చిత్రం: అనుమానాస్పదం (2007)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వంశీ
గానం: ఉన్నికృష్ణన్, శ్రేయాఘోషల్
నటీనటులు: ఆర్యన్ రాజేష్ , హంసానందిని
దర్శకత్వం: వంశీ
నిర్మాతలు: సతీష్ తాడి, జై ఆర్నల
విడుదల తేది: 10.02.2007
ననన నానాన నానా నానా నా నా న నానాన నన నానా నన నానా
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా...
నిదురే రాదు రాత్రంతా కలలు నేసే నాకూ
వినగలనంటే తమాషగ ఒకటి చెప్పనా...
హహహ చెప్పు...
ఇంధ్రధనుస్సు కిందా కూర్చునీ మాట్లాడుదాం
అలాగే చందమామతోటీ కులాసా ఊసులాడదాం
వింటుంటే వింతగా ఉంది కొత్తగా ఉంది ఏమిటీ కథనం
పొరపాటు... కథ కాదు...
గత జన్మలోన జాజి పూల సువాసనేమో...
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా...
ననన నానాన నానా నానా నా నా న నానాన నన నానా నన నానా
పువ్వుల నదిలో అందంగా నడుచుకుంటుపోనా
ఊహల రచనే తీయంగా చేసి తిరిగి రానా
వెన్నెల పొడిమినీ చెంపలకి రాసి చూడనా
సంపంగి పూల పరిమళం వయసుకీ అద్ది ఆడనా
అదేంటో మైకమే నను వదలినా పొద జరగదూ నిజమో
జడి వాన కురవాలీ...
ఎద లోయలోకి జారిపోయి దారి చూడూ
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా...
********* ******** **********
చిత్రం: అనుమానాస్పదం
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: విజయ్ ఏసుదాస్,శ్రేయ ఘోషల్
నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు
నిను తలచి తలచి మనసు నలిగింది నీకు తెలుసు
మరుపేల వలపువేళా మెరుపైన మేఘమాలా
పన్నీటి కలువపూలా వెన్నెల్లు కరుగువేళా
కనరాని చారుశీలా
ఓ మై లవ్ ఓ మై లవ్
ఓ మై లవ్ ఓ మై లవ్
నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసూ
మన అసలు పేరు నీడ అడుగడుగు తోడుగ
కథ నడుపు తమరి జాడ కనపడదు వేడుక
కరిమబ్బు చాటు తారా కనిపించె నా సితారా
చిరుచీకటింట నీడా వెలిగింది కంటినిండా
విరహాల ఆలయానా విరజాజి హారతేలా
ముగిసింది చేదు కాలం బిగిసింది ప్రేమ గాలం
చెలి కనుల ఎరుపులె వలపు గెలుపులె తెలుతుం
నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసూ
ఉసిగొలుపు ఉడుకుతనము చెలి పొగరు చాలులె
కుదురైన కలికితనమా కసి కథలు చెప్పకె
ఎదకెదుకు చిలిపితనమా సొద పెట్టి చంపుతావా
వదలడుగు వలపుతనమా పెదవుల్లొ దాచుతావా
నిదురమ్మ పలకరింతా నివురోయె వలచినంత
హృదయాల సీమలోనా ఎదగాన కోకిలేనా
మన ఏడు జన్మలై ఏడు రంగులై కలిసి
నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు
నిను తలచి తలచి మనసు నలిగింది నీకు తెలుసు
మరుపేల వలపువేళా మెరుపైన మేఘమాలా
పన్నీటి కలువపూలా వెన్నెల్లు కరుగువేళా
కనరాని చారుశీలా
ఓ మై లవ్ ఓ మై లవ్
ఓ మై లవ్ ఓ మై లవ్
నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసూ.