Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Assembly Rowdy (1991)




చిత్రం: అసెంబ్లీ రౌడీ (1991)
సంగీతం: కె.వి. మహదేవన్
నటీనటులు: యమ్.మోహన్ బాబు, దివ్య భారతి
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: యమ్.మోహన్ బాబు
విడుదల తేది: 03.06.1991



Songs List:



అందమైన వెన్నెలలోన పాట సాహిత్యం

 
చిత్రం: అసెంబ్లీ రౌడీ (1991)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: రసరాజు
గానం: చిత్ర , కె. జేసుదాసు

పల్లవి :
అందమైన వెన్నెలలోన అచ్చతెలుగు పడుచువలె
మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమలా
మనసు నిండా మరులు పండ పసిడి పల్లకి ఎక్కాలా
రాగాలె ఊగాల శివరంజ నవ్వాల
గరిసదస గరిసదసగరిసదస
చల్లనైన వేకువలోన సంకురాతిరి వెలుగువలే
ముద్దబంతి ముగ్గులలోకి సాగిరారా మగసిరిలా
కనుల నిండా కలలు పండ పూలపడవ నడపాలి
అందాలె చిందాలి అపరంజి నవ్వాలి
గరిసదస గరిసదస గరిసదస
అందమైన వెన్నెలలోన అచ్చతెలుగు పడుచువలె
ముద్దబంతి ముగ్గులలోకి సాగిరారా మగసిరిలా

చరణం: 1
నురుగు తరగల గోదారై వలపు మిలమిల మెరవాలా
ఒంపుసొంపుల సెలయేరై వయసు గలగల నవ్వాలా
నురుగు తరగల గోదారై వలపు మిలమిల మెరవాలా
ఒంపుసొంపుల సెలయేరై వయసు గలగల నవ్వాలా
కొమ్మమీద కోకిలనై కొత్తరాగం పలకాలా
గుడికి నేను దీపమునై కోటి వెలుగులు కురియాలా
కంటి పాపనై కాలి అందెనై
కంటి పాపనై కాలి అందెనై
కాలమంతా కరగబోసి కాపు ఉండనా
సరీగ రిగాప గపాద పదాస గరిసదస గరిసదస గరిసదస

చల్లనైన వేకువలోన సంకురాతిరి వెలుగువలే
మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమలా

చరణం: 2
ఇంద్రధనుసు విరిసింది ఏడడుగులు నడవాలా
సందెచుక్క నిలిచింది బుగ్గచుక్క పెట్టాలా
ఇంద్రధనుసు విరిసింది ఏడడుగులు నడవాలా
సందెచుక్క నిలిచింది బుగ్గచుక్క పెట్టాలా
ఈడుజోడు ఎలుగెత్తి ఏరువాక పాడాలా
తోడునీడ ఇరువురమై గూటికందం తేవాలా
తీగమల్లినై తేనెజల్లునై తీగమల్లినై తేనెజల్లునై
కోరికంత కూడబెట్టి కొలువుసేయనా
సరీగ రిగాప గపాద పదాస గరిసదస గరిసదస గరిసదస

అందమైన వెన్నెలలోన అచ్చతెలుగు పడుచువలె
మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమలా
కనుల నిండా కలలు పండ పూలపడవ నడపాలి
అందాలె చిందాలి అపరంజి నవ్వాలి
గరిసదస గరిసదస గరిసదస





పంతులు పంతులు పాట సాహిత్యం

 
చిత్రం: అసెంబ్లీ రౌడీ (1991)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర , యస్. పి. బాలు

పంతులూ పంతులూ... (2)
పంతులు పంతులు పావుశేరు మెంతులు
పెట్టవయ్య మిడ్డు నైటు ముహూర్తము
మా పంతులయ్య కొడుక్కి పంచదార చిలక్కి
జోడు పీటలెక్కే మంచి లగ్గము

పంతులు పంతులు పావుశేరు మెంతులు
పెట్టవయ్య మిడ్డు నైటు ముహూర్తము
మా పంతులయ్య కొడుక్కి పంచదార చిలక్కి
జోడు పీటలెక్కే మంచి లగ్గము

ఆషాడ బాద్రపదాలు శూన్యం
శ్రావణం గ్రహణం
ఇహ పొతే పుబ్బా ఓయబ్బో చాలా దెబ్బ
సూర్యుడు రున్నింగు లోను చంద్రుడు రెస్టు లోను ఉన్నారు కాబట్టి
వన్ టు త్రీ  ఫోర్  ఫోర్ ప్లస్ సెక్స్  - సెక్సెమిటండి
యూ డోంట్ టాక్ దట్ సిక్సు
ఫోర్ ప్లస్ సిక్స్ ఇజిక్వల్ టు టెన్ను
వన్ అటును జీరో ఇటును కనుక వన్నే బేషుగ్గా ఉంది
సీతా - ఏమండీ పిలిచారా
అబ్బా నిన్ను కాదు తల్లి
సీతారాముల కళ్యాణం ముహూర్తం పెడుతున్నా
రావణుడొస్తేనో...
యు డోంట్ వర్రీ వాడు ఓటర్ లిస్ట్ లో లేడు యు ప్రొసీడు
రవి గురుడు రహస్య మంతనాలాడుకునే ముహూర్తం
ఒకటో తేదీ ఖాయం

ఓ ఓ ఓ ఓ పెళ్లి కొడకా పిల్లదాన్ని చూసుకొని తుళ్ళి పడక
అమ్మాయి అందాల రామచిలక  అడిగింది ఇవ్వాలి కాదనక
ఇస్తా ఇస్తా కోరినట్టే ఇస్తా
ఇస్తా ఇస్తా కోరినట్టే ఇస్తా
మళ్ళీ మళ్ళీ అడిగేట్టు చేస్తా
జీడిపండు కావాలా చిలకమ్మకి
పూలచండు తేవాలా సరసానికి
పెందలాడే ఇల్లు చేరాలి
అందాలతో ఆడుకోవాలి
జాజిపూలే మంచమంతా జల్లుకోనా
జామురేయి నీతోనే ఉండిపోనా

పంతులు పంతులు పావుశేరు మెంతులు
పెట్టినావు మిడ్డు నైటు ముహూర్తము
మా పంతులయ్య కొడుక్కి పంచదార చిలక్కి
పసుపు బుట్టలేసుకొనే మంచి లగ్గము

ఓ ఓ ఓ ఓ పెళ్లికూతురా తల్లిచాటు పిల్లగాడు జగరతమ్మా
గిల్లితే పాలుగారే బుజ్జిగాడు
జోల పాట లేకపోతే బజ్జుకోడు
ఉంగా ఉంగా ఉగ్గుపాలు పడతా
ఉంగా ఉంగా ఉగ్గుపాలు పడతా
జోజి జోజి చాకిలెట్టు పెడతా
ఇంకేమి కావాలి అబ్బాయికి
నూరేళ్లు రాసిస్తా కట్నానికి
అయితే స్వర్గాన్ని చూపెడతా ముద్దు ముచ్చట్లు తీరుస్తా
బాబు కల్యాణ బొట్టెడతా
మనవణ్ణి ఇస్తే జోకొడతా

పంతులు పంతులు పావుశేరు మెంతులు
పెట్టినావు మిడ్డు నైటు ముహూర్తము
మా పంతులయ్య కొడుక్కి పంచదార చిలక్కి
తాళిబొట్టు కట్టుకునే మంచి లగ్గము

మల్లెమొగ్గ పెళ్లికూతురాయెనే
ఈ పిల్ల మొగుడు పెళ్ళికొడుకాయనే
మల్లెమొగ్గ పెళ్లికూతురాయెనే
ఈ పిల్ల మొగుడు పెళ్ళికొడుకాయనే



తూరుపుకొండల అగ్గిపుట్టెరో పాట సాహిత్యం

 
చిత్రం: అసెంబ్లీ రౌడీ (1991)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: జాలాది
గానం: చిత్ర , యస్. పి. బాలు

అరెరరెరరెరరెరరె తూరుపుకొండల అగ్గిపుట్టెరో
దిక్కులన్ని ఎరుపెక్కి పోయెరో
చీకటి గుండెలు చీల్చు కొచ్చెరో కటకటాలనే ఇరుసుకొచ్చెరో
కటకటాలనే ఇరుసుకొచ్చెరో
హా అరె చిచ్చర పిడుగే వచ్చనురో - నమ్మండ్రోరి సింగన్నా
అది పంజా విప్పుకు వచ్చెనురో - నమ్మండ్రోరి సింగన్నా
మన కష్టకాలమిక తీరునురో - నమ్మండ్రోరి సింగన్నా
ఆ దుష్టుల భరతం పడతడురో - నమ్మండ్రోరి సింగన్నా

