు ఏం కావాలో అడగమన్నది

ఏం పిల్లది ఎంత మాటన్నది
బాగున్నది కోడె ఈడన్నది

మువ్వాకు మువ్వాకు మువ్వాకు మువ్వ మువ్వ మువ్వ మువ్వ మువ్వ మువ్వాకు
లవ్వాకు లవ్వాకు లవ్వాకు లవ్వు లవ్వు లవ్వు లవ్వు లవ్వు లవ్వాకు

శనివారం ఎంకన్న సామి పేరు చెప్పి సెనగలట్టు చేత బెట్టి సాగనంపింది
మంగళారం ఆంజనేయ సామి పేరు జెప్పి అసలు పనికి అడ్డమెట్టి తప్పుకున్నాది
ఇనుకోని ఆరాటం ఇబ్బంది ఇడమరిసే ఈలెట్టా వుంటుంది
ఎదలోనే ఓ మంట పుడుతుంది పెదవిస్తే అది కూడా ఇమ్మంటుంది
చిరు ముద్దుకి వుండాలి చీకటి అంది
ఏ కళ్ళు పడకుంటే ఓకే అంది
తీరా ముద్దిస్తుంటే ఎంగిలన్నది

ఏం పిల్లది ఎంత మాటన్నది
బాగున్నది కోడె ఈడన్నది

ముద్దాకు ముద్దాకు ముద్దాకు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దాకు
సిగ్గాకు సిగ్గాకు సిగ్గాకు సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గాకు

సుక్రారం మాలచ్చిమి నీకు సాటి అంటూ పట్టు చీర తెచ్చి పైట చుట్టమన్నాడు
సోమారం జామురాతిరి తెల్ల చీర తెచ్చి మల్లెపూల కాపడాలు పెట్టమన్నాడు
ఉత్సాహం ఆపేది కాదంట ఉబలాటం కసిరేస్తే పోదంట
ఉయ్యాల జంపాల కధలోనే ఉ కొట్టే ఉద్యోగం నాదంట
వరసుంటే వారంతో పని ఏముంది
ఉత్తుత్తి చొరవైతే ఉడుకేముంది
మల్లి కావాలన్నా మనసు వున్నది

వామ్మో  ఏం పిల్లది ఎంత మాటన్నది...
బాగున్నది కోడె ఈడన్నది...
సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది
కొమ్మకు జత వీడేనని ఒట్టేసింది
ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది

ఏం పిల్లది ఎంత మాటన్నది
బాగున్నది కోడె ఈడన్నది




ప్రణయమా నీపేరేమిటి పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి ప్రియుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వెన్నలకంటి
గానం: యస్. పి. బాలు

ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా
ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా
గమ్యం తెలియని పయనమా ప్రేమకు పట్టిన గ్రహణమా

తెలుపుమా తెలుపుమా తెలుపుమా
ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా

చరణం: 1
ప్రేమ కవితా గానమా నా ప్రాణమున్నది శ్రుతి లేక
గేయమే ఎద గాయమైనది వలపు చితిని రగిలించగా
తీగచాటున రాగమా ఈ దేహమున్నది జత లేక
దాహమారని స్నేహమై ఎద శిథిల శిశిరమై మారగా
ఓ హృదయమా... ఇది సాధ్యమా...
రెండుగ గుండే చీలునా ఇంకా ఎందుకు శోధన
రెండుగ గుండే చీలునా ఇంకా ఎందుకు శోధన

తెలుపుమా తెలుపుమా తెలుపుమా
ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా

చరణం: 2
ప్రేమసాగర మధనమే జరిగింది గుండెలో ఈవేళ
రాగమన్నది త్యాగమైనది చివరికెవరికీ అమృతం
తీరమెరుగని కెరటమై చెలరేగు మనసులో ఈవేళ
అశ్రుధారలే అక్షరాలుగా అనువదించెనా జీవితం
ఓ ప్రాణమా... ఇది న్యాయమా...
రాగం అంటే త్యాగమా వలపుకు ఫలితం శూన్యమా
రాగం అంటే త్యాగమా వలపుకు ఫలితం శూన్యమా

తెలుపుమా తెలుపుమా తెలుపుమా
ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా
ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా




అందమా నీ పేరేమిటి పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి ప్రియుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