తాం త నకజను తాం త నకజను తాం త నకజను తకజనత

ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ

చీమలన్ని ఒకటైన నాడే పామునైన చెంపెయ్యగలవని
పామునైన చెంపెయ్యగలవని
గడ్డిపరకలే కలిపి చుట్టితే ఏనుగునైనా కట్టగలవని
ఏనుగునైనా కట్టగలవని
చేయి చేయినే కలుపుకొంటిరా చేవ ఏమిటో తెలియ జేస్తిరా
రుబాబోళ్ళ దౌర్జన్యమోర్చుకొని గుండె నెత్తురే చిమ్ముకోస్తిరా
అరె హా హా హా...
నువు దండం పెట్టి మొక్కేరా  - నమ్మండ్రోరి సింగన్నా
హారతి పళ్ళెం పట్టేరా - నమ్మండ్రోరి సింగన్నా

అరె చిచ్చర పిడుగే వచ్చనురో - నమ్మండ్రోరి సింగన్నా
అది పంజా విప్పుకు వచ్చెనురో - నమ్మండ్రోరి సింగన్నా

ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ

నోట్ల సొమ్ముతో ఓట్లు గుంజుకొని ఎమ్మెల్యేగిరి ఎంటబెట్టుకొని
ఎమ్మెల్యేగిరి ఎంటబెట్టుకొని
ఒత్తి ఒట్టి వాగ్దానాల్జేసి మాటదప్పే ఆ మంత్రుల్లాగా
మాటదప్పే ఆ మంత్రుల్లాగా
మోసగించి నే బతకనురో మీతో కలిసే ఉంటనురో
కూలి నాలి పేదోళ్ల బతుకుల బాధలు పంచుకు ఉంటనురో

హా హా హా...
నా ప్రాణాలైనా పెడతనురో - నమ్మండ్రోరి సింగన్నా
మీ ప్రాణం నేనై ఉంటనురో - నమ్మండ్రోరి సింగన్నా
చిచ్చర పిడుగే వచ్చనురో - నమ్మండ్రోరి సింగన్నా
అది పంజా విప్పుకు వచ్చెనురో - నమ్మండ్రోరి సింగన్నా





తానాల గదిలోకి పాట సాహిత్యం

 
చిత్రం: అసెంబ్లీ రౌడీ (1991)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: జాలాది
గానం: చిత్ర , యస్. పి. బాలు

హాహహఁ హాహహఁ ఊహూహుఁ ఊహూహుఁ హుఁ
తానాల గదిలోకి తారాజువ్వచ్చింది హా హా హా హా
చీరందుకోవాలని అనుకుంటే నా కొంపంటుకుందిరో ఈలోగ
నా కొంపంటుకుందిరో ఈలోగ
తానాల గదిలోన పట్టు తప్పి పడ్డాను హా హా హా హా
పడ్డాక తెలిసింది అమ్మమ్మో అది గదికాదు బూరెల   గంప అని
అది గదికాదు బూరెల   గంప అని

చరణం: 1
కన్నె పిల్ల కసి కసిగా ఉందిరో దాని పొగరెంతో చూడాలని ఉందిరో
చాకులా ఉన్నాడు సోగ్గాడు ఆకలిగా నావంక చూశాడు
సన్నగాలి రేగుతూ ఉన్నది అబ్బా ఎక్కడో జివ్వు జివ్వుమన్నది
ముచ్చటే ముడుపుగట్టి ఉంచితే ఇప్పుడే ముడి విప్పు అంటాడు
పిల్ల మొమాట పడిపోతుంది వయసు నా వల్ల కాదు అంటుంది
పిల్ల మొమాట పడిపోతుంది వయసు నా వల్ల కాదు అంటుంది
కలిసేదంతా ముందే ఉంది

తానాల గదిలోన పట్టు తప్పి పడ్డాను హా హా హా హా
పడ్డాక తెలిసింది అమ్మమ్మో అది గదికాదు బూరెల   గంప అని
అది గదికాదు బూరెల   గంప అని

చరణం: 2
చూపుతో చుట్టేసి సోగ్గాడు పాల బుగ్గనే ముద్దెట్టుకున్నాడు
కుర్రకారు వానమ్మ జల్లులో కొత్త కోర్కె మొత్తంగా తడిసింది
ఊపులో ఉన్న నీ కైపుకు అబ్బా ఊపిరాడకున్నది మాపుకు
మత్తు మత్తుగా నీ ఒంపు సొంపుతో మల్లెపూల పక్కనే వేసుకో
పక్క వేసే వరకు ఇద్దరం తీరా పక్కెక్కి చుస్తే ఒక్కరం
పక్క వేసే వరకు ఇద్దరం తీరా పక్కెక్కి చుస్తే ఒక్కరం
దుప్పట్లోనే తెల్లారాలి