అందమా నీ పేరేమిటి అందమా
అందమా నీ పేరేమిటి అందమా
ఒంపుల హంపి శిల్పమా బాపు గీసిన చిత్రమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా
పరువమా నీ ఊరేమిటి పరువమా
పరువమా నీ ఊరేమిటి పరువమా
కృష్ణుని మధురా నగరమా కృష్ణా సాగర కెరటమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా

చరణం: 1
ఏ రవీంద్రుని భావమో గీతాంజలి కళ వివరించే
ఎండ తాకని పండు వెన్నెల గగనమొలికే నా కన్నుల
ఎంకి పాటల రాగమే గోదారి అలలపై నిదురించే
మూగబోయిన రాగమాలిక ముసిరెనిపుడు నా గొంతున
సంగీతమా... నీ నింగిలో...
విరిసిన స్వరములే ఏడుగా వినబడు హరివిల్లెక్కడ

తెలుపుమా తెలుపుమా తెలుపుమా
అందమా నీ పేరేమిటి అందమా
తెలుపుమా నీ ఊరేమిటి పరువమా

చరణం: 2
భావకవితల బరువులో ఆ కృష్ణశాస్త్రిలా కవినైతే
హాయి రెమ్మల కోయిలమ్మకు విరుల ఋతువు వికసించదా
తుమ్మెదడగని మధువులే చెలి సాకి వలపులే చిలికిస్తే
మాయ జగతికి ఏ ఖయామో మధుర కవిత వినిపించడా
ఓ కావ్యమా... నీ తోటలో...
నవరస పోషణె గాలిగా నవ్విన పూలే మాలగా
పూజకే సాధ్యమా తెలుపుమా

అందమా నీ పేరేమిటి అందమా
అందమా నీ పేరేమిటి అందమా
ఒంపుల హంపి శిల్పమా బాపు గీసిన చిత్రమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా




ఉత్తరాల ఊర్వశి పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి ప్రియుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల హారతివ్వగా
హలా హలా అదెంత వేడి వెన్నెలా
ముఖాముఖి ముడేసుకున్న ముద్దులా
గీత గోవిందుడు వీనుల విందుడు
రాగమాలతోనే రాసలీలలాడగా
మజా మజా మజాఘుమా ఘుమాలయా
నిజానికి ఇదంత ఒట్టు నీదయ

చరణం: 1
పువ్వులెన్నో విచ్చినట్టుగా చెలీ నవ్వగానే నచ్చినావులే
చుక్కలెన్నో పుట్టినట్టుగా ప్రియా చూసుకోరా పట్టి కౌగిలి
ఖవాలీల కన్నులతోనే జవానీల జాబులు రాసి
జగడమొకటి సాగిందోయమ్మో
అజంతాల ప్రాసలు వేసి వసంతాల ఆశలు రేపి
లలిత కవిత నీకే మాలగా
దోరసోకు తోరణాలు కౌగిలింత కారణాలై
వంశధార నీటి మీద హంసలేఖ రాసిన

ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల హారతివ్వగా
హలా హలా అదెంత వేడి వెన్నెలా
నిజానికి ఇదంత ఒట్టు నీదయ

చరణం: 2
సమ్ముఖాన రాయబారమా సరే సందెగాలి ఒప్పుకోదులే
చందమామతోటి బేరమా అదే అందగత్తె గొప్పకాదులే
పెదాలమ్మ కచ్చేరీలో పదాలెన్నో కవ్విస్తుంటే 
హృదయమొకటి పుట్టిందోయమ్మా
సరాగాల సంపెంగల్లో పరాగాల పండిస్తుంటే 
పరువమొకటి వచ్చే వాంఛలా
కన్నెచెట్టు కొమ్మమీద పొన్నతోట తుమ్మెదాడి
జుంటి తేనెమత్తులోన కొంటె వేణువూదినా
గీత గోవిందుడు వీనుల విందుడు
రాగమాలతోనే రాసలీలలాడగా
మజా మజా మజాఘుమా ఘుమాలయా
నిజానికి ఇదంత ఒట్టు నీదయ

ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల హారతివ్వగా
హలా హలా అదెంత వేడి వెన్నెలా
ముఖాముఖి ముడేసుకున్న ముద్దులా



అహో ఒక మనసుకు పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి ప్రియుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర

అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు
ఇదే ఇదే కుహూస్వరాల కానుక
మరో వసంత గీతిక జనించు రోజు
అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు

చరణం: 1
మాటా పలుకు తెలియనిది మాటున ఉండే మూగమది
కమ్మని తలుపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది...
రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది
శ్రుతిలయలెరగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది...
రుతువుల రంగులు మార్చేది
కల్పన కలిగిన మది భావం
బ్రతుకును పాటగ మలిచేది
మనసున కదిలిన మృదునాదం
కలవని దిక్కులు కలిపేది నింగిని నేలకు దింపేది
తనే కదా వారధి క్షణాలకే సారథి మనస్సనేది
అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు

చరణం: 2
చూపులకెన్నడు దొరకనిది రంగూరూపూ లేని మది
రెప్పలు తెరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినది...
వెచ్చని చెలిమిని పొందినది వెన్నెల కళ గల నిండుమది
కాటుక చీకటి రాతిరికి బాటను చూపే నేస్తమది...
చేతికి అందని జాబిలిలా కాంతులు పంచే మణిదీపం
కొమ్మల చాటున కోయిలలా కాలం నిలిపే అనురాగం
అడగని వరములు కురిపించి అమృతవర్షిణి అనిపించే
అమూల్యమైన పెన్నిధి శుభోదయాల సన్నిధి మనస్సనేది
అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు
ఇదే ఇదే కుహూ స్వరాల కానుక
మరో వసంత గీతిక జనించు రోజు



రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి ప్రియుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా
రోజా పువ్వా పువ్వా పువ్వా
రోజూ రోజూ రోజూ రోజూ పూస్తూ ఉన్నా
పువ్వే నువ్వా నవ్వే నువ్వా
రేకు విచ్చుకున్న సోకుబంతి పువ్వే నువ్వా
ముద్దు పెట్టకుండ ఘల్లు మన్న మువ్వే నువ్వా
పడుచుతనపు గడుసు వలపు పాటవు నువ్వా వా వా
రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా
రోజా పువ్వా పువ్వా పువ్వా
రోజూ రోజూ రోజూ రోజూ పూస్తూ ఉన్నా
పువ్వే నువ్వా నవ్వే నువ్వా

చరణం: 1
చక్కదనానికి చెక్కిలి గింతవు నువ్వా నువ్వా కందే పువ్వా కన్నే పువ్వా
వెన్నెల వాకిట ఎర్రగ పండిన దివ్వే నువ్వా చిందే రవ్వా పొద్దే నువ్వా
గుందె చాటు ప్రేమలెన్నో పోటు మీద చాటుతున్న రోజ పువ్వా
అందమైన ఆడపిల్ల బుగ్గ పండు గిల్లుకున్న సిగ్గే నువ్వా
చిగురు ఎరుపు తెలుపు పొగడమాలిక నువ్వా...
రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా
రోజా పువ్వా పువ్వా పువ్వా
రోజూ రోజూ రోజూ రోజూ పూస్తూ ఉన్నా
పువ్వే నువ్వా నవ్వే నువ్వా

చరణం: 2
ప్రేమ సువాసన పెదవుల వంతెన వేసే నువ్వే
పూసే పువ్వా బాసే నువ్వా
కౌగిలి చాటున కాముడు మీటిన వీణే నువ్వా
ఝానె నువ్వ జజి నువ్వ
గుప్పు మన్న ఆశలెన్నో కొప్పులోన దాచుకున్న రోజ పువ్వా
సందెపొద్దు సంతకాల ప్రేమ లేఖ పంపుకున్న గువ్వే నువ్వా
మధుర కవిత చదివి పెదవి పండిన పువ్వా...
రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా
రోజా పువ్వా పువ్వా పువ్వా
రోజూ రోజూ రోజూ రోజూ పూస్తూ ఉన్నా
పువ్వే నువ్వా నవ్వే నువ్వా
రేకు విచ్చుకున్న సోకుబంతి పువ్వే నువ్వా
ముద్దు పెట్టకుండ ఘల్లు మన్న మువ్వే నువ్వా
పడుచుతనపు గడుసు వలపు పాటవునువ్వా వావా
రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా
రోజా పువ్వా పువ్వా పువ్వా
రోజూ రోజూ రోజూ రోజూ పూస్తూ ఉన్నా
పువ్వే నువ్వా నవ్వే నువ్వా

Most Recent

Default