ఆ తానాల గదిలోకి తారాజువ్వచ్చింది హా హా హా హా
చీరందుకోవాలని అనుకుంటే నా కొంపంటుకుందిరో ఈలోగ
అరెరరె తానాల గదిలోన పట్టు తప్పి పడ్డాను హా హా హా హా
పడ్డాక తెలిసింది అమ్మమ్మో అది గదికాదు బూరెల   గంప అని
తన తానాన తన్ననా తానాన
తన తానాన తననా తానన తగతగతగ త




పేకల్లో జొకర్లా పాట సాహిత్యం

 
చిత్రం: అసెంబ్లీ రౌడీ (1991)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: గురుచరణ్
గానం: చిత్ర , యస్. పి. బాలు

పేకల్లో జొకర్లా ఎవడే ఈ షోకిళ్ళ
మేజిక్కుల సర్కారల్లే మేకప్పేదో కొట్టాడే
చుట్టాడే తలపాగా పెట్టాడే నెమలీక
బుడబుక్కల బూచోడల్లే దసరా వేషం కట్టాడే
పదిమంది చుస్తే పకా పకా నవ్వేలా
పదిమంది చుస్తే పకా పకా నవ్వేలా
LKG లెక్కలకి కాలేజీ కొలతలకి
ఎన్నెన్నో తేడాలుంటాయ్ చూడాలే కులుకమ్మా
ఎలిమెంట్రీ బట్టల్లో నలుదిక్కులు చుట్టోస్తే
జనమంతా గగ్గోలెత్తి చస్తారే చిలకమ్మా
అవతారం చుస్తే అదో రకం అదమ్మా
అవతారం చుస్తే అదో రకం అదమ్మా

పేకల్లో జొకర్లా ఎవడే ఈ షోకిళ్ళ
మేజిక్కుల సర్కారల్లే మేకప్పేదో కొట్టాడే

అల్లా త్రేతాయుగం నుండి దూసుకువచ్చారా
విల్లు బాణాలు ఏవండి తీసుకు వచ్చారా హా
గిల్లి పోతానే ఒళ్లంత పుల్లని నారింజ
గొల్లుమంటావే నాతోనే అల్లరి చాలంజా
తోక చుక్కల్లే దొరవారు ధీమాగ దిగినారు
ఏ దేశం ఏలేవారో ఆదేశం ఇస్తారు
పంతాల కుందేలా పంజా రుచి చూస్తావా
పంతాల కుందేలా పంజా రుచి చూస్తావా

హే పేకల్లో జొకర్లా - ఆహా
ఎవడే ఈ షోకిళ్ళ - ఓహో
మేజిక్కుల సర్కారల్లే మేకప్పేదో కొట్టాడే
అయ్యో అవతారం చుస్తే అదో రకం అదమ్మా
అవతారం చుస్తే అదో రకం అదమ్మా
ఎలిమెంట్రీ బట్టల్లో నలుదిక్కులు చుట్టోస్తే
జనమంతా గగ్గోలెత్తి చస్తారే చిలకమ్మా

అహహా లలలా ఓహొహో  ఎహెహే
మాంచి ఉమ్మస్సు మీదుంది అమ్మడి వయస్సు
కొత్త సిలబస్సు చెబుతుంది సొంపుల చందస్సు
పచ్చి అక్కస్సు మీదుంది గుంటడి వర్చస్సు
ఖడ్గ తిక్కన్నకేడుంది ఇంతటి తేజస్సు
ఉత్తి ఆకారం ఏముంది అసలంతా లొనుందే
సందేశం కావాలంటే సావాసం చెయ్యండే
పల్నాటి పుంజల్లే రోషం వచ్చి రెచ్చాడే
పల్నాటి పుంజల్లే రోషం వచ్చి రెచ్చాడే

LKG లెక్కలకి కాలేజీ కొలతలకి
ఎన్నెన్నో తేడాలుంటాయ్ చూడాలే కులుకమ్మా
పేకల్లో జొకర్లా - ఓయ్ ఓయ్
ఎవడే ఈ షోకిళ్ళ - ఓయ్ ఓయ్
మేజిక్కుల సర్కారల్లే మేకప్పేదో కొట్టాడే
ఓయ్ అవతారం చుస్తే అదో రకం అదమ్మా
పదిమంది చుస్తే పకా పకా నవ్వేలా
హోయ్ తననన్న తన్నననా తరిగిటతోమ్ తకదిమితోమ్
డడడాడ డండడాడ డడాండాండ డిరి డంగట డంగట డం
తననన్న తానానా - తకతా
తననన్న తానానా - అరె హా
తననన్న తానానానా  తానానానా తన్నానా

Most Recent

Default